సహజంగా ప్రతిపక్ష పార్టీ నుంచి, అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్న చోట, ఎవరైనా భయపడుతూ, వన్ సైడ్ అవ్వాల్సిందే. ఇక్కడ బెదిరింపుల పర్వం అలా ఉంటుంది. మేము బెదిరిపోం, మేము అన్నం తినే వాళ్ళం ఆ పార్టీలో చేరం అని చెప్పిన వాళ్ళే, తోక ముడుచుకుని ఆ పార్టీలో చేరిపోయారు అంటే, పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చి రెండేళ్ళు అవ్వటం, నెమ్మదిగా ప్రజల్లో వ్యతిరేకత రావటంతో, నాయకుల్లో కూడా మార్పు మొదలైంది. ఇప్పుడు వెరైటీగా, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు వస్తున్నాయి. అన్ని పంచాయతీలు మావే, అన్ని మునిసిపాలిటీలు మావే, అన్ని జిల్లా పరిషత్ లు మావే , ఇది మా ప్రజా బలం అని చెప్పుకుంటున్న వైసీపీకి, కడప జిల్లాలోనే షాక్ తగిలింది. కడప జిల్లాలోని రాయచోటికి చెందిన, వైసీపీ కీలక నేత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని, శ్రీకాళహస్తిలో కలిసారు, వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ నెల 14వ తేదీన అయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

ycp 09042021 2

ఈ నేపధ్యంలోనే ఆయన చంద్రబాబుని కలిసారు. చంద్రబాబు కూడా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా కడప జిల్లా రాయచోటిలో, వైసిపీ ఎమ్మెల్యేగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎన్నికల్లో గెలుపు విషయంలో, రాంప్రసాద్ రెడ్డి కూడా కీలక పాత్ర వహించారని చెప్తూ ఉంటారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కానీ, మొన్న ప్రకటించిన కార్పొరేషన్లలో కానీ ఏదో ఒక పదవి వస్తుందని, ఆశగా ఎదురు చూసారు. తనకు పదవి వస్తుందని, వైసీపీ పెద్దలు కూడా నమ్మిస్తూ వచ్చారని, అయితే రెండేళ్ళు దాటుతున్నా, పదవి సంగతి పక్కన పెడితే, కనీసం గుర్తింపు కూడా పార్టీలో లేకుండా పోయిందని, ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక వైసీపీ పార్టీలో, అవమానాలతో, అసంతృప్తి ఉండలేనని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు, ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే ఆయన నిర్ణయం పై ఇప్పటి వరకు, స్థానిక వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఆయన మాత్రం తన అనుచరులతో సమావేశం అయ్యి, నిర్ణయం తీసుకున్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, దేశంలోని ప్రజాప్రతినిధులు అందరి పై ఉన్న కేసులు, ఏడాది లోపు పూర్తి చేయాలని, ఆదేశాలు రావటంతో, అన్ని చోట్లా, ప్రజాప్రతినిధుల పై కేసుల విచారణ ఊపందుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, వేగంగా కేసులు ముందుకు వెళ్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కేసులు మాత్రం, ఇంకా విచారణ వరకు రాకుండా సాగుతూనే ఉన్నాయి. దీని పై గత కొంత కాలంగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ రఘురామరాజు, సిబిఐ కోర్టులో పిటీషన్ కూడా వేసారు. ఇక ఈ విషయం పక్కన పెడితే, హైదరాబాద్ లోని ప్రజా ప్రతినిధులు కోర్టులో, ప్రజాప్రతినిధుల పై నమోదు అయిన కేసుల్లో వేగం పెరిగింది. ఇవన్నీ చాలా వరకు చిన్న చిన్న కేసులు. ముఖ్యంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన లాంటి కేసులు. మొన్న మధ్య విజయమ్మ, షర్మిల కూడా ఈ కేసు విషయంలో కోర్టుకు వెళ్లారు. అయితే ఈ కేసుల్లో పెద్దగా శిక్ష లాంటివి ఉండకపోవచ్చు, లేదా అనేక కేసులు కొట్టెయ వచ్చు కూడా. అయితే లిక్కర్ స్కాం, ఓటుకు నోటు లాంటి కేసులు మాత్రం, సీరియస్ గా విచారణ జరుగుంటుంది. ఓటుకు నోటు కేసులో ప్రతి వారం ఏదో ఒక అప్దేడ్ వస్తూనే ఉంది. అయితే అవి చూపించి సంబరపడుతున్న వైసీపీకి, ఇప్పుడు లిక్కర్ స్కాం కేసులో విచారణ, టెన్షన్ పెట్టిస్తుంది.

mopidevi 09042021 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఈ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వైసీపీ రాజ్యసభ సభ్యడు మోపిదేవి వెంకటరమణ, అప్పట్లో ఎక్ష్సైజ్ మంత్రిగా ఉన్నారు. అయితే మోపిదేవి మీద కేసు అంటే, జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో ఉన్న కేసు అని అందరూ అనుకుంటారు. కానీ మోపిదేవి పై, లిక్కర్ స్కాం కేసు కూడా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో, ఈ మద్యం స్కాం బయట పడటం, కిరణ్ కుమార్ ఎద్ది విచారణకు ఆదేశించటంతో, మొత్తం వ్యవహారం బయట పడింది. అప్పట్లో బొత్సా సత్యన్నారాయణ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసు విచారణలో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ నెలకొంది. అప్పట్లో ఎక్ష్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవికి, పది లక్షల లంచం ఇచ్చినట్టు, ఆధారాలు కోర్టుకు సమర్పించారు. దీని పై కోర్టు విచారణ చేస్తూ, స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. ఈ కేసు పై తదుపరి విచారణ, 15 వ తేదీకి వాయిదా పడింది. 15 తరువాత నుంచి, ఈ కేసు కీలక దశకు చేరుకునే అవకాసం ఉంది. దీంతో, ఇప్పుడు వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకా రంచేసిన 2014నుంచి 2021ఏప్రియల్ వరకు కూడా వివేకానందరెడ్డి మ-ర్డ-ర్ ను మించిన నేరమేదీ రాష్ట్రంలో జరగలేదని, ప్రణాళికాబద్దంగా, మంచి అవగాహనతో, బ్రహ్మాండమైన హోమ్ వర్క్ తో జరిగిన మ-ర్డ-ర్, అదితప్ప, ఈ ఏడుసంవత్సరాల్లో ఎన్నడూలేదని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలో ని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. వివేకానందరెడ్డి హ-త్య పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని రామయ్య స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డికి ముందేసమాచారం లేకపోతే, ఇంతటి దయనీయ స్థితిలో వివేకానందరెడ్డి కేసు ఉండదన్నారు. ఆనాడు హ-త్య జరిగిన వెంటనే కొందరు పెద్దలు ఆ-త్మ-హ-త్య అంటే, మరికొందరు పెద్దలు తలకుకట్లుకట్టారు.. శరీరా నికి కుట్లువేశారని చెప్పడంజరిగిందన్నారు. సునీతమ్మ ఢిల్లీలో మాట్లాడుతూ బోరుబోరున విలపి స్తుంటే, తనతండ్రిని ఎవరు చం-పా-రో తెలుసుకునేందు కు మీరైనా సాయంచేయండని ఆమె విలేకరులను దేహి అని వేడుకుంటుంటే, విజయమ్మగారు ఎందుకు స్పం దించలేదన్నారు. సునీతమ్మ ప్రెస్ మీట్ జాతీయ, స్థానిక పత్రికలన్నింటిలో వచ్చినా, సాక్షిలో ఎందుకు రాలేదన్నారు. సాక్షిలో ఆమె ఆవేదనను, బాధను రాయనప్పుడు, జగన్ బాబూ సాక్షిలో ఎందుకు సునీత ప్రెస్ మీట్ రాలేదని విజయమ్మ ప్రశ్నించలేకపోయింద న్నారు. వివేకా కేసు వెనకాల ఎవరున్నారో ప్రజల కు తెలియడానికి ఆ ఒక్కఅంశం చాలునన్నారు. కేసులోని అనుమానితులతో ముఖ్యమంత్రి క్లోజ్ గాఉంటున్నది నిజంకాదా అని రామయ్య ప్రశ్నించారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే అనుమానితుడు ముఖ్యమంత్రిని కలిశాడంటున్నారని, దానిపై ముఖ్య మంత్రి పేషీ సమాధానంచెబుతూ, శ్వేతపత్రం విడుదల చేస్తుందా అని రామయ్య ప్రశ్నించారు.

కేసులో అను మానితుడు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం, ఆ యనతో మాట్లాడాల్సిన అవసరంఏమొచ్చిందో చెప్పాల న్నారు. సీబీఐ అధికారులుకూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశాడో లేదో విచారణ జరపాల న్నారు. సీబీఐ అధికారులు దర్యాప్తుని దర్యాప్తులా చేయడంలేదని, చాలాస్పష్టంగా వారు తమవిచారణను కొందరుఅడ్డుకుంటున్నారని చెప్పింది నిజం కాదా అన్నారు. ఎవరు ఎవరికి ముడుపులుచెల్లిస్తే, ఎవరు ఎవరికి సాష్గాంగపడితే, ఎవరు ఎవరిదగ్గర ఇన్ ఫ్లుయెన్స్ చేస్తే కేసు విచారణ సజావుగా జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రిని ఎందుకు విచారించలేదో, ఆయనకు, గంగిరెడ్డి, అవినాశ్ రెడ్డిలకు ఎందుకు లైడిటె క్టర్ పరీక్షలు, నా-ర్కో అనాలిసిస్ నిర్వహించలేదో చెప్పా లని రామయ్య డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ సమాధానంచెప్పాలన్నారు. రాజకోట రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రజలంతా ఉత్సుకతతో ఉన్నార న్నారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రామయ్య మాట్లా డుతూ, ఉడతఊపులకు రామయ్య బెదరడన్నారు. బెదిరింపుకాల్స్ పై ఎవరెవరి పాత్రఉందో, తనను చం-పు-తా-నం-టూ ఫోన్ చేసిన వైసీపీనాయకుడెవరో తేలాలన్నా రు. ఆ వ్యక్తి రేపు ఉదయం 10గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్ కు వస్తే, తానుఅక్కడకు వస్తానని, అక్కడే తనను చం-పే-య-వ-చ్చ-ని రామయ్య తేల్చిచెప్పారు. రామయ్య ను బెదిరించడానికి ఎంత ధైర్య ముండాలన్నారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీసులకు రాత్రే ఫిర్యాదుచేసినా, ఇంతవరకు ఒక్క రుకూడా ఏమైందని అడగలేదన్నారు. వర్ల రామయ్య ఫిర్యాదుని పట్టించుకోవద్దని డీజీపీ వారికి చెప్పాడేమో నన్నారు. ఏంజరుగుతుందో చూస్తానని, ఎంతమంది బెదిరింపు కాల్స్ చేస్తారో చూస్తానని రామయ్య స్పష్టం చేశారు. అటువంటి కాల్స్ వల్ల వారి బుద్ధులు, వారి జీవ నవిధానం బయటపడుతుందన్నారు. తాను ఫిర్యాదుచేశానని, ముఖ్యమంత్రి డీజీపీకి ఏం సూచనలు చేస్తాడో చూస్తామ న్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన కనీస బాధ్యత వారిపైనే ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యప్రక్రియ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం నడుస్తోందా... డీజీపీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలోని పోలీస్ శాఖ ఉందా అనే అనుమానం తమతోపాటు ప్రజలందరిలోనూ ఉందని టీడీపీనేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులైన వర్లరామయ్య ప్రభుత్వంయొక్క దాష్టీ కాలు, జగన్ బాబు వైఫల్యాలను ఈ మధ్యన తరచూ ఎత్తిచూపుతున్నారన్నారు. వివేకా కేసు వ్యవహారంలో ఆయన్ని ఎవరు చం-పా-ర-ని, ఆయనకూతురు సునీతకు ఎందుకు న్యాయంజరగడంలేదని రామయ్య పదేపదే ప్రశ్నించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రామయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం, ఆయన్ని చం-పు-తా-మం-టూ బెదిరింపులకు దిగిందన్నారు. ముఖ్య మైన నాయకుడి హ-త్య సంగతి తేల్చకుండా పోలీస్ శాఖ, రాష్ట్రముఖ్యమంత్రి గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా అని టీడీపీసీనియర్ నేత ప్రశ్నిస్తే, ఆయన్ని చం-పు-తా-మ-న-డంపై డీజీపీ స మాధానం చెప్పాలన్నారు. వివేకానందరెడ్డిని ఎవరు చం-పా-రో తేల్చాలని, విచారణలో జాప్యం మంచిదికాదని, దోషులను పట్టుకోకుంటే, అది ప్రభుత్వచేతగానితనం కిందకువస్తుందని రామయ్య అడిగితే, ఆయన్నికూడా చం-పు-తా-మ-ని బెదిరింపు లకు దిగారన్నారు. రామయ్యఇంటికి ఫోన్ చేసి, ఇంట్లో ని కుటుం బసభ్యులతో అసభ్యంగా మాట్లాడారని మర్రెడ్డి తెలిపారు. పెరుమాళ రుషి అనేవ్యక్తి తన ఇంటికి ఫోన్ చేసి, ఇంట్లోవాళ్లను బెదిరించాడని, తనను చం-పు-తా-న-ని హెచ్చరించాడని రామయ్య నిన్నరాత్రి 9గంటలప్రాంతంలో భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, విజయవాడ సీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింద న్నారు. ఫోన్ చేసి బెదిరించినవారెవరో పట్టుకోవడం పో లీసులకు చేతకాదా అని మర్రెడ్డి నిలదీశారు.

రామయ్య ఫిర్యాదుచేసి, 24 గంటలు గడిచినా ఇంతవరకు బెదిరింపుకాల్ చేసిన వ్యక్తిని పట్టుకోలేకపోయారన్నారు. ఎల్ జీ పాలిమర్స్ పై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ను,ఎవరికో పంపిందని చెప్పి, రంగనాయకమ్మ అనే 65 ఏళ్ల ఆమెను, విచారణపేరుతో వేధించిన పోలీసులు, రామయ్యని చం-పు-తా-మ-ని ఫోన్ లో బెదిరించినవ్యక్తిని పట్టుకోలేకపో వడం సిగ్గుచేటన్నారు. రామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్ నిపట్టించుకునే తీరిక, ఓపిక డీజీపీకి లేదా లేక వర్ల రామయ్య తమనుకూడా ప్రశ్నిస్తున్నాడని ఆయనపై వ్యక్తిగతంగా ఏమైనా మనసులో పెట్టుకున్నారా? రుషి పెరుమాళ అనేవ్యక్తి గుంటూరులోని భీమవరం వాసి అయినట్లు ఫేస్ బుక్ లోని తనఐడీ ద్వారా తెలుస్తోంద న్నారు. రుషి పెరుమాళ్లకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడేఉద్యోగం ఎవరిచ్చారో అతనే సమాధానంచెప్పా లన్నారు. రాష్ట్రంలోకి ఏవైనా ముఠాలు ప్రవేశించి అతనికి ఈ ఉద్యోగం ఇచ్చాయా అని మర్రెడ్డి నిలదీశారు. రుషి పెరుమాళ తల్లిదండ్రులు అతన్నికనిపెంచింది, ఇందుకేనా అన్నారు. అతని తల్లిదండ్రులు అతన్ని చది వించి, ఉద్యోగం చేసుకొని జీవించమంటే, వారి అంతు చూస్తాను... వీరి అంతుచూస్తాను అని బెదిరిస్తూ బతుకుతున్నాడన్నారు. అతనొక్కడే రామయ్య అంతు చూస్తాడా... రామయ్య అతని అంతుచూడలేడా అని శ్రీనివాసరెడ్డి బదులిచ్చారు.

జగన్ పాలనతో తనకు ఎలాగు భవిష్యత్ లేదని భావించిన రుషిపెరుమాళ ఈ విధమైన దారిలోకి వచ్చిఉండొచ్చని టీడీపీనేత అభిప్రాయపడ్డారు . జగన్ పాలన శాశ్వతంకాదని, భవిష్యత్ లో తెలుగు దేశంపార్టీ అధికారంలోకి వచ్చితీరుతుందని, రుషి పెరు మాళ వంటివారిని బాగుచేస్తుందని శ్రీనివాసరెడ్డి తెలిపా రు. రుషి పెరుమాళ ఫొటో తమకు దొరికిందని, త్వరలో నే అతని ఇంటికెళ్లి, అతని తల్లిదండ్రుల ముందే అతనితో మాట్లాడతామని, అవసరమైతే అతనిఇంటి ముందు ధర్నాకు దిగుతామని శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పా రు. రుషి పెరుమాళ చర్యలను అతని తల్లిదండ్రుల ఆమోదిస్తే, అతను ఇటువంటి పనులే చేసుకోవచ్చన్నా రు. మనంచేసే పనులు కనీసం మనకుటుంబానికి కూడా ఉపయోగపడకపోతే, ఇటువంటి బతుకులు బతకడం అనవసరమనే విషయాన్ని రుషి పెరుమాళ గ్రహించాలన్నారు. జగన్ తనకు ఇటువంటి ఉపాధి కల్పించాడనే ఆలోచనల్లోనుంచి రుషి పెరుమాళతో పాటు, సామాజికమాధ్యమాల్లో కించపరుస్తూ మాట్లాడేవారు, పిచ్చిపిచ్చి ట్రోల్స్ చేసేవారు అర్థం చేసుకోవాలన్నారు. డీజీపీ ఈ విధమైన వ్యక్తులపై చర్య లు తీసుకోవాలన్నారు. గతంలో రామయ్యకు సెక్యూరిటీ ఉండేదని, దాన్ని ఈ ప్రభుత్వం తొలగించిందన్నారు. 

Advertisements

Latest Articles

Most Read