చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతు‌ల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే రీపోలింగ్ అక్కర్లేదని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటు టీడీపీ వద్దంటుండగా.. వైసీపీ నేతలు మాత్రం ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి రీ-పోలింగ్ వివాదంలోకి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దిగినట్లు తెలుస్తోంది. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సూచనల మేరకే సీఈఓ ద్వివేది రీ-పోలింగుకు సిఫార్సు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల ఆరో తేదీన రీ-పోలింగ్ చేయాలంటూ సీఎస్ ఎల్వీని చెవిరెడ్డి కోరారు. చెవిరెడ్డి ఫిర్యాదు పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్ కోరుకుంటున్నారంటూ ద్వివేదికి సీఎస్ ఓఎస్డీ లేఖ రాశారు.

chevi 17052019 3

ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యం స్పష్టంగా కన్పిస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీ-పోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఈవోకు ఫిర్యాదు చేయకుండా సీఎస్ వద్దకు చెవిరెడ్డి ఎందుకెళ్లారని టీడీపీ ప్రశ్నిస్తోంది. తనకు సంబంధం లేని వ్యవహారంలో సీఎస్ జోక్యం ఎందుకు? అని టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఎల్వీ సుబ్రమణ్యం ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

chevi 17052019 3

మరో పక్క, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎలాంటి విచారణ నిర్వహించకపోవడం దారుణమని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరమేంటి..? ఎన్నికలు జరిగిన ఇన్ని రోజులకు రీ పోలింగా..? చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడా ఫిర్యాదులు లేవు.. అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అయితే టీడీపీ అధినేత లేఖకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read