ఈ రోజు ఉదయం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఒక షాకింగ్ న్యూస్ తో నిద్ర లెగిసారు. ఈ వార్త, తెలుగు మీడియాలోనో, జాతీయ మీడియాలోనో వస్తే పట్టించుకునే వారు కాదు కాని, అంతర్జాతీయ మీడియా మొత్తం, ఈ వార్త రాయటం, వాటికి క్రెడిబిలిటీ ఉండటంతో, ఈ వార్త పై ప్రజలు షాక్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద ప్లాంట్ అయిన కియా మోటార్స్ కంపెనీ, పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడుకు వెళ్ళిపోయేందుకు రెడీ అయ్యింది అనేది, ఆ కధనం సారంశం. అయితే ప్రభుత్వం వర్గాలు ఈ వార్తలో నిజం లేదు అని ఖండించాయి. కియా మోటార్స్ వైపు నుంచి మాత్రం, ఇప్పటి వరకు ఎలాంటి ప్రెస్ నోట్ అయితే రాలేదు. ప్రభుత్వం మాత్రం, ఇది తప్పుడు వార్త అని ఖండించింది. అయితే ఈ వార్త మాత్రం, ఏపిలో ప్రకంపనలు రేపింది. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పీపీఏల విషయంలో చేసిన డ్యామేజ్ వల్ల, ఇది కూడా ఏమి అవుతుందో అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇది ఇలా ఉంటే, కియా విషయం లోక్‌సభను కూడా కుదిపేశాయి.

ram 06022020 2

తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఈ విషయాన్ని పార్లిమెంట్ దృష్టికి తీసుకు వచ్చారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయంలో చంద్రబాబు గారు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసారని, అందులో భాగంగా, విశాఖపట్నంలో ఐటి అభివృద్ధి కోసం, మిలీనియం టవర్స్ కట్టారని అన్నారు. అందులో 18 వేల మంది పని చేస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వారికి నోటీసులు ఇచ్చిందని, మార్చ్ 30 లోపు అక్కడ అన్నీ ఖాళీ చెయ్యాలని చెప్పిందని, అక్కడ సచివాలయం ఏర్పాటు చేసే అవకాసం ఉందని చెప్పారు. దీని వల్ల కంపెనీలు అన్నీ, రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా, అనంతపురంలో కియా పరిశ్రమ వచ్చిందని అన్నారు.

ram 06022020 3

అయితే ఈ రోజు, కియా మోటార్స్ కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతుందని, అంతర్జాతీయ మీడియాలో కధనాలు వచ్చాయని, ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదని, అంతర్జాతీయ పెట్టుబడి అయిన కియా, తరలి వెళ్ళిపోతుందని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. అయితే ఈ సందర్భంలో, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, వెనుక ఉన్న అయన, రామ్మోహన్ నాయుడు దగ్గరకు దూసుకొచ్చారు. రామ్మోహన్ మాట్లాడుతూనే అడ్డుకున్నారు. పక్కన ఉన్న మిగతా రాష్ట్ర సభ్యులు, వెళ్ళిపోవాలని సైగ చెయ్యటంతో, వెళ్లినట్టు వెళ్లి, మళ్ళీ రామ్మోహన్ పైకి దూసుకొచ్చారు. ఈ దశలో పక్కన ఉన్న ఇతర రాష్ట్ర ఎంపీలు, చేతులు చూపిస్తూ, ఇదేమి తీరు అంటూ, మాధవ్ పై విరుచుకుపడ్డారు. స్పీకర్ కూడా మాధవ్ చర్యను తప్పుబట్టారు. మాధవ్ తీరు పై, ఇతర ఎంపీలు నోరు వెళ్లబెట్టారు..

వైసీపీ అరాచకాలు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఎనిమిది నెలలుగా, అధికారం మారిన తరువాత, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఒక నెల రోజుల నుంచి, పరిస్థితి అదుపులోకి వచ్చింది అనుకున్న టైంలో, మళ్ళీ మొదలు పెట్టారు. వైసిపి నాయకులు తనను, తన కొడుకును చంపబోయారని మాచర్ల మండలం దండు పెద వెంకయ్య గురువారం ఎన్టీఆర్ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గొ-డ్డ-ళ్ల-తో దాడిచేసి హ-త-మా-ర్చా-ల-ని చూస్తే తన కొడుకు గురవయ్య తప్పించుకున్నాడని, అడ్డుపడ్డ తనను తలపై, భుజంపై గొ-డ్డ-ళ్లతో న-రి-కా-రం-టూ ర-క్త-మో-డు-తు-న్న గాయాలను చూపించారు. ‘‘ఊళ్లో ఉండే పరిస్థితి లేదు, మమ్మల్ని బతకనిచ్చేలా లేరు, టిడిపివాళ్లమని మమ్మల్ని చంపేస్తాం అంటున్నారు. వైసిపి వాళ్ల దాడులు ఆగవాయె, పోలీసులు పలకరాయె, మేమెలా బతకాలయ్యా, నువ్వే ఆదుకోవాలంటూ’’ కన్నీరు మున్నీరు అయ్యారు.

కంభంపాడులో వైసిపి నేతల అరాచకాలపై చంద్రబాబు మండిపడ్డారు. వెంకయ్య కుటుంబానికి పార్టీపరంగా అన్నివిధాలా అండగా ఉంటామని అన్నారు. దీనిపై వెంటనే ఎస్ పికి, డిజికి లేఖలు రాస్తామని చెప్పారు. గతంలో వెల్దుర్తి మండలం గంగలకుంట టిడిపి కార్యకర్తలను వైసిపి నేతలు తప్పుడు కేసులు పెట్టి హింసించిన విషయం ప్రస్తావించారు. బాధితులను అక్రమంగా నిర్బంధించి హింసించిన పోలీసు అధికారులపై కోర్టులే ఆగ్రహించి కేసు పెట్టాలని ఆదేశించిన సంగతి గుర్తు చేశారు. అధికారం అండతో ఇష్టారాజ్యంగా వైసిపి నాయకులు చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, కనీసం చంద్రబాబుకు కూడా మాట్లాడే అవకాసం ఇవ్వరు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగాతి తెలిసిందే. అందుకు కారణంగా, చంద్రబాబు కూడా రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా, తెలుగుదేశం పార్టీ ఎంపీలను మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు వైసీపీ ఎంపీలు. ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం పై గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంట్ లో స్పందించారు. ఈ సందర్భంగా, గత 8 ఏళ్ళుగా, రాష్ట్రానికి, కేంద్రం నుంచి సరైన సహాయం అందటం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎప్పుడు మొండి చెయ్యి చూపుతున్నారని, ఈ సారి బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అని, అయితే ఈ సారి కూడా మా ఆశలు వమ్ము చేసారని గల్లా జయదేవ్, కేంద్రం పై ధ్వజమెత్తారు. తరువాత, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, అలాగే జగన్ మోహన్ రెడ్డి గత 8 నెలలుగా రాష్ట్రంలో సాగిస్తున్న పాలనను దేశం ద్రుష్టికి తీసుకు వచ్చారు.

గత 8 నెలలుగా రాష్ట్రం రివర్స్ లో వెళ్తుందని అన్నారు. విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కు, జగన్ చేస్తున్న పనులతో మరింత నష్టం జరుగుతుందని గల్లా అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ, నిర్ణయం తీసుకున్నారని, అది మూడు రాజధానులు కాదని, మూడు ముక్కల రాజధాని అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసామని చెప్పారని అన్నారు. అలాగే మ్యాప్ లో కూడా అమరావతిని పెట్టారని గుర్తు చేసారు. విభజన చట్టంలో కూడా, ఒక రాజధానికి సహాయం అని ఉంది కాని, మూడు రాజదానులు అని లేదని గల్లా జయదేవ్ అన్నారు. అలాగే కేంద్రం కూడా గతంలో ఒక రాజధానికి అని చెప్పే, 1500 కోట్లు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేసారు.

జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ అని వేసి, గందరగోళ పరుస్తున్నారని అన్నారు. వాటికి అసలు చట్టబద్దత లేదని అన్నారు. ఒక రాజధానికి ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే, మూడు రాజధానులు ఎక్కడ నుంచి ఖర్చు పెడతారు అంటూ గల్లా నిలదీసారు. వివిధ పత్రికల్లో , జాతీయ చానల్స్ లో, జగన్ మోహన్ రెడ్డి ని ఒక తుగ్లక్ అంటూ చెప్తున్నారని అన్నారు. గల్లా ప్రసంగం ఉన్నంత సేపు, వైసీపీ ఎంపీలు, ఆయన ప్రసంగాన్ని అడ్డు చెప్పే ప్రయత్నం చేసారు. గల్లా ప్రసంగం మొదలు కాగానే, వైసీపీ ఎంపీ మాధవ్ వచ్చి, గల్లా వెనుక బెంచ్ లో కూర్చుని అడ్డు తగులుతూ వచ్చారు. ఈ దశలో పలుసార్లు వైసీపీ సభ్యులు గల్లా ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా నందిగం సురేశ్ తదితరులు గల్లా ప్రసంగాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. అయితే గల్లా మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఉదయమే నిద్ర లేవటంతోనే, సోషల్ మీడియాలో ఒక ప్రముఖ వార్తా సంస్థ రాసిన ఆర్టికల్ చూసి, ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడింది. రాయిటర్స్, nasdaq.com లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, exclusive అంటూ కధనాలు రాసాయి అంటే, నమ్మకుండా ఉండలేని పరిస్థితి. ఈ వార్త నిజం కాకూడదు అని కోరుకోవటం తప్ప, చేసేది ఏమి లేని పరిస్థితి. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లోని, అనంతపురం జిల్లాలో, అతి పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తో, 13 వేల కోట్లు పెట్టుబడి పెట్టి, ప్లాంట్ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు, ఎంతో కష్టపడి, అనేక రాయతీలు ఇచ్చి, ఈ పరిశ్రమను, మన రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఎన్నో రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడినా, మన వద్దకు వచ్చి పెట్టుబడి పెట్టింది కియా. అయితే, ఈ రోజు రాయిటర్స్ రాసిన కధనం ప్రకారం, కియా మోటార్స్, మన రాష్ట్రం నుంచి తన ప్లాంట్ ను తరలించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

reauters 06022020 2

ఇప్పటికే అమరావతిని మార్చేస్తున్నారు అనే వార్తతో రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థతిలో, ఇప్పుడు కియా కూడా వెళ్ళిపోతుంది అనే వార్త వింటుంటే, భయం వేస్తుంది. రాయిటర్స్ కధనం ప్రకారం, కియా మోటార్స్, తన 1.1 బిలియన్ డాలర్ల ప్లాంట్ ను, తమిళనాడుకి తరలిస్తున్నారు అని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ ప్రారంభం అయిన, కొన్ని నేలలుకే, కియా ఇలా ఆలోచించే పరిస్థితి వచ్చింది. గతంలో చంద్రబాబు హయంలో ఉన్న విధానాలకు, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న విధానాల కారణంగానే ఇలా ఆలోచిస్తున్నారని, ఆ కధనం సారంశం. మరీ ముఖ్యంగా గతంలో చంద్రబాబు ప్రకటించిన రాయతీలను, ఇప్పటి ప్రభుత్వం, మళ్ళీ సమీక్ష పేరుతొ, చేస్తున్న చర్యలతో, ఈ నిర్ణయం తీసుకునట్టు చెప్తున్నారు.

reauters 06022020 3

తమిళనాడు ప్రభుత్వంతో, కియా చర్చలు జరిపిందని, వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో ఏవో ఇబ్బందులు ఉన్నాయి, అందుకే వారు మాతో ప్రధామిక చర్చలు జరిపారు, వచ్చే వారం కార్యదర్శి స్థాయి సమావేశం ఉంది, అప్పుడు మాకు మరింత స్పష్టత ఉండవచ్చు అని తమిళనాడుకు చెందిన ఒక ఆఫీసర్ చెప్పినట్టు రాయిటర్స్ రాసింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి, గౌతం రెడ్డి, కియాకు ఇచ్చే రాయతీలు, 20 వేల కోట్లు అవుతాయని, అంత అవసరమా అని చెప్పిన సందర్భం కూడా ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. మరో పక్క, కియా ప్రారంభోత్సవంలో, ఎంపీ మాధవ్ అక్కడ కియా అధికారులనే బెదిరించారని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా, ఇంత పెద్ద కంపెనీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా, రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ వార్త నిజం కాకూడదు అని కోరుకోవటం తప్ప, చేసేది ఏమి లేదు.

Advertisements

Latest Articles

Most Read