జెడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబు పై, రాళ్ళ దా-డి నేపధ్యంలో, ఒక్కారిగా టిడిపి శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. తిరుపతి ప్రచార సభలో చంద్రబాబు పై రాళ్ల దా-డి, తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలు అవ్వటం, తరువాత చంద్రబాబు నిరసన వ్యక్తం చేయటం, ఈ సంఘటనలు అన్నిటి నేపధ్యంలో, టిడిపి అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య నేతృత్వంలో, ఒక ప్రతినిధి బృందం, అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ అడిగింది. గవర్నర్ ను కలిసి, ఈ రోజు జరిగిన ఘటన నేపధ్యంలో తీసుకోవలసిన భద్రతా చర్యలు, పోలీసులు వైఫల్యం తదితర అంశాల పై ఆయనకు వివరించాలని, టిడిపి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ కార్యాలయం ద్వారా, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు రాత్రికి అపాయింట్మెంట్ ఇస్తారా, లేదా రేపు ఉదయం గవర్నర్ అప్పాయింట్మెంట్ ఇస్తారా అనేది చూడాలి. ముఖ్యంగా జెడ్ ప్లస్ లో ఉన్న చంద్రబాబుకే రక్షణ లేకపోతే, ప్రజల పరిస్థితి ఏమిటి అనే విషయం పై ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు ప్రచార సభలకు, ప్రచారానికి, ఇంటి ఇంటి ప్రచారానికి ముందే అనుమతి తీసుకున్నారు.

tirupati 12042021 2

అయినా పోలీసులు నుంచి భద్రత అంతఅంతమాత్రంగానే ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా, ప్రతిపక్ష నేతగా,జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న చంద్రబాబు పై, ముందుగా పర్మిషన్ తెసుకున్న, పోలీసులు రక్షణ కల్పించకపోవటం కారణంగానే ఈ ఘటన జరిగిందని టిడిపి ఆరోపిస్తుంది. అసలు ఇది ఎవరు చేసారు, చేయించింది ఎవరు అనే అంశం పై కూడా దర్యాప్తు జరపాలని, గవర్నర్ ను కలిసి కోరాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. అలాగే రేపు జరగబోయే ఎన్నికలు కూడా కేంద్ర బలగాల మధ్య జరిపించాలని కూడా గవర్నర్ ను కోరనున్నారు. దీనికి సంబంధించి, అటు కేంద్రానికి, రాష్ట్రానికి కూడా తగు ఆదేశాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని, టిడిపి నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇస్తే, ఈ రోజే ఆయన్ను కలిసి వివరించాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. అపాయింట్మెంట్ విషయం పై, గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు ఇంకా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఈ రోజు రాళ్ళ దా-డి జరిగింది. తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచార్మలో ఉన్న చంద్రబాబు పై, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు వేయబోయారు. అయితే అవి పక్కన ఉన్న వారి పై పడ్డాయి. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. దెబ్బతగిలిన యువకున్ని తన వాహనంపై తీసుకొచ్చిన చంద్రబాబు మాట్లాడించారు. దీంతో సభకు పోలీసులు రక్షణ కల్పించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రచార వాహనం దిగి, రోడ్డుపై బైఠాయించారు చంద్రబాబు. జడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న నాకు రక్షణ కల్పించకకపోతే సామాన్యులకు ఏమి కల్పిస్తారని ప్రశ్నించారు. కొద్ది సేపు ధర్నా చేసిన తరువాత, ఎస్పీ కార్యాలయం వరకు చంద్రబాబు ర్యాలీగా బయలు దేరారు. కృష్ణాపురం ఠాణా కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ ఎస్పీకి ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే విషయం తెలుకున్న ఎస్పీ, ఆమె స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఏప్రిల్ 17న యువజన శ్రామిక రైతు పార్టీ భవిష్యత్తు తేలిపోనుంది. అదే రోజు తిరుపతి ఉప ఎన్నిక ఓటింగ్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పబోయేది, ఆ రోజు జరిగే ఎన్నికకు, దీనికి సంబంధం లేని విషయం. తిరుపతి ఉప ఎన్నికల టెన్షన్ లో ఉన్న వైసీపీ, ఏప్రిల్ 17న కోర్టు ఏమి తీర్పు ఇస్తుందా అనే టెన్షన్ కూడా పట్టుకుంది. అయితే ఇదే ఏదో ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, పార్టీకి సంబందించిన విషయమే. కడప జిల్లాకు చెందిన మహబూబ్ భాషా అనే వ్యక్తి, ఢిల్లీ హైకోర్టులో కేసు వేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తమదని, మా పేరుని జగన్ పార్టీ వాడుకుంటుందని, చివరకు లెటర్ హెడ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాసుకుంటున్నారని, ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం అని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఆరు నెలల పాటు ఈ కేసు విచారణ ఢిల్లీ హైకోర్టులో సాగింది. ఇటు ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్ భాష, అలాగే జగన్ పార్టీ నుంచి కోర్టు ముందు వాదనలు వినిపించారు. రెండు విపుల నుంచి ఢిల్లీ హైకోర్టు వాదనలు వింది. ఇద్దరి వాదనలు విన్న తరువాత, వాదనలు ముగిసినట్టు ప్రకటించింది. దీని పై ఈ నెల 17న తీర్పు ఇస్తామని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.

ysrcp 12042021 2

దీంతో ఇప్పుడు ఏప్రిల్ 17న ఏమి అవుతుందా అనే టెన్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇప్పటికిప్పుడు ఏమి ఇబ్బందులు లేకపోయినా, ఢిల్లీ హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, ఇది కొద్దిగా ఊరట కలిగించే అంశం అనే చెప్పాలి. అయితే ఈ కేసు పూర్వాపరాలు చూస్తే, ఇది కూడా రఘురామరాజు పుణ్యమా అని, బయట పడిన విషయమే. విజయసాయి రెడ్డి, రఘురామరాజు కి నోటీస్ ఇవ్వటం, ఆ నోటీస్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటంతో, రఘురామరాజు అభ్యంతరం చెప్పారు. తనకు బీఫాం ఇచ్చింది యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి అయితే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటూ ప్రశ్నించటంతో, అసలు ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయ్యింది. ముందు మా పార్టీ రిజిస్టర్ అయ్యిందని, ఎన్నికల కమిషన్ కూడా మాకే ఆ పేరు ఇచ్చింది, కానీ యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రం, మా పార్టీ పేరు వాడుకుంటుందని, ఇది అన్యాయం అంటూ, కోర్టులో కేసు వేసారు. మరి దీని పై కోర్టు ఏమి తీర్పు ఇస్తుందో, చూడాలి.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చంద్రబాబు నాయుడు, ఈ రోజు తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గున్నారు. అయితే చంద్రబాబు ప్రసంగం అడ్డుకోవటానికి అరాచక శక్తులు రెచ్చిపోయాయి. చంద్రబాబు ప్రచారం చేస్తూ ఉండగా, చంద్రబాబు లక్ష్యంగా ఆయన పై రాళ్ళ దా-డి చేసారు. అయితే ఆ రాళ్ళు చంద్రబాబుకి తగలకుండా, కింద ఉన్న ప్రజల పై పడ్డాయి. చంద్రబాబు ప్రసంగం చేస్తున్న పక్క బిల్డింగ్ లో పై నుంచి పెద్ద సైజు గులక రాళ్ళు వచ్చి పడ్డాయి. దీంతో కొంత మందికి గాయాలు అయ్యాయి. ఈ పరిణామంతో చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. మీ రౌడీయిజం చెల్లదు అంటూ చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. నాకే రక్షణ లేకపోతే, ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటూ, నిలదీశారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న తనపైనే ఇలా దాడి చేస్తే ఇంకా ఎవరికీ చెప్పుకోవాలని అన్నారు. తన పై వేసిన రాళ్ళు తీసుకుని, ప్రజలకు చూపించారు. దాడి జరిగిన వారితో మాట్లాడించారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏకంగా రెండు మూడు రాళ్ళు విసరటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

cbn stones 12042021 2

పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కేంద్ర పరిధిలో జరిగే ఎన్నికలు ఇవి అని, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే తోక కట్ చేస్తాం అని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు ప్రసంగిస్తూ, రెండేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డాం, అభివృద్ధి భావితరాలకు అందాలి , టీడీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించాం, తిరుపతిలోనే విద్యనభ్యసించా, తిరుపతి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది, సీఎం పదవి నాకు కొత్తకాదు, ప్రజల కోసం నిరంతరం పోరాడే వ్యక్తిని, , టీడీపీ అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, 2029 నాటికి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలనుకున్నా, తిరుపతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్‍కే దక్కుతుంది, తిరుపతిని విద్యాకేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించా, టీడీపీ హయాంలోనే తిరుపతి అభివృద్ధి - రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేస్తోంది - ప్రత్యేక హోదాపై జగన్ అబద్ధపు మాటలు చెప్పాడు, ఏపీలో అభివృద్ధి ఆగింది, రౌ-డీ-యి-జం పెరిగింది అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

Advertisements

Latest Articles

Most Read