జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, సిబిఐ గత కొన్ని రోజుల నుంచి స్పీడ్ మీద ఉంది. నిన్న 22న ఏదో జరిగిపోతుంది అంటూ, ఒక పుకార్ సోషల్ మీడియాలో పుట్టించారు. అయితే, అదేమీ లేదని నిన్న స్పష్టం అయ్యింది. అయితే నిన్న విచారణ సందర్భంగా సిబిఐ చేసిన వాదనలు మాత్రం, కొంత ఆసక్తిగా మారాయి. జగన్ పై నమోదు అయిన 11 చార్జిషీట్లలు, వేరు వేరుగానే విచారణ జరపాలని, సిబిఐ, కోర్ట్ ముందు తమ వాదనగా చెప్పింది. ఈ 11 చార్జ్ షీట్లు ఒకే తరహా ఆర్ధికం నేరం అయినా, వేరు వేరుగా విచారణ జరపాలని, ఈ నేరాలు జరిగిన సమయం కాని, పెట్టుబులు కానీ, నిందితులు కాని వేరు వేరు అని, కేవలం జగన్, విజయసాయి రెడ్డి మాత్రమే, అన్ని కేసుల్లో ఉన్నారని, మిగతా వారు అంతా వేరు వేరు అని సిబిఐ కోర్ట్ కు చెప్పింది. ఇప్పటికే ఈ కేసు పై కోర్ట్ ఇదే విధమైన డైరక్షన్ ఇచ్చిందని గుర్తు చేసింది. దీనికి ఉదాహరణగా, గతంలో లాలు ప్రసాద్ దాణా కుంబకోణం కేసు గురించి ప్రస్తావిస్తూ, ఆ విషయాన్ని కోర్ట్ కు గుర్తు చేసింది.

cbi 23112019 2

ఈ కేసులో చార్జ్ షీట్లు వేసి ఏడేళ్ళు అవుతున్నా, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, రకరకాలు పితీషన్లు వేసి, కేసు విచారణ జరగకుండా జాప్యం చేస్తున్నారని సిబిఐ పేర్కొంది. ఇప్పటికే డిశ్చార్జి పిటిషన్ల పై క్లారిటీ వచ్చిన కేసుల పై, ఇక విచారణ ప్రారంభించాలని సిబిఐ తాజాగా చేసిన వాదనతో ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభం అయ్యింది. అంతకు ముందు జగన్ తరుపు న్యాయవాదులు, తమ పై, దాఖలు అయిన 6 చార్జిషీట్లను సీఆర్‌పీసీ సెక్షన్‌ 223 కింద కలిపి విచారణ జరపాలి అంటూ, జగతి పబ్లికేషన్స్‌ పిటీషన్ దాఖలు చేసింది. అయితే సిబిఐ వాదిస్తూ, నేరం ఒకటే తర్హాది అయినా, జరిగిన నేరం మాత్రం, వేరు వేరు చోట్ల, వేరు వేరు మనుషులతో జరిగిందని చెప్పింది.

cbi 23112019 3

హెటిరో, అరబిందో, రాంకీ, వాన్‌పిక్‌ కేసుల్లో భూములు కేటాయించడం ద్వారా వారు పెట్టుబడులు పెట్టారనేది అభియోగమని, క్విడ్‌ప్రోకో కుట్ర ఒక్కటే అయినా పెన్నా సిమెంట్స్‌, వాన్‌పిక్‌లో ఉండే వ్యక్తులకు సంబంధం లేదని, నేరాలు వేర్వేరుగానే జరిగాయిని, వీటిపై సెక్షన్‌ 212 కింద వేర్వేరుగా ప్రత్యేక విచారణ జరగాల్సిందే అని సిబిఐ స్పష్టం చేసింది. అయితే ఇదే విషయంలో కల్పించుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా, సిబిఐ వాదనతోనే ఏకీభవించింది. ఇప్పటికే అనేక సార్లు పిటీషన్లు వేసి, విచారణ జాప్యం అయ్యేలా చేస్తున్నారని, అన్ని చార్జ్ షీట్ల పై విచారణ విడివిడిగా జరగాలని కోరింది. అయితే జగతి పబ్లికేషన్స్‌ తరుపు వాదనల కోసం, న్యాయమూర్తి ఈ కేసు విచారణను, 29కి వాయిదా వేశారు.

తెలుగుదేశం పార్టీ సాధించింది. నిన్న పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, గల్లా జయదేవ్, జీరో హావర్ లో లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధాని అమరావతిని చూపించకుండా, కొత్త ఇండియా మ్యాప్ రేలీజ్ చేసారని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదని, ఆనాడు రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అవమానం అని చెప్పారు. వెంటనే ఈ తప్పు సరిదిద్ది, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. అయితే దీని పై అప్పుడే స్పందించిన కేంద్రం హోం శాఖా సహయ మంత్రి కిషన్ రెడ్డి, ఈ విషయం పై ఆందోళన చెందనవసరం లేదని, వెంటనే ఈ తప్పు సరిదిద్ది, కొత్త మ్యాప్ ని రిలేజ్ చేస్తామని చెప్పారు. అయితే గల్లా జయదేవ్ నిన్న జీరో హావర్ లో లేవనేత్తటం, అలాగే రాజ్యసభలో కూడా తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఈ విషయం పై నోటీస్ ఇవ్వటంతో, కేంద్రం కూడా వెంటనే స్పందించి, తప్పుని సరిదిద్దింది.

galla 221112019 2

దీని పై ఈ రోజు, కొద్ది నిమిషాల క్రితమే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కిషన్ రెడ్డి ట్వీట్ చేసారు. "Taking note of the issue of Amaravati missing from the map, raised by Hon’ble MPs of AP in the Parliament yesterday, I took up the matter with the concerned. The error has been rectified. Here is the revised map of India. PC: Survey of India" అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేసారు. కొత్తగా సర్వే అఫ్ ఇండియా సరిదిద్ది రిలీజ్ చేసిన ఇండియా పొలిటికల్ మ్యాప్ ని కూడా ఆ ట్వీట్ కి జత పరిచారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, అమరావతిని చూపిస్తూ, రెడ్ లెటర్స్ లో, మన కాపిటల్ ని చూపిస్తూ మ్యాప్ లో ఉంది. అన్ని రాష్ట్రాలతో పాటుగా, మన రాష్ట్రానికి కూడా రాజధాని అమరావతిగా పెట్టారు.

galla 221112019 3

అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలను మాత్రం అభినందించాల్సిందే. ఎంపీ గల్లా జయదేవ్ పార్లిమెంట్ లో, అలాగే రాజ్యసభలో కనకమేడల ఈ విషయం పై నోటీస్ ఇవ్వటంతో, కేంద్రానికి జరిగిన తప్పు తెలిసింది. వెంటనే సరిదిద్దే అవకాసం వచ్చింది. అయితే, ముందు నుంచి అమరావతి మీద అంత ఇంట్రెస్ట్ చూపని వైసీపీ ఎంపీలు, 22 మంది కాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున కాని, కేంద్రాన్ని ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి తీసుకు రాకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా, టిడిపి ఒత్తిడి తెచ్చి, సాధించింది. అప్పట్లో అమరావతిని రాజధానిగా చేసినా, ఈ రోజు ఏకంగా మ్యాప్ లో నుంచే అమరావతిని తీసెయ్యాలని చూసినా, తెలుగుదేశం పార్టీ అమరావతిని కాపాడింది. అమరావతి అంటే, మరణం లేనిది, ఎవరు ఎన్ని చేసినా దాన్ని చంపలేరు అని చంద్రబాబు చెప్పిన మాటలు నిజమేనెమో...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే, ఏది అంటే, ఎవరైనా ఏమి చెప్తాం ? అమరావతి అంటూ ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్తాం. రాజకీయ ఇబ్బందుల్లో, ఉండి అమరావతి పరిస్థితి ఇలా ఉంది కాని, ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా అమరావతి తయారు అయ్యేది. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులే ఇందుకు ఉదాహరణ. ఒక్క ఎకరం ఇవ్వటానికి, రక్తపాతం జరిగే ఈ రోజుల్లో, ఒక మనిషిని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారు రైతులు. అక్కడ అంతా గ్రాఫిక్స్ అన్న చోటే, జగన్ మోహన్ రెడ్డి గారు, పరిపాలన సాగిస్తున్నారు. అవి గ్రాఫిక్స్ కాదు, నిజమైన బిల్డింగ్ లు అని చెప్పటానికి, ఇదే ఉదాహరణ. అయితే అధికారం మారిపోయిన తరువాత, అమరావతి రాత కూడా మారిపోయింది. ఎన్నో ఆశలతో అమరావతి నిర్మాణం అవుతుంది అనుకున్న ఆంధ్రులకు, నిరాశే మిగిలింది. ప్రపంచ బ్యాంక్ నుంచి సింగపూర్ ప్రభుత్వం దాకా, అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన షాక్ తో, ఆంధ్రుడు మరింత కుమిలి పోయే పరిస్థితి.

home 22112019 1

ఒక పక్క హైదరాబాద్ తో తెలంగణా ప్రజలు సంతోషంగా ఉంటే, మనకు మాత్రం, ఇప్పటి పాలకుల తీరు వల్ల, అమరావతి మా రాజధాని అని చెప్పుకునే అవకాసం కూడా లేకుండా పోయింది. జమ్మూ కాశ్మీర్ విభజన నేపధ్యంలో, కేంద్ర హోం శాఖ, కొత్త ఇండియా మ్యాప్ రిలీజ్ చేసింది. అందులో అన్ని రాష్ట్రాలకు, వాటి వాటి రాజధానులు పెట్టిన కేంద్రం, మన రాష్ట్రానికి మాత్రం, రాజధాని పెట్టలేదు. ఇంకా మన రాజధాని హైదరాబాద్ అనే విధంగానే, తెలంగాణాకు చూపించింది. అయితే మొన్నటి వరకు మ్యాప్ లో ఉన్న అమరావతి ఇప్పుడు మాయం కావటం పై, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో బాధ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఈ పరిస్థితి వచ్చింది అంటూ కుమిలిపోతున్నారు. అయితే ప్రజల తరుపున స్పందించాల్సిన ప్రభుత్వం మాత్రం, మాట్లాడలేదు.

home 22112019 1

ఎక్కడా కేంద్రాన్ని ఇదేమిటి అంటూ కేంద్రం ప్రశ్నించలేదు. అయితే, పార్లమెంట్ సమావేశాలు మొదలు అయ్యి, మూడు రోజులు యినా, 22 మంది ఎంపీలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈ అంశం పై పార్లమెంట్ లో లేవనెత్తింది. ఎంపీ గల్లా జయదేవ్, ఈ విషయం పై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఇది మా రాష్ట్రాన్ని తీవ్రంగా అవమానపరిచే చర్య అంటూ, అభ్యంతరం వ్యక్తం చేసి, దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే టిడిపి విజ్ఞప్తి పై, కేంద్ర హోం శాఖ స్పందించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఈ విషయం పై మాట్లాడుతూ, భారత దేశ మ్యాప్ లో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ, త్వరలోనే సవరించిన మ్యాప్ రిలీజ్ చేస్తామని చెప్పారు.

మంగ‌ళ‌గిరిలో శుక్ర‌వారం ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌శైలికి భిన్నంగా కాస్తా వ్యంగ్యంగా, ఇంకాస్తా ఘాటుగానే స‌మాధానాలిచ్చారు. మీడియా ప్ర‌తినిధి- లోకేశ్ గారూ! పార్టీ నుంచి వెళ్లిన‌వాళ్లు, వైకాపా మంత్రులు మిమ్మ‌ల్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? నారా లోకేశ్‌- విర‌గ‌కాచే చెట్ల‌పైకే క‌దా! ఎవ‌రైనా రాళ్లు విసురుతారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమం చూస్తూనే, పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శిగా సేవ‌లందిస్తూ..మంత్రిగా ఎవ‌రూ చేయ‌ని అభివృద్ధి చేశాను. స‌మ‌ర్థుడిని కాబ‌ట్టే న‌న్ను టార్గెట్ చేసి, నా ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీయాల‌ని చూస్తారు. చంద్రబాబు గారిని వీళ్ళు ఏమి అనలేరు, అందుకే నా మీద పడతారు.. క్ర‌మ‌శిక్ష‌ణ‌గలిగిన‌ 70 ల‌క్ష‌ల మంది తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌ సైన్యం సిద్ధంగా ఉంది. ఢీ అంటే ఢీ..రేప్పొద్దున ప్ర‌భుత్వంలోకి వ‌చ్చేది మేమే. మీడియా ప్ర‌తినిధి- రాజ‌ధాని ప్రాంత ప‌రిధిలో మీకు భూములున్నాయ‌ని వైకాపా నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై మీ స్పంద‌నేంటి?

lokesh 22112019 2

నారా లోకేశ్‌- జ‌గ‌న్ అధికారంలోకొచ్చి ఆరు నెల‌లైంది. మంత్రులు, అధికారుల‌ను రంగంలోకి దింపి..చంద్ర‌బాబు, లోకేశ్‌, టీడీపీ నేత‌లు ఎక్క‌డ దొరుకుతారా? అని త‌వ్వుతూనే ఉన్నారు. నాకు ఐదొంద‌ల ఎక‌రాలున్నాయ‌న్నారు.. ఇప్పుడు అర‌సెంటు భూమి ఉంద‌ని నిరూపించ‌లేక‌పోయారు. అంత చేత‌గానివాళ్లా! ద‌ద్ద‌మ్మ‌లా! ఈ పాల‌కులు? మీడియా ప్ర‌తినిధి- రాజ‌ధానిపై రోజుకో మాట ప్ర‌భుత్వం చెబుతోంది.. ఉంటుందా? త‌ర‌లిపోతుందా? నారా లోకేశ్‌- రాజ‌ధాని ఉండాలా అని ఒక‌రు.. ఇప్పుడున్న రాజ‌ధానిని 50 కిలోమీట‌ర్లు అటు జ‌ర‌పాల‌ని మ‌రొక‌రు, కాదు కాదు 30 కిలోమీట‌ర్లు ఇటు జ‌ర‌పాల‌ని మ‌రొక మంత్రి అంటున్నారు. రాజ‌ధాని ఏమైనా కారా? అటు 50 కిలోమీట‌ర్లు, ఇటు 30 కిలోమీట‌ర్లు తీసుకుపోవ‌డానికి?

lokesh 22112019 3

మీడియా ప్ర‌తినిధి- రోజుకో ప‌రిశ్ర‌మ త‌ర‌లిపోతోంద‌ని వార్త‌లొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? నారా లోకేశ్‌- టీడీపీ హ‌యాంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి తీసుకొచ్చిన ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పో..పో..అని చీద‌రించుకుని పొమ్మంటున్నారు. వెనువెంట‌నే తెలంగాణ పాల‌కులు రా..రా..ర‌మ్మంటూ ఆ ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకుపోతున్నారు. మీడియా ప్ర‌తినిధి - రాజ‌ధాని ఉంటుందా? త‌ర‌లిపోతుందా? నారా లోకేశ్‌-రాజ‌ధాని ప్రాంతంలో ఒకే కులానికి భూములున్నాయ‌ని ఒక సారి, ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ అని మ‌రోసారి అంటున్నారు. రాజ‌ధాని ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌నే ఆలోచ‌న‌తోనే జ‌గ‌న్ ఇటువంటి గంద‌ర‌గోళ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటువంటి వైట్‌కాల‌ర్ నేరాల్లో ఆరితేరారు. ఆ అనుమానంతోనే ఆయ‌న రాజ‌ధాని త‌ర‌లింపు యోచ‌న‌లో ఉన్నారు. దీనికోసం ఒక ముఖ్య‌మంత్రి అయ్యి ఉండి కులాల మ‌ధ్య‌, ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read