ఏపి తెలంగాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి నుంచి పడిగాపులు కాసి, సహనం కోల్పాయారు, విద్యార్దులు, ఉద్యోగులు. దాచేపల్లి మండలం, పొందుగుల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల పై రాళ్ళ దాడి చేసారు ప్రజలు. దీంతో పోలీసులు కూడా వారి పై లాఠీచార్జ్ చేసారు. ఈ పరిణామంతో, పొలేసులు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చేతిలో డబ్బులు లేక, ఆకలితో, నిన్నటి నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నమాని ఆవేద వ్యక్తం చేసారు. హైదరాబాద్ లో పంపెసరని, సొంత ఊరికి వెళ్లి, ఎలా గోలా బ్రతుకుతాం అని అంటున్నారు. నిన్నటి నుంచి ఓపిక పట్టిన ప్రజలు, ఈ రోజు సాయంత్రం జగన్ ప్రెస్ మీట్ పెట్టి, ఎక్కడి వారు అక్కడే ఉండాలని, ఇక ఎవరినీ లోపలకు రానివ్వం అని చెప్పటంతో, బొర్డర్ లో ఉన్న ప్రజలు రెచ్చిపోయారు.

నిన్న మధ్యానం నుంచి అక్కడ పడిగాపులు కాసిన వారు, సహనం కోల్పాయారు. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు- ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత మంది పోలీసులకు తలకాయలు పగిలాయి. అలాగే, పోలీసులు చేసిన లాఠీ చార్జ్ తో, ప్రజలకు కూడా గాయాలు అయ్యాయి. నిన్నటి నుంచి ఈ సమస్య పరిష్కారం చెయ్యకుండా, తాత్సారం చేస్తూ రావటంతో, చివరకు పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు మొండి పట్టుదలకు వెళ్ళటంతో, చివరకు పోలీసులు, ప్రజలు కొట్టుకునే దాకా పరిస్థితి వచ్చింది.

చీకటి పడటంతో, లైట్లు లేకపోవటంతో, ఎవరు దాడి చేసారో తెలియని పరిస్థితి. ఇరువురు దాడులు చేసుకోవటంతో, అక్కడ ఉన్న వాహనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఎట్టకేలకు పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు. సరిహద్దులో ముళ్ళ కంచె వేసారు. ఎట్టి పరిస్థితి లోను, లోపలకు వదిలే ప్రసక్తే లేదని, తిరిగి తెలంగాణాకు వెళ్ళిపోవాలని, పోలీసులు అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే, ఎక్కడకి దారి తీస్తుందో చూడాలి. మరోవైపు ఏపీ- తెలంగాణ బార్డర్‌ గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద పరిస్థితి మెరుగైంది.

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్తు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా, ఉండటానికి, స్పాట్ బిల్లింగ్‌ను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెల బిల్లింగ్ కోసం, గత మూడు నెలల సగటు విద్యుత్తు రీడింగ్ వినియోగాన్ని తీసుకుని, మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణలోకి తీసుకోవాలని విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని apspdcl వెబ్​సైట్‌లో ఉంచుతారు. ఈ బిల్లుని, ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. మిగతా రీడింగ్ ను, ఆ తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి నెలా, మీటర్ రీడింగ్ ఆధారంగా విద్యుత్తు వినియోగ ఛార్జీలను సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికి వచ్చి బిల్లు తీస్తూ ఉంటారు. అయితే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా, స్పాట్ బిల్లింగ్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇది ఇలా ఉంటే, రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. మూడు నెలల బడ్జెట్​కు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కరోనా భయాందోళనలు, కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా మొదటి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. మూడు నెలల బడ్జెట్‌కు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. జూన్ 30 వరకు అవసరమైన నిధులకు ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

మరో పక్క, ఉద్యోగ సంఘాలు ఒక రోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించాయి. కొవిడ్‌–19 నివారణా చర్యలకు ఈ మెుత్తాన్ని అందించారు. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి నేతలు లేఖలు సమర్పించారు. ఈ విరాళం రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. సీఎంను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ మీడియా సమావేశం నిర్వహించారు. 2019 ఆదాయపన్నుల రిటర్నులు దాఖలు, ఆధార్-పాన్ లింక్, వివాద్ సే విశ్వాస్ పథకం, మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్​టీ దాఖలు చివరి తేది జూన్ 30 వరుక పొడిగిస్తున్నట్లు ఇదివరకే స్పష్టం చేసిన నిర్మల, ఇప్పుడు పేద వర్గాలకు కొంత ఊరట ఇచ్చే, విషయాలు చెప్పారు. ఆమె ఏమన్నారంటే, "పేదలు, కార్మికులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాం. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ. లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ. నగదు బదిలీ, ఆహార భద్రత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ. వైద్యులకు ప్రత్యేక బీమా... నగదు బదిలీ, ఆహార భద్రత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి..ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ. శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున బీమా. కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు."

"లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ. గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో ఆర్థిక ప్యాకేజీ. లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైనవారిని ఆదుకునేలా ప్యాకేజీ. వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా ప్యాకేజీ. ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం. పేదవాళ్లలో ఒక్కరూ కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం. రానున్న 3 నెలలకు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం పంపిణీ. బియ్యం, గోధుమలో ఏదికావాలన్నా అందిస్తాం. ఇప్పటికే ఇస్తున్న 5 కేజీలను అదనంగా మరో 5 కేజీలు అందిస్తాం. కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తాం. రానున్న 3 నెలలకు కావాల్సిన రేషన్‌ను 2 వాయిదాల్లో తీసుకోవచ్చు. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ. నగదు బదిలీ, ఆహార భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి. శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున బీమా. కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు.

"పీఎం కిసాన్‌ యోజనలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు. దేశవ్యాప్తంగా 8.69 కోట్ల మంది రైతులకు ప్రయోజనం. ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు. 5 కోట్ల కుటుంబాలకు లబ్ది. ప్రతి కార్మికుడికి దీనిద్వారా రూ.2 వేలు అదనంగా చేకూరుతుంది. ఈ మొత్తం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి ఖాతాల్లోకి చేరుతుంది. జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో 3 నెలలపాటు నెలకు రూ.500 చొప్పున జమ. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం. కుటుంబ అవసరాలకు ఈ మొత్తం చేదోడుగా ఉంటుంది. 3 నెలల్లో మూడు గ్యాస్ సిలిండర్లు... కుటుంబ అవసరాలకు ఈ మొత్తం చేదోడుగా ఉంటుంది.ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు 3 గ్యాస్‌ సిలిండర్లు. 3 నెలల్లో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ ద్వారా 8.3 కోట్లమంది లబ్దిదారులకు ప్రయోజనం. 'ఈపీఎఫ్ చందా ప్రభుత్వమే చెల్లిస్తుంది...' రానున్న 3 నెలలకు ఈపీఎఫ్‌ చందా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం కలిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లోకి ప్రభుత్వమే జమ చేస్తుంది. వందమంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. "

"రూ.15 వేలులోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ కేంద్రమే భరిస్తుంది. స్వయం సహాయక బృందాలు... స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు. ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల పరిమితిని రూ.20 లక్షలకు పెంపు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందజేస్తాం. 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ది. కార్మికుల సంక్షేమం... భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రూ.31 వేల కోట్ల నిధి ఇప్పటికే ఉంది. దేశవ్యాప్తంగా 3.5 కోట్లమంది నమోదిత భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఈ ఆపత్కాలంలో వారి అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తాం. 'ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు...' రాష్ట్రాలు డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ను వినియోగించుకోవాలి. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబులతో ఉండకూడదు. " అంటూ నిర్మల ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభా బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరుకు జరిగే అవకాశాలు లేవంటున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాస్తవానికి ఈ నెల27నుంచి ప్రారంభం కావాల్సివుంది. ఈ సమావేశాలను పరిమిత దినాలకు కుదించి నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటన వెలువరించే సందర్భంలో వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే కేంద్రప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ను పాటించాలని ప్రకటించింది. అంతేకాకుండా పార్లమెంటు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసారు. ఈ దశలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది.

ఆ దిశలో ప్రభుత్వం న్యాయనిపుణలుతోను, చట్టసభా వ్యవహా రాల పై అవగాహన వున్న మేథావులతో చర్చలు జరువుతుందంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశం పై వలు పర్యా యాలు సమీక్షా సమావేశాలు నిర్వహించిందంటున్నారు. జగన్ బడ్జెట్ సమావేశాల స్థానంలో ఆర్డినెన్స్ ను తీసుకుని వచ్చే విషయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, ముఖ్య మంత్రి ప్రధాన సలహాదారులు అజేయ్ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డిలతో సమీక్షించినట్లు సమాచారం. గతంలో ఉమ్మడి ఏపిలో ఉండగా, రాష్ట్ర వార్షిక ప్రణాళిక పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసిన విషయం ప్రస్తావనకు వచ్చినట్లు కథనాలు ప్రచారంలో ఉంది.

కరోనా వ్యాపిస్తున్న తరుణంలో కేం ద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలనే వాయిదా వేసింది. ఈ వరిస్థితుల నడుమ అసెంబ్లీని నిర్వహించడం సరికాదని జగన్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండునెలల వ్యయాల కోసం ఆర్డినెన్స్ ను జారీ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైందంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గురువారంగాని, ఆ తరువాత రోజుగాని, క్యాబినెట్ సమావేశం పెట్టి, కీలకమైన ఆర్డినెన్స్ ను జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను 27నకాకుండా నిరవధికంగా రెండు నెలలపాటు వాయిదా వేసే అవకాసం ఉందంటున్నారు. అప్పటికి పూర్తిస్థాయిలో పరిస్థితులు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read