తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది పిల్లి.మాణిక్యరావు, విష్ణు వర్ధన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. ఆయన మాటల్లో... "బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తనపై జరిగిన దాడిని టీడీపీ కి అంటకట్టాలని ప్రయత్నించడం తన చేతకాని తనానికి నిదర్శనం. అంతేకాక స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పై దాడి జరిగినట్టు అబద్ధపు ప్రచారాన్ని చేయాలనుకోవడం తన అవివేకానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో దేశంలో నిజమైన లౌకిక వాద, ప్రజాస్వామిక పార్టీ తెలుగుదేశం పార్టీ. బిజెపి పార్టీ ఈ రాష్ట్రములో తను ఎదగడం కోసం ఆ పార్టీ ఎలాంటి పద్దతులను అవలంబిస్తుందో మేము ప్రస్తుతం ప్రస్తావించదలుచుకోలేదు. భౌతిక దాడులు, కుట్రపూరిత రాజకీయాలు, విధ్వంసకర నిర్ణయాలు ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతమో అందరికి తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్ అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్. అమరావతి ఉద్యమాన్ని అవమానకర రీతిలో మీరు మాట్లాడుతూ... తను దళితుడానే చులకన భావనతో వ్యంగంగా వ్యవహారించడమే కాకుండా ఒక పార్టీకి బానిసని అనటం శ్రీనివాస్ తట్టుకోలేకపోయారు.

vishnu 25022021 2

తన ఆత్మగౌరవం పబ్లిక్ గా చరకు గురౌతుంటే, తట్టుకోలేక శ్రీనివాస్ ఆ చర్యకు పూనుకొని ఉండవచ్చు. అది పూర్తిగా నీ ఆధిపత్య,వికార వ్యక్తిత్వానికీ....శ్రీనివాస్ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దీనిలో నువ్వు తెలుగుదేశం పార్టీనీ నిందించడం నీ చేతకాని తనానికి నిదర్శనం. నీవు ఏ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నావో.. ఏ ఉద్యమాలను అవమానిస్తున్నావో... ఏ పార్టీలో ఉండి, ఏ పార్టీ కోసం పని చేస్తున్నావో... నీ నీచపు రాజకీయ సంస్కృతిని... నీ వ్యక్తిగత వ్యవహార శైలి ప్రజలకు అర్థం అవుతుంది. అందుకే నీపై కొలికపూడి శ్రీనివాస్ అలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చు. అయినా అలాంటి చర్యలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమర్ధించదు. కాబట్టి తెలుగుదేశం పై నిందలు వేయాలనే నీ ఆలోచన మానుకొని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తావని, అధికార పార్టీ కుల తత్వం పోకడలను తొలగించుకుంటావని నీకు సూచన చేస్తున్నాము." అంటూ విష్ణు వర్ధన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

జగన్మోహన్ రెడ్డి తన అబద్ధాల చిట్టాకు, సంక్షేమ క్యాలెండర్ అనే పేరుపెడితే, మంత్రులేమో అబద్ధాలతోఊదరగొడుతూ, దేశంలో ఎక్కడా ఇటువంటి పథకాలు అమలుకావడంలేదని చెప్పడం సిగ్గుచేటని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహంవ్యక్తంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. సంక్షేమ క్యాలెండర్ పేరులో మంత్రులు సిగ్గులేకుండా, ప్రజలు ఏమనుకుంటారోనన్న ఆలోచన లేకుండా అబద్ధాలమీద అబద్ధాలు చెబుతున్నారని మర్రెడ్డి మండిపడ్డారు. గోరంత సాయం చేస్తూ, కొండంతప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి, మంత్రులను ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. జగన్ అబద్ధాల ప్రచారమనేది సాక్షి మీడియాతోసహా, బ్లూమీడియా మొత్తం భారీస్థాయిలో ఊదర గొడుతోందన్నారు. అమ్మఒడి పథకం పేరుతో రూ.14వేలిస్తున్న జగన్ , అయ్యబుడ్డిద్వారా రూ.36వేలుకాజేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాడో, పన్నులు ఎలా పెంచాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. సంవత్సరానికి రూ.5వేలకోట్లు లిక్కర్ వ్యాపారంలో దోచుకుంటున్న ముఖ్యమంత్రి ఎటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అమలుచేస్తున్నాడో చెప్పాలన్నా రు. సిమెంట్ కంపెనీలను సిండికేట్ చేసిన జగన్, తద్వారా ఎంత ఆర్జిస్తున్నాడో చెప్పాలన్నారు. మద్యంరేట్లను ఇష్టానుసారం పెంచిన జగన్, అన్నాక్యాంటీన్లను తొలగించడంతోపాటు, నిరుద్యోగ భృతిని రద్దుచేశాడన్నారు. విదేశీవిద్యకు ఇచ్చే చెల్లింపులను కూడా తొలగించాడన్నారు. టీడీపీప్రభుత్వం అమలుచేసిన 36సంక్షేమ పథకాలను రద్దుచేసిన జగన్, కొత్తగా సంక్షేమపథకాల క్యాలెండర్ విడుదలచేస్తున్నానంటూ డబ్బాలు కొట్టుకునే పని మొదలుపెట్టా డని మర్రెడ్డి ఎద్దేవాచేశారు.

జగన్ కు తానొక బహిరంగ సవాల్ విసురుతున్నానన్న శ్రీనివాస రెడ్డి, రాష్ట్రంలో 5కోట్లమంది జనాభాఉంటే, 5కోట్ల1లక్షమందికి తన సంక్షేమక్యాలెండర్ అమలుచేయబోతున్నట్టు ముఖ్యమంత్రి నేడు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడన్నారు. ఆయన ప్రకటనలకు, వాస్తవానికి ఎక్కడైనా పొంతనకుదురుతుందా అని టీడీపీనేత ప్రశ్నించారు. జగన్ ప్రకటనలు నమ్మడానికి ఏమాత్రమైనా అవకాశ ముందా అని శ్రీనివాసరెడ్డి నిలదీశారు. విద్యారుణాలు, 2019 రబీ, 2020ఖరీఫ్, 2020 రబీకిరుణాలు ఇస్తాననడం విడ్డూరంగా ఉంద న్నారు. అయిపోయిన 2019 రబీకి ఇప్పుడు రుణం ఇస్తున్నట్లు, తద్వారా కోటి20లక్షల మంది రైతాంగానికి మేలుచేస్తున్నట్లు ప్రకటనల్లో చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా,ప్రజలు నిలదీస్తారనే ఇంగితంలేకుండా బాకాలు ఊదడం ఎంతమాత్రం మం చిదికాదన్నారు. ఎన్నికలువచ్చినప్పుడే, జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంక్షేమం గుర్తుకొస్తుందన్నారు. ప్రభుత్వ ఖజానాలోని సొమ్ముని, తన సొంతఖజానాకు బదిలీచేసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి పథకా లు అమలుచేస్తున్నాడుతప్ప, ప్రజల మేలుకోసం కాదని శ్రీనివాస రెడ్డి తేల్చిచెప్పారు. అమ్మఒడికి ఇచ్చిన సొమ్ముని తల్లులు వివిధ రూపాల్లో దుర్వినియోగంచేస్తుంటే, విద్యార్థుల చదువులుఎలా కొనసాగుతాయన్నారు. అమ్మఒడిద్వారా జగన్ ఇచ్చే రూ.14వేల సొమ్ము, 80శాతానికి పైగా తిరిగి సారాకొట్లద్వారా జగన్ సొంత ఖజానాకే చేరుతున్నాయన్నారు. ప్రభుత్వ ధనాన్ని లూఠీచేయడా నికి, అవినీతిపరుడిననే ముద్ర పోగోట్టుకోవడానికే, జగన్ ప్రభుత్వ సొమ్ముని పథకాలపేరుతో సొంతఖజానాకు చేర్చుకుంటున్నాడన్నా రు. ఇళ్లపట్టాల పంపిణీపేరుతో తక్కువధరకు భూములుకొని, వాటిని ఎక్కవధరకుప్రభుత్వానికి అంటగట్టిన జగన్, వాహనమిత్ర పేరుతో డ్రైవర్లకు రూ.10వేలుఇచ్చినట్లేఇచ్చి, తెల్లారగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశాడన్నారు. అంతటితోఆగకుండా, ఆర్టీవో అధికారులతో తప్పుడుకేసులుపెట్టించి, వాహనదారులనుంచి పదికి పది అదనంగా వసూలుచేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిం దన్నారు. 2019, 2020లో రైతులు తీసుకున్నరుణాలకు సున్నా వడ్డీని ఇంతవరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో 15లక్షలమంది కౌలు రైతులుంటే, వారికిసున్నావడ్డీ పథకంతోపాటు, రుణ సౌకర్యమే లేకుండా పోయిందన్నారు.

కౌలురైతుల సంఖ్యను లక్షకు కుదించి, వారికి ఎటువంటిరుణం అందకుండాచేశాడన్నారు ఒక రైతుకు రెండేళ్లకు ఇచ్చేమొత్తాన్ని ఒకక్యాలెండర్ లో ప్రకటించి, వారికి మేలుచేస్తున్నట్లు జగన్ చెప్పుకుంటున్నాడన్నారు. నిత్యా వసరాల ధరలు విపరీతంగా పెంచిన జగన్, బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాడన్నారు. ఇసుకలేక ఉపాధిదొరక్క కార్మికులు రోడ్డునపడితే, వారి సంక్షేమ నిధిసొమ్ము నికూడా జగన్ దిగమింగాడన్నారు. వడ్డీలేని డ్వాక్రారుణాలు పొంద డానికి రాష్ట్రంలో ఎన్నిడ్వాక్రా గ్రూపులు అర్హత సాధిస్తున్నాయో, ఇచ్చేసొమ్ముకి ఎన్ని కొర్రీలు పెడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. దర్జీలకు, రజకులకు, నాయీబ్రాహ్మణులకు గతంలో టీడీపీ ప్రభుత్వం చేయూత, ఆదరణ పథకాల పేరుతో రూ.లక్షవరకు ఇస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూ.10వేలు చేతిలో పెట్టి సంక్షేమపథకాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడన్నారు. విదేశాలకువెళ్లి చదువుకునే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ విద్యార్థు లకు చంద్రబాబుప్రభుత్వం రూ.10లక్షలవరకు రుణమిస్తే, దాన్ని జగన్ రద్దుచేశాడన్నారు. జీవోనెం-77పేరుతో విద్యార్థులకు ఇవ్వా ల్సిన ఫీజురీయింబర్స్ మెంట్ ను కూడా ముఖ్యమంత్రి తొలగించా డన్నారు. ఈవిధంగా అనేకపథకాలు రద్దుచేయడం, ఉన్నవాటికి కోతలు పెట్టడం, లబ్ధిదారులసంఖ్యను కుదించడం చేసిన ముఖ్య మంత్రి, ఇప్పుడు ఉన్నజనాభాకంటే ఎక్కువమందికి సంక్షేమ పథ కాలు అమలుచేస్తానని చెప్పడం మోసగించడం కాక మరేమిటని శ్రీనివాసరెడ్డి నిలదీశారు. చేసేదేదో, చేయగలిగింది ఏదో ప్రజలకు స్పష్టంగా చెప్పకుండా, లబ్ధిదారుల సంఖ్యను ఎక్కువగా చూపు తూ, ప్రజలను మోసగించే చర్యలకు జగన్ ఇప్పటికైనా స్వస్తి పలికి తే మంచిదన్నారు. ఆరోగ్యశ్రీ, ఆసరా, గృహనిర్మాణం, ఆదరణ, విదేశీ విద్య, రేషన్ సరుకుల పంపిణీ వంటి అనేక పథకాలను చంద్ర బాబునాయుడుఎలా అమలుచేశాడో ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం ఆలోచనచేస్తే మంచిదన్నారు. సంక్షేమపథకాల క్యాలెండర్ పేరుతో ప్రజలనుమోసగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని టీడీపీనే త హెచ్చరించారు.

విశాఖలో ఉన్నటు వంటి స్వరూపానంద సరస్వతి మఠం అక్రమాలకు అడ్డంగా మారింది అంటూ, ఫిర్యాదు చేసారు. విశాఖకు చెందినటు వంటి, రాం దీని పై ఫిర్యాదు చేసారు. విశాఖ భీమిలిలోని 15 పంచాయతీల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. అటు స్వరూపానంద స్వామి ఒక దొంగ స్వామి అంటూ, స్వరూపానంద స్వామి ఆశ్రమం, వైసీపీ పార్టీకి అడ్డాగా మారింది అని కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు, ఆశ్రమం మూసివేయాలని, లేని పక్షంలో ఎన్నికలను అక్కడ నుంచి అధికార పార్టీ ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. దేశంలో ఎక్కడా, ఏ ఆశ్రమానికి లేని సెక్యూరిటీ, ఏపి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిందని, ఎందుకు ఆశ్రమాలకు ఆ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చిందో కూడా, ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులో తెలిపారు.

ఒకరకంగా గతంలోనే స్వరూపానంద స్వామికి సంబందించినంత వరకు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా దుర్గ గుడి పైన జరుగుతున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఏవైతే ఉన్నాయో, అక్కడ నుంచి నిధులు తరలిపోయాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే, మొత్తం మీద ఇప్పుడు నేరుగా స్వరూపానంద మఠం పై నేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటం, సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఆధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్వరూపానందకి అధికా ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. డీజీపీ, అధికారులు, మంత్రులు అందరూ వరుస పెట్టి ఆయన దగ్గర మోకరిల్లారు. దీని పై మొదటి నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే మొన్న ఎన్నికలు జరగటం, అక్కడ స్వరూపానంద ఆశ్రమం పై విమర్శలు రావటంతో, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ ఆశ్రమం పై, ఇక్కడ జరుగుతున్న అధికార దుర్వినియోగం పై ఫిర్యాదులు రావటం చర్చకు దారి తీసింది.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వరుస పెట్టి ఎన్నికలు జరుపుతూ, ప్రతి కేసు కోర్టులో గెలుస్తూ, తమకు ఉన్న అధికారాలను ఉపయోగించి, వరుస పెట్టి ఎన్నికలు నిర్వహిస్తూ ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్. పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా పూర్తి చేసి ఇప్పుడే సక్సెస్ అయ్యారు. ఇక వీటి తరువాత, మునిసిపల్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. మార్చి నెల పదవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటి తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సర్కులర్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. అందులో ఏకాగ్రీవలకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైనా సరే బలవంతపు ఏకాగ్రీవాలు జరిగితే, దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే, అలాంటి వాటి పై తగు చర్యలు తీసుకుంటామని, ఆధారాలతో సహా, ఎన్నికల కమిషన్ ను అపోర్చ్ అయితే సరైనా విధంగా, దాని పై చర్యలు తీసుకుంటాం అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక సర్కులర్ కూడా ఇచ్చింది. అయితే దీని పై ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ఇప్పటికే ఏకగ్రీవాలు అయిన చోట, మళ్ళీ విచారణ వద్దు అంటూ ప్రభుత్వం కోర్టులో పిటీషన్ వేసింది. 

అయితే ఇందులో విచారణ జరిపిన తరువాత, కోర్టు కూడా వారితో ఏకీభవించింది. అయితే ఎక్కడైతే ఫారం-10 ఇచ్చేసి ఉన్నారో, అక్కడ మళ్ళీ నామినేషన్ వేయటం కుదరదు అని, కోర్టు కూడా తేల్చి చెప్పింది. అయితే ఇవి మధ్యంతర ఉత్తర్వులు అని కోర్టు చెప్పింది. తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు రోజులు క్రితం ప్రెస్ మీట్ పెట్టిన నిమ్మగడ్డ, పరిషత్ ఎన్నికల పై మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ పై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కోర్టు తీర్పుకు లోబడి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, న్యాయపరమైన చిక్కులు తొలగిపోతేనే, వాటి పై ఆలోచన చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే, ఆయన ఇప్పుడు పరిషత్ ఎన్నికల నిర్వహణకు విముఖంగా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. వరుస పెట్టి కోర్టులతో పోరాడిన ఎన్నికల కమిషన్, ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. మరి రిటైర్డ్ అయ్యే లోపు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు వెళ్తారా, న్యాయస్థానాల్లో ఏ అడ్దంకులు లేకుండా ముందుకు సాగుతారో లేదో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read