25 ఎంపీలు ఇస్తే, ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్తే, 25 కాకపోయినా, 22 ఇచ్చారు. అయితే ఈ ఎంపీలు కేంద్రంతో ఏమి చేస్తున్నారో కానీ, ఢిల్లీలో బాడీ షేమింగ్ లో మాత్రం బిజీగ ఆన్నారు. ఎంపీ కంటే ఇంస్టాగ్రామ్ స్టార్ గా పేరున్న వైసిపి ఎంపి భరత్ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ వైసిపి MPలు ప్రత్యేకహోదా ఎలా తేవాలా అనే దాని మీద దృష్టి సారించకుండా ఎప్పుడు ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు. తాజాగా రాజమండ్రి MP భరత్ , రఘురామ కృష్ణం రాజు ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈయన ఒక పార్లమెంట్ మెంబర్ అయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడటం దిగజారుడుతనం అని జనం విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి కనీస భాద్యత అయిన లేకుండా ప్రవర్తిస్తున్నారని కూడా విమర్శలు ఎదుర్కుంటున్నారు. నిన్న MP భరత్ మీడియాతో మాట్లాడుతూ రఘురామ కృష్ణం రాజు బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా మాట్లాడారు. ఆయన పందిలాగా ఉంటారని, పంచ కట్టుకుని అంతా transperent గా చూపిస్తారని ,ఆయనకు అంత అంతవి ఉంటాయని చాలా నీచంగా విమర్శలు చేసారు. ఒక MP స్థానం లో ఉండి మార్గదర్శకం గా ఉండాల్సిన పొజిషన్ లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.

ysrcp 11022022 2

దీని పై రఘురామ కృష్ణం రాజు తనదైన శైలిలో స్పందించారు. ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి తన సొంత ప్రభుత్వం పైనే సటైర్లు వేస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ రోజు భరత్ చేసిన వ్యాఖ్యల పై కూడా ఆయన తన దైన స్టైల్లో స్పందించారు. తానూ పంచ కట్టుకుంటే వాళ్ళకు ఏం కనబడిందని కామేడి చేసారు. తానూ వై ఎస్ రాజశేఖర్ వేసుకునే, పంచలు లాంటివే వాడుతానని, వాళ్లకు ఏదికనబడితే అదే చూసుకోండని ఎద్దేవా చేసారు. నేను పంది లాగా ఉన్నానని పంది అన్నావు, అయితే పొట్టిగా ఉన్న 5 అడుగుల 2 అంగుళాల వాడిని పొట్టోడు అంటావా అని, కొందరి ముఖం కోతీ లాగా ఉంటుంది వాళ్ళని కోతి గాడు అంటావా అని ప్రశ్నించారు. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే రఘురామ పొట్టోడని, కోతి అని ఎవరిని విమర్శించారని సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఇలాంటి గౌరవ ప్రదమైన స్థానంలో ఉండి వీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం, మన రాష్ట్రానికే అగౌరవం.

గత రాత్రి మొత్తం టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ కు సంబంధించి, హైడ్రామా నడిచింది. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో, ఒక పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో, విజయవాడ పటమటలంకలో, సిఐడి పోలీసులు , అశోక్ బాబుని అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబుని 11 గంటలకు అదుపులోకి తీసుకుని, 12.30 గంటలకు అరెస్ట్ చేసామని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. 12.30 గంటలకు అరెస్ట్ చేసినట్టు, సిఐడి పోలీసులు అధికారికంగా దృవీకరించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఐపిసిలోని 477(A),466,467,468,471,465,420, Rw34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా పని చేయక ముందు, ఏపి ఎన్జీవో అధ్యక్షుడిగా పని చేసారు. ఆయన ఏపి ఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ విభాగంలో పని చేసారు. ఆ సమయంలో పదోన్నతి కోసం, బీకాం డిగ్రీ ఉన్నట్టుగా పేర్కొన్నారని, సర్వీస్ రికార్డులు ట్యాంపర్ చేసారని, ఆయన పైన అభియోగాలు నమోదు అయ్యాయి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇదే అభియోగాలు రాగా, అప్పట్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపింది.

cid 110222022 2

ఆయన రికార్డులు ఏమి ట్యాంపర్ చేయలేదని, ఆయన డి.కాం అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అని చెప్తే, రికార్డు చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ టైపింగ్ లో తప్పు చేసి, బి.కాం అని టైపు చేసారని, అప్పట్లో విజిలెన్స్ విభాగం క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పై కేసు పెట్టటంతో, అశోక్ బాబు పది రోజుల క్రిందటే ఈ కేసు పై స్పందించారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడి పేరు చెప్పి, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పారు. ఆ ఉద్యోగ సంఘ నేత వెనుక ప్రభుత్వం ఉందని, ఆరోపణలు చేసారు. దీని పైన లోకాయుక్తాకు ఫిర్యాదు చేసారు. అయితే లోకాయుక్తాకు ఫిర్యాదు చేస్తే, వారు ఎంక్వయిరీ చేయకుండా, సిఐడి విభాగానికి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసారు. సిఐడి దీని పైన కేసు నమోదు చేసారు. అయితే ఇలాంటి చిన్న కేసు విషయంలో, కనీసం ప్రాధమిక ఎంక్వయిరీ కూడా చేయకుండా, గతంలోనే ముగిసిపోయిన అంశాన్ని, ఇప్పుడు పైకి తెచ్చి, ఏదో పెద్ద నేరం లాగా, అర్ధరాత్రి హైడ్రామా మధ్య అరెస్ట్ చేసారు. ప్రస్తుతం అశోక్ బాబు సిఐడి కార్యాలయంలో ఉన్నారు.

పరిటాల రవి హ-త్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీను అంటే తెలియని వారు ఉండరు. అయితే ఆ తరువాత మొద్దుశీను కూడా జైల్లోనే హ-త్య-కు గురైన విషయం తెలిసిందే . ఈ విషయం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. అప్పట్లో మొద్దుసీనుని జైల్లో పెట్టిన తరువాత తాను అప్రూవర్ మరతానని కోర్టుకు తెలియచేసిన తరువాత , ఈ పరిటాల రవి హ-త్య కేసులో మరో నిందితుడు అయిన ఓం ప్రకాష్ చేతిలో మొద్దుశీను దారుణంగా హ-త్య-కు గురి అయిన సంగతి తెలిసిందే. మొద్దుశీనుని, ఓం ప్రకాష్ సిమెంట్ డంబెల్తో కొట్టి చం-పా-డు. కాని మొద్దుశీను సెల్ లోకి ఓం ప్రకాష్ ఎలా వచ్చాడు, అతని సెల్లోకి సిమెంట్ డంబెల్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికి మిస్టరీనే. అయితే అప్పటి వరకు అనంతపురం జైలు సూపరింటెండెంట్ ఉన్న ఆయన మొద్దుశీను హ-త్య జరిగిన రోజున సెలవుల్లో ఉన్నారు. ఆయన ప్లేస్ లో ఇంచార్జ్‌గా పోచా వరుణారెడ్డి భాధ్యతలు తీసుకున్నారు. అయితే అసలు సూపరింటెడెంట్ సెలవు నుంచి విధుల్లోకి వచ్చే సరికి కధ మొత్తం జరిగి పోయింది. అసలు వరుణారెడ్డి ఓం ప్రకాష్ ను మొద్దుశీను సెల్ లోకి ఎందుకుపంపించ్చారని కూడా విమర్శలు ఎదుర్కున్నారు. అయితే మొద్దు శీను హ-త్య ఉదంతం అంత ఆయన కనుసన్నల్లోనే జరిగిందని ఆయనను అప్పట్లో సస్పెండ్ కూడా చేసారు.

vvieka 10022022 2

అప్పట్లో ఈ అదికారి పై మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కంప్లైంట్ చేస్తూ ఒక ఉత్తరం కూడా రాసారు. ఆతరువాత ఈయన కూడా హ-త్య కాబడ్డాడు. ఇదంతా అప్పుడు జరిగితే, తాజాగా ఇప్పుడు అదే అధికారి వరుణారెడ్డి, ఇప్పుడు మళ్ళీ కడప జైలు సూపరిండెంట్‌గా భాద్యతలు చేపట్టారు. అయితే ఏమాత్రం అర్హత లేని ఆయన్ను ఎలా సూపరిండెంట్‌గా నియమిస్తారని కూడా విమర్శలు వస్తున్నాయి. వైసిపి ప్రభుత్వంలో ఈ సస్పెండ్ అయన ఆయనకు, మెడల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టొరీ అంతా ఎందుకు అంటే, కడప జైల్లోనే, వివేక కేసు నిందితులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా దస్తగిరి, ఇప్పటికే అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతోనే, కూసాలు కదిలిపోయాయి. అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ ని అరెస్ట్ చేసి లోపల వేసే వరుకు విషయం వెళ్ళింది. ఇప్పుడు ఈ అధికారి ఇక్కడకు రావటంతో, అందరూ మొద్దు శీను ఘటన, అలాగే ఇప్పుడు దస్తగిరి పరిస్థితి ఏమిటి అనే విషయం పై, రిలేట్ చేస్తూ కధనాలు రాస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ లో న్యాయమూర్తులు, కోర్టులను ఇష్టం వచ్చినట్టు తిట్టి, వారిని పార్టీలకు ఆపాదించి, కులాలకు ఆపాదించి, చేసిన వికృత క్రీడ అందరికీ తెలిసిందే. ఏ పార్టీకి అయినా సోషల్ మీడియా వింగ్ లు ఉండటం సహజం. వాళ్ళని తమ పనులు చెప్పుకోవటానికి, లేకపోతే ప్రత్యర్ధులు చేసే ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పి కొట్టటానికి వాడుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం రాజ్యాంగ సంస్థల మీదకు వదిలారు. జడ్జిలను, న్యాయమూర్తులను టార్గెట్ చేసారు. వారు చేసిన పనులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేరుగా రంగంలోకి దిగింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని తమ పైన చేసిన అటాక్ గురించి సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇక్కడే ఇప్పుడు అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇప్పటికే కొంత మందిని సిబిఐ అరెస్ట్ చేయగా, వారు ఇచ్చిన పక్కా సమాచారంతో, ఇదంతా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ నుంచి జరుగుతున్న వ్యవహారంగా సిబిఐ తన దర్యాప్తులో తెల్చినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు సిబిఐ అధికారులు డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ కు వచ్చి, కొంత మందిని విచారణ చేసి, అక్కడ నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉండగా, వారు సమాచారం తెలుసుకుని పరార్ అయినట్టు చెప్తున్నారు.

cbi 10022022 2

దీంతో సిబిఐ వేట మొదలు కావటం, ఏకంగా తమ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ వరకు కూడా, సిబిఐ వచ్చిందని తెలుసుకున్న పేటీయం బ్యాచ్ మొత్తం అలెర్ట్ అయ్యింది. ఎవరు అయితే అతిగా ప్రవర్తన చేసే వారో, వారు అందరూ ఇప్పుడు వారి ఎకౌంటు ను డియాక్టివ్ చేసుకున్న, కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తాము దొరికిపోతే, వాస్తవాలు బయట పడి పోతాయి ఏమో అని వారు పారిపోతున్నారు. అయితే ఇక్కడ ఏకంగా ప్రభుత్వం అధీనంలో ఉండే డిజిట‌ల్ కార్పొరేష‌న్ కేంద్రంగా ఇంత కుట్ర జరిగింది అంటే, ఏ స్థాయిలో వీరి నెట్వర్క్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీరి వెనుక ఎవరు ఉన్నారు, ఏ స్థాయి నాయకులు ఉన్నారు, ఎవరు చెప్తే ఈ పని చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఇలా మొత్తం వ్యవహారాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాచ్ లో కొంత మంది, విదేశాల నుంచి కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో కూడా ఉండటంతో, సిబిఐ దూకుడు పెంచింది. ఏమి జరుగుతుందో చూడాలి మరి.

Advertisements

Latest Articles

Most Read