మా దీక్షలతో ఢిల్లీ కదిలిపోతుంది అంటూ, ఈ రోజు జగన్ ఎదో స్టేట్మెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పగలబడి నవ్వుతున్నారు... అయిదు రోజుల్లో, అయిదు వికెట్లు పడిపోయి, టెంట్ ఎత్తేసి, ఎవడి దారి వాళ్ళు చూసుకున్నారు... ఇలాంటి దీక్షతో ఢిల్లీ కదిలిపోతుంది అనే మాటలు జగన్ మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది... మరీ అయిదు రోజులలో, అయిదు ఎంపీలు దీక్ష ఆపెయ్యటం, బహుసా ఎక్కడా ఉండదు ఏమో.. ఈ రోజు సాక్షి ఛానల్ లో పోలీసులు జులం అంటూ ఎదో ఎదో చెప్తున్నారు... తీరా అక్కడ చూస్తే నలుగురు పోలీసులు వచ్చారు, చివరకు ఇద్దరు ఎంపీలను స్ట్రెచ్చర్ మీదు మోసుకెల్లి అంబులెన్స్ లో పెట్టింది కూడా వైసిపీ కార్యకర్తలే.... సాక్షిలో న్యూస్ కోసం, సియం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి, ఫైనల్ గా దీక్ష లేపెసారు... అయితే, వీళ్ళ దీక్ష పై, నేషనల్ మీడియా ఒక కధనాన్ని రాసింది...

national media 11042018

అసలు అది దీక్ష కాదని, ఎందుకు దీక్ష చేసారో వాళ్ళకే తెలియదు అని, కేంద్రానికి అసలు దీక్ష జరుగుతుంది అని తెలుసో తెలియదో అని కధనంలో రాసింది.. అంతే కాదు, వీళ్ళ దీక్షకు, అన్ని పార్టీల నేతల మద్దతు కోసం, విజయసాయి రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు... అన్ని పార్టీల దగ్గరకు వెళ్లి, సార్ ఒక్కసారి వచ్చి, ఒక పది నిమిషాలు కూర్చుని వెళ్ళండి, కార్ పంపిస్తాం అంటూ, అందరినీ వెళ్లి అడిగితే, చివరకు కమ్యూనిస్ట్ లు వచ్చి వెళ్లారు... రెండు రోజుల నుంచి, బ్రతిమిలాడితే చివరకు శరద్ యాదవ్ కూడా వచ్చి వెళ్లారు.. అయితే, నేషనల్ మీడియా కధనం ప్రకారం, త్రినముల్ కాంగ్రెస్ ప్రతినిధి కోసం, చాలా ప్రయత్నాలు చేసినట్టు చెప్పింది...

national media 11042018

అయితే ఎన్ని సార్లు వాళ్ళని వెళ్లి కలసినా, ఎవరూ రాలేదు.. ఇక్కడ మా ఎంపీలు ఎవరూ లేదు, అందరూ బెంగాల్ వెళ్ళిపోయారు, మీరు మళ్ళీ మళ్ళీ రావద్దు అని విజయసాయి రెడ్డికి చెప్పినట్టు సమాచారం... ఇలాగే చాలా పార్టీల దగ్గరకు వెళ్లి కలిసినా, ఎవరూ దీక్షకు వచ్చి మద్దతు తెలపలేదు... అలాగే ఆ కధనం ప్రకారం, అసలు ఈ దీక్షకు కనీస స్పందన లేదు అని తెలిపింది... మొత్తానికి ముక్కి మూలిగి, అయిదు రోజుల దీక్షను తూతూ మంత్రంగా లాగించి పడేసారు.... ఈ అయిదు రోజులు అక్కడ మోడీ అనే మాట కూడా లేకుండా, చంద్రబాబు భజన చేసుకుంటూ కాలక్షేపం చేసి మొత్తానికి ముగించారు... మరి రాజీనామాలు ఆమోదం పొంది రాష్ట్రానికి వస్తారో, లేదో చూడాలి..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కలెక్టర్ల పై మరోసారి పోలీసుల మీద చిందులు వేశారు... ఈ సారి ఏకంగా రాష్ట్రంలోని కలెక్టర్ల అందరికి హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ఉండదు, మరో సంవత్సరంలో నేనొస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఐఏఎస్ లకు నేను అదే విషయం చెబుతున్నానని, ఎల్లప్పుడూ చంద్రబాబు ప్రభుత్వం ఉండదన్నారు... త్వరలో నేను వస్తా... ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు... ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేసారు... సిఎం చంద్రబాబు అవినీతి డాన్‌లా వ్యవహరిస్తుంటే...ఆయనకు జిల్లా కలెక్టర్లు సహకరిస్తున్నారని విమర్శించారు. ఇసుక మాఫియాను ముఖ్యమంత్రి పెంచిపోషిస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఇసుక దోపిడీలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.

jagan 11042018

ప్రతి అభివృద్ధి ప్రాజెక్టు పనులను తమకు కావాల్సిన వారికి నామినేషన్‌ ప్రాతిపదికన ఇస్తున్నారని, దీనికి కలెక్టర్లు సహకరిస్తు న్నారని... ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తూ..కలెక్టర్లు దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతికి పాల్పడిన వారందరినీ శిక్షిస్తామని జగన్‌ చెప్పారు... అవినీతిలో చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రధాన కార్యదర్శులు, చివరకు జిల్లా కలెక్టర్లకూ భాగస్వామ్యం ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు... ఇలాంటి విపరీత ప్రవర్తన అనేకసార్లు జగన్ నుంచి చూసాం... ఈ మధ్య, జగన్ నుంచి inspire అయ్యి, A2 కూడా, ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు.. అయినా ఇద్దరు తోడు దొంగలు, ఎంత మంది ఐఏఎస్ ల జీవితాలు నాశనం చేసారో, ప్రజలందరికీ తెలుసు... వెళ్ళు, కబ్రులు చెప్తుంటే, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది...

jagan 11042018

నిజానికి జగన్, ఇలా ప్రవర్తించటం మొదటి సారి కాదు... వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ అంటూ అక్కడ పోలీసుల మీద రంకెలు వేసింది చూశాం... అలాగే దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు ఉన్న, కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ అహ్మద్ బాబుని, నిన్ను జైలుకి తీసుకుపోతా అన్నది చూశాం... ప్రభుత్వ డాక్టర్ ల దగ్గర బలవతంగా, చేతిలో రిపోర్ట్ లు లాక్కుంది చూశాం.. ఇది జగన్ విపరీత ప్రవర్తనకు అర్ధం పడుతుంది... తనకు తానూగా, అతీత శక్తి అనుకుంటూ, ముఖ్యమంత్రి అయిపోయాను అనుకునే భ్రమలో, ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని మానసిక విశ్లేషకులు చెప్తున్నారు...

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగళం వినిపించేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి. మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థికశాఖ కార్యదర్శుల సమావేశం ఇందుకు వేదికైంది. 15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న విధానంపై, 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. దక్షిణ భారత దేశంలో, ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే ప్లాన్ ఇది అంటూ, కేంద్రం పై విమర్శలు గుప్పించారు...

modi shah 11042018

రాష్ట్రాల ఆర్థికవ్యవస్థల పై సూక్ష స్థాయిలో కూడా పెత్తనం చలాయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఈ సమావేశంలో చర్చించారు... సైద్థాంతిక పునాదులు బలపర్చుకోవలన్న ప్రయత్నమూ ఇందులో దాగుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘‘కేంద్రాన్ని మేం కోరుతున్నది ఒక్కటే.. ఈ రూల్స్‌ మార్చండి. కొత్త విధివిధానాలు తీసుకురండి’’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ డిమాండ్‌ చేశారు. ఈ సదస్సు కేంద్రానికి కనువిప్పు కావాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి అన్నారు. టీఓఆర్‌ రూపంలో రాయితీలు కోసేయబోతున్నారని కర్ణాటక మంత్రి బైరే గౌడ ఆరోపించారు. ఈ టీఓఆర్‌ వల్ల తమ రాష్ట్రం దాదాపు రూ 80,000 కోట్లు నష్టపోతుందని కేరళ ఆర్థికమంత్రి టీఎం థామస్‌ ఐజాక్‌ చెప్పారు.

modi shah 11042018

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను యథాతథంగా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వచ్చే అయిదేళ్లలో రూ.24,340 కోట్లు నష్టపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగపరంగా తప్పనిసరి అయిన రెవెన్యూలోటు భర్తీని యథాతథంగా కొనసాగించాలని రాష్ట్రాలకు రెవెన్యూలోటు ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై అధ్యయనం చేసే బాధ్యతను 15వ ఆర్థికసంఘం విధివిధానాల్లో చేర్చడం సరికాదని స్పష్టం చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి మాట్లాడుతూ మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను శిక్షించి, పనితీరు పేలవంగా ఉన్న రాష్ట్రాలకు నిధులందిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ సహకార సమాఖ్యస్ఫూర్తి గురించి మాట్లాడతారని, కానీ ఆచరణలో కనిపించేది నియంతృత్వమని ఆరోపించారు. ఈ నెలాఖరులో గానీ, లేక మే నెల మొదటివారంలో గానీ విశాఖపట్నంలో తదుపరి సమావేశం జరుగుతుందని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం నాలుగో బడ్జెట్‌లో కూడా ఏపీకి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటేనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామన్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని, అది కూడా సరిగా అమలు చేయలేదని సీఎం అన్నారు. కేంద్రం మోసం చేసిందని తెలిసే తిరుగుబాటు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. బీజేపీతో పొత్తు లేకుంటే టీడీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. పార్లమెంటు సరిగా జరగలేదని ప్రధాని మోదీ నిరాహార దీక్ష చేస్తామని అంటున్నారని, ప్రజల మనోభావాలతో మోదీ ఆడుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn punch 11042018

ఇదే సందర్భంలో వైసిపీ పై పంచ్ వేసారు... వైకాపావి రాజీనామాలు కాదని, మోడీతో రాజీపడి ప్రజలకు నామాలు పెట్టారని చంద్రబాబు నాయుడు పంచ్ వేసారు... తన మీద కక్షతో రాష్ట్రం మీద దాడి చేసే పరిస్థితికి భాజపా వచ్చిందని సీఎం మండిపడ్డారు. తెలుగుదేశం సహకారం లేకుంటే రాష్ట్రంలో భాజపా ఎక్కడుందని ప్రశ్నించారు... రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం రాజీ పడబోమని భాజపాకు అర్థమైనందునే కేసులున్న వారిని చేరదీశారని విమర్శించారు. అలా చేరదీస్తే తమ చెప్పుచేతల్లో జగన్‌ ఉంటాడన్నది భాజపా ఎత్తుగడ అని వివరించారు. కక్ష సాధింపు కోసం అవినీతి పార్టీనిభాజపా అక్కున చేర్చుకుందన్న చంద్రబాబు ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.

cbn punch 11042018

ఈనెల 30న తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా...గతంలో మోదీ చెప్పిన మాటలను గుర్తు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రంపై ఎలాంటి పోరాటాలకైన సిద్దమన్నారు. అమరావతికి అన్ని ఇస్తామని తిరుపతిలో చెప్పిన మోదీ... ఇప్పుడు మాట తప్పారని, టీడీపీపై బురద జల్లుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు టీడీపీయే గెలవాలని, అప్పుడే కేంద్రంలో మనమనుకున్న ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో రాజీ పడే వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామా ఆడారని, ఏపీ ప్రజలకు వైసీపీ ఎంపీలు నామాలు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read