"మోడీ పేరు చెప్తేనే గడగడలాడిపోతూ ఉంటాం... అందరి రాజకీయ నాయకుల పరిస్థితి అంతే... విపక్షాలు ఎప్పుడూ ఆయన పై శ్రుతిమించిన ఆరోపణలు చెయ్యలేదు... ఆయన రూపం కనిపిస్తేనే, ఆయనకు కనపడకుండా పక్కకి వెళ్ళిపోతారు... అలాంటిది, మీరు ఏకంగా ఆయన ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసారు ? నేను తెలంగాణా గొడవ అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నా... అప్పట్లో సోనియా గాంధి ఇంటి ముందుకు వచ్చి సీమంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది... కాని ఎవ్వరూ రాలేదు... ఇప్పుడు మాత్రం, మీరు ఏకంగా మోడీ ఇంటి ముందు కూర్చున్నారు.. ఇది ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను... ఏంటండి మీ ధైర్యం" ఇది ఈ రోజు టిడిపి ఎంపీలను, ఢిల్లీలో ఒక సీనియర్ ఐపిఎస్ అడిగిన ప్రశ్న...

ias delhi 08042018

ఈ రోజు ఉదయం, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ప్రధాని మోడీ ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే... అయితే, వీరిని ఎంపీలు అని కూడా చూడకుండా, పోలీసులు ఈడ్చి పడేసారు... ఈ సందర్భంలో, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, మన ఎంపీలను ఉద్దేశించి, ఈ ప్రశ్న అడిగారు... ఇంత ధైర్యంగా, మీరు ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేసారు ఏంటి ? మేము ఇలా జరుగుతుంది అని కూడా ఎప్పుడూ అనుకోలేదు అంటూ, మన ఎంపీలను అడిగారు... దీనికి, తోట నరసింహం సమాధానం చెప్తూ, మా రాష్ట్ర ప్రజలే మా ధైర్యం... మా నాయకుడు చంద్రబాబు మా ధైర్యం.. మా పార్టీ పెట్టిందే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం అంటూ, ఆయనకి సమాధానం చెప్పారు..

ias delhi 08042018

ఈ సందర్భంగా, చంద్రబాబు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ ప్రస్తావన కూడా వచ్చింది... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ప్రధాని చేసిన అన్యాయం గురించి, ఢిల్లీలో ఇలా చెప్పటం మీరు ఎప్పుడైనా విన్నారా అంటూ, ఆ ఐపిఎస్ ను ప్రశ్నించారు ఒక ఎంపీ... మేము చేస్తున్నది న్యాయమైన పోరాటం... ఇన్నాళ్ళు, ఆయన ఎదో ఒకటి చేస్తారని ఓపికగా ఆగం.. ఏమి చెయ్యరు అని తెలిసిన తరువాత, మాలోని రెండో యాంగిల్ కూడా చూపించాలి కదా అంటూ, సమాధానం చెప్పారు... అయినా, మీరు మేము ఎంపీలు అని కూడా చూడకుండా, ఇలా లాగి పడేస్తారు అనుకోలేదు... 75 సంవత్సరాలు ఉన్న వారిని కూడా, మీ వాళ్ళు ఇలాగే లాగి పడేసారు.... అయినా మాకు ఇబ్బంది లేదు, అంటూ ఆ ఐపిఎస్ కు సమాధానం చెప్పారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల అములు కోసం తెలుగుదేశం పార్టీ ఏంపీలు చేస్తున్న ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు... హోదా సాధనలో భాగంగా ఆదివారం ఉదయం ప్రధాని మోదీ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు... ఈ విషయం తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్‌ పీఎస్‌కు వెళ్లి ఎంపీలను పరామర్శించి.. సంఘీభావం ప్రకటించారు. టీడీపీ న్యాయపరమైన డిమాండ్లకు మద్దతిస్తున్నానని తెలిపారు. ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నవారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కేజ్రీవాల్. కనీసం ఎంపీలన్న గౌరవం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.

kejriwal 08042018

ఎంపీల ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని మరోమారు స్పష్టం చేసిన కేజ్రీవాల్, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రధాని మోదీ నివాసం దగ్గర మెరుపు ధర్నా తర్వాత ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీ నివాసం దగ్గర నుంచి బస్సులో తరలించి... తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్ నేరుగా పీఎస్‌కు వెళ్లారు. అక్కడ ఎంపీలను పరామర్శించిన ఆయన... వారికి సంఘీభావాన్ని తెలిపారు.

kejriwal 08042018

కాగా ఈ రోజు ఉదయం రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి నివాసంలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన ఎంపీలు.. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధాని నివాసం ముట్టడికి యత్నించారు. ప్లకార్డులు చేతబూని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దీంతో అక్కడికి చేరుకున్న కేజ్రీవాల్‌ ఎంపీలతో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు.

ప్రాధాని మోడీకి తెలుగుదేశం పార్టీ చుక్కలు చూపిస్తుంది.... నెల రోజుల నుంచి, చంద్రబాబు, మోడీని ఏకి ఏకి పెడుతుంటే, పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేసారు.. ఎంత చేసినా, పార్లమెంట్ లో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు... పార్లమెంట్ వాయిదా పడినా, తెలుగుదేశం ఎంపీలను ఢిల్లీలోనే ఉండమని చంద్రబాబు ఆదేశించారు... అయితే, ఎందుకు ఉండమన్నారా అని అందరూ అనుకున్నారు... చివరి వరకు, ఏ రకమైన ఆందోళన చేస్తున్నారో ఎవరికీ చెప్పలేదు... ఆదివారం ఉదయం ఉన్నట్టు ఉండి, తెలుగుదేశం ఎంపీలు అందరూ, మోడీ ఇంటికి బయలు దేరి వెళ్లి, మోడీ ఇంటి ముందు, టిడిపి ఎంపీల మెరుపు ధర్నా నిర్వహించారు...

modi 08042018 1

అయితే వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు... ఢిల్లీ పోలీసు కమీషనర్ తో సహా అందరూ వచ్చేశారు.. ఎంపీలను ఈడ్చి అవతల పడేసారు.. బలవంతంగా వారిని తరలించే క్రమంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు లాగి పడేశారు.. ఎంపీలు వినక పోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు. అరెస్టులతో తమను ఆపలేరని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా సీఎం రమేష్ హెచ్చరించారు.

modi 08042018 1

ప్లకార్డులు చేతబూని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. విభజన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని కోరారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే బలవంతంగా తరలించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఎంపీలు అన్నారు. ఈ చర్యతో మోదీ నిరంకుశతత్వం బయటపడిందన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో రోజుల తరబడి గొంతు చించుకున్నా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం ప్రధాని మాత్రమే చేయగలరని.. అది జరిగేవరకూ తమ పోరాటం ఇలాగే సాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు.

ఈ రోజు ఢిల్లీలో ప్రాధాని మోడీ ఇంటి ముందు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు మెరుపు ధర్నా చేసిన విషయం తెలిసిందే... అయితే, ఈ ధర్నాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పాల్గునటం చూసి, అందరూ ఆయన కర్తవ్యాన్ని మెచ్చుకుంటున్నారు... మూడు రోజుల క్రితం అశోక్ గజపతి రాజు తల్లి కుసుమ కన్నుమూశారు. గురువారం ఆమె అంత్యక్రియలు జరిగాయి.. అయితే అంత్యక్రియలు జరిగిన ఒక్క రోజులోనే ఢిల్లీ వచ్చి, ఎంపీల ఆందోళనలో పాల్గున్నారు... ఆయన నాలుగో తారీఖు ఢిల్లీ నుంచి వచ్చేశారు.. అయితే, నిన్న చంద్రబాబు ఎంపీలను ఢిల్లీలోనే ఉండమనటంతో, అశోక్ గజపతి రాజు కూడా మళ్ళీ ఢిల్లీ పయనం అయ్యారు...

ashok 08042018

నిన్న టెలి కాన్ఫరెన్స్ లో, చంద్రబాబు, రాజు గారిని మీరు కష్టాల్లో ఉన్నారు ఢిల్లీ వెళ్ళవద్దు, అని చెప్పినా, ఆయన మాత్రం వినిపించోకోలేదు... మన ఎంపీలు అందరూ కలిసి కట్టుగా ఉండి, ఎక్కువ మంది కనిపిస్తే, మన ఆందోళన ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి, ఢిల్లీ బయలుదేరి వచ్చారు.. ఈ రోజు ఉదయం, ఎంపీ సుజనా చౌదరి నివాసంలో టీడీపీ ఎంపీల సమావేశంలో పాల్గున్నారు... ఈ సమావేశం అనంతరం టీడీపీ ఎంపీలు ప్రధాని నివాసానికి బయల్దేరారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలని వారు నిర్ణయించారు. ప్రత్యేక హోదా కోసం మోదీ ఇంటి ఎదుట నిరసనకు దిగారు. దీంతో ప్రధాని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు...

ashok 08042018

అయితే పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు... పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. భద్రతా బలగాలు ఎంపీలను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకుని బస్సులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, ఎంపీలకు స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది... అదుపులోకి తీసుకున్న ఎంపీలను పోలీసులు తుగ్లక్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ప్రధాని నివాసానికి తీసుకెళ్తే తప్ప తాము బస్సు దిగేది లేదని ఎంపీలు భీష్మించుకుని కూర్చున్నారు.తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే బలవంతంగా తరలించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఎంపీలు అన్నారు. ఈ చర్యతో మోదీ నిరంకుశతత్వం బయటపడిందన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో రోజుల తరబడి గొంతు చించుకున్నా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ..

Advertisements

Latest Articles

Most Read