శాసనమండలిలో నిన్న అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను, శాసనసభలో ప్రవేశపెట్టేందుకు, వైసీపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. శాసనమండలి ప్రారంభం కాగానే, మండలి చైర్మెన్ ఈ రెండు బిల్లుల పై అనౌన్స్ చేసారు. అయితే దాని కంటే, ముందుగానే, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, లెగిసి, రూల్ 71 కింద నోటీసు ఇచ్చి, చర్చకు పట్టు పట్టారు. ఆ నోటీస్ మీద ఓటింగ్ జరగాలి అని పట్టు పట్టారు. దీంతో మండలి స్పీకర్ షరీఫ్ ఆ నోటీస్ కు అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరూ అంటూ, అడగటంతో, తెలుగుదేశం సభ్యులు అందరూ నోటీస్ కి అనుకూలంగా చెప్పటం, 20 మంది కంటే, ఎక్కువ సభ్యులు ఒప్పుకోవటంతో, ఈ నోటీస్ స్వీకరిస్తున్నామని మండలి చైర్మెన్ చెప్పారు. అయితే ముందుగా బిల్లులు ప్రవేశ పెట్టాలని, తరువాత ఏదైనా అని మంత్రి బుగ్గన పట్టు పట్టారు. రూల్ 71 కింద ఇచ్చిన నోటీసు పై చర్చ జరపవద్దు అంటూ ప్రభుత్వం తరుపున కోరారు. అయితే, ఈ సందర్భంలో, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మంత్రి బుగ్గన మధ్య వాదనలు జరిగాయి.

council 21012020 2

అయితే, బిల్లులు ప్రవేశపెట్టటానికి అవకాశం లేదు, నోటీస్ మీద చర్చ జరగాలి అని యనమల పట్టు బట్టారు. అయితే, ఈ సందర్భంలో, బొత్సా స్పందిస్తూ, యనమల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో, గందరగోళం నెలకొంది. అయితే ఇదే సందర్భంలో, మండలి పై బొత్సా చేసిన వ్యాఖ్యలు యనమల సభ దృష్టికి తీసుకు వచ్చారు. శాసన మండలిలో బిల్ పాస్ కాక పొతే, శాసనమండలి బయట, లోపల ఏమి జరుగుతుందో చూస్తారు అంటూ బొత్సా చేసిన వ్యాఖ్యలు, సభ గౌరవాన్ని కించ పరిచేలా ఉన్నాయని, బొత్సా పై చర్యలు తీసుకువాలని కోరటంతో, ఇరు వర్గాలు వాదనలకు దిగాయి. బొత్సా క్షమాపణ చెప్పి, బిల్లులు ప్రవేశ పెట్టాలని కోరారు. అయితే, ఇదే విషయం పై, సభలో చర్చ జరుగుతుంది.

council 21012020 3

ముందుగా, ఏది చెప్పట్టాలి అనే విషయం పై, చైర్మెన్ కూడా, చర్చలు జరుపుతున్నారు. అయితే తెలుగుదేశం వ్యూహంతో ఖంగుతిన్న ప్రభుత్వం, వెంటనే లైవ్ ప్రసారాలు నిలిపివేసింది. అయితే లైవ్ ప్రసారాలు నిలిచి పోవటానికి, సాంకేతిక కారణాలు సాకుగా, అధికారులు చెప్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం, ఈ చర్యను తప్పు పడుతున్నాయి. లైవ్ ప్రసారాలు ఆపేసి, లోపలా ఏమి జరుగుతుందో తెలియకుండా, ప్రభుత్వం , ప్రతిపక్షాలు ఏమి చెప్తున్నారో ప్రజలు చూడకుండా చెయ్యటం అన్యాయం అని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నా, ఇప్పటి వరకు , 11 గంటల వరకు అయితే, శాసన మండలి లైవ్ ఇవ్వలేదు. విభజన నాటి సమయంలో, ఆ నాటి ప్రభుత్వం కూడా, పార్లమెంట్ లో ఇలాగే చేసిందని, గుర్తు చేస్తున్నారు.

అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో సీఎం జగన్‌ మాట్లాడుతుండగా తెదేపా సభ్యులు పోడియం వద్దకు వచ్చి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సీఎం జగన్‌ స్పందిస్తూ ఉద్దేశపూర్వకంగానే తెదేపా సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని.. ఆ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సూచించారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన లేచి సస్పెండ్‌ చేయాల్సిన సభ్యుల పేర్లు చదివి వినిపించారు. అనంతరం స్పీకర్‌ సభ నుంచి తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకి మాట్లాడే అవకాసం ఇవ్వకుండా, పదే పదే అడ్డు పడుతూ, గంటన్నర మాట్లాడారు అంటూ అసత్యాలు చెప్పినందుకు, టిడిపి ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే, వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చెయ్యటంతో, అసెంబ్లీ లాబీల్లో నేల పైన కూర్చుని, చంద్రబాబుతో సహా నిరసన.

suspend 20012020 2

నేల పైన కూర్చుని నిరసన తెలుపుతున్న చంద్రబాబు సహా, టిడిపి ఎమ్మెల్యేలు. ఇక్కడ ఉండ కూడదు అని లాగేసిన మార్షల్స్. టిడిఎల్పీ నుంచి కూడా వెళ్ళిపోవాలని, మార్షల్స్ దౌర్జన్యం. దీంతో బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు. సియం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేట్ వద్దకు బయల్దేరిన టీడీపీ శాసనసభ్యుల బృందం. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా చంద్రబాబు మౌనదీక్ష. శాసనసభ ప్రధానద్వారం వద్ద ఒక్కడే మెడలో నల్లకండువతో చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్లేలను నిరంకుశంగా సభనుంచి సస్పెండ్ చేయడంపై చంద్రబాబు నిరసన. సస్పెండ్ అయినా సభ్యులకు సంఘీభావంగా మెట్లపై చంద్రబాబు బైఠాయింపు. ఇరవై నిముషాలుగా చంద్రబాబు బైఠాయింపు.

suspend 20012020 13

అంతకు ముందు చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ను చేతులు జోడించి వేడుకున్నారు. ‘‘అమరావతిని ఆపేశారు. పెట్టుబడులు తరలిపోతున్నాయి. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ పెరిగింది. చిన్నవాడైనా ముఖ్యమంత్రికి రెండు చేతలెత్తి దండం పెడుతున్నా. రాజధానులపై పునరాలోచన చేయండి. తొందరపడొద్దు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదు. కడపకిచ్చినట్లు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా నిధులు ఇస్తే మరింత సంతోషిస్తా. అంతే తప్ప రాజకీయంగా వెళితే మీకూ, రాష్ట్రానికి నష్టం. భూములిచ్చిన రైతులు గురించి ఆలోచించండి’’ అని చంద్రబాబు అన్నారు.

అమరావతిని నిర్వీర్యం చేస్తూ, మూడు రాజధానులు అంటూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. 33 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా, అటు వైపు కూడా చూడని ప్రభుత్వం, అలాగే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, రైతులు వైపు కూడా చూడలేదు. ఈ రోజు కూడా రైతులు కాళ్ళు చేతులు విరిగేలా, ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కూడా చేసారు. అయితే, ఇదే విషయం పై ఈ రోజు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఈ బిల్లు పై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించటం, మా అదృష్టమని, జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయం, అమరావతికి దక్కిన గౌరవమని అన్నారు. అంతే కాదు, విజయవాడ, గుంటూరు ప్రజలు అమెరికా కి వెళ్ళి డాలర్లు సంపాదించుకుంటున్నారు, ఇక్కడ సమస్య లేదు, మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఇలాగే వలస వెళ్ళి డాలర్లు సంపాదించుకోవాలి, అందుకే పరిపాలన వికేంద్రీకరణ అంటూ చెప్పుకొచ్చారు.

rk 20012020 2

గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్నే ప్రజల ముందుంచాం. అలాంటప్పుడు సెక్రటేరియట్‌ ఎక్కడుంటే ఏమిటి? హైకోర్టు ఎక్కడుంటే ఏమిటి? నెల రోజుల నుంచి చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బయటపడుతోందనని భయపడుతున్నారు. ఆయన బినామీలను కాపాడుకోవడానికే ఈ ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ప్రజలు రాకపోవడంతో బయట నుంచి తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు’’ అని ఆళ్ల ఆరోపించారు. అయితే ఆళ్ళ ఇలా మాట్లాడటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఒక పక్క ఇక్కడ 29 గ్రామాల ప్రజలు, రోడ్డున పడి రోదిస్తుంటే, ప్రజలకు సంబంధం లేకుండా, స్థానిక ఎమ్మెల్యే మాత్రం, అమరావతిలో అసెంబ్లీ మాత్రమే ఉండటాన్ని, ఇది ఈ ప్రాంత ప్రజలు అదృష్టం అని అంటున్నారు.

rk 20012020 3

మరో పక్క, ఏపీ భవిష్యత్తును సర్వనాశనం చేసే ఈ బిల్లుపై మాట్లాడేందుకు చాలా బాధగా ఉందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. గత నెల రోజులుగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తోందన్నారు. పాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ‘‘అమరావతిలో 10వేల మందికి పైగా పోలీసులను మోహరించి ఈ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందా? ఉదయం 11 నుంచి 2గంటల వరకు ఆర్థికమంత్రి చాలా తెలివిగా ప్రజలను తప్పుదోవ పట్టేంచేలా సత్యదూరమైన మాటలు చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేదు.. కలల రాజధాని కావాలన్న తపనతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. " అని అన్నారు.

మూడు రాజధానుల పై, ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం పై, ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా, చంద్రబాబు పరోక్షంగా స్పీకర్ పై చంద్రబాబు చురకలు అంటించారు. పలు సందర్భాల్లో స్పీకర్ తమ్మినేని, తమ ప్రాంతం శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం అని, తమకు అన్యాయం చెయ్యవద్దు అంటూ చెప్పిన విషయం పై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఈ రాష్ట్రంలో, ఇక్కడ చాలా మంది మేము వెనుకబడిన జిల్లాల నుంచి వచ్చాం అంటూ చెప్పుకుంటూ ఉంటారని, అన్ని సార్లు ఆ ప్రాంతం నుంచి వచ్చి, ఆ ప్రాంతానికి ఏమి చేసారు అంటే, వారి దగ్గర ఏ సమాధానం ఉండదని చంద్రబాబు అన్నారు. ఇది స్పీకర్ మాటి మాటికీ చెప్పే మాటలకు, చంద్రబాబు పరోక్షంగా ఇచ్చిన కౌంటర్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపుగా తమ్మినేని ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.

tammineni 20012020 2

ఇక శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో ఎక్కడా మూడు రాజధానులు గురించి చెప్పలేదని చంద్రబాబు అన్నారు. ఆ కమిటీ విజయవాడ-గుంటూరు ప్రాంతంపై మొగ్గు చూపిందన్నారు. ఆ తర్వాత విశాఖ ప్రాంతం వైపు మొగ్గిందన్నారు. రాజధానిగా విజయవాడ ఉండకూడదని కమిటీ ఎక్కడా చెప్పలేదని, వైకాపా నేతలు అసత్యాలు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే వరదలు వస్తాయి , ఈ ప్రాంతం మునిగిపోతుంది అంటూ తప్పుడు ప్రచారం చేసి కేసులు వేసరాని, అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇక్కడ వరదలు రావు, ఈ ప్రాంతం మునగదు అంటూ, స్పష్టంగా తీర్పు ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోని పలు రిపోర్ట్ లో ఉన్న, తీర్పును చంద్రబాబు చదివి వినిపించారు.

tammineni 20012020 3

చంద్రబాబు పై పలువురు చేసిన విమర్శల పై ఆయన స్పందిస్తూ, ‘‘సభలో నన్ను విమర్శించేందుకే సమయం కేటాయించారు. నన్ను విమర్శించినా, ఎగతాళి చేసినా పరవాలేదు. వైసీపీ నేతలు మాట్లాడిన ప్రతీది ప్రజలు గమనిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి. ఒక రాష్ట్రం... ఒకే రాజధాని మా సిద్ధాంతం. నన్ను వ్యక్తిగతంగా తిట్టడానికి సభ్యులు పోటీపడ్డారు. మూడు రాజధానులపై ప్రభుత్వ విధానం చెబితే బాగుండేది. విభజనచట్టంలో ఒకే రాజధాని అని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులని విభజన చట్టంలో చెప్పలేదు.’’ అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read