ఢిల్లీలో ఉండే ప్రధాన మోడీ ఉలిక్కిపడి లేవాలని, ఢిల్లీ దిగి రావాలని, దేవదేవుడి సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలని, చేసిన హామీలను మరచి, మాయమాటలు చెప్పడం సరికాదని, ప్రధానికి ఆ వెంకటేశ్వరుడే గుర్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతిలో గళమెత్తారు... అయితే, చంద్రబాబు నిన్న తిరుపతిలో మాట్లాడిన మీటింగ్ మొత్తం, ట్రాన్స్‌లేట్ చేసి పంపాలని, రాష్ట్ర బీజేపీ నేతలకు, ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చయి... ఆయన దాదాపు 2 గంటలు మాట్లాడారని, మొత్తం ట్రాన్స్‌లేట్ చెయ్యాలంటే టైం పడుతుందని చెప్పినా, ఢిల్లీ నాయకులు మాత్రం అర్జెంటుగా, చంద్రబాబు స్పీచ్ ట్రాన్స్‌లేట్ చేసి పంపించమని ఆదేశాలు ఇచ్చారు..

cbn 01052018 1 1

ఇదంతా ఎందుకు అని ఆరా తీస్తే, ఈ రోజు నుంచి ప్రధాని మోడీ, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గుననున్నారని, చంద్రబాబుకి అక్కడ నుంచే సమాధానం చెప్తారని, బీజేపీ వర్గాలు అంటున్నాయి... ఎన్నికలు అయ్యే లోపు, దాదాపు 5 రోజుల పాటు మోడీ కర్ణాటకలో ప్రచారం చెయ్యనున్నారు... అయితే, కర్ణాటక ఎన్నికల్లో, రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిని ఓడించాలని, అక్కడ తెలుగువారికి చంద్రబాబు పిలుపు ఇచ్చిన నేపధ్యం, అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, కర్ణాటకలో, బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యటం, ఇవన్నీ బీజేపీ అధిష్టానం గమినిస్తుంది... కర్ణాటకలో దాదాపుగా కోటి మంది తెలుగు ప్రజలు ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి...

cbn 01052018 1 1

రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహం పై చంద్రబాబు చేస్తున్న పోరాటానికి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు మద్దతు పలుకుతున్నారు... అలాగే కర్ణాటకలో కూడా, తెలుగు వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్తున్నారు... ఈ నేపధ్యంలో, అక్కడ గణనీయంగా ఉన్న తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకోటానికి, మోడీ, చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్తారని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి... అందుకే, నిన్న చంద్రబాబు స్పీచ్ అంత అర్జెంటుగా ట్రాన్స్‌లేట్ చేసి పంపించమన్నారని చెప్తున్నారు... మరో పక్క, పక్క రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై, కర్ణాటకలో ఎందుకు అంటూ, కర్ణాటక బీజేపీ నేతలు మండి పడుతున్నారు... ప్రధాని మోడీకి ఈ విషయం చెప్పి, చంద్రబాబు ప్రస్తావన లేకుండా, కేవలం కర్ణాటక పై మాత్రమే మాట్లాడాలని కోరతామని చెప్తున్నారు...

బ్రతిమాలాం... భయపెట్టాం... కేసులు పెడతాం అని చెప్పాం.. కొడుకుని జైలు పాలు చేస్తాం అని బెదిరించాం... రాష్ట్రంలో రావణ కాష్టం చేస్తామని చెప్పాం... రాష్ట్రంలో రెండు పార్టీలని ఆధీనంలో ఉంచుకుని, ఇది మా బలం అని చంద్రబాబుకి చూపించాం... రాష్ట్రానికి రావలసిన డబ్బులు ఆపెస్తున్నాం... అమరావతిని ఇబ్బంది పెట్టాం... పోలవరం అడ్డుకుంటున్నాం... ఇన్ని చేస్తున్నా, చంద్రబాబు ఎందుకు లొంగటం లేదు ? ఏంటి చంద్రబాబు ధైర్యం ? మొన్న ఢిల్లీలో, నేషనల్ మీడియా ముందు ఉతికాడు... నిన్న తిరుపతిలో, వీడియోలు చూపించి మరీ వాయిస్తున్నాడు... ఇలా అయితే, ఎలా ? చంద్రబాబుని నిలువరించటం ఎలా ? ఇది ఢిల్లీ పెద్దలు పడుతున్న మదనం...

cbn 01052018 2

ఎన్ని ప్రయత్నాలు చేసినా, చంద్రబాబు మాత్రం చేసిన అన్యాయానికి రగిలిపోతున్నారు... అందరికీ అర్థమయ్యేలా అప్పటి ప్రధాని అభ్యర్థి మోదీ ప్రసంగ వీడియోలను ప్రదర్శించారు. గోవిందుడి సాక్షిగా ప్రధాని చేసిన బాసలను గుర్తు చేశారు. దిల్లీ చిన్నబోయేలా ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని నిర్మిస్తామని, దేశ రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని, విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ నూటికి నూరుశాతం అమలు చేస్తామని ప్రధాని మోదీ 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు సభికులందరికీ వీడియోలద్వారా చూపించారు. అంతే కాదు, ఒక అడుగు ముందుకేసి, కర్ణాటక ఎన్నికల్లో మనకు అన్యాయం చేసిన వారిని ఓడించండి అని పిలుపు కూడా ఇచ్చారు చంద్రబాబు...

cbn 01052018 3

కేవలం ప్రత్యేక హోదా విషయమే కాదు.. పోలవరం, అమరావతి నిర్మాణం, విభజన చట్టం అమలు విషయాలను ఆయన లెక్కలతో సహా చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెబుతూ.. అటు కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకపోవడాన్ని ప్రస్తావించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత సహాయం చేసిందో లెక్కలతో సహా చెప్పారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేం... అని చెబుతూనే కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడాన్ని ఆయన ఎత్తి చూపారు. ఇవన్నీ, ఢిల్లీ పెద్దలకు నచ్చటం లేదు.. చంద్రబాబు మరింత దూకుడుగా వెళ్తే, ఇబ్బందులు ఉంటాయనే విషయం వారే చెప్తున్నారు.. చంద్రబాబు వెంట ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, అనే విషయం గ్రహించి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అని ఏపి ప్రజలు కోరుకుంటున్నారు...

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని మోదీ ప్రకటించిన వేదిక నుంచే ‘నమ్మకద్రోహం- కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం’ పేరిట తిరుపతిలో తెదేపా తలపెట్టిన భారీ బహిరంగ సభలో, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు... ఈ సందర్భంలో లోకేష్ జగన్ ను ఒక రిక్వెస్ట్ చేసారు... మేము మోడీని ప్రతి రోజు నిలదీస్తున్నాం, మీరు కూడా మోడీని నిలదీస్తే వినాలని ఉంది, మోదీని విమర్శించే దమ్ముందా.. ధైర్యముందా.. అని జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు లోకేష్... వాజ్‌పేయీ.. అడ్వాణీలాంటి యుగపురుషులు నడిపించిన పార్టీ. కానీ ఈ రోజు దొంగబ్బాయిలతో లాలూచీ పడి ఇక్కడ దొంగ రాజకీయాలు చేస్తున్నారు.

12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న 420 జగన్‌. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్‌.. మీకు గొప్ప నాయకుడు అన్పిస్తే పొత్తు పెట్టుకోండి. ఏపీ ప్రయోజనాలకు ఇబ్బంది కల్గిస్తే సహించం అంటూ బీజేపీ పై విమర్శలు చేసారు... నాపై ఆరోపణలు చేసేముందు నేనెక్కడ, ఎలా, ఎలాంటి తప్పు చేశానో ఆధారాలతో ప్రజలముందు పెట్టండి కానీ.. అర్థంపర్థంలేని ఆరోపణలు చేయొద్దు. నా వయస్సు 34. ఇంకా 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలనే కోరిక ఉంది. తాతలాగో, నాన్నగారిలాగో మంచి పేరు వస్తుందో, రాదో నాకు తెలీదుగానీ.. వాళ్లకు చెడ్డపేరు మాత్రం తీసుకురాను అంటూ లోకేష్ మాట్లాడారు...

జాతీయ పార్టీ తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం జరుతుంది అని ఆ రోజు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాం... బీజేపీకి రాష్ట్రంలో బలం ఉందని పొత్తు పెట్టుకోలేదు. కేవలం ప్రత్యేక హోదా కోసం, ఇచ్చిన 18 హామీలను అమలు చేస్తారు అనే నమ్మకంతో పొత్తు పెట్టుకున్నాం... 16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా,ప్రజలకు లోటు లేకుండా మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారు... ఎన్నికష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలు అసూయపడేలా సంక్షేమంలో ముందుకెళ్తున్నాం. రూ.25వేల కోట్ల మేర రైతులకు రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. 100 రోజుల్లో 24గంటల పాటు కరెంటు ఇచ్చాం. రూ.200 ఉన్న పింఛనును రూ.1000కి పెంచాం. చంద్రబాబు 68 ఏళ్ల వయసులో అహర్నిశలూ ప్రజల కోసం కష్టపడుతున్నారు. అది చూసి సంతోషపడి ప్రోత్సహించాల్సిన భాజపా నీచమైన రాజకీయాలు చేస్తోందని లోకేష్ అన్నారు..

ధర్మపోరాట సభ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌. ..నారదుడి వేషంలో వింటే ఉంటావు మోడీ అని చెప్పా…అయినా వినలేదు. చంద్రబాబుకు భూమికి ఉన్నంత సహనం, ఆకాశం అంత ఔదార్యం, సహనం ఉంది, గాలి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే దక్షత ఉంది అటువంటి వ్యక్తితో పెట్టుకోవద్దు మాడి మసైపోతావు మోడీ అని చెప్పానని అయినా వినలేదనీ ధర్మపోరాట సభ వేదికపై శివప్రసాద్ చెప్పారు..అజాతశత్రువు లాంటి చంద్రబాబు నాయుడు అలిగితే దేశమంతా ఒక్కటవుతుందని హెచ్చరించారు. తెలుగు ప్రజలను తక్కువ చేయొద్దని అన్నారు. ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించేస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు.

అష్టకష్టాలు పడతావంటూ విశ్వామిత్ర మహర్షిలా శాపనార్థాలు పెట్టారు. అయినా మోడీకి ఏమీ వినపడట్లేదని.. వినపడేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను ఇటీవల మోదీని విశ్వామిత్రుడి వేషంలో శపించానని టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. 'మోదీ మోసాలలో దిట్ట.. అబద్ధాల పుట్ట.. నిన్ను అపజయాలు చుట్టుముట్ట.. నీ నెత్తిమీద శని తిష్ట' అని అన్నానని తెలిపారు. మోదీకి మనం చెప్పేది ఏమీ వినపడట్లేదని, ఎందుకంటే ఆయన ఇండియాలో ఉంటేనే కదా అని, పార్లమెంటు సమావేశాల్లోనూ మొదటి రోజు ఐదు నిమిషాలు వస్తారని శివప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాని అభ్యర్థిగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు గుప్పించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈ సభను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఆనాడు మోదీ ఏమి చెప్పారు, నేటి వాస్తవ పరిస్థితి ఏమిటో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు... మోదీ ప్రసంగాల వీడియోలను ఆయన ప్రదర్శించారు... చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి...

Advertisements

Latest Articles

Most Read