పచ్చటి ప్రకృతి ఒడిలో... సర్వాంగ సుందరంగా.... నవ్యాంధ్ర రాజధాని మంగళగిరిలో... నిర్మించిన ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించి 10 నెలలు కాక ముందే, దాని పక్కనే, ఇప్పుడు పోలీసు టెక్ టవర్ రెడీ అయ్యిపోయింది... రాష్ట్ర పోలీసు శాఖకు ప్రధాన కేంద్రంగా మారిన ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌ మరో అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంది. బెటాలియన్‌ ఆవరణలో పూర్తి ఈశాన్యంగా టెక్‌ టవర్‌ పేరుతో బ్రహ్మాండమైన ఏడంతస్తుల భవనం నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. సుమారు రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనికి సమీపంలోనే రూ.40కోట్ల వ్యయంతో పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయ భవనం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.

police 12042018 1

ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో మేజర్‌గా టెక్ సర్వీస్ వింగ్.., ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, అక్టోపస్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ తదితర వాటికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందులోని ఏడంతస్తులలో తొలి నాలుగు అంతస్తులను కంప్యూటర్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌కు, ఆపై మూడంతస్తులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సదుపాయాల కోసం వినియోగించనున్నారు. ఒక్కో అంతస్తును 8500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు.

police 12042018 1

రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లను ఈ సాంకేతిక సౌధంతో అనుసంధానించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించేందుకు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ అండ్‌ స్టాండర్డైజేషన్‌, పోలీసు కమ్యూనికేషన్స్‌ ఆర్గనైజేషన్స్‌లను (పీసీవో) ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పోలీసులు కొంత వరకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారని, సర్వలెన్స్ కెమెరాలు, లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టం.. ఇవన్నీ ఉపయోగించుకోవడంవల్ల దొంగతనాలు, క్రైమ్‌ను నియంత్రణ చేసే అవకాశం ఉంది...

అగ్రిగోల్డ్ వ్యవహరం మళ్లీ మొదటికి రావడానికి వైసీపీనే కారణమని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… అగ్రిగోల్డ్ వ్యవహరంలో వైసీపీపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టేకప్ చేయడానికి ముందుకొచ్చిన జీ-ఎస్సెల్ గ్రూప్.. వైసీపీ వల్లే వెనక్కు వెళ్లిందన్నారు. కేంద్రం మా చేతిలో ఉంది అంటూ సీబీఐ కేసుల పేరుతో జీఎస్సెల్ గ్రూప్‌ను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ విషయాన్ని జీ-ఎస్సెల్ కంపెనీ ప్రతినిధులే స్వయంగా వెల్లడించారని తెలిపారు. ‘బాధితులకు న్యాయం జరగాలని ఏపీలో ఆందోళనలు చేస్తారు.. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ జరపాలని ప్రధాని మోడీని అడుగుతారు..’ అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.

ycp modi 12042018

18 లక్షల మంది అగ్రిగోల్డ్ లబ్దిదారుల ఉసురు వైసీపీకి తగులుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు. కేసుల పేరుతో జీ గ్రూపును వైసీపీయే బెదరగొట్టిందన్నారు. వైసీపీ రాక్షస క్రీడవల్లనే అగ్రిగోల్డ్ వ్యవహారం నిలిచిపోయిందన్నారు. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటామని, వైసీపీ బెదిరింపులకు సంబంధించిన అన్ని విషయాలనూ త్వరలో బయటపెడతామని కుటుంబరావు చెప్పారు. ఈ విషయం కోర్ట్ లో ఉన్నందున, అవసరం అయితే, ఈ ఆధారాలు కోర్ట్ కి కూడా ఇస్తామని అన్నారు... అగ్రిగోల్డ్‌ కేసు వచ్చే సోమవారం హైకోర్టులో విచారణకు రానుండగా ఈలోపే కొందరు రా ష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు..

ycp modi 12042018

తప్పుదోవ పట్టించేలా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తును తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఎస్సెల్‌ గ్రూప్‌పై కోర్టు ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని ఎస్సెల్‌ గ్రూప్‌ తెలిపిందని, సీఐడీ ఎప్పటికప్పుడు వివరాలను కోర్టుకు సమర్పించిందన్నారు. వచ్చిన బిడ్డర్లను వైసీపీ నాయకులు భయపెట్టి వెనక్కి పంపారని కుటుంబరావు ఆరోపించారు. ఈనెల 16న జ‌రిగే కేబినెట్ బేటీలో చ‌ర్చించిన త‌ర్వాత అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంలో స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందని చెప్పారు.

డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తమిళ ప్రజలు చుక్కలు చూపించారు... ప్రధాని మోడీకి కావేరి సెగలు తాకాయి.. చెన్నై ఎయిర్‌పోర్టు వద్ద ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తమిళ సంఘాల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు... చెన్నైలో డిఫెన్స్‌ ఎక్స్‌పోను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు... కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు నిర్వహించిన ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మోడీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చే శారు... అలాగే గోబ్యాక్‌ మోడీ అంటూ ఆకాశంలోకి సైతం ఆందోళనకారులు బెలూన్లు ఆకాశంలోకి వదిలారు. పెద్ద సంఖ్యలో బెలూన్లను వదలడంతో ఏం జరుగుతుందోన్న టెన్షన్ వాతావరణం నెలకొంది... హెలికాప్టర్ రూట్ కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది...

tn modi 12042018 1

మరోవైపు, మోడీ రాకను వ్యతిరేకిస్తూ డీఎంకే తో పాటు ఎండీఎంకే నేతలు కూడా చెన్నైలో ఆందోళనలు నిర్వహించారు. డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్, ఎంపీ కనిమొళితో పాటు పలువురు డీఎంకే నేతలు ఆ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కదలలేని స్థితిలో ఉన్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా తన ఇంట్లో నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో కూడా, గో బ్యాక్ మోడీ అని ట్రెండ్ చేసారు... మరోవైపు, ఎండీఎంకే నేత వైకోను పోలీసులు అరెస్ట్‌ రజనీకాంత్ కూడా కావేరీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. కేంద్రం దిగిరావాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం అమలు చేయడంలేదని మండిపడ్డారు. కావేరి నిరసనల కారణంగా భద్రత ప్రశ్నార్థకం కావడంతో ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా చెన్నై నుంచి తరలించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే...

tn modi 12042018 1

తమిళనాడు ప్రజల ఐక్యత ఎలా ఉంటుందో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చూశారు... మరి మన ఆంధ్రా ప్రజల ఐక్యత చూపించే సమయం కూడా వచ్చింది... పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా, అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి వచ్చింది.. మన పై యుద్ధం చేస్తాము అంటూ బెదిరిస్తున్న, ఢిల్లీ పాలకులను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది... తమిళనాడులో కూడా, ఇక్కడి లాగే, కొంత మంది మోడీతో రాజీ పడిపోయారు... అన్నాడీయంకే పార్టీ లాలూచి పడిపోయింది... అయినా అక్కడ ప్రజలు ఏకం అయ్యారు... మనకు కూడా ఇక్కడ మోడీతో కలిసి, మన పోరాటాన్ని నీరుగార్చే వారు ఒకరికి, ఇద్దరు ఉన్నారు... వీరికి మోడీ అనే పేరు పలకాలి అన్నా భయం... వాళ్ళను పక్కన పెట్టి, ప్రజలు ఏకం కావల్సిన టైం వచ్చింది...

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కిదాంబి శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 25 ఏళ్ల శ్రీకాంత్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రీకాంత్‌ రికార్డు సృష్టించాడు. దీంతో ఇప్పటి వరకు నెంబర్ వన్‌ స్థానంలో ఉన్న డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అలెక్సన్ రెండో ర్యాంకుకు పరిమితమయ్యాడు. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్‌ ప్రస్తుతం 76,895 పాయింట్లతో కొనసాగుతుండగా.. విక్టర్ అలెక్సన్‌ 75470 పాయింట్లతో ఉన్నాడు... అయితే, శ్రీకాంత్ ట్విట్టర్ ద్వారా స్పందించి, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతఙ్ఞతలు చెప్పారు...

srikanth 12042018 2

గాయం కారణంగా గత ఏడాది అక్టోబరులో శ్రీకాంత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును అందుకోలేకపోయాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో భారత్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్‌ 76,895 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. 77, 130 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న విక్టర్‌ అలెక్సన్‌(డెన్మార్క్‌) 1,660 పాయింట్లు కోల్పోయి 75,470తో రెండో స్థానానికి పడిపోయాడు. 52 వారాల వ్యవధిలో అత్యుత్తమ 10 టోర్నీల ప్రదర్శన ఆధారంగా బీడబ్ల్యూఎఫ్‌ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. గత ఏడాది ఇండోనేషియా, ఆస్ట్రేలియన్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ ఓపెన్‌ సిరీస్‌లు గెలుచుకున్న శ్రీకాంత్‌ నవంబరులో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

srikanth 12042018 3

కంప్యూటరైజ్డ్‌ ర్యాంకింగ్‌ పద్ధతి లేనప్పుడు 1980లో ప్రకాశ్‌ పదుకొణె నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ఆ ఘనతను అందుకున్నాడు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ నంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది... గత ఏడాది, శ్రీకాంత్ నాలుగు సిరీసులను గెలుచుకున్న సందర్భాన్ని పరస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున 50 లక్షల పారితోషికాన్ని, అమరావతి రాజధాని ప్రాంతంలో వెయ్యి గజాల స్థలాన్ని ఇస్తున్నట్టు, ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఆసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ కు రాష్ట్రంలో గ్రూప్-1 కేడర్ ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే...

Advertisements

Latest Articles

Most Read