ధర్మపోరాట సభ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌. ..నారదుడి వేషంలో వింటే ఉంటావు మోడీ అని చెప్పా…అయినా వినలేదు. చంద్రబాబుకు భూమికి ఉన్నంత సహనం, ఆకాశం అంత ఔదార్యం, సహనం ఉంది, గాలి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే దక్షత ఉంది అటువంటి వ్యక్తితో పెట్టుకోవద్దు మాడి మసైపోతావు మోడీ అని చెప్పానని అయినా వినలేదనీ ధర్మపోరాట సభ వేదికపై శివప్రసాద్ చెప్పారు..అజాతశత్రువు లాంటి చంద్రబాబు నాయుడు అలిగితే దేశమంతా ఒక్కటవుతుందని హెచ్చరించారు. తెలుగు ప్రజలను తక్కువ చేయొద్దని అన్నారు. ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించేస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు.

అష్టకష్టాలు పడతావంటూ విశ్వామిత్ర మహర్షిలా శాపనార్థాలు పెట్టారు. అయినా మోడీకి ఏమీ వినపడట్లేదని.. వినపడేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను ఇటీవల మోదీని విశ్వామిత్రుడి వేషంలో శపించానని టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. 'మోదీ మోసాలలో దిట్ట.. అబద్ధాల పుట్ట.. నిన్ను అపజయాలు చుట్టుముట్ట.. నీ నెత్తిమీద శని తిష్ట' అని అన్నానని తెలిపారు. మోదీకి మనం చెప్పేది ఏమీ వినపడట్లేదని, ఎందుకంటే ఆయన ఇండియాలో ఉంటేనే కదా అని, పార్లమెంటు సమావేశాల్లోనూ మొదటి రోజు ఐదు నిమిషాలు వస్తారని శివప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాని అభ్యర్థిగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు గుప్పించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈ సభను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఆనాడు మోదీ ఏమి చెప్పారు, నేటి వాస్తవ పరిస్థితి ఏమిటో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు... మోదీ ప్రసంగాల వీడియోలను ఆయన ప్రదర్శించారు... చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి...

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని మోదీ ప్రకటించిన వేదిక నుంచే ‘నమ్మకద్రోహం- కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం’ పేరిట తిరుపతిలో తెదేపా తలపెట్టిన భారీ బహిరంగ సభలో, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు... ఈ సందర్భంలో లోకేష్ జగన్ ను ఒక రిక్వెస్ట్ చేసారు... మేము మోడీని ప్రతి రోజు నిలదీస్తున్నాం, మీరు కూడా మోడీని నిలదీస్తే వినాలని ఉంది, మోదీని విమర్శించే దమ్ముందా.. ధైర్యముందా.. అని జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు లోకేష్... వాజ్‌పేయీ.. అడ్వాణీలాంటి యుగపురుషులు నడిపించిన పార్టీ. కానీ ఈ రోజు దొంగబ్బాయిలతో లాలూచీ పడి ఇక్కడ దొంగ రాజకీయాలు చేస్తున్నారు.

12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న 420 జగన్‌. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్‌.. మీకు గొప్ప నాయకుడు అన్పిస్తే పొత్తు పెట్టుకోండి. ఏపీ ప్రయోజనాలకు ఇబ్బంది కల్గిస్తే సహించం అంటూ బీజేపీ పై విమర్శలు చేసారు... నాపై ఆరోపణలు చేసేముందు నేనెక్కడ, ఎలా, ఎలాంటి తప్పు చేశానో ఆధారాలతో ప్రజలముందు పెట్టండి కానీ.. అర్థంపర్థంలేని ఆరోపణలు చేయొద్దు. నా వయస్సు 34. ఇంకా 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలనే కోరిక ఉంది. తాతలాగో, నాన్నగారిలాగో మంచి పేరు వస్తుందో, రాదో నాకు తెలీదుగానీ.. వాళ్లకు చెడ్డపేరు మాత్రం తీసుకురాను అంటూ లోకేష్ మాట్లాడారు...

జాతీయ పార్టీ తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం జరుతుంది అని ఆ రోజు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాం... బీజేపీకి రాష్ట్రంలో బలం ఉందని పొత్తు పెట్టుకోలేదు. కేవలం ప్రత్యేక హోదా కోసం, ఇచ్చిన 18 హామీలను అమలు చేస్తారు అనే నమ్మకంతో పొత్తు పెట్టుకున్నాం... 16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా,ప్రజలకు లోటు లేకుండా మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారు... ఎన్నికష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలు అసూయపడేలా సంక్షేమంలో ముందుకెళ్తున్నాం. రూ.25వేల కోట్ల మేర రైతులకు రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. 100 రోజుల్లో 24గంటల పాటు కరెంటు ఇచ్చాం. రూ.200 ఉన్న పింఛనును రూ.1000కి పెంచాం. చంద్రబాబు 68 ఏళ్ల వయసులో అహర్నిశలూ ప్రజల కోసం కష్టపడుతున్నారు. అది చూసి సంతోషపడి ప్రోత్సహించాల్సిన భాజపా నీచమైన రాజకీయాలు చేస్తోందని లోకేష్ అన్నారు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బద్రత వైఫల్యం తిరుపతిలో బయట పడింది... ఈ రోజు ధర్మపోరాట దీక్ష సందరభంగా, తిరుపతిలో పర్యటిస్తున్న చంద్రబాబు, ముందుగా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు.. దర్శనం చేసుకుని, తన వాహనం వైపు వెళ్తూ ఉండగా, ఉన్నట్టు ఉండి ఒక బాలిక చంద్రబాబు వద్దకు దూసుకువచ్చింది... హటాత్తుగా వచ్చి, చంద్రబాబును హత్తుకుంది... దీంతో ఒక్కసారిగా, భద్రతా సిబ్బంది, ఒక్కసారిగా అవాక్కయ్యారు.. భద్రతా సిబ్బంది బాలికను దూరం జరిపే యత్నం చేయగా, చంద్రబాబు మాత్రం ఆ బాలికతో ప్రేమగా మాట్లాడి పంపారు. అయితే, బాలిక ఒక్కసారిగా దూసుకురావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

ఇటీవల ఏవోబీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సీఎం చంద్రబాబును నక్సలైట్లు టార్గెట్ చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అందులోభాగంగా చంద్రబాబు నాయుడుకు భారీగా భద్రతను పెంచారు. ఇటీవల మావోయిస్టులపై దాడి జరగిన నేపథ్యంలో సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలకు సమాచారం అందింది. దానికి అనుగుణంగానే చంద్రబాబుకు భద్రత పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది.

సీఎంఎస్‌జీ (సీఎం సెక్యూరిటీ గ్రూప్) లో కొత్తగా 290 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిని ఇంటెలిజెన్స్ కోసం వినియోగించుకోనున్నారు. ఇందులో అడిషనల్ సూపరింటెండెంట్స్ ఐదుగురు, డిఎస్పీలు ఏడుగురు, పోలీసులు 148 ఇలా మొత్తగంగా 290ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. మొత్తనికి, ఈ రోజు తిరుమలలో జరిగిన పరిణామంతో, ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యం అని చెప్పవచ్చు... ఇలాంటివి పునరావృతం అవ్వకుండా, భద్రతా సిబ్బంది, తగు జాగ్రత్తలు తీసుకోవాలి...

సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు... కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా రాజీనామా చేసారు... అయితే, గత కొన్ని రోజులుగా వైసిపీ, బీజేపీ, జనసేన కలిసి, సుజనా చౌదారి పార్టీ మారుతున్నాడు అని, చంద్రబాబు పై నమ్మకం లేక, బీజేపీ పార్టీలో చేరుతున్నారని, ప్రచారం మొదలు పెట్టారు... కొన్ని వార్తా చానల్స్ అయితే, స్పెషల్ ప్రోగ్రామ్ లు కూడా వేసాయి... గతంలో ఎన్నో సార్లు, సుజానా ఈ పుకార్లు ఖండించినా, ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు... ఈ రోజు తిరుపతి సభ కంటే ముందే, ఈ రోజు ఉదయమే, అమిత్ షా సమక్షంలో, బీజేపీ లో చేరుతున్నారని, తద్వారా చంద్రబాబుని దెబ్బ కొట్టాలని అమిత్ షా ప్లాన్ అంటూ ప్రచారం చేసారు... కట్ చేస్తే, ఇలాంటి వారి ఆశల పై నీళ్ళు జల్లుతూ, సుజనా చౌదరి, తిరుపతి సభలో, మోడీని ఎండగట్టారు...

సుజనా మాట్లాడుతూ, "చాలా ఓపికగా నాలుగేళ్లు వేచి చూశాం... రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేం కేంద్ర మంత్రివర్గంలో చేరాం... సీఎం ఆదేశాల ప్రకారమే అక్కడ మంత్రులుగా పనిచేశాం... భాజపా ఎజెండా మాపై రుద్దే ప్రయత్నం చేశారు...పార్లమెంటు ఆమోదం పొందిన విభజన బిల్లును కూడా కేంద్రం లెక్కచేయట్లేదు.. 14వ ఆర్థిక సంఘం పేరుతో కాలయాపన చేశారు... చట్ట ప్రకారం మనకు రావాల్సిందే ఇవ్వాలని అడిగాం... రాష్ట్రానికి న్యాయం చేయడం కోసమే పనిచేశాం... నాలుగేళ్ల ముందే రాజీనామాలు చేసి ఉంటే ఇబ్బందులు పడేవాళ్లం..ఆర్థిక లోటు, రైల్వే జోన్ ఏర్పాటుపై అశ్రద్ధ చేశారు"

"కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం పోర్టు విషయంలో ఇలానే చేశారు...పసికందు లాంటి రాష్ట్రానికి పోషకాహారం ఇవ్వకుంటే ఎలా? ..మనం ధర్మపోరాటం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ విశాఖలో అధర్మ పోరాటం చేస్తోంది ..చట్ట ప్రకారం రావాల్సిన హక్కులను సాధించుకుని తీరుతాం" అంటూ ఎంపీ సుజనా చౌదరి ప్రసంగించారు.. మరో పక్క, తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాని అభ్యర్థిగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు గుప్పించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసేందుకు తెదేపా ఈ సభను ఏర్పాటుచేసింది.

Advertisements

Latest Articles

Most Read