ఇటీవల బలవన్మరణాలకు పాల్పడిన స్వర్ణకారుల కుటుంబాలను గురువారం ఉద‌యం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ పరామర్శించారు. పనుల్లేక, ఆర్థిక ఇబ్బందుల‌తో ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ వెంగలశివ కుటుంబసభ్యులను పరామర్శించారు. స్వ‌ర్ణ‌కార వృత్తిలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన యేకులభాస్కర్ (బాచి) కుటుంబ స‌భ్యుల‌ను పరామర్శించారు. 50 వేల రూపాయిల ఆర్ధిక సహాయం అందించారు. స్వర్ణకారుల ఆత్మహత్యలు,స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం స్వర్ణకార సంఘం పెద్దలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఉపాధి లేక స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. స్వర్ణకారులను ఆర్థికంగా బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా స్వర్ణకార కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

lokesh 21112019 2

స్వర్ణకార వృత్తిని కొనసాగించే విధంగా,ఆర్థిక సహాయం,లోన్స్ ఇప్పిస్తాం,ఇన్సూరెన్స్ కల్పిస్తామని అన్నారు. వైద్య సేవలు,పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. స్వర్ణకారుల పై పెడుతున్న అక్రమ కేసులు ఎదుర్కోవడానికి న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. పార్టీలకు అతీతంగా కోపరేటివ్ సొసైటీ పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పై విలేఖరులు అడిగిన ప్రశ్నల పై స్పందిస్తూ, "చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. వారి పై ఇప్పటికి రెండు సార్లు స్పందించాను. ఇక అన్నీ వెంకన్న స్వామే చూసుకుంటారు. గతంలో ఆయన జోలికి వెళ్తే ఏమి అవుతుందో చరిత్ర చెప్పింది. ఆయనను ఈ బుతుల్లోకి లాగితే, వెంకన్న స్వామికి ఏమి చెయ్యాలో తెలుసు" అని స్పందించారు.

lokesh 21112019 3

అలాగే, తెలుగు మీడియం రగడ పై కూడా స్పందించారు. "తెలుగుదేశం పార్టీ హయాంలోనే మున్సిపల్స్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం.అప్పుడు విద్యార్థులకు అప్షన్ ఇచ్చాం. మేము ఇంగ్లీష్ మీడియం వద్దు అనడం లేదు.మాతృ భాష లేకుండా చేయాలన్న నిర్ణయాన్ని మాత్రమే మార్చుకోవాలని అడిగాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒక్కటే అప్షన్ విద్యార్థులకు,తల్లిదండ్రులకు ఇవ్వండి ఏ మీడియం కావాలో వారే నిర్ణయించుకుంటారు. బలవంతంగా మీ ఆలోచనల్ని విద్యార్థులపై ప్రయోగించకండి. మాతృ భాష లేకుండా చేస్తాం అనడం కరెక్ట్ కాదు. తెలుగు రాకపోతే ఎంత ఇబ్బంది పడతామో నాకు బాగా తెలుసు. విదేశాల్లో ఎక్కువ కాలం చదవడం వలన తెలుగు నేర్చుకోలేకపోయాను. ఎప్పుడైనా ఒక పదం తప్పు పలికితే నన్ను ఎంత ఎగతాలి చేసారు అందరికి తెలుసు. అందుకే మాతృభాష కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను." అని లోకేష్ అన్నారు.

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంతో, రోజు రోజుకీ జగన్ కు అసహనం పెరిగిపోతుంది. శనివారం జరిగిన వైసిపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, ప్రాధాని మోడీని కాని, ఇతర కేంద్ర మంత్రులను కాని, మీరు డైరెక్ట్ గా కలవద్దు, ముందుగా విజయసాయి రెడ్డికి కాని, మిథున్ రెడ్డికి కాని చెప్పి, వారి సలహా తీసుకున్న తరువాత, వారి సమక్షంలోనే కలవాలి అని జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. పార్టీ లైన్ దాటవద్దని, చెప్పినట్టు వినకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తాం అంటూ ఏకంగా జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరూ, ఆయన మాట దాటరు. కాని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో మాత్రం, యాదృచికంగా జరుగుతుందో, లేక అలా జరుగుతున్నాయో కాని, జరుగుతున్న పరిణామాలు మాత్రం, జగన్ మోహన్ రెడ్డిని, తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఏదో జరుగుతుంది అని ఆయన ఆలోచనలకు, ఇవి బలం చేకురుస్తున్నాయి.

raghu 21112019 2

ప్రధాని మోడీని డైరెక్ట్ గా కలవద్దు అని జగన్ చెప్పిన, వారం రోజులకే, పార్లమెంటు సెంట్రల్ హాల్లో, రఘురామకృష్ణంరాజు, ప్రధాని మోడీని కలిసారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో, మోడీని చూడగానే, రఘురామకృష్ణంరాజు నమస్తే సార్ అంటూ ప్రధానిని పలకరించారు. సెక్యూరిటీ మధ్యలోకి రఘురామకృష్ణంరాజును మోడి దగ్గరకు పిలిచారు. దగ్గరకు వెళ్ళిన రఘురామకృష్ణంరాజు, ప్రధాని మోడీకి పాదాభివందనం చేశారు. దీంతో ప్రధాని, రాజు గారు బాగున్నారా అంటూ, నవ్వుతూ ఆప్యాయంగా భుజం తట్టి మాటలు కలిపారు. తరువాత, ప్రధాని మోడీ తన చాంబర్‌కు వెళ్లిపోయారు. ఆ సమయంలో, కృష్ణంరాజు వెంట ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు.

raghu 21112019 3

అయితే ఈ పరిణామంతో, ఒక్కసారిగా వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రఘురామకృష్ణంరాజు వర్గీయలు మాత్రం, దీంట్లో ఏమి లేదని, ఎదురు పడితే పలకరించారని అన్నారు. అయితే రెండు రోజుల క్రితం పార్లమెంట్ మొదలైన మొదటి రోజే, రఘురామకృష్ణంరాజు, తెలుగు పరిరక్షణ గురించి, కేంద్రాన్ని అడగటం, వైసిపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియం పై ముందుకు వెళ్తుంటే, సొంత పార్టీ ఎంపీ చర్యతో ఇబ్బంది అని పార్టీ వర్గాలు భావించాయి. అయితే, ఈ విషయం పై జగన్ కూడా సీరియస్ అయ్యారని, రఘురామకృష్ణంరాజు నుంచి వివరణ కోరారని వార్తలు వచ్చాయి. వారం రోజుల్లోనే, గీత దాట వద్దు అని వార్నింగ్ ఇవ్వటం, తెలుగు భాష పై రఘురామకృష్ణంరాజు ప్రశ్న అడగటం, ఇప్పుడు ప్రధాని మోడీతో పలకరింపులు, ఇవన్నీ చూస్తుంటే, ఏదో జరుగుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.

ఇతర రాష్ట్రాల్లో తక్కువధరకు లభ్యమయ్యే నాసిరకం మద్యాన్ని, రాష్ట్రంలో విక్రయిస్తు న్నారని, అధికారపార్టీ నేతల అండతోనే కల్తీమద్యం, నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వపెద్దల కనుసన్నల్లో, అధికారుల అండదండలతోనే విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతోందన్నారు. నాన్‌డ్యూటీప్లేయిడ్‌ (ఎన్‌డీపీ) లిక్కర్‌ని పక్కరాష్ట్రాలనుంచి తీసుకొచ్చి మరీ రాష్ట్రంలో అమ్మడమేనా వైసీపీప్రభుత్వం అమలుచేస్తున్న మద్యనిషేధమని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా పట్టుబడుతున్న మద్యం పరిమాణం సీసాల్లో ఉంటే, అమ్ముడయ్యే ది మాత్రం పెద్దపెద్దలోడ్ల రూపంలో ఉందన్నారు. డబ్బుపిచ్చిపట్టిన ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటానికి కూడా వెనుకాడట్లేదని బొండా మండిపడ్డారు. అక్రమ మద్యంవ్యాపారంపై తమతోచర్చకు రావడానికి ప్రభుత్వం సిద్ధమేనా అని ఆయన ప్రశ్నిం చారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒడిశా నుంచి, కృష్ణాజిల్లాకు తెలంగాణ నుంచి, నెల్లూరు, రాయలసీమ ప్రాంతానికి తమిళనాడు నుంచి ఎన్‌డీపీ మద్యం దిగుమతి అవుతోందని పేర్కొన్నారు. ఈవిధంగావచ్చే చీప్‌లిక్కర్‌ వల్ల వైసీపీనేతల జేబులు నిండు తుంటే, పేదప్రజల జీవితాలు గుల్లవుతున్నాయన్నారు.

bondauma 20112019 2

మాతృభాషను చంపేయడానికి కంకణం కట్టుకున్న రాష్ట్రప్రభుత్వం, ఒక కుట్రప్రకారమే ఆంగ్లమాధ్యమ అమలుకు నిర్ణయం తీసుకుందని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాజకీయాలకతీతంగా భాషా పండితులు, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రభుత్వ నిర్ణయంపై స్పందించాల న్నారు. తెలుగురాష్ట్రంలో తెలుగుభాషను నిషేధించడం వెనుక ఎవరున్నారో ప్రభుత్వం స్పష్టంచేయాలని బొండా డిమాండ్‌చేశారు. తాముపట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా మొండివిధానంతో ప్రభుత్వం ముందుకెళ్లడం మంచిదికాదన్నారు. టీటీడీలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం రాష్ట్రప్రభుత్వానికి తగదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, పవిత్రమైన తిరుమల కొండపై అన్యమత ప్రచారంచేయడం, తాత్కాలిక ఉద్యోగులుగా అన్యమతస్తులను నియమించడం వంటిచర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బొండా స్పష్టంచేశారు. బాధ్యత గల మంత్రిగాఉండి, కొడాలినాని తిరుమలతిరుపతి దేవస్థానంపై చేసిన వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. తిరుమలకు ఎంతటిస్థాయివారొచ్చినా తాము ఏమతానికి చెందిన వారమో, తిరుమలశ్రీవారిపై తమకు విశ్వాసమున్నట్లు డిక్లరేషన్‌లో ప్రకటించడమనేది ఎప్పటినుంచో ఆచారంగా వస్తున్నదన్నారు.

bondauma 20112019 3

అటువంటి ఆచార వ్యవహారాలను కించపరిచే లా మంత్రులు మాట్లాడటం, దానిపై జగన్మోహన్‌రెడ్డి స్పందించకపోవడం దారుణమ న్నారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నవారంతా ఏమయ్యారో కొడాలి నాని వంటివారు తెలుసుకోవాలని, గర్వం తలకెక్కిన వైసీపీనేతలంతా ఒక్కసారి శ్మశానం వైపుచూస్తే వారికి తత్వం బోధపడుతుందని బొండా హితవుపలికారు. ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడే తిరుమలక్షేత్రంపై ఇష్టానుసారం మాట్లాడిన కొడాలినానితో జగన్‌ బహిరంగ క్షమాపణలు చెప్పించాలని టీడీపీనేత డిమాండ్‌చేశారు. ప్రజలు ఓట్లేసింది ఐదేళ్లకు మాత్రమే ననే విషయాన్ని వైసీపీప్రభుత్వం గుర్తించాలని, టీడీపీనేతలను వేధిస్తున్నందుకు జగన్మోహన్‌ రెడ్డి అండ్‌ కో కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని బొండా హెచ్చరించారు రాష్ట్ర ఆర్థికవ్యవస్థ దివాలాతీయడంపై జాతీయమీడియా, ఆర్థికనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.ఎదురుదాడిచేస్తేనో, మంత్రులతో బూతులుమాట్లాడిస్తేనో ప్రభుత్వం చేసే తప్పులు, ఒప్పులయిపోవని ఉమామహేశ్వరరావు తేల్చిచెప్పారు.

తెలుగు భాష పై రగడ నడుస్తున్న వేళ, అవధాని గరికపాటి గారు, ఈ విషయం పై స్పందించారు. ఇది అయన స్పందన.. "ఈ రోజు ఎంతో గొప్ప భాష అయిన తెలుగు భాషకు, ముప్పు ఏర్పడిందని, గత వారం రోజులుగా అందరూ చర్చించుకుంటున్న విషయం. దీనికి ఒక భాష వేత్తగా, సాహిత్య వేత్తగా, అవధానిగా, నాకు ఈ విషయం పై చెప్పటానికి హక్కే కాదు, బాధ్యత కూడా ఉంది. ప్రశ్నించిన వాడిని ప్రతి వారిని, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి మాటలు, పెద్ద వాళ్ళ నోట అసలు రాకూడదు. ఆ మాటకి వస్తే, నాకు ఈ విషయం పై, అడిగే అర్హత ఉంది. మా పిల్లలు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదివి, ఉన్నత స్థితికి వచ్చారు. అందుకే నాకు అడిగే హక్కు ఉందని అనుకుంటున్నా. అసలు ఇది సరైన ప్రశ్నే కాదు. తెలుగు గురించి అడిగిన ప్రతి వారిని, మీ పిల్లలు ఎక్కడ చదివారు అంటూ, పెద్దా చిన్నా తేడా లేకుండా, దేశంలోనే అత్యున్నత స్థితిలో ఉన్న వారు, దేశ క్షేమాన్ని, భాషా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే, వారిని కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉంటే, అది మొండి తనం అవుతుంది కాని, వారి ప్రశ్నకు జవాబు చెప్పటం అవ్వదు.

garikapati 20112019 2

"అసలు తెలుగు మీడియం వద్దు, తెలుగు ఒక సబ్జెక్ట్ చాలు, మొత్తం ఇంగ్లీష్ మీడియం చేసేద్దాం అనేవారు అందరూ, ఇక నుంచి ఇంగ్లీష్ లోనే మాట్లాడి, మీ ప్రేమ చూపించండి. మీ రాజకీయ ఉపన్యాసాలు, ఓట్లు అడగటాలు, పాదయాత్రలు, ఇవన్నీ ఇంగ్లీష్ లోనే చేసి, ప్రజలతో ఇంగ్లీష్ ఉపన్యాసాలే ఇవ్వండి. తెలుగులో చెయ్యకండి. అప్పుడు ఎవరికీ అర్ధం అవుతుందో చూద్దాం. అలా కాదు, సామాన్య జనాలకి అర్ధం కావలి అంటే, తెలుగులోనే చెప్పాలి అని రాజకీయ నాయకులు అంటే, సామన్య జనాలకు అర్ధం కావాలంటే, మరి పాఠాలు కూడా తెలుగులోనే చెప్పాలి కదా. మొండిగా మీరు ఒకటంటే, అవతలి వారు కూడా మొండిగానే మాట్లాడతారు. ప్రశ్నించుకుంటూ కూర్చోవటం కాదు. ఎక్కడ ఇబ్బంది ఉందొ చూడండి. ప్రభుత్వ స్కూల్స్ లో , ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అనే పిల్లల తల్లి తండ్రులు కూడా ఆలోచించండి. "

garikapati 20112019 3

"ఆ ఇంగ్లిష మీడియంలో చదివి , ఇంజనీరింగ్ చేసిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారు, వారికి ఉద్యోగాలు వచ్చాయా అని ఆలోచించండి. ఉన్నవాళ్ళు అందులో జయం సాధించటానికి, వారికి ఇంగ్లీష్ సామర్ధ్యం కారణం కాదు, ఇంజనీరింగ్ లో సామర్ధ్యం ఉండటం వారికి కలిసి వచ్చింది. ఒక వ్రుత్తి పని ఏదైనా బాగా చెయ్యగలిగిన వాడిని, భాష ఏది ఆపలేదు. భాష అభివృద్ధిని ఆపలేదు, కాని సహకరిస్తుంది. ఒక మాతృభాష సహకరించినట్టుగా, మరొకటి సహకరించదు. రేపు మొత్తం ఇంగ్లీష్ అని చెప్పినా, పాఠాలు మాత్రం తెలుగులోనే చెప్తారు చూస్తూ ఉండండి. 20-30 ఏళ్ళ నుంచి చక్కటి తెలుగు పాఠాలు చెప్తున్న టీచర్స్ కూడా, ఒకేసారి ఇంగ్లీష్ చెప్పమంటే, వారు ఏమి నేర్చుకుంటారు, పిల్లలకు ఏమి చెప్తారు. ఇదంతా ఒక మహా మాయ జరుగుతుంది. తెలుగు భాషని గౌరవించాల్సిందే." అని గరికపాటి అన్నారు.

Advertisements

Latest Articles

Most Read