జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి ప్రతిపక్ష, స్వపక్షసభ్యులతోపాటు, ఆయన కుటుంబస భ్యులకు కూడా అర్థంకావడంలేదని, వి-వే-కా-నం-ద-రె-డ్డి హ-త్య జరిగినప్పుడు కుటుంబబంధాలకు విలువనిచ్చే మనిషిగా, భావోద్వేగంతో స్పందించిన జగన్‌, ఇప్పుడెందుకు ఆ హ-త్య-తో తనకేమీ సంబంధంలేనట్లుగా వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు. బుధవారం ఆయన మంగళ గిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వి-వే-కా చ-ని-పో-యి-న-ప్పు-డు సీబీఐ విచారణకు డిమాండ్‌చేసిన జగన్‌, అధికారంలోకి వచ్చాక దానిగురించి ఎందుకు వదిలేశాడన్నారు. వి-వే-కా కుమార్తె సునీత తనతండ్రి హ-త్య-కే-సు పై తాజాగా హైకోర్టుని ఆశ్రయించారని, ఆమె తనపిటిషన్‌ (3945-2019)లో జగన్‌ వ్యవహార శైలిపై, ఏపీపోలీసుల పాత్రపై పలు సందేహాలు వెలిబుచ్చారని వర్ల తెలిపారు. గతంలో ఏపీపోలీసుల పనితీరుని తప్పుపట్టిన వ్యక్తి నేడు అదేపోలీసులతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడని కూడా ఆమె అభిప్రాయపడిందన్నారు. కేసు విచారణచేస్తున పోలీసుల దర్యాప్తుని రాష్ట్రప్రభుత్వం ప్రభావితం చేస్తోందని, ఏపీ సర్కారుప్రమేయం లేకుండా కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని సునీత తన పిటిషన్లో కోరారన్నారు. కేసువిచారణలో జగన్‌ప్రమేయాన్ని సునీత ఇష్టపడటంలేదన్న అభిప్రాయం ఆమెపిటిషన్లో స్పష్టమైందన్నారు.

సునీత పిటిషన్‌తో ఆందోళనకు గురైన జగన్‌, ఆఘమేఘాలపై హైదరాబాద్‌కు పయనమయ్యాడని, తనఅక్క (సునీత)ను కలిసి ఆమెవేసిన పిటిషన్‌ ఉపసంహరిం పచేసేందుకే ఆయన వెళ్లాడన్న అనుమానం ప్రజలందరిలోనూ ఉందన్నా రు. ఎవరిని కాపాడటానికి, ఎవరిని కేసునుంచి తప్పించడానికి జగన్‌, సునీతతో చర్చించడానికి వెళ్లాడనే అనుమానం రాష్ట్రవాసుల బుర్రలను తొలుస్తోందని వర్ల చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వి-వే-కా-హ-త్య కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని, రాష్ట్రపోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని చెబుతూ, కేసువిచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌చేస్తూ 22-03-2019న కోర్టులో జగన్మోహన్‌రెడ్డి పిటిషన్‌ వేశాడన్నారు. (హ-త్య-కే-సు-కు సంబంధించి పలుసందర్భాల్లో జగన్‌మాట్లాడిన వీడియోను విలేకరుల ఎదుట ప్రదర్శించారు) తరువాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రయ్యాక వి-వే-కా హ-త్య- కేసు పై జగన్‌ స్పందిస్తాడని పార్టీవారితోపాటు, కుటుంబసభ్యులందరూ ఎదురుచూశారని, వారందరికీ నిరాశే మిగిలిందన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చి 8నెలలు గడిచినా కూడా ముఖ్యమంత్రి జగన్‌ వి-వే-కా-కే-సు విచారణను పట్టించుకోలేద న్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసువిచారణకు సిట్‌ను నియమించా రని, జగన్‌వచ్చాక మరోరెండు సిట్‌ బృందాలను నియమించారని, ఆయాబృందాల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కూడా ఇప్పటివరకు బయటకురాలేదన్నారు.

సునీత తాజాగా వేసిన పిటిషన్లో పలువురి అనుమానితుల పేర్లను వెల్లడించారని, కేసునిసీబీఐకి అప్పగిస్తే, ఎవరిని అరెస్ట్‌ చేస్తారని జగన్‌ భయపడుతున్నాడన్నారు. వి-వే-కా-హ-త్య-కే-సు-లో ఎవరు అరెస్టయితే జగన్‌కు ముప్పు ఉందో ఆయనే స్పష్టంచేయాలన్నారు. తమ్ముడు జగన్‌చేసిన మోసం అక్కకు (సునీతకు) ఇప్పుడు తెలిసొచ్చిందని, అందుకే ఆమెను హైకోర్టుని ఆశ్రయించిందని వర్ల తెలిపారు. వి-వే-కా-హ-త్య-కే-సు గురించి ప్రశ్నించినవారం దరికీ నోటీసులు ఇస్తామంటున్నారని, కోర్టుకి వెళ్లిన సునీతకు, వాస్తవాలు మాట్లాడిన తనకు కూడా నోటీసులు ఇస్తారా అని వర్ల నిలదీశారు. వి-వే-కా-హ-త్యకేసేమీ జగన్‌ కుటుంబసమస్యకాదని, అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న అభిప్రాయం ప్రజలందరి లోనూ ఉందన్నారు. రాజులసొమ్ము రాళ్లపాలైనట్లుగా, జగన్‌ప్రభుత్వం ప్రజలసొమ్ముని రంగులపాలు చేసిందని, విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామయ్య అభిప్రాయపడ్డారు. గతంలోకోర్టుకు వెళితే రోజుకి రూ.60లక్షలు అవుతాయన్న జగన్‌, సునీతను కలవడానికి హైదరాబాద్‌కు వెళ్లడంద్వారా రూ.కోటి20లక్షల ప్రజల సొమ్ముని వృథాచేశాడన్నారు. జగన్‌ ఇప్పటికైనా కేసువిచారణ చేపట్టాలని, సీబీఐకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఆయనలా చేయకుంటే, ఆయనపై పడినమచ్చ అలానే ఉండిపోతుందన్నారు. విశాఖవాల్తేర్‌ క్లబ్‌ను కాజేయడానికి ఇప్పటికే విజయసాయి తనప్రయత్నాలు ప్రారంభించాడన్నారు.

సొంతబాబాయి హ-త్య-కేసుని సీబీఐకి అప్పగించడానికి, జగన్‌ ఎందుకు తాత్సారం చేస్తున్నాడని, వై.ఎస్‌.వి-వే-కా కుమార్తె, భార్య హైకోర్టుకు వెళ్లినా దానిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదని టీడీపీనేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. బుధవా రం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వి-వే-కా కేసులో జగన్‌పాత్ర ఉందన్న అనుమానం నానాటికీ బలపడుతోందని, కేసు విచారణలో జగన్‌వైఖరి చూస్తుంటే ప్రజల అనుమానాలకు బలం చేకూరుతోందని వెంకన్న స్పష్టంచేశారు. వి-వే-కా కుటుంబసభ్యులు సీబీఐ విచారణకోరుతుంటే, జగన్‌ సిట్‌ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. వి-వే-కా తన ఇంట్లోనే హ-త్య-గావించబడిన తీరుచూసి రాష్ట్రమంతా చలించినా, కొడుకు తర్వాతి కొడుకైన జగన్‌ ఎందుకు మిన్నకుండిపోయాడో తెలియడంలేదన్నారు. జగన్‌ సీఎం అయ్యాక వి-వే-కాహత్యకేసు నత్తనడకన సాగుతోందని ఆయన కుటుంబసభ్యులే చెబుతున్నారని వెంకన్న తెలిపారు. తనతండ్రి కేసుని సీబీఐకి అప్పగించాలని, వీలైనంతత్వరగా దోషుల్ని పట్టుకోవాలని సునీత కోరినా, జగన్‌ స్పందించనందునే ఆమె కోర్టు తలుపు తట్టిందన్నారు.

మడమతిప్పని వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్న జగన్‌, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాశ్‌రెడ్డి సహా, ఇతరకుట్రదారులకు ఎందుకు కొమ్ముకాస్తున్నాడని వెంకన్న నిలదీశారు. ముఖ్యమంత్రివైఖరి, కేసువిచారణ జరుగుతున్న తీరుచూస్తుంటే, భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిలతోపాటు జగన్‌ ప్రమేయంకూడా ఉందన్ని స్పష్టమవుతోందన్నారు. ఎవరికీ భయపడని, ఎవర్నీ లెక్కచేయని జగన్‌, తన కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేయించడానికి ఎందుకు వెనకాడుతున్నాడు. విచారణను సీబీఐకి అప్పగిస్తే, తనవారితోపాటు తనపేరుకూడా బయటపడుతుందన్న అనుమానం జగన్‌లో ఉందని బుద్ధా పేర్కొన్నారు. 2014ఎన్నికల్లో ఎమ్మెల్యేటిక్కెట్‌ తనకు ఇవ్వాలని భాస్కర్‌రెడ్డి కోరాడని, అప్పటినుంచే వి-వే-కాతో వారికి మనస్పర్ధలు ప్రారంభమయ్యాయని బుద్ధా తెలిపారు. వి-వే-కా-హ-త్య జరిగిన తీరుచూస్తుంటే, ఆయనను చం-పి-న వారు ఆయనపట్ల ఎంతకసితో ఉన్నారో అర్థమవుతోందన్నారు.

ఒంటినిండా గొ-డ్డ-లి-గా-ట్ల-తో ఉన్నవ్యక్తి, గుండెపోటుతో మృ-తి-చెందాడని చెప్పించారని, వి-వే-కా-మృ-త-దే-హా-న్ని చూడటానికి వచ్చిన ప్పుడు జగన్‌ కంటినుంచి ఒక్కచుక్కకూడా కన్నీరురాలేదన్నారు. దివంగత వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు, తన తమ్ముడు వి-వే-కా చాలా మంచివాడని చెప్పారన్నారు. అధికారముంది కదా అని రైతుల్ని, మహిళల్ని, ప్రతిపక్షసభ్యుల్ని వేధిస్తున్న జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే, తనచెల్లి, తనచిన్నమ్మ చేసిన అభ్యర్థనపై వెంటనే స్పందించి వి-వే-కా హ-త్య-కే-సు-ని సీబీఐకి అప్పగించాలన్నారు. జగన్‌ తీరుమారకుంటే, వి-వే-కా-హ-త్య-కే-సు-ని జనంలోకి తీసుకెళతామని, తమపార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే అసలుదోషుల్ని చట్టంముందు నిలబెడతామని వెంకన్న తేల్చిచెప్పారు. మండలిరద్దుచేయడంద్వారా జగన్‌ ప్రజలముందు మండలిసభ్యులను హీరోలను, త్యాగపురుషుల్ని చేశాడని విలేకరు లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బుద్ధా అభిప్రాయపడ్డారు. జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మండలిలో ఉన్నతన ఇద్దరుమంత్రులతో రాజీనామా చేయించి, మండలి ని రద్దుచేసి ఉండాల్సిందన్నారు.

కొంతకాలంగా బీహార్ సీఎం నితీష్ కుమార్,ఐప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ మధ్య వివాదం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే.అనేక సందర్భాల్లో సీఎం నితీష్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియా తో మాట్లాడటం,తన సొంత నిర్ణయాలను పార్టీ నిర్ణయాలగా ప్రకటిస్తూ ప్రశాంత్ కిషోర్ నితీష్ కి కొరకరాని కొయ్యగా మారారు.బీజేపీ కింగ్ పిన్ అమిత్ షా ఆదేశాలతో ప్రశాంత్ కిషోర్ ని పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించిన నాటినుండి నితీష్ కి కంటి మీద కునుకు లేకుండా చేసారు ప్రశాంత్ కిషోర్.ముఖ్యమంత్రి గా ఆయన చేస్తున్న తప్పులను ఎత్తి చూపారు.పార్టీ లో కూడా నితీష్ ని కాదని తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇప్పుడు ఆ వివాదం తారా స్థాయికి చేరుకుంది.బీజేపీ తీసుకొచ్చిన సిఏఏ,ఎన్ఆర్సి,ఎన్పిఆర్ సిసిఏ బిల్లుల వ్యవహారంలో నితీష్ ,ప్రశాంత్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండే వాతావరణం తీసుకొచ్చాయి.రోజుకో ట్వీట్ తో నితీష్ ని ఇబ్బంది పెట్టారు కిషోర్.

రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాం అని గమనించిన నితీష్ అసలు నిజాలు బయటపెట్టారు.అమిత్ షా ఆదేశాలతోనే ప్రశాంత్ కిషోర్ ని పార్టీ ఉపాధ్యక్షుడిని చేసా,పార్టీ ని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చారు.పార్టీ లైన్ దాటాలి అనుకుంటే పదవికి రాజీనామా చెయ్యాలి అని అన్నారు.అయితే నితీష్ ని మరింత రెచ్చగొట్టే విధంగా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసారు.ఇక ప్రశాంత్ కిషోర్ ని పదవి నుండి తప్పించి ఆయన పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చెయ్యాలని నితీష్ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమాచారం తెలుసుకున్న జగన్ వెంటనే ప్రశాంత్ కిషోర్ తో ఫోన్లో మాట్లాడారు. నేను మీకు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మీకు పదవి ఇస్తా అని ప్రశాంత్ కిషోర్ కి జగన్ అఫర్ చేశారట.

అంతే కాదు ప్రస్తుతం ఢిల్లీ లో వ్యవహారాలు చక్కబెడుతున్న విజయసాయి రెడ్డి అనేక కేసుల్లో నిందితుడుగా ఉండటంతో జగన్ కి ముఖ్యుల అపాయింట్మెంట్ రావడం కష్టం అవుతుంది అందుకే ప్రశాంత్ కిషోర్ కి క్యాబినెట్ ర్యాంక్ తో పాటు ఢిల్లీ లో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ చేసారట.ప్రశాంత్ కిషోర్ కి బీజీపీ అధినాయకత్వం ఆశీస్సులు ఉన్నాయి.కాబట్టి ఢిల్లీ పెద్దల నుండి కావాల్సిన సహాయం కూడా వెంటనే దక్కుతుంది అలానే రాష్ట్రంలో తనకి అడ్డుగా మారిన మండలి రద్దు కు కూడా ప్రశాంత్ కిషోర్ మార్గం సుగమం చేస్తారు అని జగన్ బలంగా నమ్మి ప్రశాంత్ కిషోర్ ని మరో సారి పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలి అని డిసైడ్ అయ్యారు అట.ప్రశాంత్ కిషోర్ కూడా ముఖ్యమంత్రి జగన్ అఫర్ కి అంగీకరించినట్టు సమాచారం.వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు తీసుకోవడం ఇక లాంఛనమే అంటున్నారు పార్టీ వర్గాలు.పూర్తి స్థాయిలో పీకే బాధ్యతలు స్వీకరిస్తే ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పీకే మార్క్ సినిమా కనిపిస్తుంది అని వైఎస్ఆర్సి వర్గాలు అంటున్నాయి

హైకోర్ట్ లో తన తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వమని ఆదేశిచాలని కోరుతూ, వి-వే-క కూతురు వేసిన రిట్ పిటీషన్ చూస్తే, సంచలన విషయాలు ఉన్నాయి. స్వయానా పెదనాన్న కొడుకు, సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న అన్న పైనే, ఈ ఆరోపణలు చెయ్యటం సంచలనంగా మార్దిని. వైఎస్ సునీత కోర్టుకి ఏమి చెప్పింది? కొన్ని ముఖ్యాంశాలు ఇవి, 1. కడపలో వైఎస్ఆర్ ఎంత పాపులరో మా నాయనా అంతే పాపులర్. సౌమ్యుడూ, అందరికీ అందుబాటులో ఉంటాడన్న మంచిపేరుతో చాలా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. 2. మా నాయన మృ-త-దే-హా-న్ని చూసిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తెదేపాలోని ముఖ్యులకు దీనిని ఆపాదిస్తూ సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసారు. తన పార్టీసహచరులతను వెంటబెట్టుకొని వెళ్ళి గవర్నర్ ను కలిసి సీబీఐ విచారణ చేయించాలని కోరారు. 3. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడిషినల్ డీజీపీ అధికారి అమిత్ గార్గ్ నేతృత్వంలో మొదటి సిట్ టీం ను ఏర్పాటు చేయడం జరిగింది. 4. ఆ తర్వాత మా పెదనాన్న కొడుకూ, నా కజిన్ అయిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి, కొత్త డీజీపీ సవాంగ్ బాధ్యతలు తీసుకున్న 14 దినాల్లో సిట్ ను రీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అడిషినల్ డీజీపీ స్థాయి అధికారిని తప్పించి కేవలం జిల్లా ఎస్పీకి నేతృత్వాన్ని బదలాయించి రెండవ సిట్ ను నీరుగార్చారు.

11) [అమిత్ గార్గ్ ను ఇక్కడ తప్పించారు] రెండవ సిట్ బాస్ అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు ఇద్దరు అనుమానితులు ఉదయ్ కుమార్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి లను విచారణకై పులివెందుల నుండి కడపకు తీసుకొని వస్తుండగా మార్గ మధ్యంలో లెక్క లేనన్ని ఫోన్ కాల్స్ రావడం, చివరకు అనూహ్యంగా వారిని కడపకు తీసుకొని రాకుండా వెనక్కు పులివెందుల పంపించి వేయడం జరిగిది. ఎవరి ప్రోద్భలం మేరకు వారిని విచారణకు తీసుకొని రాకుండా మార్గమధ్యంలో వెనక్కి పంపివేయడం జరిగింది? 6. ఇది జరిగిన కొద్ది రోజులకే రెండవ సిట్ బాస్ అభిషేక్ మొహంతి ధీర్ఘకాలిక సెలవుపై ఏ కారణాల వలన వెళ్ళిపోయారు? ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళాక 3 వ సిట్ ను వేసారు.. స్థానిక ఎస్పీ కేకే అంబురాజన్ నేతృత్వంలో. 7. సిట్ కు ఇన్ చార్జ్ గా అభిషేక్ మొహంతీ గారినే కొనసాగించవలసినదిగా డీజీపీని కోరడం జరిగింది. (28-11-2019) . వ్యక్తిగత రక్షణకై 21-11-2019 న డీజీపీని కోరడం జరిగింది. 07-12-2019 న (కేసులో అనుమానితులైన వ్యక్తులే సాక్షులను ఇంటొరాగేట్ చెయ్యడంపై) కడప ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసును సీబీఐ కి బదలాయించే విషయమై మళ్ళీ 11-12-2019 న డీజీపీని కోరడం జరిగింది. 8. ఘటనా స్థలంలో ర-క్త-పు మరకలు శుభ్ర పరచడం వల్ల అప్పుడు అక్కడ విధుల్లో ఉండటంతో సస్పెండయిన సీఐ శంకరయ్యను నిందితుల లిస్ట్ లో ఎందుకు చేర్చలేదు?

9. మూడవ సిట్ కు ఎస్పీ అంబురాజన్ వచ్చినప్పటి నుండీ కేసు దర్యాప్తులో పురోగతి లేదు. గత సిట్ ల దర్యాప్తు వివరాలను తర్వాత వచ్చే వారు పరిగణలోకి తీసుకోవట్లేదు. 10. రెండవ సిట్ చే విచారింపబడిన హెడ్ కానిస్టేబుల్ రామ కృష్ణా రెడ్డి (ర-క్త-పు మరకలు శుభ్రపరిచేటప్పుడు ఘటనా స్థలంలో ఉన్నాడు) ఇప్పుడు తనే సాక్షుల ఇళ్ళకు వెళ్ళి ప్రశ్నలు వేయడం ఎక్కడి విచిత్రం? ఇదే విషయం డీజీపీకి కూడా లేఖ ద్వారా తెలియజేసాము. 11. నా సోదరుడు సీఎం జగన్ గతంలో స్వతంత్ర్య సంస్థ దర్యాప్తును కోరి ఇప్పుడు సీబీఐకు కేసును అప్పగించకపోవడం శోచనీయం. 12. తరచూ సిట్ అధికారులను ఎందుకు మార్చుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ చెప్పట్లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోసం రిట్ పిటీషన్ వేసిన నా సోదరుడు జగన్ ఆ పిటీషన్ ను వెనక్కి తీసుకోనంత వరకూ టెక్నికల్ గా ఆయన సీబీఐ విచారణ కోరుతున్నట్లే లెక్క. ఇప్పుడు తనే సీఎం అయ్యాక సీబీఐను ఈ కేసు విచారించమని కోరకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అమాయకులపై దోషులుగా ముద్ర పడే అవకాశం ఉంది. 13. అనుమానితులు :: అంతా తెలిసిన వారు, బంధువులే.. ముఖ్యమైన వారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మరియూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి డీ. శివశంకర్ రెడ్డి.

అనుమానితుల్లో అందరి కంటే చివరన మొక్కుబడిగా ఆదినారాయణ రెడ్డి, రవీంధ్రనాధ్ రెడ్డి పేర్లు.. అసలు అభియోగాలన్నీ సొంత వారిపైనే. ఈ రిట్ పిటీషన్ చదివితే సీఎం సొంత బాబాయి కూతురే తనకూ తన తల్లికీ న్యాయం జరగడం కోసం ఎన్ని అవస్థలు పడుతుందో అవగతం అవుతుంది.. మరి ఈ విషయం పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read