రాజధాని విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిపై రైతుల నుంచి అభ్యంత రాలు స్వీకరించే గడువును తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పెంచుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అభ్యంతరాల స్వీకరణను 17వ తేదీవరకు కొనసాగించి, 20న జరిగే కేబినెట్, అసెంబ్లీ సమావేశాలు రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం గైకొంటుం దని భావిస్తున్న తరుణంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం గత 30 రోజులుగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు రైతులు ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. ఇప్పటికే రైతులు దాఖలు చేసిన పలు పిటిషన్లను పరిగణనలోకి తీసుకొన్న ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది.

crda 18012020 2

ఈ నేప థ్యంలో రాజధానిపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్ డీఏ) కోరింది. అందుకుగాను 14వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో సీఆర్ డీఏ వెబ్ సైట్లో లేదా స్వయంగా అభ్యంతరాలు తెలియ జేయవచ్చని సూచించింది. పండుగ సెలవు దినాలు కావ టం, అభ్యంతరాలు తెలిపేందుకు కేవలం మూడు రోజులే గడువు ఇవ్వటంతో ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ రాజ ధాని ప్రాంతానికి చెందిన న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్ బాబు, పారా కిషోర్లు రైతుల తరుపున ఒక రిట్, మరొక పిల్ దాఖలు చేశారు. వీటిపై వాదించేందుకు ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హైకోర్టుకు వచ్చారు.

crda 18012020 3

హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరిట్, పిల్లను లంచ్ మోషన్లో విచారణకు స్వీకరించింది. సీఆర్‌డీఏ రైతుల అభ్యంతరాలను ఏ అంశంపై అడిగింది స్పష్టం చేయలేదని, అభ్యంతరాలు కోరుతున్నట్లు ఒక ప్రకటన మాత్రమే వెలువడిందని, కేవలం మూడు రోజుల వ్యవధిలో, అభ్యంత రాలు దాఖలు చేయటం ఎలా సాధ్యం అవుతుందని, ఈ స్థితి లో గడువు పెంచాల్సిందిగా పిటీషనర్ తరపు న్యాయవాధు లు న్యాయమూర్తులను అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు కేసు విచారణను 20వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన దగ్గర నుంచి, గత నాలుగు రోజులుగా, రాజధాని అమరావతి గ్రామాల్లో, పోలీసులు హడావిడి తగ్గింది. ప్రజలు, నాయకులు స్వేచ్చగా నిరసన తెలపటం, రోజు వారీ కార్యక్రమాలు చెయ్యటం, అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి అనుకున్న టైంలో, మరోసారి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు మరోసారి రాజధాని రైతులకు పోలీసులు షాక్ ఇచ్చారు. మీడియాలో అసెంబ్లీ ముట్టడితో పాటు జైల్‌భరో, గుంటూరు కలెక్టరేట్‌ ముట్టడి అంటూ వచ్చిన ప్రకటనల ఆధారంగా, పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. రైతులతో పాటుగా, నాయకులకు కూడా నోటీసులు ఇచ్చారు. సీపీఐ సీనియర్‌ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంటున్న తెలుగు దేశం నేతలకు నోటీసులు అందాయి. అందరూ పోలీసులకు సహకరించాలి, నిబంధనలు అతిక్రమిస్తే, చర్యలు ఉంటాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 149 కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ రోజు ఉదయం, పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు.

notice 18012020 2

ఇక మరో పక్క, నిన్న హైకోర్ట్ పోలీసులు, ప్రభుత్వం తీరు పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో 1-4-4 సెక్షన్ అమలుపైన రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో పోలీసులు భారీస్థాయిలో క-వా-తు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించింది. మగ పోలీసులు మహిళలతో వ్యవహరించిన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 1-4-4, పోలీసు యాక్టు 3-0 అమలు చేయడంపై అమరావతి రైతులు, మహిళలు, న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ ముగిసింది. దీనిపై అడ్వకేట్ జనరల్ దాదావు గంటపాటు వాదనలు వినిపించారు. 2014 నుంచి రాజధాని అమరావతిలో 1-4-4 సెక్షన్ ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. రాజధాని గ్రామాల్లో పోలీసులు విధించిన ఆంక్షలపైన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన కోర్టులో విచారణ ముగిసింది.

notice 18012020 3

దీనికి అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. గతంలోనే ఈ సెక్షన్‌ను అమలు చేశారనీ, ప్రస్తుతం పొడిగింపు మాత్రమే జరిగిందన్నారు. శాంతి భద్రతల సమ స్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశ్యంతోనే రైతులను అడ్డుకున్నట్లు ఎజి వివరించారు. రాజధాని ప్రాంతంలో 1-4-4 సెక్షన్ అమలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 610 మం దిపై కేసులు పెట్టడంపైనా న్యాయమూర్తులు ఎజిని వివరణ అడిగారు. ఇదే సమయంలో కోర్టు పోలీసుల తీరుపై వచ్చిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన ఫోటోలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. 610 మందిపైన కేసులు పెట్టడానికి గత కారణాలను ఎజి చెప్పుకొచ్చారు. రాజధానిలో పోలీసులు భారీస్థాయిలో క-వా-తు ఎందుకు నిర్వహించారనీ, మందడంతో మహిళను పోలీసులు బూ-టు కాలుతో ఎందుకు త-న్నా-రం-టూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆం-దోళనలో మహిళల నోరు ఎందుకు నొక్కారంటూ న్యాయమూర్తి ఎజిని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటన చెయ్యటం, తరువాత దాని పై రాష్ట్రమంతా పెద్ద రగడ అవ్వటం, గత 30 రోజులుగా రైతులు ఆందోళన చెయ్యటం, మహిళల పై కూడా కర్కశంగా ప్రవర్తించటం, ఇలా ఏపి రాష్ట్రం, ఈ రాజధాని విషయంలో, అల్లకల్లోలంగా ఉంది. అయితే ఇదే విషయం పై తెలంగాణా మంత్రి, కేసీఆర్ కొడుకు, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి, తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణాలో ఉన్న 10 జిల్లాలను, 33 జిల్లాలుగా మేము విభజన చేసామని అన్నారు. ఇది సాహసోపేత నిర్ణయం అని, కొత్త జిల్లాల ఏర్పాటు చేసే సమయంలో కాని, తరువాత కాని, తెలంగాణా రాష్ట్రంలో రవ్వంత కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదని, కేటీఆర్ అన్నారు. అయితే ఇదే సందర్బంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం, ఒక రాజధాని నుంచి, మూడు రాజధానులు చేసే క్రమంలో, తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఇలా ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుందో, అక్కడ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

ktr 17012020 3

తెలంగాణాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల సందర్భంగా, కేటీఆర్ శుక్రవారం నాడు, మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో పరిస్థితులు, ప్రతిపక్షాల ఆరోపణల పై స్పందిస్తూనే, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గొడవ పై స్పందిన్కాహారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసిన తరువాత, 29 గ్రామాల రైతులకు మద్దతుగా రాష్ట్రమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణాలో ఇలా జరగలేదని, 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయని, ఎక్కడా చిన్న ప్రజా వ్యతిరేకత లేకుండా చేసామని, కేసీఆర్ సక్సెస్‌ఫుల్‌గా పరిపాలన సాగిస్తున్నారని కేటీఆర్ అన్నారు. అయితే ఇదే సందర్భంలో అక్కడ ప్రజా ఉద్యమం ఎందుకు వచ్చిందో ఆలోచించాలి అని కేటీఆర్ అన్నారు.

ktr 17012020 2

అంటే, ఈ విషయం డీల్ చేసే విషయంలో, జగన్ విఫలమయ్యారనే రీతిలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో కేసీఆర్ అందరినీ ఒప్పించి సక్సెస్ అయ్యారని, కాని ఏపిలో ప్రజా వ్యతిరేకత వచ్చింది అంటే, ఇది ప్రభుత్వం వైఫల్యం అనే రీతిలో కేటీఆర్ వ్యాఖ్యలు చేసారు. మరో పక్క, జనసేన, బీజేపీ కలిసి, ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్న విషయం పై, కూడా కేటీఆర్ స్పందించారు. వారి పొత్తు పై ఇప్పుడే ఏమి స్పందించలేమని అన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పొత్తు పెట్టుకుంటే, తాను ఏమి చేస్తానని, ఆ విషయాన్ని ఏపీ ప్రజలు చూసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనసేన అంతర్జాతీయ పార్టీ కూడా కావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. అయినా పక్క రాష్ట్రంలో పవన్ ఏమి చేస్తే మనకు ఎందుకు అని అన్నారు.

మూడు రాజధానుల పై, బోస్టన కమిటీ, జీఎన్ రావు కమిటీ నివేదికల పై ఏర్పాటు అయిన, హైపవర్‌ కమిటీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తాము తయారు చేసిన హై పవర్ కమిటీ నివేదికను జగన్ మోహన్ రెడ్డికి అందచేసినట్టు చెప్పారు. రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో, ఈ నివేదిక పై చర్చిస్తామని చెప్పారు. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపధ్యంలో, ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఉద్యమం పై, వారి అభ్యంతరాల పై, జగన్ దృష్టికి తీసుకు వెళ్ళమని, అమరావతి రైతులకు న్యాయం జరిగేలా చూడమని, జగన్ చెప్పారని, బొత్సా అన్నారు. అలాగే సీఆర్డీఏ చట్టం రద్దు గురించి వార్తలు వస్తున్నాయి కదా, ఇది నిజమేనా అని మీడియా ప్రశ్నించగా. సీఆర్డీఏ చట్టం రద్దు విషయం, అసలు తమ ద్రుష్టిలో లేదని బొత్సా అన్నారు. అలాగే, తమ హైపవర్‌ కమిటీ ఈమెయిల్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని బొత్స ఆరోపించారు.

botsa 17012020 2

కొంత మంది అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమను కలిసారని, వారి సమస్యలు చెప్పారని బొత్సా చెప్పారు. ఇక అన్నిటికంటే కీలకమైన విషయం, గత రెండు రోజులుగా చర్చలో ఉన్న విషయం, అమరావతి పై ఐఐటీ మద్రాస్ నివేదిక. ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన ఐఐటీ మద్రాస్ నివేదిక తప్పు అని, ఐఐటీ మద్రాస్ చెప్పటంతో, ప్రభుత్వం కూడా ఈ రిపోర్ట్ గురించి చెప్తూ ఉండటంతో, అసలు ఐఐటీ మద్రాస్ నివేదిక అనేది లేదని, ఇది ఫేక్ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయం పై ఈ రోజు విలేఖరులు, బొత్సాని అడిగారు. మీరు చెప్తున్న ఐఐటీ మద్రాస్ నివేదిక ఫేక్ కదా అంటే, అని బొత్సాని అడగగా, మంత్రి బొత్సా ఈ విషయం పై, ఎక్కడా నెరుగా సమాధానం చెప్పకుండా, తప్పించుకున్నారు.

botsa 17012020 3

"కావాలంటే మీరు కూడా చెన్నై ఐఐటీకి మెయిల్‌ పెట్టుకోండి. మేం చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా? శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక కూడా అబద్ధమేనా?’ అంటూ మీడియా ప్రతినిధులను ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై తానేం మాట్లాడగలను? " అంటూ ఎదురు మీడియానే ప్రశ్నించి, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. అలాగే ఒక విలేఖరి, అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్నించగా, దాని పై బొత్సా ఫైర్ అయ్యారు. ఇదే విషయాన్ని మీరు ఎప్పుడైనా, చంద్రబాబుని అడిగారా? అంటూ ఎదురు వారి పైనే చిందులు వేసారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు, బొత్సా ఇబ్బంది పడుతూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి, ఏది నిజమో, ఏది కాదో కూడా తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది.

Advertisements

Latest Articles

Most Read