వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి ఆయువుప‌ట్టులాంటి ఆర్థిక సామ్రాజ్యాధినేత‌లు ఒక్కొక్క‌రూ ఊచ‌లు లెక్క పెట్టేందుకు క్యూ కడుతున్నారు. జ‌గ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసుల్లో స‌హ‌నిందితుడైన‌ అర‌బిందో శ‌ర‌త్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట‌యి, చివ‌రికి జ‌గ‌న్ చొర‌వ‌తో అప్రూవ‌ర్‌గా మారి బెయిల్ పై బ‌య‌ట‌కొచ్చాడు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ త‌న‌యుడు మాగుంట రాఘ‌వ‌రెడ్డి అరెస్ట‌య్యాడు. చీక‌టి వ్యాపారాలు చేస్తూ, జ‌గ‌న్ రెడ్డికి ఆర్థిక అండ‌దండ‌లు అందిస్తార‌నే ప్ర‌చారంలో వున్న ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవ‌ర్ హత్య‌కేసులో అరెస్ట‌యి బెయిల్ పై బ‌య‌ట‌కొచ్చారు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి కోసం మీడియా ప్ర‌మాణాలు కూడా పాటించ‌కుండా అడ్డ‌గోలు క‌థ‌నాలు అచ్చోసి వ‌దిలేసే డెక్కన్ క్రానికల్ వెంకట్రామ్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. రూ.8వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపి గతంలో రూ.264 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్ కు చెందిన 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. డెక్కన్ క్రానికల్ స్కామ్ పై ఈడీ ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. ఈ కేసులోనే వెంక‌ట్రామిరెడ్డిని అరెస్ట్ చేసింది. జ‌గ‌న్ తో ఇటీవ‌ల భేటీ అయి ఒప్పందాలు కూడా చేసుకున్న బైజూస్ ర‌వీంద్ర‌న్ పైనా ఈడీ కేసు న‌మోదు చేసింది. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి అత‌ని బంధువుల‌కి అత్యంత స‌న్నిహితుడైన సేఫ్‌ ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌ రెడ్డిని ముంబై కస్టమ్స్‌ అధికారులు రట్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన రూ.21 కోట్ల విలువైన ట్రమాడాల్‌ ట్యాబ్లెట్లను సూడాన్‌లో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. మన రాష్ట్రానికి చెందిన సేఫ్‌ ఫార్మా కంపెనీ కంపెనీ డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ సేఫ్ ఫార్మాతో వైసీపీలో పెద్ద‌ల‌కి సంబంధాలున్నాయ‌నే ప్ర‌చారం ఉంది. మొత్తానికి జ‌గ‌న్ రెడ్డియే కాదు, ఆయ‌న చుట్టూ ఉన్న‌వారు, ఆయ‌న‌తో ఒప్పందాలు చేసుకున్న వారూ ఏదో ఒక కేసులో అరెస్టు అవుతున్నారు.

జ‌గ‌న్ రెడ్డిని చంద్ర‌బాబు సైకో అంటారు. సీఎంగా ఉండి జ‌గ‌న్ రెడ్డి చేష్ట‌లు సైకోని త‌ల‌పిస్తూ చంద్ర‌బాబు మాట‌ల్ని నిజం చేస్తున్నాయి. కుప్పం ఎమ్మెల్యే, ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబుని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డానికి వీల్లేద‌ని అడ్డుకున్నారు. అంత‌కుముందు ప‌ల్నాడులో బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు వెళితే చంద్ర‌బాబు ఇంటికి పోలీసులు తాళ్ల‌తో క‌ట్టి నిలువ‌రించారు. ఇలా అడుగ‌డుగునా చంద్ర‌బాబుని అడ్డుకుంటూ వ‌స్తూన్న జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు తాజాగా తన నియోజకవర్గం కుప్పంలో బాబు సొంత ఇల్లు నిర్మించుకోకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసి ఏడాది గడచినా అనుమతులివ్వకుండా తాత్సారం చేస్తోంది.  కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం కోసం  నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం సమీపంలో కుప్పం-పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు రెండెకరాల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. దీనిని  రిజిస్ట్రేషన్  పూర్త‌యింది. ఇంటి నిర్మాణం కోసం  అన్ని పత్రాలతో దరఖాస్తు చేశారు. అథారిటీ సర్వేయర్‌  సర్వే చేశారు. ప‌త్రాలు స‌మ‌ర్పించ‌లేద‌ని ఇచ్చిన స‌మాచారంతో మళ్లీ సంబంధిత పత్రాలను ఉడాకు అంద‌జేశారు. గుంటూరులోని డైరెక్టర్‌ ఆఫ్‌ కంట్రీ టౌన్‌ అండ్‌ ప్లానింగ్‌కు కూడా ఈ ఏడాది జనవరి రెండో వారంలో స్థలానికి సంబంధించిన అన్ని పేప‌ర్లు పంపించినా, అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని ద‌ర‌ఖాస్తులు పూర్తిచేసి ప‌త్రాలు అంద‌జేసినా అనుమ‌తులు రాక‌పోవ‌డం వెనుక  సైకో పాల‌కుల ఒత్తిడి ఉంద‌ని తెలుస్తోంది.

దివంగ‌త ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డిని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌శంసించారు. నెల్లూరు జిల్లాలో యువ‌గ‌ళం పాద‌యాత్ర కొన‌సాగిస్తున్న నారా లోకేష్ వివిధ వ‌ర్గాల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఓ యువ‌కుడు మాట్లాడుతూ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా ప‌నిచేసిన గౌత‌మ్ రెడ్డి త‌మ ప్రాంతానికి కొన్ని ప‌రిశ్ర‌మ‌లు తెచ్చార‌ని, ఆయ‌న మృతితో అవి త‌ర‌లిపోయాయ‌ని చెప్పుకొచ్చారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశార‌ని కితాబిచ్చారు. ఉత్సాహ‌వంతుడైన మంత్రి గౌత‌మ్ రెడ్డిని ప‌నిచేయ‌కుండా జ‌గ‌న్ స‌ర్కారు అడ్డంకులు క‌ల్పించంద‌న్నారు. చివ‌రికి గౌత‌మ్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ప‌రిశ్ర‌మ‌లు తెచ్చుకోలేని ప‌రిస్థితుల్లోకి జ‌గ‌న్ రెడ్డి నెట్టేశార‌ని వివ‌రించారు. గౌత‌మ్ రెడ్డి వివిధ ప్ర‌తిపాద‌న‌ల‌తో కంపెనీల‌ను ర‌ప్పించేందుకు చంక‌లో ఫైళ్లు పెట్టుకుని తిరిగార‌ని చెప్పుకొచ్చారు. అయితే జ‌గ‌న్ రెడ్డి తుగ్ల‌క్ పాల‌న దేశ‌విదేశాల‌కి పాకిపోవ‌డంతో తుగ్ల‌క్ వ‌ద్ద‌కి రాలేమ‌ని ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు గౌత‌మ్ రెడ్డి మొఖం మీదే చెప్పేశార‌ని లోకేష్ వివ‌రించారు. టిడిపి హ‌యాంలో చేసిన 13 జిల్లాల అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌ని ఇప్పుడు జ‌గ‌న్ రెడ్డి ఏర్పాటు చేసిన 26 జిల్లాల విభ‌జ‌న‌కి అనుగుణంగా మార్పు చేయాల్సి ఉంద‌ని.. క్ల‌స్ట‌ర్ బేస్డ్ డెవ‌ల‌ప్మెంట్ ప్లాన్ చేస్తున్నామ‌ని యువ‌నేత లోకేష్ వివ‌రించారు.

స్టాన్ ఫోర్డులో చ‌దివినా నారావారిప‌ల్లె  కుర్రాడిని అనిపించుకున్నాడు నారా లోకేష్‌. వ‌ర‌ల్డ్ బ్యాంకులో వ‌ర్క్ చేసినా సీమ‌ప‌ల్లెల చిన్నోడినే అని నిరూపించుకున్నాడు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభం రాయ‌ల‌సీమ‌నే ఎంపిక చేసుకున్నారు. రాయ‌ల‌సీమ వైసీపీ వాళ్ల తాత జాగీరులా లోకేష్‌ని అడుగుపెట్ట‌నివ్వ‌మంటూ బీరాలు ప‌లికారు. నేనూ సీమ బిడ్డ‌నేన‌ని నిన‌దించారు. యువ‌గ‌ళం జ‌న‌స్వ‌ర‌మై దిగ్విజ‌యంగా పూర్తి చేశారు. క‌డ‌ప జిల్లా సీఎం జ‌గ‌న్ రెడ్డి, చిత్తూరు జిల్లా షాడో సీఎం పెద్దిరెడ్డి, అరాచ‌కాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనంత వైసీపీ లీడ‌ర్లు, క‌ర్నూలులో క‌ర‌డుగ‌ట్టిన నేర‌గాళ్ల‌యిన వైసీపీ పెద్ద‌ల‌ని అవినీతి కోటలు బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ మీసం మెలేసి లోకేష్ స‌వాళ్లు విసిరారు. కుప్పంలో ప్రారంభించి బద్వేలు నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కూ 124 రోజులపాటు  44 నియోజవకర్గాల‌లో 1587 కిలోమీటర్లు పాద‌యాత్ర చేశారు. కుప్పంలో యువగళం చినుకుగా మొద‌లై రాయ‌ల‌సీమ ముగిసేనాటికి జ‌న‌సంద్ర‌మై ఎగిసింది. రాయ‌ల‌సీమ పాద‌యాత్ర‌లో వ‌ల‌స‌లు, రైతుల అగ‌చాట్లు, పేద‌ల క‌న్నీళ్లు చూశాడు. ప్ర‌తిరంగ‌మూ కుదేలై ఆప‌న్న‌హ‌స్తం కోసం ఎదురుచూస్తోంది. కుల‌,మ‌తాల‌కు అతీతంగా లోకేష్ వెంట జ‌నం న‌డిచారు.  4 నెల‌ల రాయలసీమలో సాగిన యువ‌గ‌ళంలో ప‌రిశీలించిన స‌మ‌స్య‌లు, త‌న దృష్టికి వ‌చ్చిన డిమాండ్లు, ప్ర‌జ‌ల ఆవేద‌న‌లు తీర్చే విజ‌న్‌ని సిద్ధం చేశారు. అదే మిష‌న్ రాయ‌ల‌సీమ‌.  టిడిపికి అధికారం ఇవ్వండి-అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ప్ర‌జ‌ల‌ని చైత‌న్యం చేశారు. రాయ‌ల‌సీమలో పాద‌యాత్ర పూర్తి చేసుకుని నెల్లూరులోకి అడుగు పెట్టేముందు జ‌న్మ‌భూమికి ముద్దాడి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆత్మీయ ప్రేమ‌ని పంచిన రాయ‌ల‌సీమ గ‌డ్డ‌ని మ‌రువ‌డు ఈ బిడ్డ అంటూ ప్ర‌తిన‌బూనాడు.

Page 6 of 3181

Advertisements

Latest Articles

Most Read