ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గత 5 ఏళ్ళుగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2016 నుంచి ఇక్కడే సచివాలయం నడుస్తుంది, ఇక్కడే గవర్నర్ ఉంటున్నారు, ఇక్కడే అసెంబ్లీ ఉంది, ఇక్కడే శాసనమండలి ఉంది, 2019 నుంచి హైకోర్టు ఇక్కడే నడుస్తుంది. అయితే ప్రభుత్వం మారిపోగానే, మొత్తం మారిపోయింది. అమరావతి మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైజాగ్ లో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూల్ లో హైకోర్టు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ అంశం కోర్టుకు చేరటంతో, ఇందులో ముందుకు వెళ్ళలేక పోతున్నారు. అయితే ప్రభుత్వానికి అమరావతి పై కానీ, కర్నూల్ పై కానీ ప్రేమ లేదని, కేవలం వైజాగ్ లో ఉన్న భూములు కోసం, అక్కడ వెళ్తున్నారని, చేస్తున్న ఏర్పాట్లు అన్నీ వైజాగ్ కోసమే ఉన్నాయి కానీ, కర్నూల్, అమరావతి కోసం ఏమి లేవని ప్రాతిపక్షాలు ఆరోపిస్తిన్నాయి. నిజానికి కర్నూల్ వైపు న్యాయ రాజధాని తీసుకుని వెళ్ళటానికి, అసలు ఏ విధమైన కసరత్తు చెయ్యలేదు.

అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం చెప్పిన విషయం చూస్తే, ఇదే నిజం అనిపించేలా ఉంది. దేశంలో ఎక్కడైనా హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అని, ఉత్తరప్రదేశ్ ఎంపీ అడిగిన ప్రశ్నకు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధనం చెప్తూ, మాకు అసలు ఉద్దేశం లేదని చెప్పారు. అంతే కాదు, తమకు ఏ రాష్ట్రం నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయి ప్రతిపాదన రాలేదని చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ప్రధాన బెంచ్ 2019 జనవరి 1 నుంచి, అమరావతిలో పని చేస్తుందని అన్నారు. ఏ రాష్ట్రంలో హైకోర్టు బెంచ్ కావాలి అన్న, రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపించాలని, తరువాత హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను ఒప్పుకోవాలని, అలాగే గవర్నర్ కూడా ఒప్పుకోవాలని కేంద్ర మంత్రి చెప్పారు. మొత్తానికి, ఈ సమాధానం బట్టి, కర్నూల్ లో హైకోర్టు గురించి, ఏపి రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా ఎటువంటి ప్రతిపాదన పంపించాలేదని అర్ధం అయ్యింది.

తెలంగాణా మంత్రి హారీష్ రావు మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నాలుగు నెలల క్రితం, ఏపిలో రియల్ ఎస్టేట్ లేదు ఏమి లేదు, మొత్తం హైదరాబాద్ లోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, కేంద్రం ఒత్తిడికి తలొగ్గి, రైతులకు మీటర్లు పెడుతున్న విషయం పై, సంచలన వ్యాఖ్యలు చేసారు. బావిల కాడ మీటర్లు పెడతాం అంటున్నారు, ఇది కరక్ట్ అంటారా అని కేంద్రాన్ని నిందిస్తూ ప్రశ్నించారు. మీకు ఇంకో ముచ్చట చెప్తాను అంటూ, కేంద్రం మనల్ని మీటర్లు పెట్టుకుంటే, రెండు వేల అయుదు వందల కోట్లు అప్పు ఇస్తాం అని చెప్పింది. బావిల కాడ, పొలాల్లో మోటార్లు పెడితే, రెండు వేల అయుదు వందల కోట్లు అప్పు ఇస్తాం అని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల మీటింగ్ జరిగిందని, అందులో మాట్లాడుతూ మీకు రెండు వేల అయుదు వందల కోట్లు అప్పు కావాలి అంటే, రైతులకు మీటర్లు పెట్టాల్సిందే అన్నారు. మరి మీరు చెప్పండి మీటర్లు పెట్టమంటారా ? ఆ రెండు వేల అయుదు వందల కోట్లు అప్పు తెచ్చుకుందామా ? అంటూ ప్రజలను ప్రశ్నించారు. మనకు అదీ వద్దు, ఇదీ వద్దు అంటూ ప్రజలను ఉద్దేశించి హరీష్ చెప్పారు. అయితే ఇదే తరుణంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో, జగన్ మోహన్ రెడ్డికి నాలుగు వేల కోట్లు ఆఫర్ ఇచ్చారని, ఆయాన వెంటనే ఆ డబ్బులు కోసం అని ఆశ పడి, రైతుల మేడలకు ఉరి తాడు వేసారని అన్నారు. ఆ నాలుగు వేల కోట్ల అప్పు కోసం, రైతులను ముంచేసారని హరీష్ రావు అన్నారు. మన తెలంగాణా రాష్ట్రం మాత్రం, రైతులకు మేలు చేసే విధంగా, మీ మీటర్లు వద్దు, మీ రెండు వేల అయిదు వందల కోట్లు వద్దు అంటూ, కేంద్రాన్ని తిరస్కరించారని హరీష్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రైతులు బాగుపడుతున్నారు, ఇప్పుడు మీటర్లు అంటారు, రేపు చేతిలో బిల్లులు పెడతారు, అప్పుడు నష్టపోయేది రైతులే అని గ్రహించి, కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించామని, అక్కడ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, నాలుగు వేల కోట్ల అప్పుకు ఆశ పడి, రైతులని ముంచేస్తున్నారని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి రేపు ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. రేపు ప్రధాని మోడీతో పాటు, పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్ళిన తరువాత హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి ర్మలా సీతారామన్ తో, ఆరోగ్య శాఖా మత్న్రి హర్షవర్థన్‌ తో భేటీ అవుతారని తెలుస్తుంది. అలాగే ప్రధాని మోడీతో కూడా భేటీ అవుతారని సమాచారం. అయితే అపాయింట్మెంట్ విషయంలో ఎలాంటి సమాచారం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. అయితే జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రధాన కారణం, రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం అని వైసిపీ చెప్తుంది. రాష్ట్రానికి అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయని, రాష్ట్రానికి నిధులు సరిగ్గా రావటం లేదని, అలాగే ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ప్రత్యెక హోదా సహా అనేక పెండింగ్ అంశాల పై చర్చిస్తారని వైసిపీ చెప్తుంది. అయితే ఇంత ఆకస్మికంగా జగన్ ఢిల్లీ వెళ్ళటం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అనే విషయం కూడా చర్చకు దారి తీస్తుంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు చీరాల దళిత యువకుడు కిరణ్ మరణించిన తీరు, సందేహాల పై వేసిన కేసు పై, విచారణ జరిగింది. కిరణ్ మాస్కు పెట్టుకోలేదని, పోలీసులు కొట్టటంతో అతను చనిపోయారు. అయితే ఈ కేసు పై తమకు అనుమానాలు ఉన్నాయని, మాజీ ఎంపీ హర్ష కుమార్, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు. ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. హర్ష కుమార్ తరుపున , న్యాయవాది శ్రవణ్ కుమార్ ఈ కేసుని ఈ రోజు హైకోర్టులో వాదించారు. అయితే ఈ విచారణ సందర్భంగా, హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, ఈ కేసుని కొట్టేయాలని కోరారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పట్ల, కిరణ్ తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేసారని, వాళ్ళు ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని, కోర్టుకు తెలిపారు. అందకే కేసుని కొట్టేయాలని కోర్టుని కోరారు. అయితే ఈ వ్యాఖ్యల పై హైకోర్టు స్పందిస్తూ, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎవరినైనా మీరు సంతృప్తి పరుస్తారు, మీ ప్రభుత్వం ఎవరిని అయినా సంతృప్తి పరుస్తుంది అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసుని సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కోరింది. తల్లిదండ్రులు సంతృప్తి చెందినంత మాత్రాన ఈ కేసు మూసేయలేం, ఈ కేసుని సిబిఐకి ఇవ్వగల అర్హత గల కేసుగా మేము భావిస్తున్నాం అంటూ, కౌంటర్ దాఖలు చెయ్యటానికి రెండు వారాలు సమయం కోరారు కాబట్టి, రెండు వారల సమయం ఇస్తున్నాం అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సందర్భంగా, హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపటం చాలా తీవ్రమైన సమస్య, ఇండిపెండెంట్ బాడీ చేత విచారణ చేపించే అర్హత ఉంది అంటూ, అలాగే మీ ప్రభుత్వం ఎవరిని అయినా సంతృప్తి పరుస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలు, కీలకంగా మారాయి.

Advertisements

Latest Articles

Most Read