వైసిపీ పార్టీలో నెంబర్ టు అయిన విజయసాయి రెడ్డి కృషి అంతా ఇంతా కాదు. ఢిల్లీ లెవెల్ లో జగన్ కు సంబంధించిన విషయాలు అన్నీ చక్కబెట్టటంలో ఆరితేరిపోయారు విజయసాయి రెడ్డి. అందుకే ఆయానకు ఎన్ని విమర్శలు వచ్చినా, రాజ్యసభ సీటు కట్టబెట్టారు జగన్. అంతటితో ఆగలేదు, అధికారం రాగానే, నిబంధనలు సడలించి మరీ, ఆయనకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యెక ప్రతినిధిగా నియమించారు. ఇంత ప్రాధాన్యత జగన్ ఇస్తున్నారు అంటే, విజయసాయి రెడ్డి చేస్తున్న సేవలు అంత ముఖ్యవైనవి. తక్కువ కాలంలోనే, ప్రధాని మోడీ చేత, విజయ్ గారు అని పిలిపించుకున్నారు అంటే, విజయసాయి రెడ్డికి ఢిల్లీలో ఉన్న పలుకుబడి ఏంటో ఇట్టే అర్ధమై పోతుంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఎవరినీ నమ్మకపోయినా, విజయసాయి రెడ్డిని మాత్రం అందలం ఎక్కించారు.

vsreddy 20072019 2

ఇంతకీ విజయసాయి రెడ్డి సక్సెస్ ఫార్ములా ఏంటో ఆలోచిస్తే మనకు ఇట్టే అర్ధమై పోతుంది. అయిన సక్సెస్ ఫార్ములా, ఒక బోకే, ఒక శాలువా, ఒక వెంకటేశ్వర స్వామీ విగ్రహం. వీటితోనే ముందు ఢిల్లీ పెద్దలతో పరిచయాలు పెంచుకుని, వారికి దగ్గర అయిపోతున్నారు. మొన్నా మధ్య రాష్ట్రపతి ఎన్నికల సమయంలో విజయసాయి రెడ్డి తీరు చూసి అందరూ ఆశ్చర్య పోయారు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో బీజేపీ పెద్దలు చెప్పకుండానే, ఎవరి పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయో, వారిని ముందే కలిసి వారికి బోకే ఇచ్చి, ఫోటో దిగేవారు. అప్పట్లో ఆయన తీరుతో అందరూ అవాక్కయ్యారు కూడా. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారో, ఢిల్లీ లీడర్స్ కు అర్ధం కాలేదు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి అనుకోండి. రాష్ట్రపతిగా రాంనాద్ కోవిండ్ డిసైడ్ అవ్వగానే, ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం కూడా తీసుకున్న సీన్లు మనం చూసాం.

vsreddy 20072019 3

అయితే ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారు విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఒరిస్సాకు చెందిన, బిశ్వభూషన్ హరిచందన్‌ను రాష్ట్రపతి నియమించిన సంగతి తెలిసిందే. ఆయన 23 తారీఖున విజయవాడ వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, అంత కంటే ముందే, ఈ రోజు, బిశ్వభూషన్ హరిచందన్‌ను భువనేశ్వర్ లో కలిసారు విజయసాయి రెడ్డి. ఆయనకు బోకే, శాలువా, వెంకటేశ్వర స్వామి ఫోటో బహుకరించి, మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. అయితే, విజయసాయి రెడ్డి ఇంత హడావిడిగా, ఆయన విజయవాడ రాక ముందే, ఎందుకు వెళ్లి కలిసారో అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గవర్నర్ ను మచ్చిక చేసుకునే విషయంలో, ముందుగానే అక్కడి దాకా వెళ్ళారని, గవర్నర్ తో మంచి సంబంధాలకు ఇది దోహద పడుతుంది, వైసిపీ నేతలు అంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన ఒక్క మాటతో, ఈ రోజు ఇంటర్నెట్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆక్టివేట్ అయ్యేలా చేసింది. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబుని ఎంత హేళన చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఈ క్రమంలోనే, చంద్రబాబు అనుభవం గురించి మాట్లాడుతూ, ఏంటి అయ్యా నీ 40 ఇయర్స్ అనుభవం, మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని డబ్బా కొట్టుకుంటావ్, ఈ 40 ఏళ్ళలో నువ్వు నలుగురికైనా రోల్ మోడల్ కాగిలిగావా అంటూ తీవ్రంగా అవమానించారు. అంతకు ముందు మంత్రి అనిల్ కూడా, 40 ఇయర్స్ కాదన్నయ్యా, బులెట్ దిగిందా లేదా అంటూ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన భాష చూసాం. అయితే జగన్ కూడా, నువ్వు 40 ఇయర్స్ లో, కనీసం నలుగురికి కూడా రోల్ మోడల్ కాలేకపోయావ్ అని విమర్శలు చేసారు. కాని చంద్రబాబు మాత్రం, ఆ మాటలకు ఎక్కడా, ఎదురుతిరిగిన జగన్ ను ఒక్క మాట కూడా అనలేదు.

jagan 20072019 1

అయితే జగన్ చెప్పిన మాటలకు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, చంద్రబాబుని అభిమానించే వారు మాత్రం, సరైన సమాధానం ఇస్తున్నారు. మై రోల్ మోడల్ చంద్రబాబు అంటూ, హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి, సోషల్ మీడియాలో, చంద్రబాబు మాకు ఆదర్శం, చంద్రబాబు వల్లే మా జీవితాలు ఇలా ఉన్నాయి అంటూ, పోస్ట్ చేస్తున్నారు. అంతే కాదు, గతంలో, వివిధ దేశాధినేతలు, ఆర్ధిక వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, ఆధ్యాత్మిక గురువులు, ఇలా అనేక మంది చంద్రబాబు విధానాలను మెచ్చుకుంటూ, వాటిని అందరూ పాటించాలని, చంద్రబాబు విజనరీ అని, ఇలా అనేక విధాలుగా చంద్రబాబుని పొగిడిన వీడియోలు, పేపర్ కటింగ్స్ వేసి, చంద్రబాబు ఇలాంటి వారి అందరికే రోల్ మోడల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

jagan 20072019 1

చంద్రబాబు నలుగురి కాదు, నాలుగు లక్షల మందికి కాదు, నాలుగు జనరేషన్లకి ఇన్స్పిరేషన్ అంటూ, ఆయన విధానాల వల్ల ప్రజలు జీవితాలు ఎలా బాగుపడ్డాయి, 1995 తరువాత ఐటి విప్లవం ఎలా తెచ్చారు, పల్లెల్లో పొలం పనులు చేసుకునే వాళ్ళు, అమెరికా వెళ్లి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసింది, వ్యాపారస్తులు అయ్యింది, చంద్రబాబు విధానాల వల్ల సామాజికంగా వచ్చిన మార్పులు, ఇలా అనేక విషయాల వల్ల ఎంతో మంది ఆయనకి ఇన్స్పిరేషన్ అంటూ పోస్ట్ లు పెట్టారు. ఇదే విధంగా జగన్ మోహన్ రెడ్డికి ఎవరు రోల్ మోడల్ అనే విషయం పై కూడా పోస్ట్ లు పెట్టారు. మొత్తనికి జగన్ అనాలోచితంగా మాట్లాడిన ఒక్క మాటతో, చంద్రబాబు చేసిన మంచి పనులు అన్నీ మరోసారి గుర్తు చేసుకునేలా చేసారు. అయినా ఎంత రాజకీయ వైరం ఉన్నా, ప్రత్యర్ధి గురించి కొన్ని కొన్ని ఒప్పుకోవాలి. జగన్ ఎంత కాదన్నా, చంద్రబాబుకి ప్రపంచ వ్యాప్తంగా విజనరీ అనే పేరు ఉంది. ఇలాంటి సబ్జెక్ట్ పై చంద్రబాబుతో పెట్టుకుంటే, జగన్ కే ఎదురు తగులుతుంది.

అమరావతి నిర్మాణం కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం, రుణం ఇవ్వాలి అంటూ ప్రపంచ బ్యాంక్ ను కోరిన విషయం తెలిసిందే. దాని పై నిర్ణయం తీసుకుంటూ, మేము రుణం ఇవ్వలేం అంటూ తాజాగా ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అయితే దీని పై ఎవరి వాదన వారిదిగా ఉంది. చంద్రబాబు వల్లే రుణం రాలేదని జగన్ ప్రభుత్వం అంటుంది. కొంత మంది మాత్రం, అమరావతిలో ఉండే కొంత మంది కంప్లైంట్ ఇవ్వటం వల్ల రాలేదు అంటున్నారు. ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. అయితే, ప్రపంచ బ్యాంక్ మాత్రం అసలు కారణం చెప్పింది. మాములుగా ఏదైనా రాష్ట్రం ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం పొందాలి అంటే, నిబంధనల ప్రకారం కేంద్రం ఈ ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ కు పంపాలి. అలాగే అమరావతికి రుణం కావలి అని చంద్రబాబు ప్రభుత్వం అడిగిన సందర్భంలో, అప్పట్లో కేంద్రం, ఈ ప్రతిపాదనను, ప్రపంచ బ్యాంకుకు పంపించింది.

amaravati 200072019 1

అయితే, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో, కేంద్రం ఆ ప్రతిపాదన వెనక్కు తీసుకుంది. ఇదే విషయం ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా విభాగం సీనియర్‌ కమ్యూనికేషన్స్‌ అధికారి ఎలీనా కారబన్‌ మీడియాకు తెలిపారు. భారత ప్రభుత్వం, అమరావతికి రుణం ఇవ్వండి అనే ప్రతిపాదన వెనక్కు తీసుకుంది అని, అందుకే రుణం ఇవ్వం అని చెప్పమని చెప్పారు. ఇదే విషయం, భారత్‌, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్‌కు సంబంధించి ప్రత్యేక ప్రాజెక్టులను పర్యవేక్షించే ప్రపంచ బ్యాంకు విదేశీ వ్యవహారాల సలహాదారు సుదీప్‌ మజుందార్‌ కూడా చెప్పారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డుకు తెలియటంతో, అమరావతికి లోన్ ఇచ్చే విషయం వెనక్కు తీసుకున్నామని, వివరించారు.

amaravati 200072019 1

అయితే ఇప్పుడు ప్రశ్న, కేంద్రం ఎందుకు ఇలా చేసింది అని ? ఈ విషయం పై ఆరా తీస్తే, గత నెలలో ప్రపంచ బ్యాంక్ అధికారులు, అమరావతి వచ్చి, అక్కడ జరుగుతున్న పనులు అన్నీ చూసి, అపుడు రుణం ఇచ్చే విషయం పై ఆలోచిస్తామని, మా పర్యటనకు పర్మిషన్ కావాలని కోరారు. అయితే అమరావతి పై ఆసక్తి లేని జగన్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పై అనాసక్తిగా ఉందని గమనించిన కేంద్ర ప్రభుత్వం, ఈ విషయం పై ఇంకా ముందుకు వెళ్ళటం అనవరం అని గ్రహించి, ప్రపంచ బ్యాంక్ కు ఇచ్చిన ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది. మొత్తానికి జగన్ ప్రభుత్వం, కేంద్రం కలిసి, ఇలా మన అమరావతికి లోన్ రాకుండా అడ్డుకున్నారు. చూద్దాం ఈ కొత్త ప్రభుత్వం, వాళ్ళు ఏమైనా కొత్త లోన్లు తీసుకు వస్తారేమో ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం రివర్స్ ట్రెండ్ లో వెళ్తుంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో విమాన సర్వీసులు పెరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా తగ్గుతూ వస్తున్నాయి. విమానయాన సంస్థలు ఏ మార్గంలో డిమాండ్ ఉందో చూసుకుని ఆ వైపునకు సర్వీసులు మళ్లించి విశాఖకు సేవలను నిలిపివేస్తున్నాయి. దీంతో నిలిపివేస్తున్న విమాన సర్వీసుల సంఖ్య క్రమంగా పెరిగి పోతోంది. దీని పై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికులు సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం ఫలితం కనిపించటం లేదు. శ్రీలంక ఎయిర్లైన్స్ తన సర్వీసు అంత లాభాదాయకంగా లేకపోవటంతో రద్దు చేసుకుంది. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అందించాల్సిందిగా కోరితే ప్రభుత్వం స్పందించలేదు.

vizag 20072019 2

అయితే విశాఖతో శ్రీలంకకు వాణిజ్య సంబంధాలు ఉండటంతో అక్కడి విమానయాన సంస్థ ఒకటి 14 మంది ప్రయాణించే చిన్న విమానాన్ని నడిపేందుకు ముందుకు వచ్చింది. ఈ సర్వీసు త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ అలయెన్స్ ఇటీవల విశాఖపట్నం-విజయవాడ-తీరుపతి విమానాన్ని రద్దు చేసింది. ఎయిర్ ఇండియా చైర్మన్న ఢిల్లీలో విమాన ప్రయాణికుల సంఘం కలిసి విన్నవించినా ఆ సర్వీసును పునరుదరించ లేదు. విశాఖపట్నం నుంచి కొచ్చిన్ వెళ్లే సర్వీసును కూడా ఇటీవల రద్దు చేశారు. మరోవైపు స్పైస్ జెట్ కూడా కోల్కతా విమాన సర్వీసును ఉపసంహరించుకుంది. ఇండిగో బెంగళూరుకు నడిపే రెండు విమానా లను రద్దు చేసింది.

vizag 20072019 3

జెట్ ఎయిర్ వేస్ సంక్షోభంతో ఢిల్లీ, ముంబై సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్. హైదరాబాద్, చెన్నై నగరాలకు ఆగస్టు నుంచి సర్వీసులను నిర్వహించటం లేదంటూ టికెట్లను విక్రయించటం లేదు. నెల రోజుల పాటు విమాన సర్వీసులు అందుబాటులో లేవని చెబుతున్నారని ట్రావెల్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఆ తర్వాత ఈ సర్వీసులను కొనసాగిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇలాగే అన్ని కీలక సర్వీసులు రద్దు చేసుకుంటూ పోతున్నారు. సింగపూర్ విమానం రద్దు అయిన సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ, హైదరాబాద్ కు సర్వీసులు తగ్గించేసారు. దీని పై చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అయినా, హైదరాబాద్ నుంచి వెళ్ళేలా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని, చంద్రబాబు విమర్శిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read