దేశ వ్యాప్త లాక్ అవుట్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, హైదరాబద్ లో ఉన్న హాస్టల్స్ అన్నీ నిన్న ఖాళీ చెయ్యాలి అని చెప్పటంతో, వేలాది మంది రోడ్డున పడ్డారు. పోలీస్ దగ్గర NOC తీసుకుని, తమ ఊరికి బయలు దేరారు. నిన్న ఏపి బొర్డర్ లో జరిగిన రచ్చ చూసాం. అటు తెలంగాణా పంపించటంతో , ఇటు వచ్చిన వారిని దాదాపుగా 7 గంటలు పాటు రోడ్డు మీద నిలబెట్టారు. మహిళలు కూడా అర్ధరాత్రి దాకా రోడ్డు మీద ఉన్నారు. అయితే, ఇప్పుడు మీరు వినేది దీనికి భిన్నం. హైదరాబాద్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేస్తున్న, 14 మంది మహిళా ఉద్యోగులు మంగళవారం ఉదయం టెంపో ట్రావెలర్‌లో, కేరళలోని తమ ఇంటికి ప్రయాణం అయ్యారు. డ్రైవర్ తప్ప మిగతా వారంతా అమ్మాయిలే. కారు కోజికోడ్‌కు వెళుతోంది.

కానీ అర్థరాత్రి లాక్డౌన్ ప్రకటించడంతో, వారికి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. కేరళ బొర్డర్ లో చిక్కుకున్నారు. దీంతో, సరిహద్దు వద్ద మిమ్మల్ని దించేస్తానాని, ఇక్కడ నుంచి తమ స్థలానికి క్యాబ్ తీసుకెళ్లాల్సి ఉంటుందని డ్రైవర్ చెప్పాడు. అర్ధరాత్రి వేళ, వారికి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. దేంతో వారు చాలా మంది ఉన్నతాధికారులకు కాల్ చేసారు, కాని ఎవరూ స్పందించలేదు. అప్పటికి, సమయం గడిచిపోయింది. ఇక వేరే మార్గం లేక, వారిలో ఒకరు ముఖ్యమంత్రి ఆఫీస్ కు సహాయం కోసం ఫోన్ చేసారు. అయితే అనూహ్యంగా, ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గొంతు వినిపించింది. ఆయనే స్వయంగా ఫోన్ ఎత్తారు.

జరిగిన విషయం వారికి చెప్పారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాం అని, కేరళ బొర్డర్ లో చిక్కుకున్నాం అని, సహాయం చెయ్యమని కోరగా, ఆయన స్పందించారు. వెంటనే, వయనాడ్ కలెక్టర్ మరియు ఎస్పీకి ఫోన్ చెయ్యమని, వారికి అవసరమైన దిశానిర్దేశం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీల మొబైల్ నంబర్‌ను కూడా సీఎం తెలియజేశారు. ఎస్పీ నుంచి మొదట ఫోన్ వచ్చింది వచ్చింది. ఆయన వేరే వాహనం ఏర్పాటు చేసి, వారికి తగు వైద్య పరీక్షలు జరిపి, వారిని ఇంట్లో దిగబెట్టారు. ఏకంగా సియం ఫోన్ ఎత్తటం, వారి సమస్య పరిష్కారం చెయ్యటంతో, సియం అంటే ఇలా ఉండాలి అంటూ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా గారికపాడు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దేశవ్యాప్త లాక్​డౌన్​తో తెలంగాణలోని ఆంధ్రావాసులు రాష్ట్రానికి తరలివస్తున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుకుంటున్న కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గారికపాడు వద్ద (రాష్ట్ర సరిహద్దు) బుధవారం రాత్రి భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను మధ్యాహ్నం నుంచి పూర్తిగా నిలిపివేయటం వల్ల రాత్రికి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విద్యాసంస్థల మూసివేతతో, హాస్టల్స్ ఖాళీ చెయ్యాలి అని చెప్పటంతో, హైదరాబాద్ నుంచి వస్తున్న విద్యార్థులు.. రాష్ట్ర సరిహద్దు వద్ద తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

అయితే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడింది. తెలంగాణా హాస్టల్స్ ఖాళీ చెయ్యాలి అని చెప్పటంతో, వీరంతా పోలీస్ స్టేషన్ లకు చేరటంతో, వారికి noc ఇచ్చి, తెలంగాణా పోలీసులు పంపించారు. అయితే, ఇక్కడ ఏపి బోర్డర్ లో మాత్రం, వారిని ఆపేసారు. పర్మిషన్ లేదని నిలిపివేశారు. మధ్యానం నుంచి, దాదపుగా వేలాది మంది హైవే పై ఉన్నారు. మూడు కిమీ దాకా, ట్రాఫిక్ ఆగిపోయినట్టు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటి పోవటంతో, ఎట్టకేలకలు తెలంగాణా ప్రభుత్వం స్పందించింది.

హాస్టల్స్ ఖాళీ చెయ్యవద్దు అని, ప్రభుత్వం నుంచే అన్ని హాస్టల్స్, భోజనం పెడతాం అని, హాస్టల్స్ ఖాళీ చెయ్యవద్దు అని కోరారు. మరో పక్క ఏపి వైపు ఎక్కువ మంది రావటానికి ప్రయత్నం చెయ్యటంతో, ఇప్పుడే ఏపి ప్రభుత్వం కూడా స్పందించింది. మంత్రి బొత్సా, తెలంగాణా మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. అయితే, ఇప్పటికే చేయి దాటి పోయింది. చాలా మంది ఏపి బోర్డర్ లో ఉన్నారు. మరి వీరిని, ఎటు పంపిస్తారు ? ఏమి చేస్తారు ? ఇలాంటివి తెలియాల్సి ఉంది. తెలంగాణా ప్రభుత్వం చేసిన పనితో, ఇప్పుడు లాక్ డౌన్ స్పూర్తి పోయినట్టు అయ్యింది. ఇప్పటికైనా, వీరి పై, ఏదో ఒక నిర్ణయం తొందరగా, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంది.

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా దెబ్బకు తల పండిన శాస్త్రవేత్తలు కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టలేని పరిస్థితుల్లో ఇక అందరికీ ఆ దేవుడే దిక్కయ్యాడు. ఎవరో ఒక రూపంలో దేవుడు విరుగుడు మందును కనిపెట్టి, పంపిస్తే తప్పా, కరోనా బారి నుండి బయట పడే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ముందు చూపుతో తీసుకుంటున్న జనతా కర్ఫ్యూ , లాక్ డౌన్ వంటి కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా మేలు చేసేవే. అయితే ఇటువంటి ముందస్తు నిర్ణయాలు మంచిదే అయినప్పటికీ బడుగులకు మాత్రం చీకటి రోజులే. రెక్కాడితే కానీ డొక్కా డనీ దినసరి కూలీలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో నిత్యం రోజువారీ కూలీపనులు చేసే వారితో పాటు రిక్షా, ఆటో కార్మికులు, వివిధ వ్యాపార సంస్థల్లో అనుబంధ కార్మికులుగా సుమారు 80 లక్షల మంది పని చేస్తున్నారు. వారంతా రోజువారీ, వారంతపు కూలీ సొమ్ముపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారే.

వారంలో ఒకటి రెండు రోజులు కూలీ పనులు దొరక్కపోయినా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు లక్షల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు వారాలు లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలెవ్వరూ రోడ్ల మీదకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆయా సంస్థలు ఇంటి నుంచే విధులు నిర్వహించుకునేలా అవకాశం ఇచ్చింది. అయితే రోజువారీ కూలీలకు మాత్రం ఎటువంటి ఆర్థిక వెసులుబాటు లేకపోవటం, పని చేస్తే కాని పూటగడవని ఆ నిరుపేద బడుగుల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. చిరు వ్యాపారులకు.. చీకటి రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులు లక్షల్లో ఉన్నారు.

ప్రతి జిల్లాలోనూ లక్ష నుంచి రెండు లక్షల వరకు రోడ్డు మార్జిన్, హాకర్స్, వీధి చివర్లో ప్రజలకు అందు బాటులో వివిధ రకాల చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వ్యాపారులు న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదివారం నుంచి లాక్ డౌన్ ప్రకటించటంతో వీరంతా వ్యాపారాలకు దూరమై, ఇళ్లకే పరిమితం కావాల్సివచ్చింది. తమ వద్ద ఉన్న కొద్దీ గొప్ప సొమ్ముతో పెట్టుబడి పెట్టి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసి, వచ్చిన ఆదాయంలో కొంత ఇంటి ఖర్చులకు ఉంచుకుని, మిగిలినది మరుసటి రోజు వ్యాపారాని పెట్టుబడిగా పెట్టి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై కరోనా ప్రభావం తీవ్రంగా పడుతోంది. గడిచిన రెండు రోజుల్లోనే వీరు వ్యాపారాలకు దూరం కావటంతో రానున్న 21 రోజుల్లో ఎలా బతకాలి దేవుడా అంటూ వేడుకుంటున్నారు.

కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందు చూపుతో రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేసింది. ఇందులో భాగంగానే రిక్షా, ఆటోలు కూడా రోడెక్కటానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో రిక్షా, ఆటో కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోంది. రోజువారీ వడ్డీల కు డబ్బు అప్పుగా తీసుకుని, పెట్టుబడి పెట్టి, ఆటోలు కొనుగోలు చేసిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆటోలు నిలిపివేయటంతో వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోంది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో వివిధ దినసర కూలీలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఆదుకోవలసిన పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రంలో అన్నపూర్ణ క్యాంటీన్లు ద్వారా పేదలకు అన్నం పెడుతుంటే, మనకు మాత్రం అన్న క్యాంటీన్లు ఎత్తేయటంతో, తిండి తినటానికి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కనీసం వీరిని రెండు పూటలా అన్నం అయినా పెట్టే ఏర్పాటు చెయ్యాలి.

రైతు బజార్ల వద్ద నిబంధనలు అమలుకావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అసహనం వ్యక్తం చేశారు. లాక్​డౌన్ లక్ష్యం నెరవేరడం లేదని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. రైతు బజార్లకు ప్రజలు ఒకేసారి వస్తున్నారని, అందుకే వాటిని వికేంద్రీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో ఇళ్లకు 3 కిలోమీటర్లలోపు రైతు బజార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్యావసర షాపులు ఉదయం 6 నుంచి 1 గంట వరకే తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వల్ల ప్రజలు గుమిగూడకుండా ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

నిత్యావసర ధరలు పెరగడం, బ్లాక్ మార్కెటింగ్ నివారణకు 1902 టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు. ఈ నంబర్​కి ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక వాహనంపై ఒకరు మాత్రమే వెళ్లాలని, నిత్యావసర సరకుల రవాణాకు అవసరమైన హమాలీలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొన్ని ఇబ్బందులున్నా నిబంధనలను పాటించాలని మంత్రి కోరారు.

Advertisements

Latest Articles

Most Read