coastal economic zone 08112016

దేశంలోనే మొదటిది అయిన కోస్టల్ ఎకనామిక్ జోన్ మన రాష్ట్రానికి రానున్నది. రాష్ట్ర ఆర్ధిక ముఖ చిత్రాన్ని మార్చే ఈ ప్రాజెక్ట్ నవ్యాంద్రలో ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉంది. తూర్పు దేశాలైన, సింగపూర్‌, మలేషియా దేశాలకు దగ్గరగా ఉండటం, పొడవైన సముద్ర తీరం ఉండటంతో, కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్‌కు రాష్ట్రమే ప్రధాన కేంద్రం కానుంది.

దీనికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా, ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చింటానికి విజయవాడ వచ్చారు. అరవింద్‌ పనగారియా మాట్లాడుతూ, నవ్యాంధ్రలో కోస్టల్ ఎకనామిక్ ఎంప్లాయిమెంట్ జోన్ గురించి చర్చించాం. సముద్ర తీరప్రాంతాలైన కొన్ని నగరాలు ఈ తరహా జోన్ల ఏర్పాటుతో అభివృద్ధి చెందడం గమనించి దేశంలో కూడా ఈ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం.

వేల ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేదే ఈ జోన్ ఏర్పాటు వెనుక బలమైన ఉధ్దేశం. కొత్త జోన్ లో ఉద్యోగాల సృష్టి ఆధారంగా పరిశ్రమలకు రాయితీలు అందుతాయి. జోన్ల ఏర్పాటు వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెద్దఎత్తున వస్తాయి. జోన్ ఏర్పాటు వల్ల ఏపీలో తయారీరంగం ఊపందుకుంటుంది. చైనా అభివృద్ధికి కోస్టల్ ఎకనామిక్ ఎంప్లాయిమెంట్ జోన్ల పాత్ర ఎంతో ఉంది అన్నారు.

రానున్న బడ్జెట్‌లో ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించిన అంశం ప్రవేశపెట్టనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read