ఇప్పటిదాకా దక్షిణాదిపై వివక్ష గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులు మాత్రమే పోరాడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కేరళ కూడా గొంతు కలుపుతోంది. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇస్సాక్‌ దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని.. అభివృద్ధి అవసరాల పేరుతో ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇదే అంశంపై రేపు, ఏప్రిల్‌ 10న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసారు. మోదీ హయాంలో నిధుల కేటాయింపులో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా ఉంది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల ఏపీకి జరుగుతున్న నష్టం.. దక్షిణాదికి పనికి రాని కేంద్రం పథకాలు.. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలవల్ల జరిగే నష్టాలపై మన రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు వివరిస్తారని సమాచారం.

south india 09042018

ఉపయోగం లేని పథకాలను తొలగించాలని లేదా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే.. కేంద్ర పథకాల్లో 83:17గా ఉన్న రాష్ట్ర వాటా 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత 69:31గా మారింది. ఆర్థికలోటులో ఉన్న ఏపీకి ఇది చాలా భారంగా మారింది. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేని దుస్థితి ఉంది. కేంద్ర పథకాలు అవసరం లేని రాష్ట్రాలకు ఆ మేర నిధులను ఆయా రాష్ట్రాలకే కేంద్రం ఇచ్చేయాలని 11వ ఆర్థిక సంఘమే చెప్పింది. కానీ కేంద్రంలోని పెద్దలు వీటిని పట్టించుకునే స్థితిలో లేరు. 14వ ఆర్థిక సంఘం తప్పుడు అంచనాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఏటా వేల కోట్ల రెవిన్యూ లోటు కోల్పోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం రూ.77,784కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసి.. రెవిన్యూ లోటును రూ.37,817 కోట్లుగా తేల్చింది.

south india 09042018

కానీ, రాష్ట్ర సొంత పన్నుల ఆదా యం రూ.50వేల కోట్లకు అటూ ఇటూగా ఉంది. ఇందులోని లోటే రూ.27 వేల కోట్లు. ఆర్థికసంఘం అంచనా వేసిన రెవిన్యూ లోటు.. పన్ను ఆదాయం లోటు కలిపితే ఈ మొత్తం లోటు రూ.64 వేల కోట్లకు చేరుకుంది. ఆ మేరకు నిధులు రాష్ట్రానికి రావాలి. కానీ రాలేదు. మూడేళ్లగా రాష్ట్రం విషయంలో జరిగింది ఇదేనని అధికారులు చెబుతున్నారు. సరాసరి రాష్ట్రం రూ.50 వేల కోట్లు కోల్పోయిందనేది వారి వాదన. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఐదేళ్ల పాటు నిధుల వస్తాయి కాబట్టి.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు, నిధుల కేటాయింపులో మొదటి నుంచీ పకడ్బందీగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ లోటు నిధిని రద్దు చేసే ఆలోచన.. 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో ఉండటంతో.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో కొన్ని సవరణలు అవసరమని.. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.

మోడీ జీ... ప్లీజ్ మోడీ జీ.. రిక్వెస్టింగ్ మోడీ జీ... ఇది ఈ రోజు, జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీని ఉద్దేశించి పెట్టిన ట్వీట్... ఒక పక్క రాష్ట్రం మొత్తం, మోడీ పై మండి పడుతుంటే, మనోడు మాత్రం, ప్లీజ్ ప్లీజ్ అంటూ దేవులాడుతున్నాడు... ఈ పేరు పలకటానికి, నాలుగేళ్ళు పట్టింది అనుకోండి అది వేరే విషయం... ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు, చంద్రబాబు మోడీని నడి బజారులో, ఏకి పడేస్తుంటే, జగన్ మాత్రం, మోడీ అనే పేరు పలకటానికి కూడా భయపడుతున్నాడు... రెండు రోజులు క్రిందట, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు... గంట మాట్లాడాడు... 130 సార్లు చంద్రబాబు పేరు తలిస్తే, ఒక్క సారి కూడా మోడీ పేరు తలవలేదు...

jagan 09042018

ఇదే విషయం కొంత మంది వైసిపీ నేతలను అడిగితే, వారు అఫ్ ది రికార్డు చెప్పిన మాట ఏంటి నటే, గెట్టిగా ఈయన మోడీ అంటే, ఈడీ బయటకు వస్తుంది.. అందుకే మోడీ అనే పేరు తలవటానికి కూడా మా వాడికి భయం.. ఎప్పుడన్నా తలిచినా, ఎంతో రెస్పెక్ట్ తో తలుస్తారు... ఎందుకో కారణాలు మీకు తెలియనిదా... మాకు కూడా అదే ఆదేశాలు ఉన్నాయి... మోడీ మీద ఒక్క విమర్శ చెయ్యవద్దు... అసలు మోడీ అనే పేరే తలవద్దు అని ఖటినమైన ఆదేశాలు ఉన్నాయి.. ఒక పక్క చంద్రబాబు అలా వాయిస్తుంటే, మా వాడు ఇలా ప్లీజ్ ప్లీజ్ అంటుంటే, మేము కూడా ప్రజల్లో చులకన అయిపోతున్నాం.. ఈయన కేసులు కోసం, ఈయన తాపత్రయం.... ఈయనతోనే అనుకుంటుంటే, ఆ విజయసాయి రెడ్డి ఒకడు అంటూ, అసహనాన్ని చూపించారు...

jagan 09042018

మరో పక్క ఎంపీలు రెండు రోజుల నుంచి నిరాహారదీక్ష చేస్తున్నారు... ఢిల్లీలో చేస్తున్నారు కాబట్టి, హోదా ఇవ్వాల్సింది, విభజన హామీలు నేరవేర్చాల్సింది మోడీ కాబట్టి, అయన పేరు తలుస్తారేమో అని ఎదురు చూసాం... వాళ్ళు కూడా, చంద్రబాబు చంద్రబాబు తప్ప వేరే మాట లేదు అంటూ, వైసిపీ నేతలు వాపోతున్నారు... మోడీ అనే గట్టిగా ఒక్క మాట అంటే, ఈడీ ఎంటర్ అయితే, మావోడి పరిస్థితి ఏంటి, పక్కన శశికళను చూసారుగా, ఒక్క రోజులో ఏమైందో ? మోడీ వచ్చి నెత్తిన చెయ్య పెట్టాడు, నాకు ఏంటిలే అనుకుంది.... మోడీకి ఎదురు తిరిగింది, లోపల వేసాడు... మా వాడి పరిస్థితి అదేగా... 16 సిబిఐ, ఈడీ కేసులు కింద పెట్టుకుని ఉన్నాడు... ఆయనకు తిక్క తిప్పేస్తే, ఏమవుతుందో మా వాడికి తెలుసు.. అందుకే ఈ బాధలు అని, వైసిపీ నేతలే చెప్పుకుంటున్నారు... ఇది జగన్ పరిస్థితి...

నిన్న ఢిల్లీలో ప్రాధాని మోడీ ఇంటి ముందు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు మెరుపు ధర్నా చేసిన విషయం తెలిసిందే... నెల రోజుల నుంచి, చంద్రబాబు, మోడీని ఏకి ఏకి పెడుతుంటే, పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేసారు.. ఎంత చేసినా, పార్లమెంట్ లో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు... పార్లమెంట్ వాయిదా పడినా, తెలుగుదేశం ఎంపీలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. ఆదివారం ఉదయం ఉన్నట్టు ఉండి, తెలుగుదేశం ఎంపీలు అందరూ, మోడీ ఇంటికి బయలు దేరి వెళ్లి, మోడీ ఇంటి ముందు, టిడిపి ఎంపీల మెరుపు ధర్నా నిర్వహించారు...

sumanth 09042018 1

అయితే వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు... ఢిల్లీ పోలీసు కమీషనర్ తో సహా అందరూ వచ్చేశారు.. ఎంపీలను ఈడ్చి అవతల పడేసారు.. బలవంతంగా వారిని తరలించే క్రమంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని, గల్లా జయదేవ్ ని పోలీసులు లాగి పడేశారు.. ఎంపీలు వినక పోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు... అయితే, ఎంపీలను ఈ విధంగా, ఈడ్చి పడేయటం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి... సాక్షాత్తు, ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చి ఎంపీలను పరామర్శించి, పోలీసుల తీరుని తప్పుబట్టారు... అయితే, ఈ విషయం పై, హీరో సుమంత్ స్పందించారు...

sumanth 09042018 1

ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, అలా జయదేవ్‌‌కు జరగడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోందంటూ హీరో సుమంత్ పోస్ట్ పెట్టారు. ‘నాకు తెలిసిన వ్యక్తుల్లో ది బెస్ట్ అయిన గల్లా జయదేవ్‌కు ఇలా జరగడం చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అంటూ సుమంత్ గల్లా జయదేవ్ పెట్టిన పోస్ట్, ని రీ ట్వీట్ చేస్తూ స్పందించారు... ఒక్క జయదేవ్ కే కాదని, ప్రత్యేక హోదా కోసం, ఆందోళన చేస్తున్న అందరికీ మద్దతు పలుకుతున్నట్టు మరో పోస్ట్ కూడా పెట్టారు... ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పై, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర అసహనం ఉంది... ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, మన సమస్య పై సరైన స్పందన లేదు అనుకుంటున్న టైంలో, ఒక హీరో కనీసం ట్విట్టర్ ద్వారా అయినా స్పందించారు...

ఈ సారి ఎలాగైనా కర్ణాటకలో ఎన్నికలు గెలిచి, తద్వారా దక్షిణ భారతంలో అడుగు పెట్టి, మిగిలిన రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని చూస్తున్న బీజేపీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి... ఒక పక్క చంద్రబాబు ఎదురుతిరిగి, ఆంధ్రప్రదేశ్ విభజన హామీల విషయం, నేషనల్ ఇష్యూ చెయ్యటంతో, ఆ దెబ్బ కర్ణాటకలో కూడా పడింది... దాదాపు కోటి మంది తెలుగు ఓటర్లు ఉన్న కర్ణాటకలో, ఈ ప్రభావం ఉంటుంది అని, బీజేపీ నేతలే చెప్తున్నారు... ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు మరో సమస్య బీజేపీకి వచ్చి పడింది... అదే కావేరీ బోర్డు విషయం... ఇదే ఇష్యూతో, అన్నాడీయంకేతో నాటకం ఆడించి, పార్లమెంట్ వాయిదా వేసుకున్న బీజేపీకి, ఇప్పుడు ఇదే విషయం మెడకు చుట్టుకుంది...

amit 09042018

కావేరీ నదీ జలాల వివాదంపై గత ఫిబ్రవరిలో ఇచ్చిన తుది తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఈ రోజు ప్రశ్నించింది... మే 3వ తేదీలోగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపకాలకు సంబంధించి డ్రాఫ్ట్‌ను తయారుచేసి సమర్పించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది... మేనేజ్‌మెంట్‌ బోర్డు విషయమై ముందే తమను ఎందుకు సంప్రదించలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది... కోర్టు అన్ని విషయాలనూ అమలయ్యేలా చేయలేదని.. కేంద్రమే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు...

amit 09042018

అయితే, ఇది కావాలనే కేంద్రం వాయిదా వేస్తూ వస్తుంది... ఎందుకంటే, ఇలా చేస్తే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి నష్టం వస్తుంది.. అందుకే, సాధ్యమైనంత వరకు, కర్ణాటక ఎన్నికలు అయ్యే దాక, ఈ విషయం పక్కన పెడదాం అనుకుంది... తీర్పు అమలుకు మరింత సమయం కావాలని కేంద్రం స్పష్టం చేసింది... కాని సుప్రీం కోర్ట్ మాత్రం, కనీసం మే 3లోగా కావేరి బోర్డు ముసాయిదాను అందించాలని పేర్కొంది.... దీంతో ఇప్పుడు కోర్ట్ ఆదేశాలు పాటించాల్సిన పరిస్థితి... ఇలా చేస్తే, ఇప్పటికే వ్యతిరేక పవనాలు వీస్తున్న కర్ణాటకలో, మరో ఎదురుదెబ్బ బీజేపీకి తగలనుంది... కావేరీ జలాల విషయంలో తమిళనాడులో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. కావేరీ జలాల్లో కర్ణాటకకే ఎక్కువ శాతం నీరు కేటాయించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read