సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి వైనాట్ 175 స్లోగన్ అందుకున్న నుంచీ వైసీపీ తిరోగ‌మ‌నం మ‌రింత స్పీడు అందుకుంది. కుప్పం కొడ‌తామంటూ వైసీపీ ప్ర‌గ‌ల్భాలుగా మిగిలిపోయేలా ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. స‌మ‌యం-సంద‌ర్భం చిక్క‌డంతో నీ పులివెందుల నిల‌బెట్టుకో ద‌మ్ముంటే అంటూ టిడిపి అధినేత ప్ర‌తీ స‌మావేశంలోనూ స‌వాల్ విసురుతున్నారు. చాలెంజ్ చేస్తున్న‌ట్టే..కార్యాచ‌ర‌ణ కూడా మొద‌లు పెట్టేశారు. పులివెందుల నుంచి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ ర‌విని గెలిపించుకున్న టిడిపి, తాజాగా ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి కూడా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని నిల‌బెట్టి తిరుగులేని విజ‌యం సాధించగ‌లిగారు. అనంత‌రం క‌డ‌ప జిల్లాలో యువ‌నేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి క‌నివినీ ఎరుగ‌ని జ‌న ప్ర‌భంజ‌నం పోటెత్తింది. ప‌రిస్థితుల‌న్నీ అనుకూలిస్తున్న త‌రుణంలో వైసీపీ కుప్పం వైపు రావ‌డం కాదు..టిడిపియే పులివెందుల కుంభ‌స్థ‌లాన్ని కొట్టాల‌ని చూస్తోంది. ఇదే స‌మ‌యంలో  కుప్పంలో తిరుగులేని మెజారిటీ సాధించి తెలుగుదేశం కుటుంబం కుప్పం అని నిరూపించాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేశారు. ఇక తానే నేరుగా క్షేత్ర‌స్థాయిలోకి దిగారు చంద్ర‌బాబు.  కుప్పంలో "లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యం" పేరిట క్యాంపెయిన్‍కు శ్రీకారం చుట్టారు. కుప్పం టిడిపికి మ‌రింత బ‌లం చేకూర్చేందుకు త‌ట‌స్తులు, ఇత‌ర పార్టీల నేత‌ల‌ని కూడా చేర్చుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబు టిడిపిలో చేరారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపికి ఉన్న యంత్రాంగానికి అద‌నంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ ని దింపారు. నిమ్మ‌ల రామానాయుడు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల ప‌ర్య‌వేక్ష‌ణ బృందంలో ఉన్నారు. మొత్తానికి చంద్ర‌బాబు కుప్పంలో తాను ల‌క్ష ఓట్ల మెజారిటీ సాధించ‌డంతోపాటు పులివెందుల వైసీపీ కంచుకోట‌కి బీట‌లు పెట్టాల‌నే భారీ వ్యూహాన్ని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో అమ‌లు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన నుంచి జ‌గ‌న్ రెడ్డి ఆయ‌న వ్యూహ‌క‌ర్త‌లు సామ‌దాన‌భేద దండోపాయాలు ప్ర‌యోగిస్తూ ఎదురులేకుండా చేసుకుంటున్నారు. ప్ర‌శ్నిస్తే ప్రాణాలు తీయ‌డం-ప‌రిహారం ఇవ్వ‌డం ప్లాన్ ఏ. త‌మ అరాచ‌కాల‌ని ప్ర‌శ్నించే మీడియా సంస్థ‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి అరెస్టు చేయించ‌డం ప్లాన్ బీ. దీనికి లొంగ‌ని కిందిస్థాయి మీడియా సంస్థ‌లు, యూట్యూబ్ చాన‌ళ్లు, ఎన‌లిస్టుల‌ని ప్యాకేజీ కింద కొనేయ‌డం ప్లాన్ సీ. ఈ మూడు ప్లాన్లు అమ‌లు చేయ‌డంలో వైసీపీ ఎటువంటి మొహమాటాల‌కి పోవ‌డం లేదు. టిడిపికి ఫేవ‌ర్ గా వివిధ చాన‌ళ్ల‌లో విశ్లేష‌ణ‌లు చేస్తున్న ఒక ఎన‌లిస్టుని భారీ ప్యాకేజీకి కొనుగోలు చేసింది వైసీపీ. మరో యూట్యూబ్ చానెల్ ప‌బ్లిక్ బైట్స్ విప‌రీతంగా తీసుకుని ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ని ప్రొజెక్ట్ చేస్తోంద‌ని ముందుగా ఆ చానెల్ ప్ర‌తినిధుల‌పై కేసులు పెట్టారు. ఈ త‌రువాత బెదిరించారు. చివ‌రికి బేరానికి వ‌చ్చార‌ని తెలిసి కోట్ల‌కి ఆ యూట్యూబ్ చానెల్ ని కొనేశారు వైసీపీ పెద్ద‌లు. టివీ5, ఈనాడు, ఏబీఎన్ కొనగ‌లిగే శ‌క్తి ఉన్నా అమ్ముడుపోయే సంస్థ‌లు కాక‌పోవ‌డంతో సీఐడీని దింపి అటాచ్మెంట్లు..కేసులు గ్యాప్ లేకుండా బిగించేస్తున్నారు.

అప్పుల కోసం నానా తిప్ప‌లు ప‌డుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఐపీఎల్ టీమ్ అవ‌స‌రమా? మ‌ంత్రి పేషీలో అటెండ‌ర్ల‌కి జీతాలు ఇవ్వ‌లేని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చిన పాల‌కులు ఐపీఎల్ టీము ఆలోచ‌న వెనుక ఏదో అతి పెద్ద కుంభ‌కోణ‌మే దాగి ఉంద‌ని అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. జ‌గ‌న్ రెడ్డిని ఒక‌రు క‌లిశారంటే, ఏదో భారీ ప్యాకేజీ తీసుకోవ‌డం, రాష్ట్రానికి న‌ష్టం చేసే వేల‌కోట్ల పందేరానికో రంగం సిద్ధం అవుతోంద‌ని నాలుగేళ్ల ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో వ‌ర‌స‌గా క్రికెట‌ర్లు జ‌గ‌న్ రెడ్డితో భేటీ అవుతున్నారు. మ‌న రాష్ట్రానికి చెందిన క్రికెట‌ర్లు మ‌న ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌డం పెద్ద విశేషం ఏమీ కాదు. అంద‌రూ ఆమోదించే భేటీలే. ఈ భేటీల వెనుక ఏదో లూటీకి స్కెచ్ వేస్తున్నార‌నే అనుమాన‌మే ఇప్పుడు ఏపీ మేధావులు వ్య‌క్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి ఆడిన అంబ‌టి రాయుడు ఇటీవ‌ల తాము గెలిచిన క‌ప్పు ప‌ట్టుకుని వ‌చ్చి సీఎం జ‌గ‌న్ రెడ్డికి చూపించాడు. సీఎస్కే గెలిచిన ఐపీఎల్ క‌ప్‌ని తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో ఉంచి పూజ‌లు చేశారు. ఈ సీఎస్కే టీము య‌జ‌మాని ఇండియా సిమెంట్స్ శ్రీనివాస‌న్ జ‌గ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసులో నిందితుడు. ఇప్పుడు చుక్క‌లు క‌ల‌పండి. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో నిందితుడైన చెన్నై సూప‌ర్ కింగ్స్ టీము క‌ప్పుని జ‌గ‌న్ వ‌ద్ద‌కి ఎందుకు తెచ్చిందో? నిబంధ‌న‌ల‌కి విరుద్ధంగా టిటిడిలో ఐపీఎల్ క‌ప్‌కి పూజ‌లు ఎలా చేశారో? ఇప్పుడు మ‌రో క్విడ్ ప్రోకో భేటీ లింక్స్ క‌లుపుతూ వెళితే ఇదీ అక్క‌డే తేలుతాయి. కోన శ్రీక‌ర్ భ‌ర‌త్. మ‌న రాష్ట్రం నుంచి టెస్ట్ కీప‌ర్ గా ఎంపిక‌య్యారు. టెస్టుల్లో అంత ప్ర‌తిభ క‌న‌ప‌ర‌చ‌క‌పోయినా, మ‌న తెలుగువాడ‌నే అభిమానంతో మ‌నం గౌర‌వించుకుంటున్నాం. 5 టెస్టు మ్యాచ్‌లు ఆడిన‌ మ‌న కోన శ్రీక‌ర్ భ‌ర‌త్ చేసిన మొత్తం ప‌రుగులు 129. యావ‌రేజ్ 18. అంటే ఒక టైలెండ‌ర్ కంటే త‌క్కువ ప‌రుగులు-యావ‌రేజ్. పోనీ ఐపీఎల్లో ఏమైనా ఇర‌గ‌దీశాడా అంటే ఇప్ప‌టివ‌ర‌కూ 10 ఐపీఎల్ మ్యాచులు ఆడిన కోన శ్రీక‌ర్ భ‌ర‌త్ 200 ప‌రుగులు కూడా చేయ‌లేదు. తెలుగు క్రికెట‌ర్‌కి జాతీయ జ‌ట్టులో స్థానం దొర‌క‌డం మ‌న‌మంతా గ‌ర్వించేదే. కానీ క‌నీస ప‌రుగులు చేయ‌కుండా స్థానం ఎలా దొరుకుతోంది..అంటే ఇదిగో ఈ లింకులు చూడండి. జ‌గ‌న్ రెడ్డి కోట‌రీ స్వామీజీ విశాఖ‌ స్వ‌రూపానంద‌. జ‌గ‌న్ రెడ్డిని కాపాడే అదృశ్య‌శ‌క్తి అమిత్ షా కొడుకు జై షా. కోన శ్రీక‌ర్ భ‌ర‌త్ విశాఖ‌లో స్వ‌రూపానంద ఆశీస్సులు అందుకుంటే, జ‌గ‌న్ రెడ్డి ఆశీస్సుల‌తో జై షా టీములో స్థానం ఇస్తారు. టీములో చోటు ఇప్పించే స్వామీజీ-జై షా ఆట ఆడించ‌లేరు క‌దా! అదే మ‌న భ‌ర‌త్ కి శాపం. త‌న‌కి టెస్టులో చోటు ఇప్పించిన సీఎం జ‌గ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకునేందుకు తాడేప‌ల్లి ప్యాలెస్‌కి వ‌చ్చాడు. చెప్పాడు. కానీ స‌డెన్‌గా ఐపీఎల్ టీము ప్ర‌పోజ‌లే ఆశ్చ‌ర్యం. మ‌ళ్లీ ఏపీ ఐపీఎల్ టీముకి సీఎస్కే మార్గ‌నిర్దేశ‌క‌త్వం అంటే...ఏదో అతి పెద్ద క్విడ్ ప్రోకో స్కెచ్ రెడీ అవుతోంద‌నే అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి.

కుక్క తోక ప‌ట్టుకుని గోదావ‌రి ఈద‌డం మాదిరిగానే ఉంది వైసీపీ మ‌ద్ద‌తుతోఓ ప్రముఖ చానెల్  పోరాటం. మునిగిపోయే ప‌డ‌వ‌లాంటి వైసీపీ కోసం సదరు చానెల్  ద‌శాబ్దాలుగా కూడ‌గ‌ట్టుకున్న క్రెడిబులిటీ-రేటింగ్స్ కూడా ప‌ణంగా పెట్టేయ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చనీయాంశం అవుతోంది. వాస్త‌వంగా తెలంగాణ పెద్దల కోసం ర‌విప్ర‌కాశ్‌ని ర‌క‌ర‌కాల కేసుల్లో ఇరికించి ఆ చానెల్  చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ కోసం కాకుండా జ‌గ‌న్ కోసం 24 గంట‌లూ ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టింది.  స‌రే ఎవ‌రు య‌జ‌మాని అయితేనేం? ఏళ్లుగా సాధించుకున్న నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని వైసీపీ కోసం వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డింది. ఇప్పుడు ఆ ప్రముఖ చానెల్  నెంబ‌ర్ 1 స్థానాన్ని వ‌దులుకుంది. ఒక వారం బార్క్ రేటింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌కి వ‌చ్చిన ఆ ఛానెల్  కోట్లు ఖ‌ర్చు చేసి కుట్రలతో, కుతంత్రాలతో నెంబర్ వన్ స్థానం ఎవరూ కొట్టేయ్య‌లేరంటూ భారీ హోర్డింగుల‌తో హోరెత్తించింది. కేకులు క‌ట్ చేశారు. సిబ్బందితో బ‌ల‌వంత‌పు సంబ‌రాలు చేసి సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ నెంబ‌ర్ వ‌న్ సంబ‌రం ఒక్క వారం కూడా నిల‌వ‌లేదు.  23వ వారానికి  80 పాయింట్లతో ఎన్టీవీ దూసుకుపోయింది. ముఖ్య‌మైన మెట్రో న‌గ‌రం హైద‌రాబాద్‌లోనూ ఆ చానెల్ రేటింగ్ ఫ‌స్ట్ ప్లేసు నుంచి జారిపోయింది.   తెర‌చాటు య‌జ‌మాని కోసం అథఃపాతాళానికి దిగ‌జారిపోయి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేయ‌డానికీ వెనుకాడ‌ని ఆ చానెల్ విశ్వ‌స‌నీయత పూర్తిగా కోల్పోయింది. విలువ‌లు-వంకాయ‌లు- మూట‌గ‌ట్టి మూల‌న పెట్టి వ‌క్రీక‌ర‌ణ‌లు, వ‌క్ర‌భాష్యాల ఆ చానెల్ ప్ర‌స్తుతం సెకండ్ ప్లేస్. ఇలాగే కొన‌సాగితే ఆ స్థానం అట్ట‌డుగుకి చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అంటున్నారు మీడియా ఎన‌లిస్టులు.

Page 7 of 3181

Advertisements

Latest Articles

Most Read