దుర్గగుడిలో జరిగిన ఏసీబీసోదాల్లో అవినీతికిపాల్పడిన అసలు దొంగైన వెల్లంపల్లి శ్రీనివాస్ ను వదిలేసి, అమాయకులైన ఉద్యోగులను సస్పెండ్ చేయడం మంచిపద్ధతికాదని, దేవాదాయ శాఖకే మచ్చతెచ్చిన వెల్లంపల్లి, దేవాదాయశాఖలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రచరిత్రలో ఎప్పుడూలేనట్టు, వెల్లంపల్లి దోపిడీకి పాల్పడ్డాడని టీడీపీ రాష్ట్రప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దావెంకన్న స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో టీడీపీ అధికారప్రతినిది నాగుల్ మీరాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏసీబీసోదాల్లో అసలు వాస్తవాలు బయటకురాలేదని, అందుకే వాటిని ప్రజలముందుంచడానికి తాము మీడియాముందుకు వచ్చినట్లు బుద్దా తెలిపారు. దుర్గగుడిలో మాయమైనచీరల్లో కొన్ని వెల్లంపల్లి ఇంటికి వెళితే, మరికొన్ని ఆయన దుకాణానికి వెళ్లాయన్నారు. ఆఖరికి అమ్మవారికి వేసే కానుకలు, చెల్లించే మొక్కుబడులు, హుండీలో వేసే ఇతరవిలువైన వస్తువులను సాధారణంగా భక్తులసమక్షంలో లెక్కించాలన్నారు. అలాకాకుండా డినామినేషన్ అనేది బహిరంగంగా అందరిముందుచేయరని, మంత్రివెల్లంపల్లి వచ్చాకే అది జరుగుతుందని, దానిలో కోటిరూపాయలు వస్తే, రూ50లక్షలు మాత్రమే అధికారికంగా చెప్పి, మిగిలిందంతా శ్రీనివాస్ కాజేస్తాడన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, ఎమ్మెల్యేస్థాయిలో తనదోపిడీని ప్రారంభించిన వెల్లంపల్లి, నేడు మంత్రి హోదాలో దాన్నిరెండింతలకు పెంచాడన్నారు. ఏసీసీఅధికారులు, ప్రభుత్వం కేవలం దుర్గగుడికే పరిమితం కాకుండా, అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల దేవాలయాలలో కూడా తనిఖీలుజరపాలన్నారు. ద్వారకాతిరుమలలో వెల్లంపల్లి సాగిస్తున్న దోపిడీ అంతాఇంతా కాదన్న వెంకన్న ఆఖరికి విజయవాడలోని వినాయక దేవాలయాన్నికూడా మంత్రి వదల్లేదన్నారు.

విఘ్నేశ్వరుడి ఆలయంతోపాటు, విజయేశ్వరస్వామి ఆలయాన్నికూడా శ్రీనివాస్ తనదోపిడీకేంద్రాలుగా మార్చుకున్నాడన్నారు. రూ.కోటి30లక్షలతో నిర్మించిన దుకాణాల అద్దెలనుకూడా తనకు నచ్చిన ధరకే వెల్లంపల్లి నిర్ణయించాడన్నారు. వెల్లంపల్లి తనకూతురిపై ప్రమాణం చేసి, అమ్మవారిగుడిలో ప్రమాణంచేసి, తాను దేవుడి సొమ్మురూపాయికూడా తినలేదని చెప్పగలడా అని వెంకన్న నిలదీశారు. ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వెల్లంపల్లిని అరెస్ట్ చేస్తేనే అసలు వ్యవహారాలు బయటకు వస్తాయన్నారు. వెల్లంపల్లి కనుసన్నల్లోనే దుర్గగుడి నడుస్తోందని, అక్కడ జరిగే ప్రతిఅవినీతిలో ఆయనప్రమేయం ఉందన్నారు. నెలకు రెండుసార్లు తిరుమలవెళ్తూ, తనవెంట తీసుకెళ్లేవారికి స్వామివారి దర్శనంచేయించి,వారినుంచి కూడా డబ్బులు దండుకుంటున్నాడన్నారు. గతఎన్నికల్లో రూ.10కోట్ల ఆస్తిని ఎన్నికల అఫిడవిట్ లోచూపిన వెల్లంపల్లి ఆస్తినేడు కోట్లాదిరూపా యలు ఎలా అయిందో ఆయనే సమాధానంచెప్పాలన్నారు. 2009 – 2014 మధ్యలో వెల్లంపల్లి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు, జగన్మో హన్ రెడ్డి సొంతపత్రిక అయినసాక్షిలో శ్రీనివాస్ పై చెన్నైలో వ్యభిచార కేసులు నమోదయ్యాయని రాశారు. ఆవ్యవహారంపై కూడా జగన్ ప్రభుత్వం విచారణ జరిపి వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలని బుద్దా డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించటం లేదు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై, గతంలో ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ వేసిందో లేదో చూడాలని చెప్పి, గతంలో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఈ రోజు కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ పై, మళ్ళీ విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నీలం సాహనీ, ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ ప్రినిసిపల్ సెక్రటరీగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేదీ, వీళ్ళ ఇద్దరినీ కూడా కోర్టుకు వ్యతిగంగా రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టు ధిక్కరణ పిటీషన్ వేయటంతో, ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్ పై ప్రభుత్వం అసలు స్పందించటం లేదని, అదే విధంగా ఎన్నికల కమిషన్ కు కావలసిన వివిధ అవసరాలకు సంబంధించి, గవర్నర్ కు విజ్ఞప్తి చేసినప్పటికి కూడా , రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇస్తూ, వచ్చే నెల 22వ తేదీ నాటికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నీలం సాహనీ, ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ ప్రినిసిపల్ సెక్రటరీగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేదీ కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నీలం సాహనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ గగిలింది. 90 శాతం గెలుచుకుంటాం అని చెప్పిన వైసిపీ నేతలు, బొక్క బోర్లా పడ్డారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పోటా పోటీగా సీట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కంచుకోతలను కూడా టిడిపి బద్దలు కొడుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తమ సొంత గ్రామంలో ఓడిపోతున్నారు. దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సొంత గ్రామం అయిన, రాయుడుపాలెంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. ఇక్కడ టిడిపికి చెందిన చింతమనేని ప్రభాకర్ ఎంతో కష్టపడి సాధించారు. చింతమనేని స్వగ్రామం దుగ్గిరాలలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక మంత్రి విశ్వరూప్ సొంత ఊరిలో తెలుగుదేశం బలపరించిన అభ్యర్ధి గెలిచారు. అలాగే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ ఆళ్ల దశరధరామిరెడ్డి సొంత వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గెలిచారు. ఇది పొన్నూరు నియోజకవర్గం, పెదకాకాని మండలం, పెదకాకాని మేజర్ పంచాయితీలో ఉంది. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ గారి సొంత గ్రామం, తిక్కిరెడ్డిపాలెంలో 323 ఓట్ల తేడాతో వైసిపీ ఓడిపోయింది. అలాగే కొంత మంది వైసిపీ, ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశారు. అక్రమాలపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం నుండి ఎలాంటి చర్యలు లేవు. నాలుగు దశల ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ.. ఫలితాలు ప్రకటించకుండా దాచి, రాత్రి 8 తర్వాత వైసీపీ బలపర్చిన అభ్యర్ధులకు అనుకూలంగా ప్రకటనలు వెలువరుస్తున్నారు. గత మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లోనూ, నేడు జరిగిన చివరి దశలోనూ అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. చీకటి పడిన తర్వాత జరుగుతున్న ఫలితాల తారుమారు అంశాలన్నింటిలో కూడా పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వైసీపీ అభ్యర్ధులకు అనుకూలంగా పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరపున ఈ ఘటనలను మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 1. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ కేంద్రాల్లో జరగాల్సిన వీడియో రికార్డింగ్ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. 2. చీకటి పడిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల్లో లైట్లు ఆపేసి ఫలితాలను తారుమారు చేస్తున్నారు. ఉదా: ఈ రోజు (21.02.2021) విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనగమయ్యపాలెం కౌంటింగ్ సెంటర్లో లైట్లు ఆపేసి వైసీపీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రకటన చేశారు. 3. సింగిల్ డిజిట్ మెజార్టీతో ఎన్నికల ఫలితాలు వచ్చినపుడు మాత్రమే రీ కౌంటింగ్ చేయాల్సి ఉన్నా.. వైసీపీ గెలుపు కోసం రెండు, మూడు అంకెల ఫలితాల తేడా ఉన్నప్పటికీ రీ కౌంటింగ్ చేస్తున్నారు. 4. ప్రతిపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్ధుల గెలుపు ఖాయమైనప్పటికీ.. ఫలితాలు బయట పెట్టకుండా దాచిపెట్టి.. తర్వాత వైసీపీ అభ్యర్ధులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారు. ఉదా 1 : నాలుగో విడతలో ఎన్నికలు జరిగిన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ మద్దతు దారుడు 9 ఓట్ల మెజార్టీతో గెలిచినా ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా దాచిపెట్టారు. ఉదా 2 : కర్నూలు జిల్లా నందవరం మండలం మిట్టసోమాపురం పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధి ఒక ఓటు మెజార్టీతో గెలిచిన తర్వాత ఎన్నికల ఫలితాలు దాచిపెట్టి.. తర్వాత వైసీపీ అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించారు.

5. ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధులు రీ కౌంటింగ్ కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉదా : గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనమర్లపూడిలో వైసీపీ అభ్యర్ధి ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటిస్తే.. రీ కౌంటింగ్ చేయాలని ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులు ప్రతిపాదించినా అధికారులు పట్టించుకోవడం లేదు. 6. వైసీపీ అభ్యర్ధులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లను అనధికారికంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లతో పంపిస్తూ.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లను మాత్రం పంపించడం లేదు. 7. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల్లోకి పోలీసులు వెళ్లి ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధులను, కౌంటింగ్ ఏజెంట్లను, ఎన్నికల అధికారులను కూడా బెదిరిస్తున్నారు. 9. ఒకటి రెండు ఓట్ల తేడాతో ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధులు గెలిస్తే.. వైసీపీ బలపర్చిన అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. అదే సమయంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా పారదర్శకంగా నిర్వహించాలి. ఎన్నికల కౌంటింగ్ సమయంలో పలు ఓట్లు దారి మళ్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎన్నికల సంఘం గమనించి సరైన చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ఎన్నికల సంఘం నుండి సరైన స్పందన లేకపోవడంతో ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. ప్రజల అభిప్రాయాలను నాశనం చేస్తోంది. ఇప్పటికైనా ఎన్నికల ఫలితాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

Advertisements

Latest Articles

Most Read