దేశమంతా తిరిగి కబురులు చెప్పే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం పట్టు సాధించలేకపోతోంది. సరికదా.. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ముందుకు రావడమే కష్టంగా మారింది. అంతెందుకు ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలే ఇందుకు సుముఖంగా లేరు. ప్రత్యేక హోదా/ప్యాకేజీ ఇవ్వకపోవడం, విభజన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడమే దీనికి కారణం. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో 13 అసెంబ్లీ స్థానాల్లో, నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ పోటీచేసింది. కానీ నాలుగు అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. పదేళ్లు కాంగ్రెస్‌ ఎంపీగా ఉండి.. ఎనిమిదేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి సైతం రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు, విశాఖ నుంచి కంభంపాటి హరిబాబు ఎంపీలుగా విజయం సాధించారు.

bjp 20022019

బీజేపీపై జనాగ్రహంతో పాటు రాష్ట్ర నాయకత్వం శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సుయాత్ర చేపట్టి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఆహ్వానిస్తే కనీసం వంద మంది కూడా రాని దుస్థితి. ఈ పరిస్థితుల్ని అంచనా వేసిన ఎంపీలు హరిబాబు, గంగరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మిపై విశాఖపట్నంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన హరిబాబు ఆ సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ రైల్వే జోన్‌. కేంద్రం ఆ ఊసే ఎత్తడంలేదు. దీనిపై సానుకూల స్పందన కూడా లేకపోవడంతో గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. తప్పక పాల్గొన్నా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గంగరాజుకు నేరుగా అమిత్‌ షాతోనే సత్సంబంధాలున్నాయి. కానీ రాష్ట్ర నాయకత్వంతో సఖ్యత లేని కారణంగా.. ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

bjp 20022019

అంతేగాక.. తన కుమారుడిని వైసీపీలోకి పంపి.. నరసాపురం లోక్‌సభ టికెట్‌ ఖరారుచేయించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పురందేశ్వరి ఈ సారి బీజేపీ తరపున ఎక్కడ పోటీ చేస్తారన్నది తెలియరాలేదు. కానీ ఆమె కుమారుడు హితేశ్‌, భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలే వైసీపీలోకి వెళ్లారు. హితేశ్‌కు ప్రకాశం జిల్లా పరుచూరు అసెంబ్లీ సీటు ఖరారైందని కూడా తెలిసింది. దీనిపై పార్టీలోని ఒక వర్గం అభ్యంతరం చెబుతోంది. కుటుంబ సభ్యులతో కూడా ఓట్లు వేయించుకోలేని వ్యక్తి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చని పార్టీలోకి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరిపోయారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌..ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని సభాముఖంగానే ప్రకటించారు. బీజేఎల్పీ నేతగా ఉన్న విష్ణుకుమార్‌రాజు.. వేరే పార్టీలో చేరి పోటీచేయనున్నట్లు గట్టి ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలింది తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు మాత్రమే. పార్టీ ఆదేశిస్తే పోటీకి ఆయన సంసిద్ధంగానే ఉన్నారు.

 

గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారనే ప్రచారం మంగళవారం రాజకీయవర్గాల్లో నెలకొంది. టీడీపీలో తిరిగి తనకు టిక్కెట్‌ లభించదనే సంకేతాలతో ఆయన వైసీపీలో బెర్త్‌ కోసం పావులు కదుపుతున్నారని ప్రచారం గత కొంతకాలంగా ఉంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంపై మోదుగుల కన్నేశారని, అక్కడ గెలుపు అవకాశాలపై ఇటీవల సర్వే కూడా చేయించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యేందుకు కూడా సిద్ధమయ్యారని తెలిసింది. హైదరాబాద్‌ వెళ్ళి జగన్‌ను కలిశారని.. పార్టీలో కూడా చేరారని ఒక దశలో ప్రసార సాధనాల్లో కథనాలు వచ్చాయి.

ambati 20022019 1

అయితే పలానా సీటు కావాలని మోదుగుల షరతు విధించిన నేపథ్యంలో భేటీ వాయిదా పడినట్లు సమాచారం. తాను లండన్‌ వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత మాట్లాడదామని జగన్‌ దాట వేసినట్లు తెలిసింది. సీటు విషయంలో లభించని హామీతో వైసీపీలో చేరిక వాయిదా పడినట్లు సమాచారం. మోదుగుల సత్తెనపల్లి సీటును అడిగేందుకు జగన్‌ వద్దకు వెళుతున్నట్టు వచ్చిన ప్రచారం నేపథ్యంలో అంబటి రాంబాబు, జిల్లాకు చెందిన ఓ కీలక యువనేతతో కలిసి హుటాహుటీన హైదరాబాద్‌ వెళ్ళారు. ముందుగా పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కలిసి మోదుగులకు సత్తెనపల్లి సీటు ఇవ్వటంపై చర్చించినట్లు తెలిసింది. తొలి నుంచి పార్టీని నమ్ముకొని ఎన్నో వ్యయప్రయాసలు తట్టుకొని పనిచేస్తున్న వారిని హఠాత్తుగా తప్పించి పార్టీలో కొత్తగా చేరేవారికి సీటు ఇవ్వటం తగదని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ambati 20022019 1

ఇప్పటి వరకు టీడీపీలో ఉంటూ జగన్‌పై, వైసీపీపై విమర్శలు చేసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటమే తప్పని, పైగా అతను కోరిన టిక్కెట్టు ఇచ్చేందుకు సన్నద్ధమవటం ఎంత వరకు సబబని బొత్సను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకొని ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేద్దామని కలలు కన్న నేతలను వెన్నుపోటు పొడిచారనే భావన పార్టీ కేడర్‌లో ఉందని బొత్సకు వివరించినట్లు సమాచారం. ఇప్పటికే జంగా కృష్ణమూర్తి(గురజాల), లేళ్ళ అప్పిరెడ్డి (గుంటూరు పశ్చిమ), మర్రి రాజశేఖర్‌ (చిలకలూరిపేట), కత్తెర క్రిస్టియానా (తాడికొండ), కావటి మనోహర్‌నాయుడు (పెదకూరపాడు)లకు అన్యాయం జరిగిందనే భావన నెలకొని ఉందని, ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ అసమ్మతి జ్వాలలు ఆరలేదని బొత్సకు వివరించినట్లు తెలిసింది.

తెలంగాణ లో స్థిరపడ్డ ఆంధ్ర కి చెందిన పారిశ్రామిక వేత్తలను టార్గెట్ గా తెరాస పావులు కదుపుతుంది. అత్యధిక పారిశ్రామిక వేతలు తెలుగు దేశం సింపటైజర్స్ అవ్వగా వారి అందరిపై ఈడీ, ఇన్కమ్ టాక్స్ ఉపయోగించటానికి రంగం సిద్ధం చేసిన తెరాస అధినేత కెసిఆర్. ఈ కోవ లో తెలుగు దేశం వైపు ఉన్న పారిశ్రామిక వేతలని భయభ్రఅంతులకి గురిచేసి వారిని వైస్సార్సీపీ కి సపోర్ట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమయానికి కుల విద్వేషాలు రెచ్చకొట్టటానికి పకడ్బందీ గా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ కోవలో బెదిరించి కొంత మందిని చేర్చుకున్నారు. హైదరబాద్ లో ఉన్న ఆస్థులు, కంపెనీలు కాపాడుకోవటానికి, వారు కేసిఆర్ కు సరెండర్ అవ్వాల్సిన పరిష్తితి.

kr 202022019

అయితే ఇప్పుడు వరుస పెట్టి కేవలం తెలుగు సూపర్ స్టార్ట్ మహేష్ బాబు మీద జరుగుతున్న ఐటి దాడులు చూస్తుంటే, మహేష్ ను కూడా కావాలనే బెదిరిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. మహేష్ బాబు రాజకీయాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. సూపర్ స్టార్ట్ కృష్ణ కాంగ్రెస్ లో ఉన్నా, మహేష్ మాత్రం ఎప్పుడూ ఒక పార్టీకి సపోర్ట్ చేసిన సందర్భం లేదు. అయితే మహేష్ బావ గల్లా జయదేవ్ ని వైసిపీలోకి తేవటానికి, మహేష్ పై ఒత్తిడి తెస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. మహేష్ ఈ ఒత్తిడికి లొంగక పోవటంతో, ఆయన్ను టార్గెట్ చేసుకుని గత కొన్ని రోజులుగా ఐటి దాడులు చేస్తుంది. మొన్నా మధ్య ఐటి దాడులు చేసి హడావిడి చేసారు. అయితే అన్నీ సక్రమంగా ఉన్నాయని మహేష్ చెప్పటంతో అక్కడితో వివాదం సద్దుమణిగింది.

kr 202022019

ఇప్పుడు మళ్ళీ, ఈ రోజు మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్‌ అతిక్రమించిందని వార్తలు వెలువడుతున్నాయి. రూ.100 ఆ పైన టికెట్‌కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్‌పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది. అయితే ఏఎంబీ మాల్‌ తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల వసూలు చేసినట్లు ఆరోపణలు సాకుగా చూపి దాడులు సెహ్సారు. దాంతో థియేటర్‌పై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. తాజాగా వస్తున్న ఆరోపణలపై మహేశ్‌ స్పందించాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ద్రోహం చేసిందని ఆయన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున హామీ ఇచ్చిందని.. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ద్రోహం చేసిందని ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఫిబ్రవరి 20, సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ద్రోహం చేసి ఐదేళ్లు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి ప్రత్యేక హాదాతో సహా మరో 5 హామీలు గాలికి వదిలేసింది. వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకుంది. బీజేపీ చేసిన ఈ నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి’’ అని ట్విట్టర్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.

tweet 20022019

సరిగ్గా నేటికి ఐదేళ్ళ క్రితం... తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమం, అభివృద్ధి ఆగకుండా ముందుకు సాగేందుకు వీలుగా... రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఏపీకి ఆరు హామీలిచ్చారు. ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వం పై ఉంది. అయితే మోడీ ప్రభుత్వం ఆ హామీలను తుంగలో తొక్కింది. ఏపీకి నమ్మక ద్రోహం చేసింది. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి 5 ఏళ్లు అయిన సందర్భంలో తమ నిరసనలు తెలుపుతున్నారు ఏపీ ప్రజలు. నవ్యాంధ్ర ప్రజల తరపున ఒక్కో హామీని గుర్తుచేస్తూ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం.

tweet 20022019

ఇవి ఆ హామీలు: హామీ నెం.1 - ప్రత్యెక హోదా. హామీ నెం.2 - దేశంలోని మరికొన్ని రాష్ట్రాలతో సమానంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు, హామీ నెం.3 - కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, హామీ నెం.4 - పోలవరం ప్రాజెక్టు సహాయ, పునరావాసం సున్నితంగా అమలయ్యేలా చట్టానికి సవరణ, హామీ నెం. 5 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి... అంటే 2014 జూన్ 2 నాటికే సంతృప్తికర రీతిలో ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు -అప్పుల పంపిణీ పూర్తి కావాలి. హామీ నెం.6 - రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది తలెత్తే రెవెన్యూ లోటు భర్తీ. ఇంకా ఎన్నాళ్ళు సాగాలి ఈ పోరాటం? ఒక రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఐదేళ్ళయినా సరిదిద్దక పోగా, మరింత అన్యాయం జరిగేలా రాష్ట్రంపై కుట్రలు చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకోవడం ఎంత దారుణం? ఈ వివక్షను, కక్షను ప్రశ్నిస్తోంది తెలుగుదేశం. సాక్షాత్తూ దేశ ప్రధాని, అత్యున్నత చట్టసభలో ఇచ్చిన హామీలకే విలువ లేకపొతే ఇంకెక్కడి ప్రజాస్వామ్యం? మాజీ ప్రధాని ఇచ్చిన ఆరు హామీలకు నేడు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, వాటిని ఎందుకు నెరవేర్చలేదని ప్రతి నవ్యాంధ్ర పౌరుని తరపున మోడీని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం.

Advertisements

Latest Articles

Most Read