చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఒక్కో కుట్ర బయటకు వస్తుంది... ఒరిస్సాలో ఓట్లు కోసం, ఒరిస్సాలో అధికారం కోసం బీజేపీ ఆడుతున్న నాటకాలు బయట పడ్డాయి... వీళ్ళు ఓట్లు కోసం, ఒక రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూస్తున్నాం... ఇప్పుడే వాళ్ళే, స్వయానా వాళ్ళు చేసిన అన్యాయం చెప్పుకున్నారు... ఓట్లు కోసం, ఆడిన అబద్ధాలలో, పొరపాటున నిజం బయటకు వచ్చింది...కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నిన్న, ఒరిస్సాలో పర్యటించారు...అక్కడ అధికార బీజేడీ పార్టీ పై విమర్శలు చేసారు... మనకు ఇక్కడ చెప్పినట్టే, ఒరిస్సాకు ఎంతో చూసాం, లక్షలు లక్షలు కోట్లు ఇచ్చాం, కాని ఇక్కడ ప్రభుత్వం అవినీతి చేసింది అంటూ, మనకు పాడిన పాటే పాడారు...

polavaram 10042018

ఈ సందర్భంలో పోలవరం గురించి మాట్లాడారు... పోలవరం ప్రాజెక్ట్ విషయం పై ఒరిస్సాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని, బీజేపీ ప్రభుత్వం, పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్షపాతం చూపిస్తుంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి అని విలేకరులు అడగగా... పోలవరం విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం... కేంద్రం, ఒరిస్సాకు అన్యాయం చెయ్యాలని అనుకోవటం లేదు... అసలు చంద్రబాబు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు అంటే పోలవరం ప్రాజెక్ట్ గురించే అంటూ వ్యాఖ్యలు చేసారు.. అంటే, పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కేంద్రం సరిగ్గా సహకరించటం లేదు, తద్వారా ఒరిస్సాకి న్యాయం చేస్తుంది, అందుకే పోలవరం విషయంలో కేంద్రం సహకరించటం లేదు కాబట్టి, చంద్రబాబు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అని కేంద్ర మంత్రి చెప్తున్నారు...

polavaram 10042018

అంతే కాదు, మరో విషయం మాట్లాడుతూ, మనకు బుద్ధి చెప్తారంట కేంద్ర మంత్రి గారు... కొఠియా గ్రూప్‌ గ్రామాలు ఒడిశావేనని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తమవంటే గుణపాఠం చెప్తామంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్నింగ్ ఇస్తున్నారు... డిశా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒడిశా సరిహద్దులను కాపాడుకోవడం ప్రతి పౌరుడు బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు... ఇలా వీళ్ళు వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో, అక్కడ పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడుతూ, రాష్ట్రానికి రాష్ట్రానికి చిచ్చు పెడుతూ, మోడీ లక్షల లక్షల కోట్లు ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలే అవినీతి చేస్తున్నాయి అంటూ, ప్రతి రాష్ట్రంలో ఇదే పాట పాడుతున్నారు... ప్రజలు ఇప్పటికే వీళ్ళ ఫేక్ ప్రచారం కనిపెట్టారు... ఇలాని సోదికి విసిగి పోయారు.. పాపం ఈ బీజేపీ వాళ్ళకే అర్ధం కావటం లేదు...

దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నాయి... ఈ రోజు, కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు... తమ హక్కుల కాపాడుకొనే దిశగా సౌత్ స్టేట్స్ ఏకమవుతున్నాయి. దక్షిణాది నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం వస్తున్నా… నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ సమావేశానికి రావటం లేదు అంటూ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మంత్రులు కబురు పంపించారు... ఎందుకు రావటం లేదో సరైన కారణం చెప్పటం లేదు... ఈ నిర్ణయంతో, వీరు మోడీ తొత్తులు అనేది మరోసారి స్పష్టం అయ్యింది...

modi 10042018

మొన్న పార్లమెంట్ సమావేశాలు అప్పుడు కూడా, ఈ రెండు పార్టీలే గోల చేసి, అవిశ్వాస తీర్మానం రాకుండా అడ్డు పడ్డాయి... చివరి వారం రోజులు తెరాస ఎంపీలు వెనక్కు తగ్గారు... కాని అన్నడీయంకే కొనసాగిస్తూనే ఉంది... దేశంలో అన్ని పార్టీలు, ఈ రెండు పార్టీల చేత, బీజేపీనే గోల చేస్తుంది అని విమర్శలు కూడా చేసాయి... ఈ రోజు, అన్ని దక్షినాది రాష్ట్రాలు సమావేశం అయ్యి, కేంద్రం పై ఒత్తిడి తెస్తుంటే, తెలంగాణ, తమిళనాడు డుమ్మా కొట్టాయి... దీంతో, పూర్తి క్లారిటీ వచ్చేసింది... కేరళలో భేటీకి వెళ్లడం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం కూడా ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించింది. ఆర్థికమంత్రి పన్నీర్‌సెల్వం ఈ సమావేశానికి వెళ్తారని తొలుత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సమావేశానికి ఒక్కరోజు ముందు తమిళనాడు ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది.

modi 10042018

ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఐదేళ్ల పాటు నిధుల వస్తాయి కాబట్టి.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు, నిధుల కేటాయింపులో మొదటి నుంచీ పకడ్బందీగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు... రెవెన్యూ లోటు నిధిని రద్దు చేసే ఆలోచన.. 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో ఉండటంతో.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర అధికారులు చెప్పారు. రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో కొన్ని సవరణలు అవసరమని.. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా ఉంది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల ఏపీకి జరుగుతున్న నష్టం.. దక్షిణాదికి పనికి రాని కేంద్రం పథకాలు.. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలవల్ల జరిగే నష్టాలపై మన రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు వివరిస్తారని సమాచారం.

అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. శంకుస్థాపన జరుపుకొన్న ఈ రెండు నెలల్లోనే 30 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇదే ఊపు కొనసాగితే, వచ్చే ఏడాది మార్చి నాటికి పరిశ్రమ సిద్ధం అవుతుంది. రూ.13,500 కోట్లు పెట్టుబడితో ఇక్కడ భారీ కార్ల పరిశ్రమకు ‘కియ’ శ్రీకారం చుట్టింది. దీనికిగాను అవసరమైన యంత్ర సామగ్రిని కొరియా నుంచి దిగుమతి చేసుకొంటోంది. ఆ సామగ్రిని తొలుత కృష్ణపట్నం రేవుకు తీసుకొచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో పరిశ్రమ వద్దకు తరలిస్తున్నారు. ప్రస్తుతం బాడీ బిల్డ్‌షాపు యూనిట్‌, ప్రెస్‌ యూనిట్‌, అసెంబ్లింగ్‌ యూనిట్‌, పెయింటింగ్‌ షాపు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.

kia 09042018 1

ఉద్యోగుల కోసం దుద్దేబండ క్రాస్‌ వద్ద చేపట్టిన టౌన్‌షిప్ నిర్మాణ పనులు 30 శాతం పూర్తయ్యాయి. 12.6 ఎకరాల్లో 16 భవనాల్లో 82 గదుల నిర్మాణం చేపట్టారు. 2018 ఆగస్టు నాటికి ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పరిశ్రమకు నీటిని అందించడానికి చేపట్టిన రూ.22 కోట్ల విలువైన పైప్‌లైన్‌ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.3.5 కోట్లతో ఇంటెక్‌వెల్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఉద్యోగ నియామకాల అనంతరం శిక్షణ ఇవ్వడానికి దుద్దేబండ క్రాస్‌లో 11 ఎకరాల్లో నిర్మిస్తున్న శిక్షణ కేంద్రం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కేంద్రంలో ఒకేసారి వంద మందికి శిక్షణ ఇచ్చే వీలుంది.

kia 09042018 1

అయితే, ఇక్కడ పని చెయ్యాలి అంటే, కొరియా భాష నేర్చుకుంటే, ప్రయారిటీలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు... అందుకే, కొరియా భాష నేర్పేందుకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎస్కేయూ స్కిల్‌ డెవలప్ మెంట్‌ ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఈ భాషా శిక్షణ సాగనుంది. ‘కియ’ వంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే కొరియా భాష వచ్చి ఉంటే మంచిదనే అభిప్రాయంతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్టు మండలి తెలిపింది. ఆసక్తి కలిగిన వారు www.skuniversity.ac.in, www.skillsku.com నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని, ఈనెల 12 లోగా పూర్తిచేసి సమర్పించాలని కోరింది. ఇక్కడ నుంచి, పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు http://skuniversity.ac.in/dload/SKU%20-%20Certificate%20Course%20in%20Korean%20Language%20-%20Notification.pdf

అగ్రిగోల్డ్‌... కాంగ్రెస్ హయాంలో జరిగిన మరో భారీ స్కాం ఇది... కాకపొతే ప్రభుత్వ సొమ్ము కాకుండా, డైరెక్ట్ గా ప్రజల జేబులు కొట్టేసారు ఘరానా దొంగలు... దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులుంటే వీరిలో 19 లక్షల మంది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, వీరికి ఎలా అయినా న్యాయం చెయ్యాలని, అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మి, నష్టపోయిన వారికి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు... ప్రభుత్వం తరుపున చేస్తే లేని పోనీ తలనొప్పులు అని, కోర్ట్ ద్వారా ఈ ప్రక్రియ చెయ్యటానికి రెడీ అయ్యారు... ఇదే తరుణంలో, అగ్రి గోల్డ్ ను టేకోవర్ చేసేందుకు జీఎస్సెల్ గ్రూపు ముందుకొచ్చింది. జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర అమరావతి వచ్చి ఆ మధ్య చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు.

subhash 100402018 1

కోర్ట్ కి కూడా ఇదే విషయం చెప్పారు... ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్‌ సంస్థలో డబ్బులు దాచుకున్న వారి జాబితా మొత్తం సిద్ధం చెయ్యమని సీఐడీ అధికారులని ఆదేశించింది... జీఎస్సెల్ గ్రూపు టేక్ ఓవర్ చేసిన అనంతరం సమకూరే నిధులు నుంచి బాధితులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చెయ్యటానికి ప్రభుత్వం రెడీ అయ్యింది... అంతా స్వయంగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో, అగ్రిగోల్డ్‌ సంస్థను టేకోవర్‌ చేయడానికి ముందుకొచ్చిన ఎస్సెల్‌-జీ గ్రూపు చేతులేత్తేసింది... ఇదే విషయం నిన్న కోర్ట్ కి చెప్పింది.. అంతేకాదు, సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్‌ను కూడా తెరపైకి తీసుకు వచ్చింది, జీ గ్రూప్.. సంయుక్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆసక్తి ఉందని అమర్ సింగ్ చెప్పారని జీఎస్ఎల్ గ్రూప్ తెలిపింది.. ఈ ప్రతిపాదనను హైకోర్టు తోసిపుచ్చింది. నేరుగా మీరు అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకుంటారా లేదా రెండు వారాల్లో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

subhash 100402018 1

అయితే, ఈ తతంగం మొత్తం వెనుక మోడీ, బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి... ఇంత పెద్ద గ్రూప్, ఏమి గ్రౌండ్ వర్క్ చేసుకోకుండానే, ఇక్కడ వరకు వచ్చిందా ? ఇప్పుడు వచ్చి, మా వాల్ల కాదు అంటున్నారు అంటే, ఒత్తిడి ఉండే ఉంటుంది అని భావిస్తున్నారు... ఇది కనుక ఒక కొలిక్కి వస్తే, 19 లక్షల మందికి చంద్రబాబు దేవుడు అవుతాడు... అల చేస్తే, రాజకీయంగా చంద్రబాబుకి లాభం... అందుకే, ఇది ముందుకు వెళ్ళకుండా ఆపారు అంటున్నారు... జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర, 2016లో బీజేపీ సపోర్ట్ తో రాజ్యసభకు ఎన్నికయ్యారు... మోడీ, సూచనలు మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చంద్రబాబుకి ఏ మేలు చెయ్యకూడదు అనే ఆదేశాలు మేరకు, ఇలా జరిగి ఉండవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.. అలాగే అమర్ సింగ్ పేరు తెర పైకి తీసుకురావటం కూడా, ఇందులో భాగమే అని భావిస్తున్నాయి... మొత్తానికి, మోడీ మన మీద అన్ని వైపుల నుంచి, కక్ష తీర్చుకుంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read