ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పోస్ట్... చంద్రబాబు గురించి రాస్తూ, సగటు తెలుగోడు చంద్రబాబుని అడుగుతున్న సూటి ప్రశ్న ఇది... రాష్ట్రాన్ని రంపంతో కోశారు....తెగిపడిన అవయవాల్ని తీసుకొని ఆంధ్ర వచ్చావు... పట్టిసీమ ఒక పాపం అన్నారు....కానీ పంట పండించావు... పోలవరం ఒక శాపం అన్నారు....కానీ ముందుకు నడిపించావు... రాజధాని ఒక అభూత కల్పన అన్నారు....కానీ రైతులు పొలం ఇచ్చారు... నీకు చిత్తశుద్ధి లేదన్నారు...కానీ ప్రజలు గెలిపించారు... కేంద్రంతో లాలూచీ పడ్డావు అన్నారు....కానీ మోడీని ఎదిరించావు. అవినీతి చేస్తున్నావ్ అంటున్నారు....కానీ అభివృద్ధి చేసి చూపిస్తున్నావు.

cbn 11042018 2

నువ్వు ఎవరికి పుట్టావ్ అని అడుగుతున్నారు? నిన్ను కాల్చి చంపమంటున్నారు? నిన్ను బావిలో దూకి చావమంతున్నారు ?నువ్వు ఎం పాపం చేశావ్? ఒక మనిషి ఇన్ని కష్టాలు పడితేనే కానీ "చంద్రబాబు" కాలేడా? నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటే నాలాంటి వాడు ఇన్ని భరించాలా? ఇన్ని అవమానాలు నీకు ఎందుకు ? నీకే ఎందుకు ? ఈ ప్రశ్న ప్రజలు ఆనాడు రాముడిని అడిగి ఉండాల్సింది... కష్టం పడిని రాముడు దేవుడైతే మరి నువ్వు ఎవరు? ఇది ప్రతి తెలుగువాడు నిన్ను అడగాలనుకుంటున్న ప్రశ్న?

cbn 11042018 3

నిజమే.. ఈ ప్రశ్నల్లో వాస్తవం కూడా ఉంది... చంద్రబాబు నాయుడుని గత నలభై ఏళ్ళుగా తెలుగు ప్రజలు ఆదరించారు... ఎన్ని అవస్తావాలు ప్రచారం చేసినా, ఆయన్ను మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించారు... రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చారు.. చంద్రబాబు విజన్ కు, దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు... బిల్ గేట్స్ మొన్న వైజాగ్ వచ్చి ఏమి చెప్పారో విన్నాం... అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏమన్నారో విన్నాం... ఇలాంటి చంద్రబాబుని కనీస స్థాయి లేని జగన్ లాంటి వాళ్ళు, పవన్ లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, బొత్సా లాంటి వాళ్ళు ఘోరంగా విమర్శించటం ఏమిటి ? ఇవన్నీ చంద్రబాబు భరిస్తూ, ముందుకు పోతూనే ఉన్నారు... అయినా, ఇలాంటి వాళ్ళు తిడుతుంటే, ఎలా భారిస్తున్నావ్ చంద్రబాబు అని, ప్రజలు అడుగుతున్నారు...

ప్రధాని నరేంద్ర మోదీ చేస్తాను అంటున్న ఒక్క రోజు నిరాహార దీక్ష పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు... మోడీ దీక్ష చేస్తాను అనటం ప్రజల దృష్టి మరల్చడానికేనని చంద్రబాబునాయుడు ఆరోపించారు. మంగళవారం అమరావతిలో జరిగిన ఆనంద నగరాల సదస్సుకు హాజరైన ప్రతినిధులకు ఇచ్చిన విందు సమయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. విపక్షాలు పార్లమెంటు సమావేశాలు జరగనీయకపోవడాన్ని నిరసిస్తూ ఏప్రిల్‌ 12న భాజపా ఎంపీలతో పాటు మోదీ కూడా దీక్షలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. పార్లమెంటు సజావుగా సాగకపోవడానికి ఎన్డీయేనే కారణమని ఆయన ఆరోపించారు.

cm mdoi 11042018

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండేందుకు అన్నాడీఎంకే పార్టీ వెనుక ఉండి లోక్‌సభ జరగనీయకుండా చేసింది ఎన్డీయే కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం తలచుకుంటే కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాన్ని ఏర్పాటు చేయకుండా మోదీని ఎవరు ఆపారు’ అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల వివాదం పరిష్కరించేందుకు కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభలో ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటు జరగకపోవడంపై తప్పు తమ వైపు పెట్టుకుని ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

cm mdoi 11042018

కేంద్రం సాయం కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు సెక్టార్‌ సహాయంతో రాజధాని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇతర పార్టీలతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపాను బలహీనం చెయ్యాలని చూస్తున్నారు. కానీ, తెదేపా చాలా బలమైన పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు. మరో పక్క ఉదయం, విజయవాడ: మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. కేంద్రంతో విభేదాలు ఉన్నంత మాత్రాన సంక్షేమం, అభివృద్ధి ఆగదని, మోదీ ఏపీకి సాయం చేయకపోతే కేంద్రం నుంచి వడ్డీతో సహా ఎలా సాధించుకోవాలో మాకు తెలుసని సీఎం చంద్రబాబు తెలిపారు.

సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారు... ఒకప్పుడు వైఎస్‌ జగన్‌కి అత్యంత ఆత్మీయుడు... జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి, ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చిన మూలస్తంభం... జగన్‌లోని చీకటి కోణాలు తెలిసినా వైఎస్‌పై అభిమానంతో గుండెల్లోనే గుట్టుగా పెట్టుకున్న కమిటెడ్‌ లీడర్... రాష్ట్ర విభజన అనే అత్యంత హేయమైన గాయం విషయంలో జగన్‌ సోనియాతో రాజీపడటాన్ని సహించలేక పోయారు... జగన్‌ సోనియా మ్యాచ్‌ఫిక్సింగ్‌ వ్యవహారాన్ని బయటపెట్టారు... విశాఖలో విజయమ్మ గెలిస్తే లవ్‌లీ వైజాగ్‌ రక్తపాతంతో రగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు... వైజాగ్ లో జగన్, బ్యాచ్ ఎంటర్ అవ్వకుండా, ఆయన ప్రయత్నం చేసారు...

sabbam 11042018

అయితే, గత కొన్ని ఏళ్ళుగా రాకీయలకు దూరంగా ఉన్న సబ్బం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావటానికి డిసైడ్ అయ్యారు... అయితే, దీనికి ప్రధాన కారణం, చంద్రబాబే అని సబ్బం హరి, ఆయన సన్నిహితుల వద్ద చెప్తున్నారని సమాచారం... ఈ సమయంలో నా లాంటి సీనియర్ల అండ చంద్రబాబుకి అవసరం ఉంది అని సబ్బం హరి చెప్తున్నారు... ఒక పక్క కేంద్రంతో చంద్రబాబు చేస్తున్న యుద్ధం, మరో పక్క రాష్ట్రంలో పవన్, జగన్ ఎలా ప్రజలని మభ్యపెడుతుంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని, అదే విధంగా చంద్రబాబు రాష్ట్రం కోసం పడుతున్న కష్టంలో, తన వంతు పాత్ర కూడా ఉంటే బాగుండు అని సబ్బం హరి అనుకుంటున్నారు...

sabbam 11042018

నవ్యాంధ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద దిక్కని ఆయన ఇటీవల పలుసార్లు తన అభిప్రాయం వ్యక్తంచేశారు... ఎన్డీఏతో తెలుగుదేశం తెగదెంపులు, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో, రాష్ట్రంలో టీడీపీ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయింది. సమీకరణలూ మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న హరి తెలుగుదేశంలో చేరడానికి ఆసక్తి చూపగా.. ఆ పార్టీ నాయకత్వం ప్రాథమికంగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం... 2014 లో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించారు, సబ్బం హరి... అయితే, గత కొన్ని రోజులుగా బీజేపీ, జనసేన, వైసిపీ సబ్బం హరి కోసం ఎంతో ప్రయత్నం చేసాయి... చివరకు ఆయన, ఈ మూడు పార్టీల తతంగం చూసి, తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు...

విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చేస్తున్న పోరాట ఉద్ధృతిని మరింత పెంచాలని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల్ని చైతన్యపరచాలని తెదేపా నిర్ణయించింది. ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. నాలుగేళ్ల క్రితం ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ ఏప్రిల్‌ 30న తిరుపతిలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే దిల్లీని మించిన రాజధానిని నిర్మించుకునేలా ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. అప్పట్లో మోదీ ఇచ్చిన హామీల్ని గుర్తుచేస్తూ, వాటిని అమలుచేయకుండా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా అన్యాయం చేసిందీ వివరించేందుకు ఏప్రిల్‌ 30న తిరుపతిలో తెదేపా బహిరంగ బహిరంగ సభ నిర్వహించనుంది.

cbn 11042018

ఢిల్లీ వెళ్లి, నేషనల్ మీడియాకు ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు, డాక్యుమెంట్ లతో ఎలా వివరించి, మోడీకి షాక్ ఇచ్చారో, ఈ సభలో కూడా, ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు అలా వివరించనున్నారు... ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలో మొదలుపెట్టి, ప్రతి నెలా ఒక్కో జిల్లాలో భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రతి జిల్లాలో విస్తృత స్థాయిలో అఖిలపక్ష సమావేశాల్ని నిర్వహించనున్నారు. అన్ని వర్గాల్నీ ఆహ్వానించి, కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కేంద్రంపై పోరాటానికి అందివచ్చిన ప్రతి సందర్భాన్నీ తెదేపా వినియోగించుకోనుంది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించనున్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగారుస్తూ కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని, దానికి సద్బుద్ధి కలిగేలా చూడాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద అర్జీలు అందజేసే కార్యక్రమాన్ని తెదేపా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది.

cbn 11042018

తెదేపా-దళితతేజం కార్యక్రమం ముగిసిన సందర్భంగా ఈ నెల 20న గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా లక్షమంది దళితులు, క్రైస్తవ మైనారిటీలతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రంపై పోరాటాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు నియోజకవర్గాల వారీగా సైకిల్‌ యాత్రలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దిల్లీలో పార్లమెంటు వేదికగాను, వెలుపలా పోరాటం చేసిన పార్టీ ఎంపీలు నియోజకవర్గాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో భావి పోరాట కార్యాచరణపై వ్యూహ కమిటీ చర్చించింది. ఎంపీలతో బస్సు యాత్ర నిర్వహించాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. అన్న క్యాంటీన్లు త్వరలో ఏర్పాటుచేయాలని, నిరుద్యోగభృతి విధి విధానాన్ని ఖరారుచేసి వెంటనే అమల్లోకి తేవాలని నిర్ణయించారు. అవినీతి, హత్యా రాజకీయాలకు పాల్పడినవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారని, కేంద్రంతో కుమ్మక్కై తెదేపాపై కుట్రపన్నుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం నమ్మక ద్రోహాన్ని, కుట్ర రాజకీయాల్ని తిప్పికొట్టాలని పార్టీశ్రేణులకు ఆయన సూచించారు.

Advertisements

Latest Articles

Most Read