సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గున్నారు... ఈ సందర్భంగా, చంద్రబాబు ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానంతో, ఆయన స్టేట్స్మెన్ అనే విషయం మరో సారి రుజువైంది... దక్షిణాది రాష్టాల పట్ల కేంద్రం వివక్ష అవలంబిస్తోందన్నారు. దీనిపై మీ అభిప్రాయం, ఏంటి అని ప్రశ్న అడగగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ, "అది చర్చించడానికి ఇది వేదిక కాదు. ఆ అంశంపై మనం భారత్ లో కూర్చుని మాట్లాడుకుందాం. కానీ నేను ఒక్క విషయం స్పష్టం చేయదలిచాను. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు శిక్షకు గురికాకూడదు. ఇది దేశాభివృద్ధినే ఆటంకపరుస్తుంది." అంటూ సమాధానం చెప్పి ఆపేశారు... పరాయి దేశంలో, అంతర్జాతీయ వేదికల పై, మన ప్రధాని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో, చంద్రబాబు ఇలా సమాధానం చెప్పి, ఎంతో హుందాగా వ్యవహరించారు...

cbn on modi 13042018

అలాగే వివిధ అంశాల పై చంద్రబాబు స్పందించారు... పోలవరం గురించి మాట్లాడుతూ, "విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. నీటి ఆయోగ్ సిఫారసులతో త్వరగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే 53% నిర్మాణం పూర్తయింది. జూన్ 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇతర రాష్ట్రాలకూ నీరందించవచ్చు. గోదావరి నది ద్వారా ఏటా 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని నిన్న పట్టిసీమ పూర్తిచేశాం. రేపు పోలవరం పూర్తిచేస్తాం." అంటూ పోలవరం పై స్పందించారు...

cbn on modi 13042018

అలాగే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశం మీద సీఎం స్పందిస్తూ "రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మా రాష్ట్రం నెంబర్-2 ఉంది. నెంబర్-1 కాగలమని ఆత్మవిశ్వాసం ఏర్పడింది. తర్వావత వరుసగా రెండేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మా రాష్టానికి ప్రపంచ బ్యాంకు నెంబర్-1 రేటింగ్ ఇచ్చింది. వ్యాపారానికి అన్నీ సానుకూలతలే ఉన్నాయి. ఏ రకమైన వేధింపులు లేవు. వేగంగా అన్ని అనుమతులిస్తున్నాం. వచ్చే మార్చినెల నాటికి కియా కార్ల పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించనుంది. రండి. మా రాష్ట్రానికి వచ్చి స్వయంగా పరిశీలించి వ్యాపార అనుకూలతలో మా రాష్ట్రం ఏ రకంగా అగ్రగామిగా ఉందో మీరే పరిశీలించండి. మీకిదే మా ఆహ్వానం. ఐటీలో మేం అభివృద్ధి సాధించాం. పౌరుడు పౌరసేవలు పొందాలంటే ఐటీ ఆధారంగా గడప దాటకుండా సేవలు పొందే అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఏ సేవలనైనా ఎక్కడి నుంచైనా పొందే అవకాశం ఆన్ లైన్ ద్వారా కల్పించాం." అంటూ సమాధానం చెప్పారు...

ఆధునిక సాంకేతికతను పాలనలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా, సంస్కరణవాదిగా చంద్రబాబును అభివర్ణించింది హిందుస్థాన్ టైమ్స్.... సింగపూర్ లో జరుగుతున్న, ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును పరిచయం చేస్తూ హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఆర్ సుకుమార్ ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా, రాజధాని అమరావతి గురించి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అన్నింటికంటే సెద్ద సంక్షోభమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించిన అనుభవం ఉందని, అయితే... కొత్త రాజధానికి భూమిని సమకూర్చుకోవడం పెద్ద సవాల్ అన్నారు... రాజధాని అంశం పై చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇది...

mint asia 13042018 1 1

“నేను రెండు దశాబ్దాలకు పైగా సింగపూర్‌ను పరిశీలిస్తున్నాను. వారు చాలా వేగంగా ముందడుగు వేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం. నాలుగేళ్ల పసికూన. అత్యంత జాగరూకతతో సాకవలసిన బిడ్డ. రాజధాని కూడా లేకపోవడం ఈ రాష్ట్రానికి అన్నింటికంటే పెద్ద సంక్షోభం. సైబరాబాద్ వంటి ఆధునిక నగరాన్ని నిర్మించిన అనుభవం ఉంది. బ్రౌన్‌ఫీల్డు సిటీగా ఇప్పటికే హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం. అదే అనుభవం నాకు ఇక్కడ అక్కరకొచ్చింది. తొలుత కొత్త రాజధాని కోసం ఒక చక్కటి ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. కొత్త రాజధానికి చాలినంత భూమిని సమకూర్చుకోవడం పెద్ద సవాల్. అంత భూమి కూడా ప్రభుత్వపరంగా ఎక్కడా లభ్యంగా లేదు. అంత భూమిని ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపై మథనం చేశాను. మా దగ్గర అంత భూమిని సమకూర్చుకునేందుకు అవసరమైన డబ్బు కూడా లేదు."

mint asia 13042018 1 1

"అన్నీ ఆలోచించి ఒక్క పిలుపునిచ్చాను. నా పిలుపు విని ఇప్పటి రాజధాని రైతులు తక్షణం స్పందించారు. వారు నన్ను విశ్వసించారు. వారికి నేను ఒకటే చెప్పాను. సింగపూర్ తరహా నగరాన్ని నిర్మిస్తానని ఎంతో నమ్మకంగా చెప్పాను. వారు నమ్మి ప్రభుత్వానికి 33 వేల ఎకరాల విలువైన భూముల్ని ధారదత్తం చేశారు. వెంటనే నేను కార్యాచరణలోకి దిగాను. రాజధాని నిర్మాణం కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించాలని తొలుత సింగపూర్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించాను. వారు వెంటనే తమ మంత్రివర్గ సమావేశంలో చర్చించి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వారు స్పందించి కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. చెప్పినట్టే వారు 6 మాసాల అత్యంత తక్కువ కాలంలో మా రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఇచ్చారు. ఆ తరువాత రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టాం. విశాలమైన రహదారులు, భూగర్భజల వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థ, వరద నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటీ పూర్తిచేస్తూ వస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించుకుని మా రాజధాని ప్రణాళికలు, ఆకృతులు రూపొందించుకుంటున్నాం,” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

ప్రస్తుతం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వైరం నేపధ్యంలో, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కు మరో గండం లాంటిది వచ్చి పడింది... పోలవరానికి పర్యావరణ అనుమతులు, ఈ జూలై 2తో ముగుస్తాయి... ప్రతి సంవత్సరం కేంద్రం, దీన్ని పొడిగిస్తూ వస్తుంది... మరి ఈ సారి ఏమి చేస్తుందో అని రాష్ట్ర అధికారులు టెన్షన్ పడుతున్నారు... ఇదే విషయం పై ఢిల్లీ వెళ్లారు.. పోలవరం పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా సడలించడం కాకుండా, శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలసంఘాన్ని కోరింది. పోలవరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 31 బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై సీడబ్ల్యూసీ సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలవరం డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ నాగిరెడ్డి, మరికొందరు ఇందులో పాల్గొన్నారు. పూర్తిస్థాయిలో చర్చించడానికి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

polavaram 13042018

ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి గురించి రాష్ట్ర అధికారులు సీడబ్ల్యూసీకి పవరపాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పోలవరం నిర్మాణం పై ఉన్న షరతులను తొలగించాలని కోరింది. ఒడిశాలో తలెత్తే ముంపును దృష్టిలో ఉంచుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేంతవరకూ నిర్మాణ పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న అప్పటి యూపీయే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాతి కాలంలో ఈ షరతులను సమయానుకూలంగా ఆరునెలలు, సంవత్సరంపాటు సడలిస్తూ వస్తున్నారు. తాజాగా 2017 జులై 5న ఇచ్చిన సడలింపు ఈ ఏడాది జులై 2తో ముగియనుంది. ఇలా ప్రతిసారీ నిర్మాణ పనుల పై ఆంక్షలు విధించడం వల్ల తమకు పూర్తి అసౌకర్యం కలుగుతోందని, ఈ నిబంధనలను శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తాజా సమావేశంలో కోరారు.

polavaram 13042018

ఇదే అంశం పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రికి లేఖ కూడా రాసినట్లు వారి దృష్టికి తీసుకొచ్చారు. 2010-11 ధరల స్థాయితో పోలిస్తే 2013-14 నాటికి ప్రాజెక్టు వ్యయం పెరగడానికి గల కారణాలను విపులీకరించారు. ఇదివరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ. 2,934 కోట్లు అవుతుందని అంచనా వేయగా 2013 భూసేకరణ చట్టం నేపథ్యంలో ఆ వ్యయం రూ. 33,225 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ ఒక్క వ్యయమే 1,132. 27% పెరి గినట్లు తెలిపారు. కాలువలు, హెడ్ వర్క్ నిర్మాణ పనుల్లో ఇంత అసాధారణ స్థాయిలో పెరుగుదల లేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చులనూ సకాలంలో ఇప్పించాలని కోరారు. 2018 ఫిబ్రవరి వరకు రూ. 8,065 కోట్లు ఖర్చుచేస్తే రూ. 5,342 కోట్లు చెల్లించారని, ఇంకా రూ. 2,723 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. ఈ డబ్బు త్వరగా ఇప్పిస్తే ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి కావడానికి వీలవుతుందన్నారు.

శుక్రవారం వేకువజాము 3:30కు సింగపూర్ చాంఘి అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగుపెట్టారు. సింగపూర్‌లో ఈరోజు ఒకరోజు పర్యటనలో బిజీ షెడ్యూల్ గడపనున్నారు. పారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం 5:30 (IST) నుంచే ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్ ఈశ్వరన్‌తో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంలో, హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఆర్ సుకుమార్, చంద్రబాబుని ప్రశ్నలు అడిగారు...

mint asia 13042018 1+

జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర, ప్రణాళిక ఏమిటి, అని అడగగా, "జాతీయ రాజకీయాల్లో నాకు ఆసక్తిలేదని అంశాన్ని గతంలో నేను ఎన్నో పర్యాయాలు స్పష్టం చేశాను. నాకు అటువంటి ఆకాంక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలకు అభివృద్ధిలో ఒక నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం. నా ఆకాంక్ష అదే." అంటూ చంద్రబాబు సమాధానం చెప్పారు... టెక్నాలజీలో రోల్ మోడల్ అని ఎలా చెబుతారు? అని మరో ప్రశ్న అడగగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ... "నేను టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాను. డిజిటల్ పరిపాలనలలో భాగంగా ప్రభుత్వ విభాగాల ఫైళ్లను ఆన్‌లైన్ లో ఉంచాం. కంప్యూటర్ ద్వారానే ఫైళ్ల క్లియరెన్స్ ను పర్యవేక్షిస్తున్నాను. ముఖ్యమంత్రిగా నాకు ఒక డ్యాష్ బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్ బోర్డుకు అన్ని విభాగాలను అనుసంధానం చేశాం....."

mint asia 13042018 1+

"...తద్వారా వాస్తవిక సమాచార పద్ధతిలో పరిపాలనలో ముందుకు సాగుతున్నాం.రియల్ టైమ్ గవర్నెన్స్ మెరుగైన పరిపాలన అందిస్తున్నాం. రైతు వ్యవసాయిక సీజనులో చీడపీడల నివారణకు ఏ సీజనులో ఏ పంటకు ఏఏ క్రిమిసంహార మందులు వినియోగించాలో తెలియజేసే యాప్స్ ను మా రైతులు ఉపయోగిస్తున్నారు. అటువంటి టెక్నాలజీ ఉంది. నా ట్యాబ్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తు వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షిస్తాను. సంఘవ్యతిరేక శక్తులైన రౌడీషీటర్లను అదుపు చేయడానికి యాప్ సేవలు ఉపయోగించుకుంటున్నాం. అదలా ఉంచితే మా రాష్ట్ర వృద్ధి రేటు 10.5% గా ఉంది. వచ్చే 15 నుంచి 20 ఏళ్లలో వృద్ధి రేటును 15% కు తీసుకెళ్లడానికి సంకల్పం తీసుకుని కష్టపడి పని చేస్తున్నాం. మా రాష్ట్రంలో పెట్టుబడులకు నాదీ భరోసా. ఆంధ్రప్రదేశ్ కి రండి. పెట్టుబడులు పెట్టండి. మా రాష్ట్రం వృద్దిరేటులో, అభవృద్ధిలో మరింత ఎదగడానికి మీ సహాయ సహకారాలను కోరుతున్నాను." అని అన్నారు...

Advertisements

Latest Articles

Most Read