టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి అనుమ‌తి ఇవ్వ‌కుండా ఇన్నాళ్లూ తాత్సారం చేసిన ఏపీ పోలీసులు, నాట‌కీయంగా డిజిపి పేరుతో ఒక లెట‌ర్ పంపారు. అనుమ‌తి కోసం  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖపై స్పందించినట్టు డీజీపీ ఇచ్చిన ఆ ప్ర‌తిలేఖ‌లో చాలా వివ‌రాలు కోర‌డంతో టిడిపి వ‌ర్గాలు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్రతి జిల్లాలో పాదయాత్ర జరిగే తేదీ, స్థలం, సమయం వివరాలు త‌మ‌కు ముందుగానే ఇవ్వాల‌ని కోరారు. జిల్లాలో రూట్ మ్యాప్ లు, ఎందరు పాల్గొంటారనే వివరాలు కూడా స‌మ‌ర్పించాల‌ని డీజీపీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న లేఖ‌లో కోరారు. పాదయాత్రలో వినియోగించే వాహనాలు, వాటి నంబర్లు, రాత్రి బసచేసే ప్రాంతం , జిల్లాలో సంప్రదించాల్సిన వ్యక్తుల ఫోన్ నంబర్లుతో కూడిన వివ‌రాలు తెల్లారేసరికి ఇవ్వాల‌ని డిజిపి పంపిన లేఖ‌పై టిడిపి భ‌గ్గుమంది. చాలా మంది పాద‌యాత్ర‌లు చేసిన‌ప్పుడు లేని ఈ నిబంధ‌న‌లు ఇప్పుడెలా వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. లోకేష్ పాద‌యాత్ర జ‌ర‌గ‌కుండా అడ్డుకునేందుకు పోలీసుశాఖ విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, ఎట్టి ప‌రిస్థితులు ఎదురైనా పాద‌యాత్ర చేసి తీరుతామంటున్నారు. దీనిపై చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ``ఆయ‌న డిజిపి కాదు..క‌సి..రెడ్డే`` అంటూ ట్వీట్ చేశారు. టిడిపి అఫీషియ‌ల్ హ్యాండిల్ నుంచి కూడా డిజిపి అడిగిన వివ‌రాలే డిజిపిని కూడా అడుగుతూ ట్వీటేశారు. మొత్తానికి యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి అనుమ‌తి ఇవ్వ‌కూడ‌ద‌నే ఇటువంటి అడ్డ‌గోలు స‌మాచారం అడుగుతున్నార‌నేది స్ప‌ష్టం అవుతోంది.

నూరు గొడ్ల‌ని తిన్న రాబందు గాలివాన‌కి చ‌చ్చింద‌ని సామెత‌. రాష్ట్రంలో త‌న అరాచ‌కాలు, అవినీతిని ప్ర‌శ్నించే విప‌క్షాల‌పై దా-డు-ల‌కు బ‌రితెగించిన పెద్దిరెడ్డికి అమిత్ షా భ‌యం ప‌ట్టుకుంది. పుంగ‌నూరు, తంబ‌ళ్ల‌ప‌ల్లె, పీలేరులో పెద్దిరెడ్డిని ప్ర‌శ్నిస్తే ఓంప్ర‌తాప్ ని చంపిన‌ట్టే చంపేస్తార‌ని అంద‌రికీ భ‌యం ప‌ట్టుకుంది. అరాచ‌కాల‌కు ఎదురొడ్డిన టిడిపి నేత‌కి రెండు కాళ్లు తొల‌గించింది పెద్దిరెడ్డి గ్యాంగ్. జ‌డ్జి రామ‌కృష్ణ‌, జ‌ర్న‌లిస్టులు ఆ దా-డు-ల్నించి త‌ప్పించుకోలేక‌పోయారు.  పెద్దిరెడ్డి పేరెత్త‌డ‌మే నేరంగా దౌర్జ‌న్యాలతో చెల‌రేగిపోయారు. పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ నియోజ‌క‌వ‌ర్గంలో రైతుస‌ద‌స్సు ఏర్పాటు చేస్తున్నార‌ని ఆయ‌న ఇంటిపై దాడిచేసి ధ్వంసం చేశారు.  త‌న‌ ఇంటిపై  వ్యక్తుల మూకుమ్మడి దాడి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా వారు ప‌ట్టించుకోలేదు. దీంతో స‌మ‌యం చూసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షాని క‌లిశారు.  తనపై 300 మంది పెద్దిరెడ్డి మ‌నుషులు హత్యాయత్నం చేశారని  ఫిర్యాదు చేశారు. హోం మంత్రి ఆదేశాల మేరకు రామచంద్ర యాదవ్ కు భారీ భద్రత కేటాయించారు. వై ప్ల‌స్ భ‌ద్ర‌త‌తో ఇప్పుడు రామ‌చంద్ర‌యాద‌వ్ పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు. ఇప్పుడు రామ‌చంద్ర‌యాద‌వ్ జోలికి వెళ్తే ఇటు సెక్యూరిటీ, అటు అమిత్ షా భ‌యంతో పెద్దిరెడ్డి గ్యాంగ్ వ‌ణుకుతోంది.

త‌మ ఇంటి ప‌ని చేసేవారు ఒక స‌ల‌హాదారుడు. త‌మ వంట ప‌నిచేసేవాడు మ‌రొక స‌ల‌హాదారుడు. సాక్షి జీత‌గాళ్ల‌కు ప్ర‌జాధ‌నం దోచిపెట్ట‌డానికి స‌ల‌హాదారుల పోస్టులు క‌ట్టబెట్టిన వైసీపీ ప్ర‌భుత్వం హైకోర్టు వ్యాఖ్య‌ల‌తో భ‌యం ప‌ట్టుకుంది. లెక్కలేనంత మంది స‌ల‌హాదారుల్ని వేసుకుని జ‌నం సొమ్ము దోపిడీకి దారులు వేసిన వైసీపీ స‌ర్కారుకి ఎంత మంది ఉన్నారో తెలియ‌క‌పోవ‌డం షాక్ కి గురిచేస్తోంది. దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్, ఉద్యోగుల సంక్షేమ‌ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి నియామకాలపై హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై వాద‌న‌ల సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది ధ‌ర్మాస‌నం.  చివ‌రికి ఉద్యోగుల‌కు డీఏ ఇవ్వ‌డం కోసం మరో సలహాదారున్ని నియమిస్తారా అని ప్రశ్నించారు. ఇలా వదిలేస్తే రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఐఏఎస్ అధికారులు ఉండగా శాఖలకు సలహాదారులు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్దతను తేలుస్తామని, ఎంత మంది స‌ల‌హాదారులున్నారో..వారి విధులు, జీత‌భ‌త్యాలు తెలియ‌జేయాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో తాము ఎడాపెడా నియ‌మించిన స‌ల‌హాదారులు ఎంత‌మంది  రాష్ట్రంలో ఉన్నారో వారి వివరాలు ప్ర‌భుత్వం సేక‌రిస్తోంది. శాఖలవారీగా సలహాదారుల వివరాలు వెంటనే పంపాలని అన్ని శాఖలకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. సలహాదారుల పేర్లు, హోదా, ఎప్పట్నుంచి ఉన్నారనే వివరాలు పంపాలని, ఇవి హైకోర్టుకు సమర్పించాల్సి ఉంద‌ని కోరింది.

కియా. ఎవ‌రు తెచ్చిన‌ద‌యా. అంటే చ‌దువుకోని పిల్లాడిన‌డిగినా ఠ‌క్కున చెబుతాడు చంద్ర‌బాబు తెచ్చాడ‌ని. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కియా కార్ల కంపెనీని అనంత‌పురం జిల్లాలో స్థాపించ‌డంలో క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుదే. టిడిపి కియా తెచ్చిన‌ప్పుడు వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడుబోని కార్ల కంపెనీ కియా అని, కమీషన్ల కోసం చంద్రబాబు ఆంధ్రకు తెచ్చాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జగన్ రెడ్డి కూడా ‪‬చంద్రబాబు కియాని తెచ్చి రైతుల పొట్ట కొడతన్నాడ‌ని, దీనిని అడ్డుకుని తీర‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఏపీలో కియా తెచ్చిన టిడిపి స‌ర్కారు ఓడిపోయింది. వైసీపీ స‌ర్కారు వ‌చ్చింది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కియా వాళ్ల‌ను క‌మీష‌న్ల కోసం వైసీపీ నేత‌లు బెదిరించారు. దీంతో అనుబంధ ప‌రిశ్ర‌మ‌లు క‌ర్ణాట‌క‌కి త‌ర‌లించుకుపోయేందుకు కియా సిద్ధ‌మైంది. కియా చంద్ర‌బాబు తేలేద‌ని, దివంగ‌త మ‌హానేత రాజ‌శేఖర్ రెడ్డి బతికి వున్న‌ప్పుడు లేఖ రాయ‌డం వ‌ల్లే వ‌చ్చింద‌ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న అసెంబ్లీ చెప్పిన బుర్ర‌క‌థ ఇప్ప‌టికీ నెట్టింట న‌వ్వులు పంచే ట్రోల్. తాజాగా కియా ఇండియ‌న్ కార్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023 అవార్డు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి నాలుక మ‌డ‌తేసి ట్వీట్ తిర‌గేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. నేడు కియా కార్ల ప‌రిశ్ర‌మ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్న ట్వీటుతోనే నాడు అమ్ముడుబోని కార్ల కంపెనీ క‌మీష‌న్లు ఇచ్చి ఏపీకి వ‌స్తోంద‌ని ట్వీటారు. విజ‌య‌సాయిరెడ్డి ఇంత‌లా నాలుక మ‌డ‌తేయ‌డం ప్ర‌తీసారీ అలవాటే అయినా కియా విష‌యంలో ట్వీటు మార్చి మ‌రింత అభాసుపాల‌య్యారు.

Advertisements

Latest Articles

Most Read