జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలసొమ్ముని ప్రకటనలరూపంలో దుబారా చేస్తోందని, “గుండెలనిండా జగన్ అజెండా... తొలిఏడు జగనన్నతోడు” అంటూ తనవ్యక్తిగత మరియు పార్టీ ప్రచారానికి ముఖ్యమంత్రి రూ.24కోట్ల62లక్షల 40వేల రూపాయాల ప్రజల సొమ్ముని ప్రభుత్వం కేటాయించిందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ఆక్షేపించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! ఏడాదిపాలన పూర్తయిన సందర్భంలో తనపార్టీ ప్రచారానికి జగన్ ప్రభుత్వ సొమ్ముని ఎలాఖర్చుచేస్తాడని టీడీపీతరుపున ప్రశ్నిస్తు న్నాను. ఏడాదిన్నరలో ప్రజలకు చేసిందేమీ లేకపోయినా, పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్ముని ఉపయోగిస్తోంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరంపై దుష్ప్రచారాలుచేశారని, అవన్నీ అవాస్తవాలని చెప్పడంకోసం, ఆనాడు చంద్రబాబుప్రభుత్వం ప్రజలను పోలవరం సందర్శనకు తీసుకెళ్లి, భోజనాలు పెడితే, దానిపై గతంలో జగన్, ఆయనపార్టీవారు అసెంబ్లీలో నానాయాగీ చేశారు. మరిప్పుడు రూ.24కోట్ల 62లక్షలను పార్టీ కార్యక్రమాలకు ఎలా మళ్లించారో సమాధానంచెప్పాలి. ఆనాడు అన్నంపెట్టడాన్ని తప్పుపట్టిన వైసీపీనేతలు, జగన్మోహన్ రెడ్డి, నేడు అధికారంలోకి వచ్చాక రంగులకే రూ.4వేలకోట్లు తగలేశారు. ముఖ్యమంత్రి, వైసీపీమంత్రులు దానికేం సమాధానం చెబుతారో చెప్పాలి. రూపాయి జీతం తీసుకుంటానని చెబుతున్న జగన్, తన ఇంటికి వేసేరోడ్లు, ఇతర సౌకర్యాలకల్పనకే రూ.50కోట్ల ప్రజలసొమ్ముని ఖర్చుచేశాడు.

jagan 18122020 2

అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వాదిస్తున్న లాయర్లకే జగన్ ప్రభుత్వం రూ.కోట్లాది రూపాయలను ఖర్చుచేసిందన్నారు. ఎలక్షన్ కమిషనర్ వ్యవహారం కోర్టులోఉండగానే అత్యుత్సాహం ఆపుకోలేక కనగరాజ్ ని తీసుకొచ్చి ఈసీగా తీసుకొచ్చి కోట్లరూపాయాలను దుర్విని యోగం చేశారు. సాక్షిపత్రికలో ప్రకటనలకు, సొంతడబ్బాలు కొట్టుకోవడానికి రూ.50కోట్ల ప్రజలసొమ్ముని ఖర్చుచేయడం దుబారా కాక ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి లేస్తే ప్రకటన, కూర్చుంటే ప్రకటన, అవిచాలవన్నట్లు ఇసుకపాలసీపై ప్రజల సలహాలుకోరుతూప్రకటనలివ్వడం మరో దారుణం. సాక్షిపత్రికకు మేలుచేయడానికే ఆ విధమైన ప్రకటనలిచ్చారు. సెంటుపట్టా పథకంలో వేలకోట్ల అవినీతి చేశారు. మద్యం వ్యాపారంలో అవినీతి మొత్తాన్ని ఒకేచోటకేంద్రీకృతంచేసిన ప్రభుత్వం, మద్యపాన నిషేధం ముసుగులో పెద్దఎత్తున సంపదను పోగేసుకుంటోంది. అటువంటి ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రతిపక్షాలను, ఆపార్టీనేతలను ఎలా విమర్శిస్తుంది? 15-12-2020న తీసుకొచ్చిన జీవో 257ను వెంటనేరద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. పార్టీ కార్యక్రమాలకు ఖర్చుచేసిన మొత్తాన్ని అధికారపార్టీనే భరించాలి. ప్రజలసొమ్ముని పార్టీ కార్యక్రమాలప్రచారానికి వాడుకోవడాన్ని టీడీపీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాము.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అణిచివేత విచ్చలవిడిగా మారడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారింది. పోలీసులలో కొందరు నేరాల రేటు తగ్గించి శాంతిభద్రతలు కాపాడటానికి బదులుగా, ప్రజల ప్రాధమిక హక్కులను అణిచేయడంపైనే శ్రద్ద చూపడం విడ్డూరం. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వమే అసమ్మతిని అణిచేయడం హాస్యాస్పదం. ప్రతిపక్షాల గొంతు నొక్కేయడంలో పోలీసుల్లో కొందరు అధికార వైసిపితో కుమ్మక్కు కావడం విచారకరం. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలు ఏడాది పూర్తయిన సందర్భంగా 17డిసెంబర్ 2020న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోలీస్ నోటీసులు జారీ చేయడమే అందుకు తార్కాణం. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదని, ఏ కార్యక్రమంలో పాల్గొనరాదని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే ఈ నోటీసులు..17డిసెంబర్ 2020న పోలీసులు జారీచేసిన ఈ నోటీసులు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), 19(1)(బి) మరియు 19(1)(డి) స్ఫూర్తిని కాలరాయడమే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600మంది టిడిపి నాయకులకు ఈ నోటీసులను ఇచ్చారు, ఎటువంటి అసమ్మతిని తెలియజేయరాదని హెచ్చరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తమ అసమ్మతిని తెలియజేసి శాంతియుత ఆందోళనల ద్వారా మన స్వాతంత్ర్య యోధులు మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించారనేది ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా వెలిబుచ్చే అసమ్మతిని అణిచేయడానికి బదులుగా శాంతిభద్రతల పరిరక్షణపై మీరు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగ హామీగా సంక్రమించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ బాధ్యత మీ రాజ్యాంగ విధి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం విచ్చిన్నం జరిగిందో లేదో తేలుస్తాం అంటూ, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పై, వాటిని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపీల్ చేసింది. రాజ్యాంగం విచ్చిన్నం జరిగిందో లేదో తెలుస్తాం అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వెనక్కు తీసుకోవాలని ఏపి ప్రభుత్వం అభ్యర్ధించింది. అసలు రాజ్యాంగం విచ్చిన్నం జరిగిందో లేదా అనేది అసలు సమస్య కాదని, పిటీషన్ లో తెలిపారు. రాజ్యాంగం విచ్చిన్నం జరిగిందో లేదో తేల్చాల్సింది రాష్ట్రపతి అని, హైకోర్టుకు సంబంధం లేదని సుప్రీంలో వాదించారు. దీని పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‍ఏ బోబ్డే ధర్మాసనం విచారణ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసు పై సెలవులు తరువాత అత్యసరంగా విచారణ జరుపుతాం అని కోర్టు చెప్పింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. మొత్తానికి ఈ అంశం పై ఏపి ప్రభుత్వానికి ఊరట లభించింది.

ప్రతి రోజు మీడియా ముందు కనపడి, రాజధాని రచ్చబండ పేరుతో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, ప్రభుత్వం తీరు పై , వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో అభిప్రాయలు చెప్పే వారు. అయితే ఈ మధ్య ఆయన సైలెంట్ అయ్యారని అందరూ అనుకున్నారు. నిజానికి ఎంపీ రఘురామకృష్ణరాజుకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆయనకు జరిగిన వైద్య పరీక్షల్లో, స్వల్ప తేడా గమనించి, గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుని, ఇప్పుడిప్పుడే మళ్ళీ తనదైన శైలిలో సమస్యల పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణం రాజు, తన ఆపరేషన్ అయిన తరువాత చేసిన మొదటి పని, అమరావతి రైతులు తరుపున నిలబడటం. మూడు ముక్కలు చేసి, అమరావతి రైతులకు గుండె కోత మిగిల్చిన ప్రభుత్వ తీరును ఆయన వ్యతిరేకించారు. అయితే ఈ క్రమంలో రాజధాని రైతులు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల చీఫ్ జస్టిస్ లను మార్చుతూ, కొలీజియం సూచనలు చేసింది. ఈ లిస్టు లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మహేశ్వరీ కూడా ఉన్నారు. అయితే ఆయన కీలకమైన అమరావతి కేసు కూడా వాదిస్తున్నారు.

rrr 18122020 2

రెండు నెలల క్రితం నుంచి అమరావతి కేసు రోజు వారీ విచారణ కూడా జరుగుతుంది. మరో నెల రోజుల్లో సంక్రాంతి పండుగ అయిన తరువాత, ఈ కేసు పై హైకోర్టు ఒక తీర్పు ఇస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆయన బదిలీ వార్తలు వచ్చాయి. మళ్ళీ కొత్త చీఫ్ జస్టిస్ వస్తే, కేసు మళ్ళీ మొదటి నుంచి వినాల్సి వస్తుంది. దీనిపైనే ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక లేఖ రాసారు. అమరావతి కేసు తీర్పు వచ్చే వరకు మహేశ్వరీ గారినే చీఫ్ జస్టిస్ గా ఉంచాలని కోరారు. ఇది రైతులతో ముడిపడిన అంశం అని, ఇప్పటికే అనేక మంది మనోవేదనతో చనిపోయారని, మళ్ళీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ మారిపోయి, కేసు మళ్ళీ మొదటి నుంచి రావాలి అంటే జాప్యం జరుగుతుందని, దీన్ని నివారించేందుకు ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణ అయ్యి, తీర్పు ఇచ్చేంత వరకు ఉంచాలని కోరారు. కొత్తగా వచ్చే చీఫ్ జస్టిస్ పై పూర్తి నమ్మకం ఉందని, మళ్ళీ ఈ కేసు మొదటి నుంచి మొదలు పెడితే, తీవ్ర జాప్యం జరిగి, ఇక్కడ ఉన్న 29 వేల కుటుంబాలు మరింత ఆవేదనకు లోనవుతారని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్టు, రాష్ట్రపతిని, చీఫ్ చీఫ్ జస్టిస్ ని కోరారు.

Advertisements

Latest Articles

Most Read