తిరుపతి ఉప ఎన్నికల్లో, వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి పై, తెలుగుదేశం సోషల్ మీడియాలో, ఆయన్ను కించపరుస్తూ పోస్ట్ పెట్టారని, అందుకని చంద్రబాబు, లోకేష్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అంటూ, వైసీపీ ఎంపీ సురేష్ తో పాటు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులు డీజీపీకి ఫిర్యాదు చేసారు. అయితే దీని పై సీరియస్ గా రియాక్ట్ అయ్యింద్ టిడిపి. చంద్రబాబుని ప్రచారంలో పాల్గునకుండా, ఇరికించే కుట్ర పన్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిపాలనలో, దళితులకు రక్షణ లేదని వర్లరామయ్య గారి విషయంలో మరోసారి రుజువైందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ అభిప్రాయపడ్డా రు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యు లు వర్లరామయ్యకు బెదిరింపుకాల్స్ వస్తే కనీస చర్యలు తీసుకోకుండా, తాత్సారంచేస్తున్న పోలీసుల వైఖరి మరో వైపు, దళితుల రాజధాని అమరావతిని భూస్థాపితం చేస్తున్న ముఖ్యమంత్రి వైఖరి మరోవైపుఉందన్నారు. దానితోపాటు, దళితులకు శిరోముండనాలు, డాక్టర్ సుధాకర్, అనితారాణిలకుజరిగిన అవమానాలపై స్పందించని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుని మరోవైపు ఛూస్తున్నామన్నారు. వారంతా తగుదునమ్మా అంటూ చంద్రబాబునాయుడిపై, లోకేశ్ పై ఫిర్యాదు చేయడానికి డీజీపీ వద్దకు వెళ్లారన్నారు. జగన్మోహన్ రెడ్డికి గురుమూర్తి కాళ్లు నొక్కడం నిజమా అబద్ధమా చెప్పాలన్నారు. అలానే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కూడా ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న మాట వాస్తవమాకాదా అన్నారు. చంద్రబాబునాయుడి పై వైసీపీ నేతలు అట్రాసిటీ కేసు పెట్టాలనడం విచిత్రంగా ఉందన్నారు. వారంతా కేసుపెట్టాల్సింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిపైనే నని జవహర్ తేల్చిచెప్పారు. దళితుడితో కాళ్లు ఎలా నొక్కించుకుంటున్నారని ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిపైన, పెద్దిరెడ్డిపైనే కేసులు పెట్టాలన్నారు.

చంద్రబాబునాయుడి వ్వవహారంపై అనేకసార్లుకేసులు పెట్టి అభాసుపాలయ్యారన్నారు. దళితనాయకులంతా జగన్మోహన్ రెడ్డి పాలనలో మాట్లాడలేని స్థితిలో ఉన్నారన్నారు. మేరుగ నాగార్జున, సురేశ్ ఎస్సీలోకాదో తెలియడంలేదన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం మొదలుకొని చిత్తూరు వరకు దళితులపై దా-డు-లు, మహిళలపై అ-త్యా-చా-రా-లు జరుగుతున్నా, శిరోముండనాలు, హత్యలు జరుగుతున్నా వారు ఏనాడూకనీసం స్పందించలేదన్నారు. దళితులపైనే అట్రాసిటీకేసులు పెట్టిన దౌర్భాగ్యపు పరిపాలనలో వైసీపీదళితనేతలు ఉన్నారన్నారు. వారంతా తక్షణమే డీజీపీని కలిసి జగన్మోహన్ రెడ్డిపై పెట్టాల్సిన కేసుని పొరపాటున చంద్రబాబుపై పెట్టినట్లు తప్పుఒప్పుకోవాలన్నారు. దళితుల ముసుగులో నయా జమీందారులుగా, నయా వలసవాదులుగా, నయా ధనికవర్గప్రతినిధులుగా నాగార్జున, సురేశ్ వంటివారు చెలామణీ అవుతున్నారని జవహర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో దళితులకు రక్షణగా ఉండాల్సిన చట్టాలన్నీ నిర్వీర్యమై పోయాయని, ఎస్సీ సబ్ ప్లాన్ కూడా లేకుండా పోయిందన్నారు. ఆఖరికి చర్మకారులకు, డప్పులుకొట్టేవారికి ఇచ్చిన స్థలాలు కూడా కబ్జాకు గురవుతుంటే, ఏనాడూవారు మాట్లాడింది లేదన్నారు. ఇంతజరుగుతున్నా నోరెత్తని వారు తగుదునమ్మా అంటూ డీజీపీ వద్దకెళ్లి, చంద్రబా బుపై ఫిర్యాదుచేస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు. శిరో ముండనం కేసులో కవలకృష్ణమూర్తి ఏమయ్యాడో, దళిత మహిళలపై అత్యాచారాలు చేసినవారుఏమయ్యా రో చెప్పాలన్నారు. దళితులుగా బయటకొచ్చిన వైసీపీనేతలు, దళితరాజధాని అమరావతిని చంపుతున్నందుకు జగన్మోహన్ రెడ్డిపైనే కేసుపెట్టాలని జవహర్ తేల్చిచెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ప్రదేశమని, ప్రపంచంలోని హైందవులందరికీ అతిపవిత్రమైనదని, ఇప్పటికీ కోట్లాదిమంది భక్తులు స్వామివారిని చూసి తరిస్తుంటారని, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జా తీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనేక్లుప్తంగా మీకోసం... పిలిస్తే పలికేదేవుడిగా, కులదైవంగా శ్రీ వేంకటేశ్వరస్వా మి విరాజిల్లుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల వైభవం, ప్రాభవం, ప్రాశస్త్యం మసకబారుతోందని చాలా బాధాతప్తహృద యంతో చెబుతున్నాను. గతంలో ప్రధానార్చకులుగా చేసి, రిటైరైన రమణదీక్షితు ల్ని, మరలా ప్రధాన అర్చకులుగా జగన్మోహన్ రెడ్డి 6వ తేదీన నియమించారు. మతపరమైన ఆచారాలతో ఆటలాడకూడదని జగన్మోహన్ రెడ్డికి తెలియచేస్తున్నా ఎందుకంటే అటువంటి వ్యవహారాలపై ఆయనకు ఆట్టే అవగాహనలేదుకాబట్టి, నేను చెబుతున్నాను. రమణ దీక్షితులు వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన వైఖరి, భాష ప్రతీది వివాదాస్పదమే. ఆయన భగవంతుడికి సేవచేస్తు న్నట్లుగా కనపడరు. కొంతమంది వ్యక్తులకు సేవచేస్తు న్నట్లుగా అనిపిస్తుంది. భగవంతుడికి సేవచేస్తున్న మనిషిలా ఆయన కనిపించరు. స్వామివారి వైభవానికి, తిరుమలతిరుపతి దేవస్థానం ప్రాశస్త్యానికి దెబ్బతగిలే రీతిలో ఆయన గతంలో కొన్నివ్యాఖ్యలుచేశాడు. పింక్ డైమండ్ గురించి ఆయనకు అవగాహనలేకున్నా, తెలి యకపోయినా, ఏ2 విజయసాయిరెడ్డికి మద్ధతిస్తూ, రమణదీక్షితులు మాట్లాడారు. అదికూడా చెన్నైలో, ఢిల్లీ లో మాట్లాడారు. స్వామివారి ఔన్యత్యానికి, ప్రాశస్త్యానికి, దెబ్బతగిలే మాటలు మాట్లాడాడు. స్వామివారి వైభవం మసకబారే మాటలు వేరేరాష్ట్రాల్లో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై ఆనాడున్న పాలకమండలి బాధపడింది.

పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లోఉంది, కరకట్ట తవ్వితే బయటపడుతుందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు, రమణ దీక్షితులు మద్థతుపలికాడు. దానివల్ల స్వామి వారి ఔచిత్యానికి, ఔన్నత్యానికి, ప్రాభవానికి ఎంత భంగం కలుగుతుందండీ? పింక్ డైమండ్ఉంటే అది, స్వామివారి ఇంట్లో ఉండాలి. సీబీఐ నేరస్థుడని ముద్ర వేసినవ్యక్తి, 11కేసుల్లో ముద్దాయిగా ఉన్నవ్యక్తి, మాట్లా డిన మాటలకు మద్ధతుపలకడమేంటి? ప్రధాన అర్చకు డిగా స్వామివారి పక్షాన నిలవాల్సిన వ్యక్తి, ఆలయ ఔచి త్యాన్ని కాపాడాల్సినవ్యక్తి ముద్దాయిలపక్షాన వారితో గొంతుకలిపాడు. దేవస్థానం వైపు నిలబడాల్సిన వ్యక్తి, పేరెన్నికగన్న ముద్దాయిలకు మద్ధతుపలికాడు. ఆనా డు వారుచేసినవ్యాఖ్యలపై బాధపడిన పాలకమండలి, టీటీడీపెద్దలు, ప్రభుత్వం, ప్రశ్నార్థకమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి, అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కుడి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉండటానికి వీల్లే దని నిర్ణయించారు. ఎంతోమంది భక్తులసూచనలు, సల హాల ప్రకారం 65ఏళ్లు నిండిన రమణదీక్షితుల్ని తొలగిం చడం జరిగింది. ఆనిర్ణయంపై ఆనాడు హైందవలోకమం తా హర్షం వ్యక్తంచేసింది. దానితోపాటు, 2018 –మే లో పేరెన్నికగన్న నేరస్థుడైన విజయసాయిరెడ్డితోపాటు, రమణ దీక్షితులు రూ.200కోట్లను పరువునష్టంకింద ధరావతుగా చెల్లించడం జరిగింది. అధికారమిచ్చింది ఇష్టమొచ్చినట్లు వ్యవహారించడానికికాదు. ముఖ్యమం త్రి గారు నా ప్రెస్ మీటు వినాలి. ఏ2, రమణదీక్షితుల వ్యాఖ్యలవల్ల స్వామివారి పవిత్రత, ఔచిత్యం దెబ్బతిన్నదని తిరుపతి పదోఅదనపు జిల్లా కోర్టులో పరువునష్టం దావావేశారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అదృష్టమో, దురదృష్టమో జగన్మోహ న్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో, విజయసాయిరెడ్డి ఎప్పుడైతే రాష్ట్రంలో చక్రం తిప్పడం మొదలెట్టారో అప్పుడు రమణ దీక్షితులకి ఒకబలం వచ్చింది. ఊతం లభించింది.

మొన్నటివరకు పరువునష్టం దావా ఎదుర్కొంటూ తిరి గినవ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక బలం వచ్చింది. ఆ బలం ఎంతవరకు వచ్చింది. పరువునష్టం దావాలో ముద్దాయిగా ఉన్న రమణదీక్షితుల్ని ప్రధాన అర్చకుడిగా ఈ ప్రభుత్వం నియమించడం ఎంత శోచనీ యమండీ... ఎంత బాధాకరమండీ? స్వామివారి పరు వుకి భంగం కలిగించిన ముద్దాయిని ప్రధాన అర్చకుడి గా నియమిస్తారా? ముఖ్యమంత్రి క్రైస్తవుడు కనుక, హైందవసంప్రదాయంపై ఆయనకు ఆట్టే అవగాహన లేదు కనుక, రమణదీక్షితులు తనతో, తనతోటి ముద్దా యిలతో బాగుంటాడు కనుక, ఒకఆర్డర్ వేసి, ఆయన్ని ప్రధాన అర్చుకుడిగా నియమించారు. చట్టబద్ధంగా, ధర్మ బద్ధంగా ఆయన్ని నియమించలేదు. ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందనేసూక్తితో స్వామివారి సేవలు నడుస్తుంటాయి. రమణదీక్షితుల్ని తిరిగి నియమించడం ధర్మాన్నికాపాడినట్టా? స్వామి వారి ఔచిత్యాన్ని కాపాడినట్టా? హైందవ మతానికి సం బంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఆలోచించకుం డా నిర్ణయం తీసుకున్నారు. ఏ హైందవమతపెద్దలను, ఏ పీఠాధిపతులను, ఏ జీయర్ స్వాములను సంప్రదించి ముఖ్యమంత్రి, రమణదీక్షితులి విషయంలో నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యమంత్రిది హైందమతంకాదు, ఆ మతం ఆచారవ్యవహారాలు ఆయ నకు తెలియవు. మరి అలాంటప్పుడు ఎవరిని సంప్రదిం చి ఈనిర్ణయం తీసుకున్నారు. స్వామివారి ప్రాశస్త్యాన్ని తక్కువచేసిన వ్యక్తి, స్వామివారి గౌరవం మసకబారేలా వ్యవహరించిన వ్యక్తి, స్వామివారి పరువుతీశాడని, దేవ స్థానంవేసిన పరువునష్టం కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, తోటి ఏ2కు సహకరించాడని ప్రధాన అర్చకత్వం కట్టబెట్టారా? దీనిపై ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.

తనను ప్రధాన అర్చకుడిగా నియమించగానే, రమణ దీక్షితులు చెంగుచెంగున గెంతుకుంటూ వెళ్లి ముఖ్య మంత్రిని కలిశాడు. స్వామివారి ప్రసాదం అందించాడు. దాన్ని ఆయన పక్కనున్న టేబుల్ పై పెట్టారు. రమణ దీక్షితులు, ముఖ్యమంత్రిని కలిసి, పెద్దబొకే ఇచ్చి, శాలువాకప్పి, బయటకువచ్చాక ఏమన్నాడండీ .. సీఎం జగన్ విష్ణుమూర్తికి ప్రతిరూపమని అభివర్ణిం చారు.... అంతకంటేఘోరం ఇంకోటి ఉందా? హైందవ మత పెద్దలారా..జీయర్ స్వాములారా... పీఠాధిపతులా రా.. విశాఖపట్నంలోని ఆస్వామీజీ రమణదీక్షితులి వ్యాఖ్యలపై ఏమంటారు? క్రైస్తవ మతాన్ని ఆచరించే జగ న్మోహన్ రెడ్డి, వేంకటేశ్వరస్వామికి ప్రతిరూపమా? ఎంత పొగరుంటే దీక్షితులుమహాశయుడు అలా అంటాడు? అనేకకేసుల్లో ముద్దాయిగా ఉన్నవ్యక్తి, ప్రశ్నార్థకమైన జీవితం గడుపుతున్నవ్యక్తి, ప్రతిశుక్రవారం కోర్టుకి హజ రయ్యే వ్యక్తి, విచారణ సక్రమంగా జరిగితే జైలుకు పోతాడో.. ఇంట్లో ఉంటాడో తెలియని వ్యక్తిని విష్ణుమూర్తి తో పోలుస్తారా? ప్రధానార్చకులు రమణ దీక్షితులు, క్రైస్త వమత ఆరాధకుడైన జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోల్చి, సీఎంజగన్ విష్ణుమూర్తి ప్రతిరూపమంటే, అలా అనవద్దని ముఖ్యమంత్రి ఎందుకు అనలేదు? రమణ దీక్షితులి వ్యాఖ్యలపై పీఠాధిపతులు, జీయర్ స్వాము లు, విశాఖస్వామీజీ ఏం సమాధానంచెబుతారు? మనిషిని దేవుడితో పోల్చడం సబబేనా? సమంజసమే నా?

 

సామాన్యులు సొంత ఇంటి కల నిజం చేసుకోవాలి అంటే, చాలా మంది బ్యాంకు రుణాల మీద ఆధారపడి ఇల్లు కట్టుకుంటారు. ఒక లోన్ మన పేరు మీద ఉండగా, మరో లోన్ ఏ బ్యాంకు ఇవ్వదు. అది కూడా ఇల్లు కట్టుకుంటా అని లోన్ తీసుకుని, ఇల్లు కట్టకుండా, ఆ డబ్బులు వాడేసుకుని, ఇప్పుడు మరో కొత్త రుణం కోసం, అదే బ్యాంక్ కు వెళ్తే, అక్కడ బ్యాంకు వాడు చెప్పేది, ముందు పాత లోన్ తీసుకున్న డబ్బులతో, ఇల్లు కట్టి చూపించు, అప్పుడు కొత్త లోన్ గురించి ఆలోచిస్తాం అని చెప్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు అయ్యింది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేవలం అప్పులతో నెట్టుకుని వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రం షాకుల మీద షాకులు ఇస్తుంటే, ఇప్పుడు బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, నిర్మాణాలు పూర్తి చేయటానికి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ, లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే, అక్కడ షాక్ తగిలింది. ఇప్పటికే మీకు గతంలో 3 వేల కోట్లు రుణాలు ఇచ్చామని, అమరావతిలో ఆ ప్రాజెక్ట్ లు పూర్తి చేసి, క్లోజర్ రిపోర్ట్ లు మాకు చూపిస్తే, అప్పుడు మీకు కొత్త రుణం గురించి అలోచిస్తామని చెప్పటంతో, జగన్ ప్రభుత్వం షాక్ తింది. గతంలో అమరావతిలో అనేక నిర్మాణాలు చంద్రబాబు చేపట్టారు. వైసీపీ అవి గ్రాఫిక్స్ అని హేళన చేసినా, అక్కడకు వెళ్లి చూసిన వారికి అవి ఏంటో తెలుస్తాయి.

amaravati 09042021 2

ఈ నిర్మాణాల కోసం, అప్పట్లో సిఆర్డీఏ, రూ.2,060 కోట్ల లోన్ తెచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ల కన్సార్షియం, ఈమూడు బ్యాంకులు కలిసి ఈ లోన్ ఇచ్చాయి. వాటిల్లో చాలా వరకు 90 శాతం వరకు నిర్మాణాలు పూర్తీ అయ్యాయి. అయితే ఎన్నికల్లో చంద్రబాబు, ఓడిపోవటం, జగన్ గెలవటంతో, అమరావతి నిర్మాణం ఆగిపోయింది. అయితే అమరావతి ప్రాంతంల్లో రైతుల ఆందోళన, కోర్టులలో కేసులతో, అలాగే రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఇక్కడ నిర్మాణాలు కొంత మేరకు చేయాలని జగన్ ప్రభుత్వం భావించి, మళ్ళీ ఇదే బ్యాంకుల కన్సార్షియం వద్దకు 10 వేల కోట్లు రుణం కావాలని, మొదటి విడతగా 3 వేల కోట్లు కావలని వెళ్లారు. అయితే అనూహ్యంగా బ్యాంకులు అడ్డం పడ్డాయి. ఇది వరకు లోన్ తెసుకున్న బిల్డింగ్ లు ముందు కట్టి చూపించండి, తరువాతే కొత్త రుణం ఇస్తామని మెలిక పెట్టాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం, ఏమి చేయాలి అనే దాని పై తర్జన బర్జన పడుతుంది. మళ్ళీ కొత్త బ్యాంకు కోసం వెళ్తే, ఈ ప్రాసెస్ అంతా అయ్యే సరికి, ఏడాదికి పైగా పడుతుంది. ఈ లోపు, కోర్టులో, మీరు వచ్చిన తరువాత అమరావతికి ఏమి చేసారు అంటే, ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. మరి ఏమి చేస్తారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్స్ అసోసియేషన్ కలెక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఆరు నెలలుగా, రాష్ట్రంలోని చాలా మంది తహశీల్దార్లకు జీతాలు కూడా రావడం లేదని, దీనికి ఎవరు బాధ్యులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కలెక్టర్లు చేసిన తప్పులతో,  తహశీల్దార్లకు జీతాలు నిలిచిపోయాయి అంటూ, రెవెన్యూ అసోసియేషన్ తరుపున బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క బదిలీల పై నిషేధం ఉన్నా సరే, ఈ సమయంలో కలెక్టర్లు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసారని అన్నారు. కలెక్టర్ లు ఇలా ఇష్టం వచ్చినట్టు బదిలీ చేయటం వలనే, ఈ రోజు తమకు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ బదిలీలు అన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయంగా వస్తున్నఒత్తిళ్లతోనే, కలెక్టర్లు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ తప్పిదానికి బాధ్యత వహించాలని, ఇష్టం వచ్చినట్టు నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ బదిలీల పై , బాధ్యులైన అధికారులకు జీతాలు నిలిపివేయాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read