పదేళ్ళ నెల్లరు జిల్లా వాసుల కల సాకారం కానుంది. దగదర్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంఖుస్థాపన చెయ్యనున్నారు. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. పారిశ్రామికంగా ఎదుగుతున్న జిల్లాకు విమానాశ్రయం అవసరమని గత ప్రభుత్వం గుర్తించినా, భూసేకరణ జాప్యం కావడం, ప్రభుత్వంలో పాలకుల ఉదాసీనతతో విమానాశ్రయం పనులు ముందుకు సాగలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ దగదర్తి వద్ద విమానాశ్రయం నిర్మించాల్సిందేనని నిర్ణయించింది. దీని కోసం భూసేకరణ చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. పదేళ్లుగా ఈ విమానాశ్రయం కోసం పాలకులు ఎన్నో హామీలు గుప్పించి ఇదిగో వస్తోంది. అదిగో వస్తోంది. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. చంద్రబాబు సర్కార్ ఈ విమానాశ్రయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమం అయింది.

nellore 23052018 2

దగదర్తి విమానాశ్రయం కొరకు 1051 ఎకరాల భూములు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిపోర్ట్‌ నిర్మాణ సంస్థ అప్పగించారు.. విమానాశ్రయ నిర్మాణానికి ప్రస్తుతం రన్‌వే, ఇతర నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన భూములను అప్పగించామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇచ్చిన భూములతో నిర్మాణం చేపట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కొన్ని భూములకు సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నా.. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పటి వరకు అప్పగించిన 1,051 ఎకరాల్లో.. పట్టా భూములు 231.39 ఎకరాలు, డీకేటీ భూములు 151.11 ఎకరాలు, సీజేఎఫ్‌ఎస్‌ భూములు 301.91 ఎకరాలు, ఏ.డబ్ల్యూ భూములు 137.57 ఎకరాలు, పోరంబోకు భూములు 226.11 ఎకరాలను విమానాశ్రయ నిర్మాణ సంస్థకు అప్పగించారు.

nellore 23052018 3

గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిపోర్ట్‌ నిర్మాణ సంస్థ తరఫున అధికారుల బృందం కూడా జిల్లాకు వచ్చి సమీక్ష నిర్వహించి వెళ్లింది. ఇంకా సేకరించాల్సిన 336 ఎకరాల్లో.. పట్టా భూములు 104.9 ఎకరాలు ఉండటం గమనార్హం. డీకేటీ భూములు 23.42 ఎకరాలు, పోరంబోకు భూములు 208.14 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 1,051 ఎకరాలు సేకరించారు భూముల సేకరణ.. పరిహారం రైతులకు ఇవ్వటం మాత్రమే పూర్తయింది. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్‌ నెలలో సీఎం జిల్లా పర్యటన ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో దగదర్తి విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. దాదాపు దశాబ్దకాలం ఎదురుచూపులకు నిరీక్షణ ఫలిస్తున్నది.

బెంగళూరు పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వెళ్లిన ఆయన.. తన పిలుపు మేరకు ఇక్కడ భాజాపాకు వ్యతిరేకంగా ఓటు వేసిన తెలుగువారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబుకు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం భాజపాయేతర పక్షాలను ఇందుకు అనుకూలంగా మద్దతు కోరారు.

cbnbangalore 23052018 2

బెంగుళూరులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని బహుజన సమాజ్ వాద్ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిని, సిపిఐ, సిపియం జాతీయ నేతలను, ఆకలీ దళ్ అధినేతను, కలిసి పరిస్థితిని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో పరిణామాలు, భాజపా కుట్ర రాజకీయాలను ఆయా నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను ఆయా నేతలు చంద్రబాబుకు వివరించారు. ప్రాంతీయ పార్టీలన్నీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని మమతాబెనర్జీ బాబుతో అన్నట్లు సమాచారం.

cbnbangalore 23052018 3

రాష్ట్రాల హక్కులను హరించేలా 15వ ఆర్థికసంఘం సిఫార్సులు ఉన్నాయన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలపై కేజ్రీవాల్, మమత ఏకీభవించారు. 1971 జనాభా లెక్కలపై వారు చర్చలు జరిపారు. కర్ణాటక పరిణామాలే ఇందుకు నాంది కావాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరం ఉందని మాయావతి ప్రస్తావించినట్లు సమచారం. జాతీయ స్థాయిలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశం నేతల భేటీల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో పక్క పశ్చిమబెంగల్ సీఎం మమత బెనర్జీ, భారతీయ జనతాపార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరమని, కూటమిని ఏర్పాటు చేయాలని ఏపీ చంద్రబాబుకు సూచించారు.

అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించాలని డీజీపీని చంద్రబాబు ఆదేశించారు. వదంతులు వ్యాపింపచేసి ప్రజల్లో భయం పెంచేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు... గత వారం రోజులుగా, రాష్ట్రంలో జరుగుతున్న విష ప్రచారం పై చంద్రబాబు ఈ సమీక్ష చేసారు. ఇప్పటికే రాష్ట్ర హోం శాఖ కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది... ఇప్పుడు పరిస్థితి తీవ్రతని దృష్టిలో పెట్టుకుంది, స్వయంగా ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగారు..

dgp 23052018 2

"పార్ధీ గ్యాంగ్ సంచరిస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. అమ్మాయలు, చిన్న పిల్లలను అపహరిస్తున్నారు అని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవి ప్రజలు నమ్మకండి. ఆ తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను భయపెడుతున్న వారి పై, విచారణ చేసి, సరైన ఆక్షన్ తీసుకుంటాం.." అంటూ హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.. దొంగలు ఇళ్లల్లో చొరబడి సొత్తు దోచుకోవడంతో పాటు మనషులపై దాడులు చేస్తున్నారని, చిన్న పిల్లలను అపహరించి హత్యలు చేస్తున్నారన్న వదంతులు వాట్సాప్‌ గ్రూపుల్లో వ్యాప్తి చెందటంతో గత కొన్ని రోజులుగా ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు..

dgp 23052018 3

ఇవన్నీ ఒక పధకం ప్రకారం, రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థుతులు నెలకొల్పటానికి, ఎవరో చేస్తున్నారు అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు.. ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు... ప్రజలని ఇలా భయపెడుతూ, ఎదో జరిగిపోతుంది అనే ప్రచారం కలిగింది, ప్రజల్లో భయం కలిగించేలా చేస్తున్న వారిని గుర్తించి, చంద్రబాబు కూడా వారి పై చర్యలు తీసుకోమని చంద్రబాబు డీజీపీని కోరారు.. పోలీసులు ఇప్పటికే రంగలోకి దిగారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ఎలాంటి నరహంతక గ్యాంగ్‌లు రాలేదని, జనం ఆందోళన చెందవద్దని మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజల్లో అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి రాష్ట్రమంతా పాకటంతో, ఏకంగా రాష్ట్ర హోం శాఖ కూడా, ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పూర్తి సమాచారం కోసం వాట్సప్, ఫేస్‌బుక్ యాజమాన్యాలకు నోటిసులు పంపించామని, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎవరిపైనా అనుమానాలు ఉంటే పోలీసులకు ఫోన్ చెయ్యాలని చెప్పారు.

ఇన్నాళ్ళు అయ్యా !బాబూ!అంటూ విభజన హామీలు నెరవేర్చమంటే, ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు లోకువగా కనిపించాడు.... లోక్‌సభ లో సరిపడా మెజారిటీ ఉండనే ధీమాతో, లోపలా, బయట మిత్రపక్షాలని హీనంగా చూసారు... పార్టీ సీనియర్లు తో సహా నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు ని ఘోరంగా అవమానించారు... అవహేళన చేసారు... ఇంకా చేస్తున్నారు... కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయి, తమకు తిరుగేలేదనుకుని విర్రవీగారు...ఎంతకు దిగజారారంటే, A1,,A2 జతకట్టి, ఇంకొక అజ్ఞానవాసితో రహస్య ఒప్పందం చేసుకుని... చంద్రబాబు ని తొక్కుదామనుకున్నారు... కేంద్రం లో తమ అధికారం శాశ్వతమనుకున్నారు... కాని ఇక్కడ బీజేపీ చెయ్యల్సింది, ఇలాంటి వారిని నామ్ముకోవటం కాదు, ఆంధ్రాకి న్యాయం చెయ్యటం... అలా చేస్తే, ఇటు ప్రజలు, ఇటు చంద్రబాబు, ఇద్దరూ బీజేపీతోనే ఉండేవారు... కాని జరగలేదు...

vijaysayi 23052018 2

ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయం పై చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష అంటూ, ప్రతి జిల్లాలో సభలు పెట్టి, మోడీ ని లెఫ్ట్ రైట్ వాయిస్తున్నారు... నిన్న వైజాగ్ లో కూడా ఒక సభ పెట్టారు... బీజేపీ నాయకులు చేస్తున్న ఫేక్ ప్రాపగాండా ఎండగట్టారు... మోడీతో సహా అందరు చెప్పివి పచ్చి అబద్ధాలు అని చెప్పారు... చెప్పటం మాత్రమే కాదు, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా, మోడీ చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రజలు ముందు ఉంచారు... ఆంతే కాదు, మోడీతో కలిసి, ఇక్కడ రెండు పార్టీలు చేస్తున్న నమ్మక ద్రోహం పై కూడా ప్రజలకు వివరించారు.. ప్రజల ఆకాంక్ష మేరకు, విభజన హామీలు అన్నీ నేరవేర్చలాని వైజాగ్ సభ సాక్షిగా చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేసారు...

vijaysayi 23052018 3

అయితే, చంద్రబాబు మీటింగ్ పెట్టి మోడీని ఉతికి పడేస్తే, వెరైటీగా వైసిపీ స్పందించింది... రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్దగా చంద్రబాబుకి కౌంటర్ ఇవ్వలేదు... చంద్రబాబు మీటింగ్ అయిన వెంటనే, అదేదో తమ పార్టీని, తమ నాయకుడిని అన్నట్టు, విజయసాయి రెడ్డి స్పందించారు... నిన్న చంద్రబాబు సభ పెట్టటం అన్యాయం అని, మా మోడీని తిడతారా అంటూ విజయసాయి రెడ్డి ఈ రోజు హడావిడి చేసారు... మా మోడీని తిట్టిన చోటుని గంగా జాలంతో శుభ్రం చేస్తాను అంటూ, ఒక చెంబు పట్టుకుని బయలుదేరాడు.. అయితే, పోలీసులు అడ్డుకుని లోపల వేసారు... మోడీని చంద్రబాబు ఎదో అంటే, వైసిపీ నాయకులకి ఎందుకు నొప్పి ? వీళ్ళకు కొత్త ఉద్యోగం ఏమన్నా ఇచ్చారా ? వీళ్ళకు మోడీ అంటే ఎలాగూ భయం, అలాంటిది, కేంద్రం పై పోరాటం చేస్తున్న చోటుని, గంగా జలంతో కడుగుతావా ? సరేలే అరెస్ట్ అయిన ఫోటోలు ఢిల్లీకి పంపించు... శుక్రవారం బాధ ఎమన్నా తప్పుతుంది ఏమో...

Advertisements

Latest Articles

Most Read