మూడు రాజధానుల పై, ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం పై, ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా, చంద్రబాబు పరోక్షంగా స్పీకర్ పై చంద్రబాబు చురకలు అంటించారు. పలు సందర్భాల్లో స్పీకర్ తమ్మినేని, తమ ప్రాంతం శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం అని, తమకు అన్యాయం చెయ్యవద్దు అంటూ చెప్పిన విషయం పై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఈ రాష్ట్రంలో, ఇక్కడ చాలా మంది మేము వెనుకబడిన జిల్లాల నుంచి వచ్చాం అంటూ చెప్పుకుంటూ ఉంటారని, అన్ని సార్లు ఆ ప్రాంతం నుంచి వచ్చి, ఆ ప్రాంతానికి ఏమి చేసారు అంటే, వారి దగ్గర ఏ సమాధానం ఉండదని చంద్రబాబు అన్నారు. ఇది స్పీకర్ మాటి మాటికీ చెప్పే మాటలకు, చంద్రబాబు పరోక్షంగా ఇచ్చిన కౌంటర్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపుగా తమ్మినేని ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.

tammineni 20012020 2

ఇక శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో ఎక్కడా మూడు రాజధానులు గురించి చెప్పలేదని చంద్రబాబు అన్నారు. ఆ కమిటీ విజయవాడ-గుంటూరు ప్రాంతంపై మొగ్గు చూపిందన్నారు. ఆ తర్వాత విశాఖ ప్రాంతం వైపు మొగ్గిందన్నారు. రాజధానిగా విజయవాడ ఉండకూడదని కమిటీ ఎక్కడా చెప్పలేదని, వైకాపా నేతలు అసత్యాలు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే వరదలు వస్తాయి , ఈ ప్రాంతం మునిగిపోతుంది అంటూ తప్పుడు ప్రచారం చేసి కేసులు వేసరాని, అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇక్కడ వరదలు రావు, ఈ ప్రాంతం మునగదు అంటూ, స్పష్టంగా తీర్పు ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోని పలు రిపోర్ట్ లో ఉన్న, తీర్పును చంద్రబాబు చదివి వినిపించారు.

tammineni 20012020 3

చంద్రబాబు పై పలువురు చేసిన విమర్శల పై ఆయన స్పందిస్తూ, ‘‘సభలో నన్ను విమర్శించేందుకే సమయం కేటాయించారు. నన్ను విమర్శించినా, ఎగతాళి చేసినా పరవాలేదు. వైసీపీ నేతలు మాట్లాడిన ప్రతీది ప్రజలు గమనిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి. ఒక రాష్ట్రం... ఒకే రాజధాని మా సిద్ధాంతం. నన్ను వ్యక్తిగతంగా తిట్టడానికి సభ్యులు పోటీపడ్డారు. మూడు రాజధానులపై ప్రభుత్వ విధానం చెబితే బాగుండేది. విభజనచట్టంలో ఒకే రాజధాని అని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులని విభజన చట్టంలో చెప్పలేదు.’’ అని చంద్రబాబు అన్నారు.

అమరావతిని నిర్వీర్యం చేస్తూ, మూడు రాజధానులు అంటూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. 33 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా, అటు వైపు కూడా చూడని ప్రభుత్వం, అలాగే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, రైతులు వైపు కూడా చూడలేదు. ఈ రోజు కూడా రైతులు కాళ్ళు చేతులు విరిగేలా, ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కూడా చేసారు. అయితే, ఇదే విషయం పై ఈ రోజు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఈ బిల్లు పై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించటం, మా అదృష్టమని, జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయం, అమరావతికి దక్కిన గౌరవమని అన్నారు. అంతే కాదు, విజయవాడ, గుంటూరు ప్రజలు అమెరికా కి వెళ్ళి డాలర్లు సంపాదించుకుంటున్నారు, ఇక్కడ సమస్య లేదు, మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఇలాగే వలస వెళ్ళి డాలర్లు సంపాదించుకోవాలి, అందుకే పరిపాలన వికేంద్రీకరణ అంటూ చెప్పుకొచ్చారు.

rk 20012020 2

గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్నే ప్రజల ముందుంచాం. అలాంటప్పుడు సెక్రటేరియట్‌ ఎక్కడుంటే ఏమిటి? హైకోర్టు ఎక్కడుంటే ఏమిటి? నెల రోజుల నుంచి చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బయటపడుతోందనని భయపడుతున్నారు. ఆయన బినామీలను కాపాడుకోవడానికే ఈ ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ప్రజలు రాకపోవడంతో బయట నుంచి తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు’’ అని ఆళ్ల ఆరోపించారు. అయితే ఆళ్ళ ఇలా మాట్లాడటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఒక పక్క ఇక్కడ 29 గ్రామాల ప్రజలు, రోడ్డున పడి రోదిస్తుంటే, ప్రజలకు సంబంధం లేకుండా, స్థానిక ఎమ్మెల్యే మాత్రం, అమరావతిలో అసెంబ్లీ మాత్రమే ఉండటాన్ని, ఇది ఈ ప్రాంత ప్రజలు అదృష్టం అని అంటున్నారు.

rk 20012020 3

మరో పక్క, ఏపీ భవిష్యత్తును సర్వనాశనం చేసే ఈ బిల్లుపై మాట్లాడేందుకు చాలా బాధగా ఉందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. గత నెల రోజులుగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తోందన్నారు. పాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ‘‘అమరావతిలో 10వేల మందికి పైగా పోలీసులను మోహరించి ఈ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందా? ఉదయం 11 నుంచి 2గంటల వరకు ఆర్థికమంత్రి చాలా తెలివిగా ప్రజలను తప్పుదోవ పట్టేంచేలా సత్యదూరమైన మాటలు చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేదు.. కలల రాజధాని కావాలన్న తపనతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. " అని అన్నారు.

అంతా అనుకున్నదే జరిగింది. 33 రోజుల పాటు, అమరావతి రైతులు చేసిన ఆందోళన అరణ్య రోదనే అయ్యింది. రైతులు కన్నీళ్ళు మధ్యే, ఈ రోజు భేటీ అయిన క్యాబినెట్, అమరావతి రైతుల నెత్తిన పిడుగు పడే నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం ఏడు అంశాల అజెండాగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలివి.. హైవపర్‌ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం. సీఆర్‌డీఏ రద్దుకు కేబినెట్‌ ఆమోదం. పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం. ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం.

jagan 200122020 1

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం. రైతులకు 15 ఏళ్లపాటు కౌలు చెల్లించేందుకు నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయం తరువాత, అసెంబ్లీ బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ హాజరైన సీఎం జగన్ ,శ్రీకాంత్ రెడ్డి
, మంత్రులు బుగ్గన,కన్నబాబ,అనీల్ కుమార్ . టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు. బీఏసీ సమావేశం తరువాత, వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు 2020ను సభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. AP సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. తరువాత వికేంద్రీకరణ బిల్లు పై అసెంబ్లీలో, చర్చను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.

jagan 200122020 1

ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ, "కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. కర్నూలులోనే న్యాయపరమైన అన్ని శాఖలు. హైకోర్టు అనుమతి తర్వాత ఇవి ఏర్పాటు చేస్తాం. ఇది చారిత్రాత్మక బిల్లు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌భవన్‌, సచివాలయం. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం చేయాలి. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లు. సమ్మిళిత అభివృద్ధి మన లక్ష్యం" అని బుగ్గన తెలిపారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అమరావతిని నిర్వీర్యం చేస్తూ, మూడు రాజధానుల విషయం పై, ప్రభుత్వం ముందుకు వెళ్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని, వైజాగ్ లో సచివాలయం ఉంటుందని, అలాగే కర్నూల్ లో హైకోర్ట్ ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. అయితే, అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అసెంబ్లీలోకి స్పీకర్ తమ్మినేని సీతారం రాగానే, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, 'బ్యాడ్ మార్నింగ్ సార్' అంటూ, ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్ పై నినాదాలు చేసారు. అయితే, దీని పై స్పందించిన స్పీకర్, ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తారని, మంచి జరగాలని కోరుకుంటారని, కాని మీరు ఏమిటి బ్యాడ్ మార్నింగ్ చెప్తారు, ఇలా బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమని స్పీకర్ సమాధానం ఇచ్చారు. దీని పై టిడిపి ఎమ్మెల్యేలు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ రోజు బ్యాడ్ మార్నింగ్ అని అన్నారు.

speaker 20012020 2

ఇక మరో పక్క అసెంబ్లీ జరుగుతూ ఉండగానే, బయట నిరసనలు మిన్నంటాయి. రైతులు , పోలీసులు నిర్బంధాన్ని దాటుకుని వచ్చి, అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేసారు. సచివాలయం రెండో గేటు వద్దకు, దాదాపుగా 2 వేల మంది రైతులు, మహిళలు వచ్చారు. అయితే పోలీసులు విచక్షణారహితంగా వచ్చి, లాఠీచార్జ్ చేసారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా, దొరికిన వారిని దొరికినట్టు, చితకోట్టారు. కొంత మంది పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయారు. పోలీసులు వీరిని తరమటంతో, రైతులు సచివాలయం పక్కన ఉన్న పొలాల్లో, ఎండలోనే కూర్చుని నినాదాలు చేస్తున్నారు. మరో పక్క, పోలీసులు ఇక్కడ నుంచి వీరిని వెళ్ళిపోవాలని కోరుతున్నారు. కొంత మందిని అరెస్ట్ లు చేసారు.

speaker 20012020 3

రాజధాని ప్రాంత రైతుల ఆందోళనల దృష్ట్యా సచివాలయం వద్దకు విజయవాడ నుంచి పోలీసులు అదనపు బలగాలు తరలిస్తున్నారు. రెండు బస్సుల్లో సుమారు 70 మంది పోలీసులను తీసుకొస్తున్నారు. మరోవైపు, రైతులు తమ గ్రామాల నుంచి పొలాలు మీదుగా జాతీయ జెండాలు పట్టుకొని అసెంబ్లీ, సచివాలయం వద్దకు దూసుకొస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జిలో గాయపడినా లెక్కచేయకుండా తమ నిరసన గళాన్ని విన్పించేందుకు అసెంబ్లీ వైపు వచ్చేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మరో పక్క, మంగళగిరి మండలంలోని కృష్ణాయ పాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏపీ కేబినెట్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, రైతు కూలీలు రహదారిని దిగ్బంధించారు.

Advertisements

Latest Articles

Most Read