ఈ రోజు బ్లూ మీడియాలో ఒక కధనం వచ్చింది అంటూ టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ కధనం ప్రకారం, తిరుపతిలో ప్రచారం చేస్తున్న టిడిపి శిబిరంలో కలకలం రేగింది అని, టిడిపి తరుపున ప్రచారం చేయటానికి వచ్చిన వారిలో చాలా మందికి, క-రో-నా పోజిటివ్ వచ్చింది అంటూ కధనం ప్రచారం పెట్టారు. క-రో-నా వచ్చిన వారిలో, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఉన్నారని, అలాగే మాజీ మంత్రి జవహర్ ఉన్నారని, అలాగే మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలు కూడా ఉన్నారని, వీరి అందరికీ క-రో-నా వచ్చింది, దీంతో టిడిపి నేతలు అందరూ తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటూ, బ్లూ మీడియా ప్రసారం చేసిందని, టిడిపి నేతలు వాపోతున్నారు. అయితే వీరిలో అనిత, సంధ్యారాణి చంద్రబాబుని కలిసారని, చంద్రబాబుతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కూడా చేసుకున్నారని, వీరికి వెంటనే క-రో-నా వచ్చింది అని, దీంతో టిడిపి నేతలు, కార్యకర్తలు భయపడి పోతున్నారు అంటూ, బ్లూ మీడియాలో కధనాలు వచ్చాయని, ఎవరిని భయ పెట్టటానికి, ఇలాంటి కధనాలు వేస్తున్నారు అంటూ టిడిపి నేతలు మండి పడ్డారు. ఇలా అనుకుంటే విజయసాయి రెడ్డి లాంటి నేతలకు, అనేక మంది మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా క-రో-నా వచ్చింది, సాక్షాత్తు తిరుపతి ఉప ఎన్నికే, వైసీపీ ఎంపీ క-రో-నాతో చనిపోవటం వల్ల వచ్చిందని వాపోతున్నారు.

jawahar 10042021 2

అయితే ఈ కధనంలో అనేక అవాస్తవాలు ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి పాజిటివ్ వచ్చి, వారం రోజులు అయ్యింది, ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఇక మాజీ మంత్రి జవహర్ అయితే, తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తనకు కో-ర-నా వచ్చి వారం రోజులు దాటిందని, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమి లేదని, అయితే ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని, ఆ రిపోర్ట్ కూడా మీ ప్రభుత్వానిదే, నెగటివ్ వచ్చింది చూసుకోండి అంటూ, మీడియాకు విడుదల చేసారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన బ్లూ మీడియా ఆ వార్తను వెనక్కి తీసుకోవాలిని జవహర్ కోరారు. కేవలం అబద్ధాలను ప్రసారం చేస్తూ, పబ్బం గడుపు కోవటం సరికాదుని సదరు మీడియాకు హితవు పలికారు. తనకు మళ్ళీ ఏదో అయిపొయింది అంటూ, ఈ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలు చూసి, సహచరులను,అభిమానుల నుంచి ఫోనులు వస్తున్నాయని, వారిని ఇలాంటి తప్పుడు వార్తలతో తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్ లో మరో పెను సంచలనానికి దారి తీసే ఘటన ఇది. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వేంకటేశ్వర రావు సంచలన ఆరోపణలు చేస్తూ, సిబిఐ ఎంక్వయిరీ కోరుతూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. ఇప్పటికే ఏబీ వేంకటేశ్వర రావు పై, దేశ ద్రోహం ఆరోపణలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, ఏబీ వేంకటేశ్వర రావు, చీఫ్ సెక్రటరీకి తొమ్మిది పేజీల లేఖ రాసారు. అందులో కొన్ని సంచలన విషయాలు పొందు పరిచారు. ఏకంగా డీజీపీ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు తన వద్ద ఉన్న ఆధారాలు, ఆ లేఖకు జత పరిచారు. అంతే కాదు, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటుగా, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతా రామాంజనేయులు, ఇంటలిజెన్స్ విభాగపు అధికారులతో పాటు, మిగతా వారి ప్రమేయం పై కూడా, ఆధారాలు ఆ లేఖలో ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సచివాలయంలోని అధికార వర్గాల్లో కలకలం రేగింది. ఏకంగా డీజీపీ, సిఐడి చీఫ్, ఏసిబీ చీఫ్ ఫోర్జేరి చేసారు అంటూ, ఆధారాలు ఇవ్వటం, పెను సంచలనం అనే చెప్పాలి. ఏబీ వేంకటేశ్వర రావు డీజీ ర్యాంకు అధికారి, ఆయన చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే, ఇది దేశంలోనే సంచలనానికి దారి తీస్తుంది. ఒక వేళ ఆయన చేసిన ఆరోపణలు నిజం కాకపోతే, వెంటనే ఆ అధికారులు అందరూ వచ్చి, నిజం ప్రజలకు చెప్పాలి.

abv 100442021 2

ఇప్పటికే ఏబీ వేంకటేశ్వర రావు గత వారం కమీషనర్ అఫ్ ఎంక్వయిరీస్ విచారణ సందర్భంగా, మీడియాతో మాట్లాడిన ఆయన, తన పై తప్పుడు కేసు పెట్టారని, అంతే కాకుండా, దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని, వాటిని తొందర్లోనే బయట పెడతాను అంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణలుకు సంబంధించి, పూర్తి వివరాలు ఆ లేఖలో ఇచ్చారు. అయితే దీని పై తనకు సిబిఐ ఎంక్వయిరీ కావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలో తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోక పొతే, కోర్టుకు కూడా వెళ్ళే ఆలోచనలో ఏబీ వేంకటేశ్వర రావు ఉన్నారు. ఇప్పటికే ఆయన కేసు సుప్రీం కోర్ట్ లో ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే, ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఏప్రిల్ చివరి లోపు విచారణ ముగించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో, ఇప్పుడు ఏకంగా డీజీపీ, ఏసిబీ, సిఐడి తన పై దొంగ పత్రాలు సృష్టించారు అంటూ, ఏబీ వేంకటేశ్వర రావు చేసిన ఆరోపణలు, ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. మరి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.

 

వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ఒక రోజు ముందు నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతూనే ఉంది. సహజంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సమయంలో, బెనిఫిట్ షో లు వేయటం, వారం, రెండు వారాలు టికెట్ రేట్లు పెంచటం, ఇవన్నీ సహజంగా జరిగేవి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఉంది. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత కూడా, చాలా సినిమాలకు, ఇలాగే అవకాసం ఇచ్చారు. అయితే వకీల్ సాబ్ సినిమా విషయంలో మాత్రం, ముందు రోజు రాత్రి, టికెట్ రేట్లు పెంచటానికి వీలు లేదని, బెనిఫిట్ షోలకు అవకాసం లేదని ఆర్డర్స్ వచ్చాయి. దీంతో అప్పటికే టికెట్లు అమ్ముకున్న వారు షాక్ తిన్నారు. ఇక పవన్ ఫాన్స్ కూడా ఈ విషయంలో, ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాజకీయంగా, ఇబ్బందులు గురి చేసేందుకే, ఇలా ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. అయితే రిలీజ్ కు ముందు నుంచి టికెట్ ధరల విషయంలో, వివాదం నడుస్తూనే ఉంది. దీంతో సినిమా యూనిట్, రెండు వారల పాటు ధరలు పెంచే విషయంలో, అనుమతి ఇవ్వాలి అంటూ, గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అన్నీ కోర్టుకు చూపించి, కోర్టుని ఆశ్రయించటం జరిగింది. దీంతో హైకోర్టు, రెండు వారాలు కాకుండా, మూడు రోజులు పాటు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది.

vakeel 10042021 2

అయితే ఈ ఆదేశాల పై ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టులో అత్యవసర పిటీషన్ వేయనుంది. సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేయనున్నారు. మూడు రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చు అంటూ, హైకోర్టు తీర్పుని సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో దీని పై హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనుంది. అయితే ఈ చర్య నిజంగానే ఆశ్చర్యానికి గురి చేసే చర్య అని చెప్పుకోవాలి. ఏ సినిమాకు లేని ఇబ్బంది, కేవలం ఈ సినిమాకే ఎందుకు కలిగిస్తున్నారు, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే, అన్ని సినిమాలకు ఇదే నిబంధన వర్తింప చేయాలని, అంతే కానీ తమ అధికారాన్ని ఇలా రాజకీయ కక్ష కోసం వాడకూడదని వాపోతున్నారు. అయినా హైకోర్టు, కేవలం మూడు రోజులు వరుకే పర్మిషన్ ఇచ్చింది. దీనిని కూడా ప్రభుత్వం, అత్యవసర పిటీషన్ గా, హౌస్ మోషన్ పిటీషన్ రూపంలో వేయటం చూస్తుంటే, రాజకీయ కక్ష ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఎంపిటిసి, జెడ్పీటీసి ఎన్నికలు గురువారం జరుగగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం 60 కి పడిపోయింది. ఈ క్రమంలో అధికార వైసిపి పార్టీ పోలింగ్ శాతం ఎందుకు తగ్గిందనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇన్ని పధకాలు పెట్టారు, ప్రజలు 95 శాతం మా వైపే ఉన్నారు అంటూ ప్రచారం చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఈ ఫిగర్ చూసి, ఆలోచనలు పడ్డారు. అయితే ఓటింగ్ ఇంతలా పడిపోవటానికి, చంద్రబాబు మాట ప్రజలు విన్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా, ఈ పరిషత్ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తుందని ప్రకటించారు. అయితే కొంతమంది అభ్యర్ధులు మాత్రం కొన్ని చోట్ల పోటీలో ఉన్నారు. సామాన్య ప్రజలతో పాటుగా, టిడిపికి చెందిన ఓటర్లలో మెజార్టీ ఓటర్లు ఓటు వేయడానికి ఇష్టపడకుండా ఇంటికే పరిమితమయ్యారు. దీనివల్లే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిందని తెలుస్తుంది. అయితే పోలింగ్ శాతం ఎంత తక్కువగా ఉంటే అంతగా తమ పార్టీ అభ్యర్థులకు మేలు జరుగుతుందని అధికార పార్టీ భావిస్తుంది. తాము టిడిపిని ఆదినుండి ఆదరించాం కాబట్టి ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు తాము ఓటేయ్యడానికి వెళ్లలేదని పలువురు ఓటర్లు వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు ప్రభావం వల్లనే పోలింగ్ శాతం తగ్గిందని, అయితే టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్న చోట మాత్రం ఆయా గ్రామాల్లో 75 నుండి 80 శాతం వరకూ కూడా పోలింగ్ జరిగిందని తెలిసిందే.

voting 10042021 2

ఇదలా ఉంచితే టిడిపికి ఇంకా కొన్ని గ్రామాల్లో పట్టుందని ఈ పరిషత్ ఎన్నికలు నిరూపించాయి. చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించి పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రాంతాల్లో ఓటర్లు సాయంత్రం ఐదు దాటినా క్యూ లైనులో నిలబడి ఉన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో టిడిపి అభ్యర్ధులు గట్టిగానే పని చేసారు. వీరిని చూసి అధికార పార్టీ కూడా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అయితే ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల్లో మరింతగా తమ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని, అసలు టిడిపి ఎందుకు ఎన్నికలు బహిష్కరించింది అనే విషయం పై ప్రజల్లో చర్చ జరిగింది, దాని ఫలితమే ఇంత తక్కువ పోలింగ్ అని అంటున్నారు. ఇక మరో విషయం ఏమిటి అంటే, సహజంగా గ్రామాల్లో ఓటింగ్ భారీ స్థాయిలో ఉంటుంది. ఇంకా మూడేళ్ళు పైగా అధికారం ఉండటంతో, వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తారు. అయితే ఈ సహజ ధోరణికి భిన్నంగా, ఈ సారి ఓటింగ్ లో పాల్గునటానికి ఆసక్తి చూపలేదు. గతంలో 2014లో 83 శాతం వరకు ఓటింగ్ జరగగా, ఇప్పుడు కేవలం 60 శాతానికి పరిమితం అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read