తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి కుడి చేతికి కట్టుతో కనిపించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశానికి చంద్రబాబు చేతికి కట్టుతో హాజరయ్యి, కార్యకర్తలను కంగారు పెట్టారు. అయితే, ఆయన కుడి చేతి నరం పై ఒత్తిడి పెరిగిందని, దానికి నొప్పి రావటంతో ఆయన కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని, దీంతో చేతికి మరింత ఒత్తిడి పెరగకుండా, చేతికి కట్టులాగా కట్టి, సపోర్ట్ గా ఉంచారని, తెలుగుదేశం వర్గాలు చెప్పాయి. నొప్పి మరీ ఎక్కవుగా ఉండటంతో, చంద్రబాబుని రెండు రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారని, అందుకే చంద్రబాబు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారని తెలుగుదేశం వర్గాలు చెప్పాయి. అయితే, ఆయన హైదరాబాద్ వచ్చారని తెలియటంతో, తెలంగాణా తెలుగుదేశం నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు కూడా చంద్రబాబుని కలిసారు.

cbn 145082019 2

రాఖీ సందర్భంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుని కలిసి రాఖీ కట్టారు. పార్టీలు వేరు అయినా, చంద్రబాబు మీద అభిమానం ఎప్పటికీ చచ్చిపోదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి చేతి కట్టు పై అక్కడ నాయకులు ఆందోళన వ్యక్తం చెయ్యటంతో, వారికి చంద్రబాబు సమాధానం చెప్తూ, ఇది చాలా చిన్న విషయం అని, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాని చెప్పారు. ఇటీవలే అమెరికాకి వెళ్లి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేపించుకున్నానని, ఎప్పటికి మీద ఈ సారి రిపోర్ట్ లు బాగున్నాయని, నా ఆరోగ్యం గురించి ఎటువంటి ఆలోచన పడాల్సిన పనిలేదని చంద్రబాబు అన్నారు. చేతికి కొంచెం ఒత్తిడి తగలటంతో, ఇబ్బందిగా ఉందని అన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చంద్రబాబు వారికి వివరించారు.

cbn 145082019 3

ఇక మరో పక్క రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై చంద్రబాబు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. నిన్న ఏకంగా జపాన్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరం రాయటంతో, చంద్రబాబు స్పందించారు. ఒక పక్క కేంద్రం చెప్తుంది, ఒక పక్క కోర్ట్ లు చెప్తున్నాయి, ఇప్పుడు విదేశాలు కూడా చెప్తున్నాయని, అయినా జగన్ మొండిగా వెళ్తున్నారని, పేరులో సగం ఉంటే, తన చేష్ట,లతో, మరో సగం మొండితనం కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. "విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష మంచిది కాదని, రాష్ట్రానికి పెట్టుబడులు దూరమవుతాయని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి చెప్పారు, వినలేదు. కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి చెప్పారు, వినలేదు. ఇప్పుడు జపాన్ రాయబార కార్యాలయం కూడా ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమని భారత్ కు లేఖ రాసింది. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే, మిగతా సగం ఆయన చేసే పనుల్లో ఉంది. రాష్ట్రం దాటి, దేశం దాటి, జగమంతా వారికి హితవాక్యాలు చెబుతుంటే... బహుశా ఇలా చెప్పించుకోవడం కూడా వాళ్ళకు గర్వకారణంగా ఉందో ఏమో! పిచ్చికి అనేక రూపాలు మరి." అంటూ చంద్రబాబు స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తిమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. రెండు రోజుల క్రితం, స్పీకర్ స్థానంలో ఉంటూ, ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటూ, తెలుగుదేశం కోన్‌కిస్కాగాళ్లు అంటూ స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీని పై చంద్రబాబు స్పందిస్తూ, ఒక స్పీకర్ అనే వ్యక్తి హుందాగా ఉండాలి. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఉండాలి. ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ, మరో పార్టీని టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తే, రాజ్యాంగబద్ధ పదవులో ఉన్న వ్యక్తికి, ఇంకా విలువ ఏమి ఉంటుంది ? తమ్మినేని పధ్ధతి మార్చుకోవాలి. స్పీకర్ స్థానంలో ఉంటూనే, వాలంటీర్లు మన వాళ్ళు అనే విధంగా స్పీకర్ మాట్లడుతున్నారని చంద్రబాబు తప్పుబట్టారు.

speaker 14082019 2

రెండు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని, శ్రీకాకుళంలో పర్యటిస్తూ, గ్రామ వాలంటీర్లకు ఎంపిక అయిన వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, వారు ఎదో వైసిపీ కార్యకర్తలు అన్నట్టు మాట్లాడారు. నిజానికి గ్రామ వాలంటీర్లు అనేది, ప్రభుత్వ వ్యవస్థ, అయితే ఇది వైసీపీ కార్యకర్తల పునరావాసంగా మారిపోయింది. ఈ సమావేశంలో గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలుగుదేశం కౌన్కిస్కా గొట్టం గాళ్ళు, గ్రామ వాలంటీర్ల పై కోర్ట్ కు వెళ్తారు, మీరేమే ఆ గొట్టంగాళ్ళని పట్టించుకొకండి, వారి సంగతి మేము చూసుకుంటాం అంటూ, వివాద్సపద వ్యాఖ్యలు చేసారు. నిజానకి, ఒక మాములు నాయకుడు మాట్లాడితేనే ఇది సంచలనం అవుతుంది, అలాంటిది ఒక స్పీకర్ ఇలా మాట్లాడటంతో అందరూ అవాక్కయ్యారు.

speaker 14082019 3

అయితే స్పీకర్ ఇలా మాట్లాడటం పై చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. ఒకటి ఆయన, ఒక పార్టీని టార్గెట్ చెయ్యటం. అలాగే రెండోది, ప్రభుత్వ వ్యవస్థ అయిన గ్రామ వాలంటీర్లని, పార్టీ కార్యకర్తలు లాగా చెప్పటం. దీని పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అలాగే, నిన్న విజయసాయి రెడ్డి కూడా, సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశంలో మాట్లాడుతూ, మీ కోసం ఏమి చెయ్యలేదు అంటున్నారు, డైరెక్ట్ గా మేము ఏమి చెయ్యలేం, ఎందుకంటే ఇది ప్రభుత్వం, కోర్ట్ లు ఊరుకోవు, అందుకే మీకు 4 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చాం, ఈ పని సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేసాం అని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యల పై కూడా చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. దీని పై ఎలా పోరాడాలో ఆలోచిస్తున్నామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రత పై, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. చంద్రబాబు అధికారం కోల్పోయిన వెంటనే, జగన్ ప్రభుత్వం చంద్రబాబు భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే చంద్రబాబు కాన్వాయ్ లో కూడా, జామర్ తొలగించి, భద్రతని కూడా 1+1 కి తగ్గించారు. అయితే, ఈ విషయం పై చంద్రబాబు హైకోర్ట్ కు వెళ్లారు. ఈ విషయం పై గత నెల రోజులు పైగా వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్ లో పెట్టారు. అయితే దీని పై ఈ రోజు హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు 97 మందితో పూర్తీ భద్రత ఇవ్వాల్సిందే అనే కోర్ట్ స్పష్టం చేసింది. మొత్తం 97 మందితో భద్రత కొనసాగించాలని చెప్పటంతో, ప్రభుత్వ వాదన కోర్ట్ నమ్మలేదని చెప్పాలి. దీంతో ప్రభుత్వానికి హైకోర్ట్ లో చిక్కు ఎదురైంది.

cbn 14802019 2

97 మందితో భద్రత మాత్రమే కాకుండా, చంద్రబాబు కాన్వాయ్ లో, జామర్ కూడా పెట్టాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. నిబంధనలు ప్రకారం మెడికల్ టీం కూడా ఇప్పటికే ఉంది. మరో పక్క, ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా, చంద్రబాబు సెక్యూరిటీలో ఉండాలని కోర్ట్ తెలిపింది. అయితే ఒక విషయంలో మాత్రం, కోర్ట్ క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబుకి ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ అంటే, చంద్రబాబు బయట తిరిగే సమయంలో కాకుండా, క్లోజ్‌డ్‌ ఉన్నప్పుడు, ఎవరు సెక్యూరిటీ ఇవ్వాలి అనే అంశం పై వాదనలు నడిచాయి. ఎన్‌ఎస్‌జీ నిబంధనలు ప్రకారం, చంద్రబాబు బయట తిరిగే సమయంలో మాత్రమే వారు భద్రత ఇస్తారు. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.

cbn 14802019 3

క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ పై రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు అని చెప్పటంతో, హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ ఎవరు చూసుకోవాలి అనే అంశంపై ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య వచ్చిన ఇబ్బందిని, మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. అయితే అప్పటి వరకు ఎవరు చూస్తారు అనే దాని పై క్లారిటీ లేదు. లెక్క ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి. ఇక మరో పక్క, దేశం అంతా, ప్రముఖులకు ఇస్తున్న సెక్యూరిటీ పై, గత నెలలో కేంద్రం రివ్యూ చేసి, ఆ సందర్భంలో కొంత మందికి ఎన్‌ఎస్‌జీ, ఎస్పీజీ భద్రత తొలగించినా, చంద్రబాబుకు ఉన్న సెక్యూరిటీ థ్రెట్ దృశ్యా, ఎన్‌ఎస్‌జీ భద్రత కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇదే విషయం చంద్రబాబు లాయర్లు కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. మొత్తానికి చంద్రబాబుకు పూర్తీ భద్రత రావటంతో, తెలుగుదేశం శ్రేణులు సంతోషం వ్యక్తం చేసాయి.

జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. ఆయన చిన్న కూతురుని, యూనివర్సిటీలో జాయిన్ చెయ్యటానికి వెళ్తున్నారు. అలాగే అక్కడ ప్రవాసాంధ్రులతో కూడా జగన్ భేటీ కానున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అక్కడ ఇంకొక వ్యక్తిని కలుస్తున్నారని, ఇది ఆ పర్యటనలోనే హైలైట్ అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అమెరికాలో ఒక అమెరికా వ్యక్తి, స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ, మన తెలుగు వారితో మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ ఒక స్టేడియంలో, ఐస్ క్రీం అమ్ముతూ, ఉన్న ఆ వ్యక్తి, మన తెలుగు వారితో, తెలుగులో మాట్లాడుతూ, అందరినీ ఆశ్చర్యపరిచారు. యుట్యూబ్, ఫేస్బుక్ లో అది బాగా ఫేమస్ అయ్యింది.

foregin 14082019 2

అతని పేరే, ఇసాక్ రిచర్డ్స్. ఇతను అమెరికా వ్యక్తి, న్యూజిలాండ్ క్రికెట్ స్టేడియంలో ఐస్ క్రీం అమ్మే వారు. అయితే ఆ వీడియో వైరల్ అవ్వటంతో, ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు ఈయన అమెరికాలో ఉంటున్నారు. అయితే జగన్ అమెరికా పర్యటనలో, ఇసాక్ రిచర్డ్స్ ను కలుస్తారాని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇంత చిన్న విషయానికి, జగన్ మోహన్ రెడ్డి, ఇతన్ని ఎందుకు కలుస్తున్నారో అర్ధం కావటం లేదు. ప్రస్తుతం ఇసాక్ రిచర్డ్స్ కి, అమెరికాలో, తెలుగు సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉందని, తెలుగు ఈవెంట్స్ అన్నిటికీ ఇతన్ని పిలుస్తున్నారని, అందుకే ఆ క్రేజ్ ఉన్న వ్యక్తిని కలిసి, తెలుగు బాగా మాట్లాడుతున్నందుకు జగన్ అభినందిస్తారాని అంటున్నారు. జగన్ అమెరికా పర్యటనలో ఇదే హైలైట్ అంటున్నారు.

foregin 14082019 3

అయితే ఇసాక్ రిచర్డ్స్ అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు ? మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తిరిగారు అనేది ఆరా తీస్తే, ఈయన గుaరించి కొన్ని విషయాలు తెలిసాయి. ఇవి ఇప్పటికే ప్రచారం కూడా అయ్యాయి. ఇసాక్ రిచర్డ్స్ విజయవాడ, విశాఖపట్నంలో రెండేళ్ళుకు పైగా ఉన్నారంట. ఆ సమయంలో ఏమి చేసే వారు అంటే, ఆయన ఇక్కడ మత ప్రచారం చేసే వారంట. రెండేళ్ళ పాటు క్రీస్టియానిటీని ఇక్కడ వ్యాప్తి చెయ్యటంలో భగంగా, ఆయన తెలుగు బాగా నేర్చుకున్నారని తెలుస్తుంది. అయితే అప్పట్లో మత ప్రచారం కోసం తెలుగు నేర్చుకుంటే, ఇప్పుడు ఆ తెలుగు భాష, అతన్ని ఒక్క వీడియోతో సెలబ్రిటీని చేసింది. జగన్ ని కలిసిన తరువాత, ఆయన ఇంకా ఎన్ని సంగతలు చెప్తారో చూడడం.

Advertisements

Latest Articles

Most Read