ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూలు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఒక పక్క ప్రభుత్వం తాము ఎన్నికలు ఒప్పుకోం అంటూ, పడుతున్న పాట్లు చూస్తున్నాం. సచివాలయ ఉద్యోగ సంఘం నుంచి వెంకట రామిరెడ్డి, ఏపి ఎన్జీవోల సంఘం నుంచి చంద్రశేఖర్ రెడ్డి, పోలీసులు సంఘం, ఇలా అందరూ నిన్న వరుస పెట్టి ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్ లు విడుదల చేసి, మేము ఎన్నికల్లో పాల్గునేది లేదు, మేము సహకరించేది లేదు అంటూ, హడావిడి హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రభుత్వం కూడా అత్యవసర పిటీషన్ అంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే, ఇటు నిమ్మగడ్డ మాత్రం, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో, ఆయనకు రాజ్యాంగబద్ధ పదవిలో, ఎన్నికల సమయంలో సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి, తన అధికారాలని ఆయన ఉపయోగిస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రభుత్వం ఆయన్ను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే, ఇప్పుడు ఆయన రూల్స్ ప్రకారం, ఒక్కో బాణం వదులుతున్నారు. నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ కు లేఖ రాసారు. గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు దాఖలు చేసే సందర్భంలో, అనేక ఘటనలు జరిగాయి. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు చేసి, అఅనేక ఏకాగ్రీవాలు చేసుకున్నారు.

nimmagadda 10012021 2

ఈ సందర్భంగా కొన్ని ఘటనలు జరిగాయి. చివరకు బొండా ఉమా, బుద్దా వెంకన్న మీదకు కూడా వచ్చిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో అప్పట్లో నిమ్మగడ్డ కొంత మంది అధికారుల పై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, వారిని ఇప్పుడు మళ్ళీ తప్పించాలని నిమ్మగడ్డ, తాజాగా లేఖ రాసారు. అప్పట్లో ఆయన ఆదేశాలు అమలు కాలేదు. ఎన్నికలు వాయిదా పడటంతో, ఈ ఆదేశాలు అమలు కాలేదు. చిత్తూరు కలెక్టర్, గుంటూరు కలెక్టర్, తిరుపతి, గుంటూరు లో ఎస్పీలను బదిలీ చేయాలనీ, మాచర్ల సిఐని సస్పెండ్ చేయాలని, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ట్రాన్స్ఫర్ చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను, ఇప్పుడు ఎన్నికల షెడ్యూలు వచ్చిన నేపధ్యంలో, మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపధ్యంలో, ఆ ఆదేశాలు అమలు చేయాలని నిమ్మగడ్డ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. గతంలో మేము చెప్పిన వారందరినీ బదిలీ చేసి, వారి స్థానంలో వేరే వారిని నియమించాలని నిమ్మగడ్డ కోరారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, సహకరించకపోతే నిమ్మగడ్డ ఏమి చేస్తారో చూడాలి.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎన్నికల ప్రకటన వచ్చిన నేపధ్యంలో, రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు అందరితో మాట్లాడారు. టెలి కాన్ఫరెన్స్ లోకి అందరినీ తీసుకున్న చంద్రబాబు, ఎన్నికల అజెండా గురించి చర్చించారు. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు, ఈ రోజు పత్రికల్లో వచ్చిన ఒక వార్త పై స్పందించారు. ఈ రోజు పత్రికల్లో జగన్ అభినవ శ్రీరాముడు అంటూ, వైసీపీ నాయకులు పెట్టిన ఒక ఫ్లెక్సీ వార్తగా వచ్చింది. అందులో శ్రీరాముడు, లక్ష్మణుడు వేష ధారణలో జగన్ మొఖం పెట్టారు. బాణం ఎక్కుపెట్టినట్టు ఉంది. ఆ బాణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు మీద ఎక్కు పెట్టినట్టు ఉంది. ఒక పక్క రాష్ట్రంలో దేవాలయాల పై వరుస ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ పార్టీ, తమ హిందూ ఇమేజ్ పెంచుకోవటానికి, నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే, నిన్న విజయవాడలో కొత్తగా గుడులు కడుతున్నాం అంటూ శంకుస్థాపన చేసి హడావిడి చేసారు. ఈ రోజు ఇలా జగన్ అభినవ శ్రీరాముడు అంటూ ఫ్లెక్స్ లు ఏర్పాటు చేసారు. అయితే ఇది హిందువులకు చూడటానికి ఎంతో ఎబ్బుట్టుగా ఉందని, ఉదయం నుంచి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కొన్ని హిందూ సంఘాలు ఆందోళన కూడా చేసాయి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు కూడా ఈ విషయం పై ప్రస్తావించారు.

jagan 090120221 2

జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, ఈ ఫ్లెక్స్ పెట్టింది కూడా, క్రిస్టియన్ మంత్రి నియోజకవర్గంలో అని, ఇలా ఎందుకు చేస్తున్నారు, జగన్ మోహన్ రెడ్డి మొఖాన్ని శ్రీరామ చంద్ర మూర్తికి పెడతారా, హిందువుల మనోభావాలను గాయపరుస్తారా ? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఒక పక్క రామతీర్ధంలో శ్రీరాముడి తల పెకిలిస్తే, ఇప్పటి వరకు కనీసం అక్కడకు వెళ్లి స్పందించని జగన్ మోహన్ రెడ్డిని, శ్రీరాముడితో పోలుస్తారా ? హైందవ సంస్కృతిపై ఇంతకంటే మరో దా-డి ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం, నదిలో మునిగి నాటకాలు అడారని, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పేదానికి, చేసేదానికి పోలిక ఉండదని చంద్రబాబు అన్నారు. అపరిచితుడు సినిమాలో లాగా చేస్తున్నారాణి, చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతిలో వెంకటేశ్వర స్వామి గుడి కుదించారని, గతంలో పెట్టిన దివ్యదర్శనం రద్దు చేసారని, ఇప్పుడేమో, నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు.

జగన్ మోహన్ రెడ్డికి అక్రమ ఆస్తుల కేసులో, ఈడీ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు ఆయన విచారణకు హాజరుకాకుండా, కోర్టు నుంచి ఎప్పటికప్పుడు పర్మిషన్ తీచ్చుకుంటున్నారు. ఇక మధ్యంలో క-రో-నా వల్ల కోర్టులు కూడా పని చేయలేదు. అయితే ఈ మధ్య రోజు వారీ విచారణ కూడా ప్రారంభం అయ్యింది. ఈ నేపధ్యంలోనే ఈడీ తాజాగా జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 11 వ తారీఖున కోర్ట్ కు హాజరు కావాలని జగన్ ను ఆదేశించారు. అరబిందో, హెరిటో భూకేటాయింపులు విషయంలో, ఈ చార్జ్ షీట్ ను, నాంపల్లి కోర్టు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కోర్టుకు బదిలీ చేయటం జరిగింది. అయితే ఈ అరబిందో, హెరిటో భూకేటాయింపులకు సంబంధించి, భూములు కేటాయింపులకు ప్రతిఫలంగా, జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని దానికి సంబంధించిన, దాని మీద ఈ కేసు నమోదు అయ్యింది. దీని పై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అనేక సాక్ష్యధారాలు నమోదు అయిన నేపధ్యంలో, నాంపల్లి కోర్టు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కు బదిలీ చేయాలనే పిటీషన్ కు స్పందించి, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఈ కేసుని తీసుకోవటం జరిగింది. దీంతో ఈ కేసుని విచారణకు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, జగన్ కు సమన్లు జారీ చేసి కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారే చేసింది. ఇక ఇదే కేసులో విజయసాయి రెడ్డి, హెరిటో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, శరత్ చంద్రా రెడ్డి కోర్టుకు రావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది.

jagan 09012021 2

ఇక మరో పక్క సిబిఐ చూస్తూ, విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చింది. విజయసాయి రెడ్డి పై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు మోపటం సరైన నిర్ణయమే అని సిబిఐ వాదించింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించి తనకు సంబంధం లేదని విజయసాయి రెడ్డి డిశ్చార్జ్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీని పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. సిబిఐ తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ,అవినీతి నిరోధక చట్టంలో ఉన్న సెక్షన్ 9, 13 విజయసాయి రెడ్డికి వర్తిస్తాయని చెప్పారు. ఆ సమయంలో విజయసాయి రెడ్డి ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారని, అది పబ్లిక్‌ సర్వెంట్‌ కిందకే వస్తుందని, అవినీతి నిరోధక చట్టం కింద విజయసాయి రెడ్డిఐ బుక్ చేయవచ్చని అన్నారు. వాదనలు విన్న సిబిఐ కోర్టు, ఈ కేసుని ఈ నెల 12కు వాయిదా వేసింది. అయితే ఇప్పటికిప్పుడు జగన, విజయసాయి రెడ్డికి ఈ కేసులతో వచ్చే ముప్పు ఏమి లేదని చెప్పాలి. అయితే జగన్ కోర్టుకు వెళ్ళటానికి ఇష్ట పడటం లేదు కాబట్టి, ఏమవుతుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. నిన్న ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం, ఈ రోజు ఎన్నికల నియమావళి అమలు లోకి రావటంతో, ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. అధికార వైసీపీ ఇప్పుడు ఎన్నికలు మేము ఒప్పుకోం అని చెప్తున్నా, కోర్టుల్లో వీరి వాదన నెగ్గే అవకాసం లేదు. ఎందుకంటే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని, కోర్టులు కాదనే అవకాసం లేదని, మొన్నే కేరళ విషయంలో చూసాం. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తం అయ్యింది. ఈ రోజు చంద్రబాబు రాష్ట్రంలోని సీనియర్ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో పాల్గున్నారు. ఈ సమవేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ఇతర ముఖ్య నేతలు పాల్గున్నారు. ఎన్నికల నేపధ్యంలో వారికి చంద్రబాబు దేశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను స్వాగతించారు. ఇవి జరిగితే జగన్ బండారం బయట పడుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తే, జగన్ కు ఒక బ్రేక్ వస్తుందని, పెంచిన చార్జీలు దగ్గర నుంచి, పన్నుల దగ్గర నుంచి,ర రైతులకు మోటార్ల మీటర్ల దాకా అన్నిటి పై వెనక్కు తగ్గుతాడని అన్నారు. ఎన్నికలు అనేవి నిర్ణయించేది రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ అని అన్నారు. దీనికి జగన్ మోహన్ రెడ్డికి ఏమి సంబంధం ఉండదని అన్నారు.

cbn 09012021 2

ఎన్నికల సంఘాన్ని నియంత్రించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఉద్యోగులు, పోలీస్ వారు కూడా, సహకరించాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదని అన్నారు. ఎన్నికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరపాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ ముందు పలు సంచలన డిమాండ్స్ పెట్టారు. ఆన్లైన్ లో కూడా నామినేషన్లు వేసే విధంగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. తద్వారా వీళ్ళు బలవంతంగా ఎత్తుకుని వెళ్ళే అవకాసం ఉందని అన్నారు. ఇక కేంద్ర బలగాలు పర్యవేక్షణలో మాత్రమే ఎన్నికలు జరగాలని అన్నారు. అలాగే గ్రావ వాలంటీర్లును ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం చేయ కూడదు అని చంద్రబాబు డిమాండ్ చేసారు. గతంలో ఎన్నికల కమిషన్ కొంత మంది అధికారుల పై చర్యలు తీసుకుందని, వారిని ఈ ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని అన్నారు. ప్రభుత్వ భావనల పై వైసీపీ రంగులు తీయాలని డిమాండ్ చేసారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని అన్నారు. అలాగే గతంలో బలవంతంగా చేసిన ఏకాగ్రీవాలు అన్నీ రద్దు చేయాలని అన్నారు. అన్ని స్థానాలకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read