నందమూరి నటసింహం సినిమా వీరసింహారెడ్డి దెబ్బకి పులివెందుల పులి అని పిలిపించుకునే వైసీపీ ప్రభుత్వం గజగజ వణికారని వార్తలు వస్తున్నాయి. సినిమాని ఆపడానికి ఏమైనా చేయగలమా? అనే ఆలోచనతో కొందరు పోలీసు అధికారులు సినిమా విడుదలైన రోజే అర్ధరాత్రి స్పెషల్ షో చూశారని వార్తలు వచ్చాయి. తన పరిపాలనని టార్గెట్ చేసుకుని క్యారెక్టర్, డైలాగులు పేలిన వీరసింహారెడ్డి సినిమా బలంగా ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డ్యామేజ్ అవుతుందని ఆందోళనలో ఉన్నారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుర్రాడిగా వున్నప్పుడు కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అని ప్రచారం ఉంది. మీడియా వార్తలను బట్టి చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరసింహారెడ్డి సినిమాని తీశారని, మొత్తం డైలాగులు, సన్నివేశాలు వైసీపీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయని, ఈ సినిమాని అడ్డుకునే మార్గాలు పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. దీంతో కొందరు ఉన్నతాధికారులు సినిమా చూశారు. అభివృద్ధి ఏమీ లేదని, అరాచకాలు పెరిగిపోయాయని బాలయ్య పేల్చిన డైలాగులు జగన్ సర్కారుని ఉద్దేశించినవేనని తేల్చేసిన నివేదిక అందజేశారని తెలుస్తోంది. ఈ డైలాగులు సినిమా నుంచి కట్ చేసుకుని సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని నిర్మాతలకు ఆదేశించాలని అనుకుంటున్నారని సమాచారం. లేదంటే వీరసింహారెడ్డి ప్రదర్శనకు అడ్డంకులు తప్పవని అధికారుల ద్వారా హెచ్చరికలు పంపారని ప్రచారం సాగుతోంది.
news
సంక్రాంతి పండుగ వేళ, బులుగు బ్యాచ్ ఎత్తుల్ని చిత్తు చేసిన టిడిపి టీమ్స్
సంక్రాంతికి విడుదలైన బాలయ్య, చిరు సినిమాల వేదికగా విష ప్రచారం చేసి వారి ఫ్యాన్స్, సామాజి కవర్గాల మధ్య విభేదాలకు భారీ ప్లాన్ చేసిన బులుగు బ్యాచ్ కుట్ర భగ్నం అయ్యింది. బులుగు బ్యాచ్ ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా భారీ ప్రణాళికతో వస్తుంది. బులుగు బ్యాచ్ ఈ కుతంత్రంతో వస్తుంది..అని కొందరు హెచ్చరించినా వినే స్థితిలో ఏపీ ప్రజలు ఉండరు. కోడికత్తి, బాబాయ్ మర్డర్ఆ బులుగు బ్యాచ్ పన్నిన వ్యూహాలు అని ఒకరు ముందుగానే మొత్తుకుని చెప్పినా..అప్పటి ప్రభుత్వంలో ఉన్న టిడిపి లైట్ తీసుకుంది. ఆ బులుగు బ్యాచ్ స్కెచ్ ల ఫలితంతో దారుణ పరాజయం చవిచూసింది టిడిపి. అధికారంలోకి వచ్చాక కూడా విష వ్యూహాలను అమలు చేస్తూనే ఉంది. వీటిని తిప్పికొట్టడంలో టిడిపి కూడా రాటుదేలింది. చిరు, బాలయ్య సినిమాల విడుదలయ్యాయి. కాపు-కమ్మ పేరుతోనూ, ఫ్యాన్స్ పేరుతోనూ ఒకరిపైకి మరొకరిని ఉసికొల్పేలా ఫేక్, మార్ఫ్‌డ్ కంటెంట్ రెడీ చేసి వదిలారు. ఈ విడత టిడిపి ముందుగానే అలెర్ట్ అయ్యింది. బులుగు బ్యాచ్ చేయబోయే విషప్రచారం నమ్మొద్దంటూ టిడిపి అన్ని మాధ్యమాల ద్వారా అప్పీల్ చేసింది. వారు ఏం కుట్ర పన్నారనేది వివరించింది. దీంతో సోషల్మీడియా వేదికగా వేలకొద్దీ ఫేక్ అక్కౌంట్ల ద్వారా పుష్ చేసిన కంటెంట్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. రెండు సినిమాలు విడుదలై, విజయవంతంగా నడుస్తున్నాయి. చిరు బాలయ్యని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలంటూ ఓ మార్ఫింగ్ వీడియో వైసీపీ వదిలింది. తన కుటుంబంలో చెర్రీ, బన్నీ గురించి చిరు చెప్పిన విషయాలను అసలు వీడియోని టిడిపి సోషల్మీడియా బయటపెట్టింది. మొత్తానికి కమ్మ-కాపు విద్వేషాలు పెంచాలని బులుగు బ్యాచ్ తయారుచేసిన ప్రమాదకరమైన కంటెంట్ ఇద్దరి సినిమాలకు మంచి ప్రచారం తెచ్చి పెట్టింది. టిడిపి కూడా బులుగు బ్యాచ్ వ్యూహాన్ని ముందస్తుగా తెలుసుకుని చిత్తు చేయడంలో విజయం సాధించింది.
జగన్ ప్రభుత్వానికి సంక్రాంతి ధమాకా ఇచ్చిన హైకోర్ట్...
చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి ఏం చేయలేక బరితెగించి మరీ తెచ్చిన జీవోని రెండు వారాలు కూడా పూర్తి కాక ముందే కోర్టు కొట్టేసింది. 1861 పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేపట్టరాదంటూ ప్రభుత్వం నిషేధం విధిస్తూ జీవో 1 తెచ్చింది. ఈ చీకటి జీవోని తక్షణమే రద్దు చేయాలని విపక్షాలు ఉద్యమించాయి. జీవో 1 సవాల్ చేస్తూ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. రామకృష్ణ తరపున లాయర్ అశ్వినీకుమార్, ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. అనంతరం 23 వ తేదీ వరకూ జీవో అమలుపై హైకోర్టు సస్పెన్షన్ విధించింది. టిడిపి, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇటీవల కాలంలో ప్రజాసమస్యలపై రోడ్డుపైకి వస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో విపక్షాల సభలు, ర్యాలీలకు అశేషజనం హాజరవుతున్నారు. పథకాలు ఆపేస్తామని బెదిరించినా వీరు తగ్గడంలేదు. దీంతో ఏకంగా విపక్షాలు సభలు, ర్యాలీలు పెట్టకుండా 1861 నాటి బ్రిటిష్ చట్టం అమలుకి బరితెగించింది జగన్ సర్కారు.
విజయసాయి రెడ్డికి ఏమైంది ? వైసీపీలో హవా తగ్గిపోయిందా ? ఎందుకు దూరం పెడుతున్నారు ?
సీబీఐ-ఈడీ పెట్టిన కేసుల్లో ఏ1 జగన్ మోహన్ రెడ్డి అయితే ఏ2 విజయసాయిరెడ్డి. ఇద్దరూ ఒకే జైలులో చాలా కాలం ఉన్నారు. మామా అల్లుళ్ల బంధం కంటే ఆర్థిక సంబంధం వీరి మధ్య విడదీయలేనిది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పార్టీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి హవా బాగానే సాగింది. రాజ్యసభ సభ్యుడు, కేంద్రంతో స్నేహం వల్ల వచ్చిన పదికి పైగా పదవులు సాయిరెడ్డి సొంతమయ్యాయి. ఉత్తరాంధ్రకి అనధికార ముఖ్యమంత్రిగా సాయిరెడ్డి కొనసాగారు. భూముల కుంభకోణాలు, కబ్జాలని ఆరోపణలు వచ్చినా చూసీచూడనట్టు వదిలేశారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలంతా మాకు ఈయన వద్దు బాబోయ్ అని వేడుకున్నా జగన్ రెడ్డి కనికరించలేదు. ఏమైందో ఏమో హఠాత్తుగా విజయసాయిరెడ్డిని దూరం పెడుతూ వస్తున్నారని వైసీపీలో నేతలకు అర్థం అయిపోయింది. ఉత్తరాంధ్ర బాధ్యతలు ఊడపీకేశారు. సోషల్మీడియా బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించకుండా, సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పొమ్మనకుండా పొగబెట్టినట్టయ్యింది. ఒక్కో కీలక బాధ్యతల నుంచి జగన్ రెడ్డి తప్పిస్తుండడంతో సాయిరెడ్డి పని అయిపోయిందని వైసీపీ బాహాటంగానే చర్చించుకుంటున్నారు.