సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు... కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా రాజీనామా చేసారు... అయితే, గత కొన్ని రోజులుగా వైసిపీ, బీజేపీ, జనసేన కలిసి, సుజనా చౌదారి పార్టీ మారుతున్నాడు అని, చంద్రబాబు పై నమ్మకం లేక, బీజేపీ పార్టీలో చేరుతున్నారని, ప్రచారం మొదలు పెట్టారు... కొన్ని వార్తా చానల్స్ అయితే, స్పెషల్ ప్రోగ్రామ్ లు కూడా వేసాయి... గతంలో ఎన్నో సార్లు, సుజానా ఈ పుకార్లు ఖండించినా, ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు... ఈ రోజు తిరుపతి సభ కంటే ముందే, ఈ రోజు ఉదయమే, అమిత్ షా సమక్షంలో, బీజేపీ లో చేరుతున్నారని, తద్వారా చంద్రబాబుని దెబ్బ కొట్టాలని అమిత్ షా ప్లాన్ అంటూ ప్రచారం చేసారు... కట్ చేస్తే, ఇలాంటి వారి ఆశల పై నీళ్ళు జల్లుతూ, సుజనా చౌదరి, తిరుపతి సభలో, మోడీని ఎండగట్టారు...

సుజనా మాట్లాడుతూ, "చాలా ఓపికగా నాలుగేళ్లు వేచి చూశాం... రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేం కేంద్ర మంత్రివర్గంలో చేరాం... సీఎం ఆదేశాల ప్రకారమే అక్కడ మంత్రులుగా పనిచేశాం... భాజపా ఎజెండా మాపై రుద్దే ప్రయత్నం చేశారు...పార్లమెంటు ఆమోదం పొందిన విభజన బిల్లును కూడా కేంద్రం లెక్కచేయట్లేదు.. 14వ ఆర్థిక సంఘం పేరుతో కాలయాపన చేశారు... చట్ట ప్రకారం మనకు రావాల్సిందే ఇవ్వాలని అడిగాం... రాష్ట్రానికి న్యాయం చేయడం కోసమే పనిచేశాం... నాలుగేళ్ల ముందే రాజీనామాలు చేసి ఉంటే ఇబ్బందులు పడేవాళ్లం..ఆర్థిక లోటు, రైల్వే జోన్ ఏర్పాటుపై అశ్రద్ధ చేశారు"

"కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం పోర్టు విషయంలో ఇలానే చేశారు...పసికందు లాంటి రాష్ట్రానికి పోషకాహారం ఇవ్వకుంటే ఎలా? ..మనం ధర్మపోరాటం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ విశాఖలో అధర్మ పోరాటం చేస్తోంది ..చట్ట ప్రకారం రావాల్సిన హక్కులను సాధించుకుని తీరుతాం" అంటూ ఎంపీ సుజనా చౌదరి ప్రసంగించారు.. మరో పక్క, తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాని అభ్యర్థిగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు గుప్పించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసేందుకు తెదేపా ఈ సభను ఏర్పాటుచేసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బద్రత వైఫల్యం తిరుపతిలో బయట పడింది... ఈ రోజు ధర్మపోరాట దీక్ష సందరభంగా, తిరుపతిలో పర్యటిస్తున్న చంద్రబాబు, ముందుగా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు.. దర్శనం చేసుకుని, తన వాహనం వైపు వెళ్తూ ఉండగా, ఉన్నట్టు ఉండి ఒక బాలిక చంద్రబాబు వద్దకు దూసుకువచ్చింది... హటాత్తుగా వచ్చి, చంద్రబాబును హత్తుకుంది... దీంతో ఒక్కసారిగా, భద్రతా సిబ్బంది, ఒక్కసారిగా అవాక్కయ్యారు.. భద్రతా సిబ్బంది బాలికను దూరం జరిపే యత్నం చేయగా, చంద్రబాబు మాత్రం ఆ బాలికతో ప్రేమగా మాట్లాడి పంపారు. అయితే, బాలిక ఒక్కసారిగా దూసుకురావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

ఇటీవల ఏవోబీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సీఎం చంద్రబాబును నక్సలైట్లు టార్గెట్ చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అందులోభాగంగా చంద్రబాబు నాయుడుకు భారీగా భద్రతను పెంచారు. ఇటీవల మావోయిస్టులపై దాడి జరగిన నేపథ్యంలో సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలకు సమాచారం అందింది. దానికి అనుగుణంగానే చంద్రబాబుకు భద్రత పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది.

సీఎంఎస్‌జీ (సీఎం సెక్యూరిటీ గ్రూప్) లో కొత్తగా 290 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిని ఇంటెలిజెన్స్ కోసం వినియోగించుకోనున్నారు. ఇందులో అడిషనల్ సూపరింటెండెంట్స్ ఐదుగురు, డిఎస్పీలు ఏడుగురు, పోలీసులు 148 ఇలా మొత్తగంగా 290ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. మొత్తనికి, ఈ రోజు తిరుమలలో జరిగిన పరిణామంతో, ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యం అని చెప్పవచ్చు... ఇలాంటివి పునరావృతం అవ్వకుండా, భద్రతా సిబ్బంది, తగు జాగ్రత్తలు తీసుకోవాలి...

ఒక్కొకరికి ఒక్కో రోజు, చాలా ముఖ్యం.. మన ప్రతిపక్ష నాయకుడుకి, ఎన్ని పనులు ఉన్నా శుక్రవారం కోర్ట్ కి వెళ్ళాలి.. చంద్రబాబు మాత్రం, ఎన్ని పనులు ఉన్నా, సోమవారం వచ్చింది అంటే పోలవారమే... ఈ రోజు తిరుపతిలో సాయంత్రం అతి పెద్ద బహిరంగ సభ ఉంది.. అయినా సరే, ముందు పోలవరం మీద సమీక్ష చేసిన తరువాతే ఏమైనా అంటూ, దాదాపు రెండు గంటల పాటు, పోలవరం పై వీక్లీ రివ్యూ జరిపారు చంద్రబాబు.. సోమవారం గ్రీవెన్స్‌ హాల్‌లో 58వ సారి పోలవరంపై ముఖ్యమంత్రి వర్చవల్ రివ్యూ నిర్వహించారు. వర్షాకాలం వచ్చేలోగా మే, జూన్ నెలల్లో వీలైనంత వేగంగా పోలవరం ఎర్త్‌వర్క్, కాంక్రీట్ పనులు చేపట్టాలని, లక్ష్యాన్ని అధిగమించినప్పుడే ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలమని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. నీరు-ప్రగతి పనులు కూడా ముమ్మరంగా జరగాలని, తాను ప్రతి జిల్లాలోనూ త్వరలోనే పర్యటిస్తానని వెల్లడించారు.

పోలవరం నిర్మాణంలో తొలిసారిగా ఒక నెలలో స్పిల్‌వే కాంక్రీట్ పనులు లక్ష క్యూబిక్ మీటర్లు దాటడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈనెలలో 1,15,658 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే కాంక్రీట్ పనులు జరగడం రికార్డుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.02% పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం కుడి ప్రధాన కాలువ 89.44%, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.16%, స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ ఎర్త్‌వర్క్ 72.30%, స్పిల్‌వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16.40%, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 85.10%, జెట్ గ్రౌటింగ్ పనులు 64.90%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 60% పూర్తయినట్టు చెప్పారు. గత వారం రోజుల్లో 5.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 32 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 19 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 806.29 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 5.76 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,214.6 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,800 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కోసం మొత్తం రూ. 13,430.84 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ. 8,294.97 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులో రూ. 5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ. 2,952.71 కోట్లు కేంద్రం నుంచి రావాల్సివుందని చెప్పారు.

ఈ రోజు తిరుమలలో, ఆంధ్రులు చేస్తున్న ధర్మ పోరాటానికి, చిరుజల్లులతో వెంకన్న ఆశీర్వదించారు... ఉదయం నుంచి, ప్రచండమైన ఎండ వేడి నుంచి, సభకు వచ్చిన ప్రజలు ఉపసమనం పొందారు... 4 గంటల ప్రాంతంలో, కొద్ది సేపు వర్షం పడి, ఉపసమనం కలిగించింది... అయితే, వర్షం సభకు అడ్డు వస్తుందేమో అని అనుకున్నా, వెంకన్న దయతో, వర్షం తగ్గిపోయింది. బహిరంగ సభ వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నాయి... వాతావరణం చక్కబడటంతో నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది... వరుణుడు సహకరించాడని.. సభ విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...

మరో పక్క, తిరుమలలో వడగళ్ల వాన పడింది... అదే సమయంలో, చంద్రబాబు వెంకన్న దర్శనానికి వెళ్లారు... వర్షంలో తడుస్తూనే సీఎం శ్రీవారి ఆలయానికి వెళ్లారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబుతో పాటుగా మంత్రి లోకేష్ శ్రీవారి దర్శంచుకున్నారు... మరి కొద్ది సేపట్లో, చంద్రబాబు సభా వేదిక వద్దకు రానున్నారు.. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరిని చంద్రబాబు ఈ సభలో ఎండగట్టనున్నారు. సభలో ప్రధాని మోదీ ప్రసంగాల వీడియోలను ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

తిరుమల వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని వంచన చేసిన నరేంద్ర మోదీ, బీజేపీలపై సమరాన్ని టీడీపీ మరింత ఉధృతం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలో సోమవారం భారీస్థాయిలో ధర్మపోరాట సభ నిర్వహిస్తోంది. 2014 ఏప్రిల్‌ 30వ తేదీన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామ స్టేడియంలో మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చకుండా మోసగించారని మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ.. అదే ఏప్రిల్‌ 30న అదే ప్రాంగణం నుంచి మోదీ మోసాన్ని జనానికి తెలియజెప్పే విధంగా సభ నిర్వహిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read