జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న ప్రజావ్యతిరేకచర్యలను, గతంలో ఒప్పుకొని, ఇప్పుడు మాటతప్పిన ఆయన తీరుని ప్రశ్నించామన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి టీడీపీ ఎమ్మెల్సీలపై కక్షకట్టి, మండలినిరద్దు చేశాడని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆక్షేపించారు. సోమవారం ఆయన మరోఎమ్మెల్సీ సత్యనారాయణరాజుతో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 151మంది వైసీపీ ఎమ్మెల్యేలుం టే, వారిలో 84మందిపై కేసులున్నాయని, అలాంటివారుపెద్దలసభను రద్దు చేయడం దురదృష్టకరమని దీపక్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రప్రజలు ఇప్పటికైనా మేలుకోకుంటే, భవిష్యత్‌లో అధికారపార్టీ ఆధ్వర్యంలో మరిన్ని అనర్థాలు చోటుచేసుకుంటాయన్నారు. మండలిరద్దు తీర్మానం ఓటింగ్‌పై 18మంది వైసీపీఎమ్మెల్యేలు సభకు రాలేదని, తమఅధినేత నిర్ణయం తప్పన్న ఆలోచన వారిలో కొందరికి ఉందని ఈవిషయం తో రుజువైందన్నారు. దేశంలో 10రాష్ట్రాలు తమకు కౌన్సిల్‌ (మండలి) కావాలని కేంద్రానికి అభ్యర్థించుకున్నాయన్నారు.

తనపుట్టినరోజు కానుకగా రాష్ట్రానికి మండలిని కానుకగా ఇచ్చిన వై.ఎస్‌.నిర్ణయాన్ని కూడా ధిక్కరించేలా జగన్‌ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రప్రజలే ఆలోచించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలపక్షాన మండలిఉండాలన్న సదుద్దేశంతోనే నాటిపాలకులు మండలిని పునరుద్ధరించారన్నారు. జగన్‌ తనసొంత ఇంటికి రూ.43కోట్లు ఖర్చుచేశాడని, అలాంటివ్యక్తి మండలికి రూ.60కోట్లు ఖర్చుచేయ లేడా అని దీపక్‌రెడ్డి ప్రశ్నించారు. 38బిల్లులు మండలికి వస్తే, రెండుబిల్లులకు మాత్రమే సలహాలు, సూచనలుచేశామని, ప్రజలఅభిప్రాయం తెలుసుకోమని చెప్పడమే తప్పన్నట్లుగా జగన్‌ నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నిరకాలుగా చేయాలో అన్నిరకాలుగా మండలిసభ్యుల్ని ఇబ్బందులకు గురిచేశారని , తననిర్ణయాన్ని కాదన్నారని ఇదంతా జరిగిందని, భవిష్యత్‌లో తనకు ఎదురుచెబితే అసెంబ్లీసభ్యులపైకూడా జగన్‌ఇలానే ప్రవర్తిస్తాడన్నారు. బీజేపీ వాళ్లుకూడా ప్రజలపక్షాన ఢిల్లీలో పోరాడి, మండలిరద్దుని ఆపాలని దీపక్‌రెడ్డి సూచించారు.

జగన్‌ పతనం ఆరంభమైంది : సత్యనారాయణరాజు.. అన్నివ్యవస్థలను తనకింద ఉంచుకోవాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి కౌన్సిల్‌ను రద్దుచేశాడని, మండలి నిర్వహణకు రూ.60కోట్లు వృథా అవుతున్నాయంటు న్న ముఖ్యమంత్రికి తమసభ్యులను నామినేట్‌చేసినప్పుడు ఆ విషయం తెలీదా అని సత్యనారాయణరాజు ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాన్ని సెలెక్ట్‌కమిటీకి పంపడమే ఏదో తప్పని భావించిన ముఖ్యమంత్రి తనపతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడన్నారు. తనకు విధేయుడిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆర్డీవోస్థాయికి పంపినప్పుడే జగన్‌పతనం ఆరంభమైందన్నారు. దేశం లో ఎవరూ చేయనివిధంగా జగన్‌ ప్రవర్తిస్తున్నాడని, 5కోట్లమందికి ముఖ్యమంత్రి నన్న భావన ఆయనలో ఏమాత్రం కనిపించడంలేదన్నారు.

ఓటింగ్‌లోసభ్యుల్నే లెక్కించలేనివారు, పరిపాలనేం చేస్తారు : అశోక్‌బాబు.... మండలిరద్దు తీర్మానం బిల్లుపై ఓటింగ్‌ జరిగేటప్పుడు నాన్‌మెంబర్స్‌ను బయటకుపం పారని, అలానే మండలిలో కూడా సభ్యులుకానివారిని బయటకు పంపమంటే దాన్ని తప్పుపట్టారని, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడటం, ఏవో కాగితాలు ఆయనకు చూపించడం జరిగిందని, తరువాతే 133మంది సభ్యులు మండలిరద్దు బిల్లుకి ఆమోదం తెలిపినట్లుగా స్పీకర్‌ చెప్పారన్నారు. 121మంది సభ్యులు న్నారని తొలుతచెప్పి, తరువాత 133అనడం జరిగిందన్నారు. సభలోని సభ్యుల్ని కూడా లెక్కించలేని ఈ ప్రభుత్వం, ప్రజలకు ఏం పరిపాలన ఇస్తుందని అశోక్‌బాబు ప్రశ్నించారు. వైసీపీకి ఉన్న151మందిలో 133మంది మద్ధతుపలికితే, మిగిలిన సభ్యులు ఏమయ్యారని, వారి పరిస్థితి ఏమిటని ఆయన నిలదీశారు. నేటితో వైసీపీపని అయిపోయిందని, రేపటినుంచి (28వతేదీ) టీడీపీపోరాటం ఆరంభమవుతుందన్నారు. తీర్మానాలు చేసినంతమాత్రాన రాజధాని మార్పు, మండలిరద్దు అనేవి సాధ్యంకావన్నారు. చంద్రబాబుకి పేరొస్తుందనే జగన్‌ రాజధానిని తరలిస్తున్నాడని, మండలిని రద్దుచేశారని, మేమంతా మావ్యక్తిగతంకోసం పనిచేయడంలేదని, రాష్ట్రప్రజలకోసమే పనిచేస్తున్నామని, భవిష్యత్‌లోనూ చేస్తామని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు తెలిపారు.

వైఎస్ జగన్ మోహన్ ప్రభుత్వానికి, కోర్టుల్లో మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. పీపీఏల విషయంలో మొదలైన హైకోర్ట్ మొట్టికాయలు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ స్పీడ్ కి, కోర్ట్ బ్రేకులు వేస్తూ ఉండటంతో, జగన్ కు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే శాసనమండలి తన మాట వినటం లేదని, ఆయన శాసనమండలిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్ట్ ల విషయంలో, ప్రభుత్వాలకు ఎలాంటి అధికారాలు లేకపోవటంతో, కోర్ట్ జోలికి పోలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులూ సెటైర్లు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు విషయానికి వస్తే, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం బ్రాండింగ్ కార్యక్రమం పెట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా, ఎటు చూసినా వైసీపీ రంగులే కనిపించాలి అంటూ, పెద్దలు హుకుం జారీ చెయ్యటంతో, మొత్తం అదే బాట పట్టారు. పంచాయతీ ఆఫీస్లు, ప్రభుత్వం భవనాలు, వాటర్ ట్యాంకులు, ఆకులు, అలమలు, గేదల, గొర్రెల కొమ్ములు, ఇలా ఒకటి కాదు, రెండుకాదు, ఏది కనిపిస్తే అది, వైసీపీ రంగులతో నింపేశారు.

court 27012020 2

ఈ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తతంగం అంతా చూస్తున్న కొంత మందికి విరక్తి చెంది, కోర్ట్ కు వెళ్లారు. ఎక్కడైనా పంచాయతీ ఆఫీస్ అనేది, అన్ని పార్టీల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు వెళ్ళేదిలా ఉండాలని, ఇప్పుడు పంచాయతీ ఆఫీస్లకు వెళ్ళాలి అంటే, ఏదో పార్టీ ఆఫీస్ కు వెళ్లినట్టు ఉందని అంటున్నారు. దీంతో వారికి విరక్తి చెంది, వారు కోర్ట్ కు వెళ్లారు. ప్రజా ఆస్తులకు ఒక పార్టీ రంగులు వెయ్యటం తప్పు అని, కోర్ట్ ఈ విషయంలో, సరైన విధంగా, ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ, గుంటూరుకు చెందిన కొంత మంది హైకోర్ట్ లో కేసు వేసారు. ఈ విషయం పై, ఈ రోజు హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది.

court 27012020 3

పంచాయతీ కార్యాలయాలపై వైకాపా రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా పడింది. అయితే ఇప్పటికి రంగులు వెయ్యటానికి, 1400 కోట్లు అయ్యింది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంటే, ఇప్పుడు ఈ 1400 కోట్లు, మళ్ళీ రంగులు మార్చటానికి, ఎన్ని వేల కోట్లు అవుతాయి. ఇలాంటి వృధా ఖర్చులు పెట్టే బదులు, ప్రజలకు ఉపయోగపడే వాటి పై, ఖర్చు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డి, మూడు ముక్కల రాజధాని నిర్ణయం తీసుకున్న సమయంలో, ఈ ప్రక్రియ అంతా, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. జగన్ ఈ నిర్ణయం తీసుకున్న తరువాత, అమరావతి రైతులు ఎంత ఆందోళన చేసినా, 30 మంది చనిపోయినా, జగన్ మాత్రం అదరలేదు బెదరలేదు. క్యాబినెట్ నిర్ణయం, అసెంబ్లీ నిర్ణయం తీసుకోవటంతో, ఇక మూడు ముక్కల రాజధాని తధ్యం అని అందరూ అనుకున్నారు. ఇక అమరావతి రైతులు రోడ్డున పడినట్టే అని అందరూ అనుకున్నారు. శాసనమండలిలో టిడిపికి మెజారిటీ ఉన్నా, ఇక్కడ బిల్లు రిజెక్ట్ చేసినా, మళ్ళీ అసెంబ్లీ ఆమోదిస్తే, ఇక మండలి గురించి పట్టించుకోనవసరం లేదని అనుకున్నారు. అయితే, ఇదే సమయంలో, చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవాన్ని చూపించారు. ఏ 40 ఏళ్ళ అనుభవం అంటూ, వైసీపీ ఎగతాళి చేసిందో, దాంతోనే చంద్రబాబు కొట్టారు. మండలి సమావేశాల మొదటి రోజు, బయటకు తెచ్చిన రూల్ 71 దెబ్బకు, గిలగిలా కొట్టుకున్న వైసీపీ, ఇక దీంట్లో నుంచి బయటకు రాలేక, ఏకంగా మండలినే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

cbn 27012020 2

ఇంకో ఏడాది ఎలాగోలా తట్టుకుంటే, జగన్ కే మండలిలో మెజారిటీ వచ్చేస్తుంది. ఏడాది కూడా సహనంగా ఉండలేక, చంద్రబాబు వేసిన పాచికలో జగన్ చిక్కుకుని, ఏకంగా మండలినే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు జగన్, వైఖరి ఏమిటో, ప్రజలు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న తుగ్లక్ అనే ఆరోపణ నిజం చేస్తూ, వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు వేసిన పాచికకు జగన్ చిక్కారు. ఇది ఇక్కడితో అయిపో లేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి కూడా బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు, వైసీపీ, బీజేపీ మధ్య వైరం ఉంది అంటూ, నమ్మించే ప్రయత్నం చేస్తున్నా, ఆచరణలో మాత్రం, కేంద్రం ఎక్కడా జగన్ ని కట్టడి చెయ్యటం లేదు.

cbn 27012020 3

చివరకు ఒక రాజధానిని మూడు ముక్కలు చేస్తాం, 29 వేల మంది రైతుల త్యాగం వృధా చేస్తాం అంటున్నా, కేంద్రం స్పందించలేదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ మాత్రం, మాటలు కోటలు దాటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ దాగుడు మూతలకు చెక్ పెడుతూ, చంద్రబాబు వేసిన పాచికతో, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి కూడా తెలిసిపోతుంది. ఒక వేళ, కేంద్రం కనుక మండలి రద్దు నిర్ణయం వెంటనే, అంటే, రేపు ఫిబ్రవరి నుంచి మొదలు అయ్యే పార్లమెంట్ సమావేశంలో ఇది పెడితే, జగన్ కు, బీజేపీకి ఉన్న సంబంధం బయట పడుతుంది. లేదు, ఇప్పటికే ఉన్న రెండు రాష్ట్రాల శాసనమండలి రద్దు తీర్మానాల లాగా, ఏపి తీర్మానం కూడా పెండింగ్ లో పెట్టి, ఏడాది, రెండేళ్ళ తరువాత రద్దు పార్లమెంట్ లో పెడితే, అప్పుడు బీజేపీకి, జగన్ కు ఎలాంటి సంబంధాలు లేవు అని ప్రజలకు అర్ధం అవుతుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ అన్ని విషయాలు లాగా తప్పించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ వైఖరితో, బీజేపీ ఎటు వైపు అనేది ఏపి ప్రజలకు అర్ధమై పోతుంది.

అమరావతిలో ఒక పక్క మండలి రాద్దు అంశం పై, అసెంబ్లీలో చర్చ జరిగి, ఏమి జరుగుతుందో అని ఆసక్తి ఉన్న వేళ, విజయవాడలో కర్ణాటక రైతులని అరెస్ట్ చెయ్యటం సంచలనంగా మారింది. అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం 40వ రోజుకు చేరుకుంది. అయినా ఎక్కడా ప్రభుత్వం కనీసం వీరిని పరిగణలోకి కూడా తీసుకోలేదు. కనీసం వారి సమస్య ఏమిటి అనేది కూడా పట్టించుకోలేదు. అయినా అమరావతి రైతులు, శాంతియుతంగా, ఎక్కడా లైన్ దాటకుండా, వారు 40 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, అమరావతి రైతులకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అయితే, ఈ రోజు అమరావతి రైతులకు అనూహ్య మద్దతు వచ్చింది. తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న నిరసనకు, కర్నాటక నుంచి వచ్చిన రైతులు, మద్దతు ప్రకటించారు. అయితే, ఇది ఇక్కడితో అయిపోలేదు. వారు అమరావతికి వస్తూ ఉండగా, వారిని పోలీసులు అడ్డుకోవటం, సంచలనంగా మారింది. మడ్డు ఇస్తే కూడా అడ్డుకుని, అరెస్ట్ చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు.

cbn 277012020 2

అది కూడా, వేరే రాష్ట్ర రైతులని, మన రాష్ట్రంలో అరెస్ట్ చెయ్యటం, సంచలనంగా మారింది. అయితే కర్ణాటక రైతుల అరెస్ట్ ను తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు కర్ణాటక రైతులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్ళు ఏమి తప్పు చేసారని అరెస్ట్ చేసారని, చంద్రబాబు అడిగారు. వారిని వెంటనే విడుదల చేసి, వారిని అమరావతి రైతుల దగ్గరకు వెళ్ళకుండా చెయ్యాలని కోరారు. వారిని కనుక విడుదల చెయ్యకపోతే నేనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వస్తాను అంటూ చంద్రబాబు హెచ్చరించారు. దీంతో, పోలీసులు మళ్ళీ చంద్రబాబు వస్తే, ఎలా ఉంటుందో అని, పోలీసులు వెంటనే వారిని విడుదల చేసారు. వారికి అండగా అక్కడ స్థానికి విజయవాడ టిడిపి నేతలు ఉన్నారు.

cbn 277012020 3

చంద్రబాబు మాట్లాడుతూ, "కర్ణాటక నుంచి వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం హేయం. రాజధాని రైతులకు మద్దతుగా కర్ణాటక రైతులు వస్తే తప్పా..? సాటి రైతులు కష్టంలో ఉన్నారని కర్ణాటక రైతులు వచ్చారు. తోటి రైతులకు సంఘీభావం చెప్పడమే వాళ్ల నేరమా..? ఒక రైతుకు, మరో రైతు మద్దతివ్వడంలో తప్పేంటి..? తక్షణమే కర్ణాటక రైతులను వదిలేయాలి. లేకుంటే నేనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వస్తాను. ఏవిధంగా విడుదల చేయరో చూస్తాను " అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అయితే కర్ణాటక రైతులు, వారికి ఎదురైన పరిస్థితి చూసి అవాక్కయ్యారు. మేము ఏమి చేసాం అని మమ్మల్ని అరెస్ట్ చేసారు, ఒక సాటి రైతుకు, మరో రైతు, ఈ దేశంలో మద్దతు తెలపటం కూడా తప్పా అంటూ, కర్ణాటక రైతులు వాపోయారు.

Advertisements

Latest Articles

Most Read