ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాని ముందు జగన్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదు? అంటూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆయన మాటల్లో, "కేంద్రాన్ని ప్రశ్నించలేక వైజాగ్ లో బహిరంగ సభ పెట్టి తమ తప్పును ఒప్పుగా చేసుకునే పనిలో వైకాపా నేతలు నిమగ్నమయ్యారు. స్టీల్ ప్లాంట్ అంశంపై ఢిల్లీలో బహిరంగ సభ పెట్టే దమ్ము ఏ1, ఏ2లకు ఉందా? ఢిల్లీలో చేయాల్సిన పోరాటం గల్లీలో చేయడం ఏంటి? విజయసాయిరెడ్డి కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం ఊసరవెల్లి రాజకీయం కాదా? ప్రైవేటీకరణ కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఎందుకు చేయటం లేదు? పాదయాత్ర చేసి విజయసాయిరెడ్డి సాధించింది సూన్యం. మీ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగింది ఏంటి? కోర్టు కేసులు ఉండటం వల్ల విశాఖ ఉక్కు గనులు ఇవ్వలేకపోతున్నామని విజయసాయిరెడ్డి చెప్పడం దుర్మార్గం. ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్లు మీ అన్యాయులకు ఒబుళాపురం గనులు దోచిపెట్టి ఇప్పుడు మాత్రం కోర్టులో ఉన్నాయని మాట్లాడటం సిగ్గుచేటు. విశాఖలో సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ కోసమా చంద్రబాబు నాయుడుని తిట్టడానికా? అధికారంలో ఉన్నది ఎవరు? పోరాటం చేయాల్సింది ఎవరు? ప్రతిపక్షం మీద నెపం నెట్టి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు."

modi 20022021 2

"పోస్కోతో రహస్య ఒప్పందాలు చేసింది మీరు. మీ కేసుల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా టీడీపీపై నోరు పారేసుకోవడం విజయసాయిరెడ్డి దివాళాకోరుతనం. ప్రజలకు సమాధానం చెప్పలేనప్పుడల్లా తెలుగుదేశం పార్టీపై నెపం నెట్టడం వైసీపీకి అజెండాగా మారింది. జగన్ నేలబారు రాజకీయాలకు వైజాగ్ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏ2 రెడ్డి పాదయాత్ర పేరుతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్నారు. అసలు బహిరంగ సభ ఎందుకు పెట్టారో ప్రజలకు అర్ధం కావడం లేదు. నేడు ప్రధాన మంత్రితో నిర్వహించిన నీతి ఆయోగ్ వర్చువల్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్ రెడ్డి కనీసం ప్రస్తావించకపోవడం అత్యంత దుర్మార్గం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం గురించి ప్రధాన మంత్రి వద్ద ఎందుకు స్పందించలేదు? 2020 సెప్టెంబర్ లో వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా నలుగురు ఎంపీలు పోస్కో ప్రతినిధులతో కలిసి కేంద్ర ఉక్కు శాఖా మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ను కలవడం వాస్తవం కాదా.? ప్రైవేటీకరణకు చేయాల్సిన తంతు పూర్తి చేసి నేడు వైజాగ్ ప్రజల ముందు కళ్లబొల్లి కబుర్లు చెప్పడం హేయం." అని అచ్చెన్నాయుడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. విభజన తరువాత చంద్రబాబు ప్రభుత్వం, 5 ఏళ్ళలో లక్షా 25 వేల కోట్లు అప్పు చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 19 నెలల్లోనే ఆ రికార్డు దాటేసింది. పోనీ అప్పు తెచ్చి ఆదాయం పెంచుతున్నారా అంటే, అప్పు తెచ్చి పంచి పెడుతున్నారు. పరుగులు పెట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, సాగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి చూస్తే, ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా, ఉద్యోగస్తులకు, పదవీ విరమణ చేసిన వారికి సరైన సమయానికి జీతాలు, పెన్షన్లు వస్తున్నాయా అంటే, ఒక్కో నెల ఒక్కో విధంగా, వస్తున్నాయి. జీతాలు ఆలస్యం అవుతున్నాట్టు ప్రతి నెల ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. దానికి కారణం సాంకేతిక సమస్యలు అని ప్రతి సారి చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంగతి అయితే చెప్పే పనే లేదు. చాలా మందికి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందటం లేదు. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, ఇల్లు కట్టుకోవటానికి, ఇలా అనేక అవసరాల కోసం ఆ డబ్బులు వాడుకుందాం అనుకునే వారికి నిరాస ఎదురు అవుతుంది. ఈ రోజు ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం ప్రకారం, ఇలాంటి బిల్లులు దాదాపుగా వెయ్యి కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.

bopparaju 20022021 1

పీఎఫ్ డబ్బులు ప్రభుత్వం నుంచి రాకపోవటంతో, మళ్ళీ బయట అప్పులు తెచ్చుకుని, ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇక పెన్షన్ తీసుకునే వారి కష్టాలు ఇలాగే ఉన్నాయి. ప్రతి నెలా మొదటి తారీఖున వచ్చే పెన్షన్, ఇప్పుడు రెండు వారాలకు పడుతుందని వాపోతున్నారు. తాజాగా కొంత మందికి జనవరి నెల పెన్షన్, ఫిబ్రవరి నెలలో అందింది. అయితే అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఏమిటో చెప్పే వారు లేరని, పెన్షన్ దారులు వాపోతున్నారు. ఈ సమస్యలు అన్నిటి పై చర్చించటానికి, నిన్న చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో తమ సమస్యల గురించి పరిష్కారం చూడాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు,ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవటంతోనే సరిపోయింది. వారికి సర్ది చెప్పిన సజ్జల, యధావిధగా సాంకేతిక సమస్యలు ఉన్నాయని, తొందర్లోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పి పంపించారు. ఆ సమస్యను పరిష్కరించి, మళ్ళీ ఈ ఇబ్బందులు లేకుండా చుస్తామని చెప్పి వెళ్ళిపోయారు.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగుల్ మీరా పై వైయస్సార్ పార్టీలో చేరుతున్నట్లు గత కొంత కాలంగా, వైసీపీ బ్యాచ్ సోషల్ మీడియా వేదికగా విపరీత ప్రచారం చేస్తుంది. దీంతో విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపధ్యం లో నాగుల్ మీరాపై ఇటువంటి వార్తలు వెలువడటంపై అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. వైకాపాలో చేరితే ఆయన కిచ్చే పదవిపై కూడా ఇటు వైకాపా నాయకులు, కార్యకర్తల్లోను ఫేక్ ప్రచారం జరిగేలా ఫేక్ బ్యాచ్ ప్రచారం చేస్తుంది. అయితే వీట న్నింటికి నాగుల్ మీరా చెక్ పెట్టారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వారికీ ఘాటుగా బదులు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం వీడియో ద్వారా ఆయన ట్రోలర్స్ పై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసారు. కావాలనే కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పీఆర్పీ పార్టీ నుంచి తాను రాలేదని, పార్టీలు మారే మన స్తత్వం తనది కాదని, సిద్ధాంతాలున్న కమ్యూనిస్టుపార్టీ నుంచి వచ్చానని తాను విలువలు ఉన్న నాయకుడినంటూ వైకాపా నాయకులకు చురకలంటించారు. దీంతో ఎట్టకేలకు నాగుల్ మీరాపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఊహగానాలకు చెక్ పడినట్లయ్యింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకం ప్రతి రోజు ఏదో ఒకట చూస్తూనే ఉన్నాం. పోటీలో ఉండ కూడదు అని బెదిరింపు, పోటీలో నుంచుంటే ఉపసంహరించుకోవాలని బెదిరింపు, వేరే పార్టీకి ఓటు వేస్తె బెదిరింపు, సంక్షేమ కార్యక్ర్తమాలు తీసేస్తామని బెదిరింపు, అక్రమ కేసులు, అరెస్ట్ లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టు అవుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తుంది సాంపుల్ మాత్రమే. గత ఏడాది క-రో-నా కారణంగా మొదలైన ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. అప్పట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బెదిరించి పెద్ద ఎత్తున ఏకాగ్రీవాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నోటిఫికేషన్ వస్తూ ఉండటం, గతంలో బలవంతపు ఏకాగ్రీవాలు చేస్తే, తగిన ఆధారాలు చూపిస్తే, మళ్ళీ పోటీ చేయవచ్చు అంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో, అధికార పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. అనుకున్నట్టు గానే, పెద్ద ఎత్తున అభ్యర్ధులు నిన్న ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేసారు. ఆ వస్తున్న ఫిర్యాదులు చేసి, ఎన్నికల కమిషన్ అధికారులు కూడా అవక్కవుతున్నారు. వస్తున్న ఫిర్యాదులు అన్నీ నిజమా కాదా అని, తేల్చే పనిలో పడ్డారు. అభ్యర్ధుల దగ్గర నుంచి తగిన ఆధారాలు తీసుకుంటున్నారు.

nominations 20022021 2

తాము నామినేషన్ వేయటానికి వస్తే బెదిరించారని కొందరు, నామినేషన్ వేసిన తరువాత ఉపసంహరించుకోవాలని బెదిరించారని మరి కొందరు, ఇలా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా అరాచకాలు ఎక్కువ జరుగుతున్న చిత్తూరు జిల్లా నుంచి, 18 మంది అభ్యర్ధులు ఫిర్యాదు చేసారు. అలాగే విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులే కాకుండా, మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా ఉన్నారు. తమ ఫిర్యాదులకు అప్పటి బెదిరించిన వీడియోలు, ఆడియో టేప్ లు, ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్ లు లాంటివి కూడా జత పరిచారు. ఈ ఫిర్యాదులకు ఈ రోజు దాకా గడువు ఉండటంతో, ఈ రోజు మరింత మంది వచ్చే అవకాసం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. తిరుపతి డివిజన్ పరిధిలో 50 వార్డులకు నామినేషన్లు సమర్పించేందు అవకాసం ఇవ్వాలని, గతంలో బలవంతంగా బెదిరించినట్టు, టిడిపి కూడా ఫిర్యాదు చేసింది. అలాగే గుంటూరు, ముఖ్యంగా మాచర్ల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి.

Advertisements

Latest Articles

Most Read