వైసీపీ ఎమ్మెల్యే, రోజా ఆ పార్టీతో, జగన్ తో విసుగెత్తిపోయారాని, పార్టీ అధినేత జగన్‌కు.. రోజాకు మధ్య అంతరం బాగా పెరిగిపోయింది అని... అలాగే జగన్ కూడా, రోజా వ్యవహారం శైలి పార్టీకి చేటు తెస్తోందని అనే అభిప్రాయాని వచ్చారని, దీంతో రోజా వైసీపీని వీడి, పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరుతున్నారు అని వార్తలు వచ్చాయి.

ఈ వార్తతో, జనసేన పార్టీలో కలకలం రేగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో ప్రజలకు సేవ చెయ్యటానికి వస్తుంటే, రోజా లాంటి వ్యవహారం శైలి ఉన్న ఆమెను, పార్టీలోకి తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పవన్ కు చెప్పారు. అంతే కాదు, రోజా మీద "ఐరన్ లెగ్" అనే ముద్ర కూడా ఉంది. చంద్రబాబుతో కలవగానే ఆయన మీద అలిపిరి ఎటాక్ జరిగింది అని, వైఎస్ఆర్ ని కలవగానే, ఆయన ఏకంగా చచ్చిపోయారు అని, జగన్ ను కలవగానే, 16 నెలలు జైల్లో ఉన్నాడు అని, ఇప్పుడు పవన్ తో కలిస్తే ఏమవుతుందో అని, ఆ బ్యాక్ గ్రౌండ్ తలుచుకుని, జనసేన అభిమానాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అయితే, పవన్ నో అన్నాడో ఏమో కాని, ఇవాళ రోజా ప్రెస్ మీట్ పెట్టి, జనసేన ఒక తోక పార్టీ అని, ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదు అని, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని వదిలిపెట్టబోనని రోజా స్పష్టం చెయ్యటంతో, జనసేన అభిమానాలు ఎగిరి గంతేసి, వీకెండ్ మాంచి జోష్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read