ఒక పక్క రాష్ట్రంలో పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి అంటూ, అందరూ గగ్గోలు పెడుతూ బాధ పడుతున్నారు. మరో పక్క వాతావరణం కూడా అలాగే ఉంది. ఒక్క కొత్త కంపెనీ వచ్చిన పరిస్థితి లేదు. అయితే ఉన్న కంపెనీలు వెళ్ళిపోవటం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా కియా గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా, రాష్ట్రంలో అలజడి రేగింది. కియా లాంటి పెద్ద కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే బ్రాండ్ ఇమేజ్ పోతుంది అంటూ, అందరూ బాధపడ్డారు. దీంతో, తమ ప్రభుత్వం పై వచ్చిన కధనంతో, డ్యామేజ్ జరుగుతుందని, వెంటనే ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, ప్రెస్ మీట్ పెట్టి, కియా వెళ్ళిపోతుంది అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. అయితే, రాసింది అంతర్జాతీయ మీడియా అయితే, వాళ్ళని ఏమి అనుకుండా, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు పై పడ్డారు బుగ్గన. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితికి కారణం మొత్తం చంద్రబాబే అంటూ, బుగ్గన చాలా పెద్ద లిస్టు చదివారు.

పారిశ్రామిక రాయతీలకు బకాయలు కూడా చంద్రబాబు ఇవ్వలేదని, తాము వచ్చిన తరువాత, రూ.3,500 కోట్లు ఇచ్చాం అని అన్నారు. అలాగే, చంద్రబాబు అనేక బకాయలు పెట్టారని అన్నారు. రంజాన్, సంక్రాంతి తోఫాలు కూడా, మేమే డబ్బులు కట్టాం అని బుగ్గన అన్నారు. వీటి అన్నిటితో పాటు చంద్రబాబు అప్పులు చేసారని అన్నారు. మొత్తానికి చంద్రబాబు హయంలో చేసిన పనులకు కూడా మేమే డబ్బులు ఇచ్చాం అని బుగ్గన చెప్పారు. ఇక తమ ప్రభుత్వం పై, వస్తున్న ప్రాధాన ఆరోపణకు సమాధానం చెప్పారు. జగన ప్రభుత్వం వచ్చిన తరువాత, ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటం లేదని, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బుగ్గన మండి పడ్డారు.

రాష్ట్రంలో కొత్తగా 1250 కంపెనీలు వచ్చాయని, వారికి భూములు కేటాయించామని చెప్పారు. కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ కు రెడీగా ఉన్నయని బుగ్గన అన్నారు. తాము చంద్రబాబు లాగా ప్రచారం చేసుకోమని, సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్తాం అని అన్నారు. అయితే ఇక్కడే బుగ్గన స్టేట్మెంట్ పై, పలు అనుమానాలు వస్తున్నాయి. 1250 కంపెనీలు పెట్టుబడి పెట్టటం అంటే మాములు విషయం కాదు. ఒక్క కంపెనీ కూడా రాలేదు, అదనీ, రిలయన్స్, లూలు, లాంటి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అని విమర్శలు వస్తున్న వేళ, 1250 కొత్త కంపెనీలు వచ్చాయి అంటే, ఎవరికీ నమ్మ బుద్ధి కావటం లేదు. ఇదే విషయం పై, క్లారిటీ ఆడుతున్నారు. 1250 కంపెనీలు వద్దు కాని, కనీసం ఒక 20 కంపెనీలు కొత్తగా వచ్చిన వాటి పేర్లు, వివరాలు చెప్పమని కోరుతున్నారు. మరి బుగ్గన గారు, ఏదో చెప్పాలని అలా చెప్పారా, లేక నిజంగానే అన్ని కంపెనీలు వచ్చాయా అనేది, ఆయనే చెప్పాలి మరి.

కియా కంపెనీ అఫెక్ట్ తో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లైన్ లోకి వచ్చింది. కియా కంపెనీ వెళ్ళిపోతుంది అంటూ వచ్చిన వార్తల పై, పార్లమెంట్ లో గళమెత్తారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. కియా కంపెనీని చంద్రబాబు ఎంతో కష్టపడి తెస్తే, ఇప్పుడు అది వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళిపోతుంది అని, ఇది రాష్ట్ర సమస్య కాదని, ఇది జాతీయ సమస్య అని, ఇది అంతర్జాతీయ పెట్టుబడి అని, అందుకే కేంద్రం జోక్యం చేసుకోవాలి అంటూ, రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో లేవనెత్తారు. అయితే, రామ్మోహన్ మాట్లాడిన తరువాత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆరోపణలు ఖండించారు. కియా మోటార్స్ ఎక్కడికీ తరలి వెళ్ళటం లేదని, తాను మాట్లాడానని, తరువాతే ఈ విషయం చెప్తున్నా అని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, తరువాత మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలతో, అవాక్కయ్యారు అక్కడ ఎంపీలు. ఎంపీలు మాత్రమే కాదు, మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలకు, టీవీలు చూస్తున్న వార్కు కూడా అవాక్కయారు.

"చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ పేరుతో డమ్మీ కంపెనీ రూ. 30 కోట్ల పెట్టుబడికి.. రూ. వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చింది. దీని గురించి ప్రశ్నిస్తే.. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తోంది." అంటూ మిథున్ రెడ్డి అన్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అనేది ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ అని అందరికీ తెలిసిందే. ఇలాంటి కంపెనీని పట్టుకుని, ఒక డమ్మీ కంపెనీ అంటూ, ఏకంగా భారత పార్లమెంట్ లో వ్యాఖ్యానించటం, అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ట్విట్టర్ లో ఒక వ్యక్తీ, మిథున్ రెడ్డి వ్యాఖ్యల పై ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ను వివరణ అడగగా, వారు ట్విట్టర్ లో స్పందించారు. "Hi! We've been serving investors in India for over two decades and you may kindly visit our website to know more about us. Thanks. http://bit.ly/3bkIMYe" అంటూ ట్వీట్ చేసారు.

ఫ్రాంక్లిన్ రిసోర్సెస్ ఇంక్. ఒక అమెరికన్ హోల్డింగ్ సంస్థ, దాని అనుబంధ సంస్థలతో కలిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని పిలుస్తారు; ఇది న్యూయార్క్ నగరంలో 1947 లో ఫ్రాంక్లిన్ డిస్ట్రిబ్యూటర్స్, ఇంక్ గా స్థాపించబడిన ఒక ప్రపంచ పెట్టుబడి సంస్థ. ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో టిక్కర్ చిహ్నం BEN క్రింద జాబితా చేయబడింది, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గౌరవార్థం, కంపెనీ పేరు, మరియు ఎవరు? వ్యవస్థాపకుడు రూపెర్ట్ జాన్సన్, సీనియర్ చేత ఆరాధించబడింది 1973 లో కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నుండి కాలిఫోర్నియాలోని శాన్ మాటియోకు మారింది. మార్చి 2017 నాటికి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్, ప్రొఫెషనల్ మరియు సంస్థాగత పెట్టుబడిదారుల తరపున US $ 740 బిలియన్ల ఆస్తులను అండర్ మేనేజ్‌మెంట్ (AUM) కలిగి ఉంది

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, చంద్రబాబు హయంలో ఆక్టివ్ గా, పని చేస్తూ, చంద్రబాబుకి సహకరించిన సీనియర్ ఐఏఎస్ ల పై ప్రభుత్వం కక్ష తీర్చుకుంది అనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంటలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావుకి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగే 48 మంది డీఎస్పీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ పరిస్థితిలో, ఐఏఎస్ లు కూడా టార్గెట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు సిఈఓగా పని చేస్తున్న జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారం పై కూడా ఇలాగే విమర్శలు వచ్చాయి. కృష్ణ కిషోర్ తాను, తన మాతృ సంస్థకు వెళ్ళిపోతాను అని, కేంద్రానికి వెళ్లిపోవటానికి తనను రిలీవ్ చెయ్యాలని కోరగా, అతనిని రిలీవ్ చెయ్యకుండా, చివరకు అతను అవినీతి చేసారు అంటూ కేసులు పెట్టారు. రాత్రికి రాత్రి ఎంక్వయిరీ వేసారు. ఎంక్వయిరీ అయ్యే వరకు రిలీవ్ చెయ్యం అని చెప్పారు. అయితే ఈ విషయం పై కృష్ణ కిశోరే క్యాట్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసారు. ఈ విషయం ఇంకా విచారణలో ఉంది.

విచారణ జరుగుతున్న సందర్భంలో, క్యాట్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, ఇలా ఒక అధికారి పై ఎందుకు కక్ష గట్టింది అంటూ మొదటి సారి జరిగిన విచారణలో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక అలాగే, రెండో సారి విచారణలో, తాము జాస్తి కృష్ణ కిషోర్ కి, జీతం ఇవ్వమని చెప్పినా ఎందుకు ఇవ్వలేదు అంటూ ఫైర్ అయ్యారు. చీఫ్ సెక్రటరీ వచ్చి మాకు సమాధానం చెప్పాలి అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది ట్రిబ్యునల్. దీంతో వెంటనే గంటలోనే జీతం ఇచ్చిన ఏపి అధికారులు, ఈ విషయం పై ట్రిబ్యునల్ కు చెప్పటంతో, అయినా ట్రిబ్యునల్ శాంతించలేదు. జీతం ఎందుకు లేట్ అయ్యిందో చెప్పాలని, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఇంత ఇదిగా ఈ కేసు నడుస్తున్న టైంలో, ఇప్పుడు ఒక నివేదిక వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు, గత మూడేళ్లలో ఖర్చు పెట్టిన ఖర్చు వివరాలు, అలాగే చేసిన నియమకాలు అన్ని నిబంధనలు ప్రకారమే ఉన్నాయని, ఆడిట్‌ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి, ఒక పత్రికలో వచ్చిన వార్త, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రయాణ, ప్రకటన, వసతి, స్టేషనరీ ఖర్చులు, జీతభత్యాల చెల్లింపు తదితరాల్లో నిబంధనల మేరకే నిధులు ఖర్చు చేశారని ఆ నివేదికలో ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ నివేదిక రావటంతో, ఈ కేసు మొత్తంలోనే ట్విస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ నివేదిక ప్రకారం, ప్రభుత్వ ఆరోపిస్తున్నట్టు, కృష్ణ కిషోర్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు అనే విషయం అర్ధమవుతుంది. మరి ఈ విషయం పై, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

జగన్ మొహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, తనకు వారం వారం కోర్ట్ నుంచి వ్యక్తగత మినహాయింపు ఇవ్వాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా హైకోర్ట్ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. అయితే సిబిఐ తరుపున న్యాయవాది స్పందిస్తూ, తమ వైపు నుంచి కౌంటర్ వెయ్యటానికి, తమకు మరి కొంత సమయం కావాలని, హైకోర్ట్ ని కోరారు. దీంతో ఈ కేసు విచారణ ఈ రోజు ఏమి తేలకుండానే వచ్చే నెల 12కు వాయిదా పడింది. ఈ నేపధ్యంలో, కోర్ట్ ఏమి రిలీఫ్ ఇవ్వక పోవటంతో, రేపు జగన్ మొహన్ రెడ్డి శుక్రవారం కావటంతో, కోర్ట్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు జగన్ మోహన్ రెడ్డి, ఈడీ కేసుల వ్యవహారంలో, ఆయన రేపు కోర్ట్ కు హాజరు అవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి రేపు నాంపల్లి సిబిఐ కోర్ట్ కు వస్తున్న విషయాన్ని, తెలంగాణా పోలీసులకు, ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్పినట్టు సమాచారం వస్తుంది. ఈ నేపధ్యంలో, రేపు జగన్ మోహన్ రెడ్డి, నాంపల్లి సిబిఐ కోర్ట్ కు హాజరు కానుకున్నారు అని అర్ధం అవుతుంది.

పోయిన శుక్రవారమే జగన్ మోహన్ రెడ్డి, తప్పని సరిగా కోర్ట్ కు హాజరు కావాలని, కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే, కోర్ట్ లో జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాదులు అబ్సెంట్ పిటీషన్ వెయ్యటంతో, న్యాయమూర్తి ఆ ఒక్క రోజుకు ఒప్పుకున్నారు. ఈ నేపధ్యంలోనే రేపు శుక్రవారం కావటంతో, అటు హైకోర్ట్ లో కూడా రిలీఫ్ రాక పోవటంతో, జగన్ మోహన్ రెడ్డి, తప్పని పరిస్థితిలో కోర్ట్ కు హాజరు అవుతున్నారు. అయితే, రేపు సిబిఐ కోర్ట్ జడ్జి సెలవులో ఉంటారని సమాచారం ఉన్నా, జగన్ హాజరు తప్పని సరి కావటంతో, ఆయన రేపు విచారణకు వెళ్తున్నారని సమాచారం వచ్చింది. ఈ నేపధ్యంలోనే, నాంపల్లి సిబిఐ కోర్ట్ ప్రాంగణంలో, భద్రతా ఏర్పాట్లు చూడాలని, ఏపి అధికారులు, తెలంగాణా అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి అటు సిబిఐ విచారణకు, ఇటు ఈడీ కేసుల విచారణకు తాను శుక్రవారం శుక్రవారం రాలేను అని, తనకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నాయని, తన తరుపున, సహా నిందితుడు వస్తారని, కోర్ట్ కు తెలిపారు. అయితే సిబిఐ కోర్ట్ లో, అటు సిబిఐ విచారణ, ఇటు ఈడీ విచారణ గురించి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరినా, సిబిఐ కోర్ట్ తోసిపుచ్చింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా హైకోర్ట్ కు, తనకు విచారణ మినహాయింపు ఇవ్వాలని కోరారు. సిబిఐ కోర్ట్ ఇప్పటికే ఈ పిటీషన్ ను రెండు సార్లు కొట్టేసింది. అదే విధంగా హైకోర్ట్ కూడా ఇప్పటికే ఒకసారి కొట్టేసింది. ఇది రెండో సారి. అయితే జగన్ పిటీషన్ పై, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి ఆదేశాలు ఇచ్చింది కోర్ట్. ఈ విషయం పై ఇంకా సమయం కావాలి అని సిబిఐ కోరటంతో, విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది హైకోర్టు .

Advertisements

Latest Articles

Most Read