మాజీ విమానయాన మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజుకు తీవ్ర అవమానం జరిగింది... అవమానం జరిగింది కూడా, తాను నెల రోజుల క్రిందట మంత్రిగా నిర్వహించిన శాఖలోనే... ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం అశోక్ గజపతి రాజుకు చేదు అనుభవం ఎదురైంది... ఎయిర్ ఇండియా విమానంలో, ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్ళేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు... అశోక్ గజపతి రాజు లగేజీని తనిఖీ చేసిన విమానాశ్రయ సిబ్బంది, దానిని అక్కడే వదిలేశారు... ఆయన విశాఖపట్నం చేరుకున్న తర్వాత తన లగేజ్ లేకపోవడం గమనించినట్లు తెలుస్తోంది... ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి...

ashok 10042018

అయితే, ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో జరగటంతో, ఇది కావాలని ఎమన్నా జరిగిందా ? కావాలనే ఆయన్ను అవమానపరచటానికి, ఇలాంటి సంఘటన ఏమన్నా జరిగిందా అనే సందేహాలు ఉన్నాయి... మొన్న ప్రధాని ఇంటి ముందు జరిగిన ధర్నా సందర్భంలో, అశోక్ గజపతి రాజు కూడా పాల్గున్నారు... ఆయన తల్లి అంత్యక్రియలు ముగిసిన రెండో రోజే, ఆందోళనలో పాల్గుని, కన్న తల్లి లాంటి రాష్ట్రానికి న్యాయం కోసం, ఆయన చేసిన పనికి ప్రజలు మన్ననలు పొందారు... ఈ నేపధ్యంలోనే, ఎవరన్నా పెద్దలు కక్షకట్టి, రాజు గారిని ఇలా అవమానపరిచారా అనే సందేహం కూడా కలుగుతుంది...

ashok 10042018

ఎందుకంటే, అయన ఇదే విమానయాన శాఖలో నెల రోజులు క్రిందటి దాకా మంత్రి, మరో పక్క ఇప్పటికీ ఒక ఎంపీ... ఇలాంటి విఐపిని, ఎయిర్ ఇండియా సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాసం ఉండదు... పోనీ ఆయనతో పాటు, మరికొంత మంది లగేజి కూడా ఆగిపోతే, పొరపాటు అనుకోవచ్చు... కాని, పని గట్టుకుని, అశోక్ గజపతి రాజు ఒక్కరి లగేజిని ఇలా చెయ్యటం చూస్తుంటే, ఆయన్ను ఘోరంగా అవమానించటం కోసం, ఆయన మీద కక్ష తీర్చుకునే క్రమంలో, అశోక్ గజపతి రాజు గౌరవాన్ని భంగం కలిగించే చర్యలు కూడా తీసిపారియ్యలేము అని టిడిపి వర్గాలు అంటున్నాయి...

పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై సచివాలయంలో సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌తో సహా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయిలో కేంద్రీకృతమైనందున ఎలాంటి అవరోధాలూ లేకుండా శత్రుదుర్భేద్యంగా మార్చాలని, పనుల్లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలని జల వనరులశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీలను ఫైబర్‌ నెట్‌తో అనుసంధానం చేయాలని సూచించారు.

polavaram 100042018

ప్రాజెక్టులో ముఖ్య భాగమైన డయాఫ్రమ్‌ వాల్‌ జెట్‌ గ్రౌంటింగ్‌ నిర్మాణాన్ని ఈ వేసవి ఆయ్యేలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మొత్తం 10 కెమెరాలతో పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 52.10 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి కాగా, కుడి ప్రధాన కాలువ 89.10శాతం, ఎడమ ప్రధాన కాలువ 58.30 శాతం మేర పనులు పూర్తయినట్లు సిఎంకు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.13,364.98 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ.8,229.11 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రూ.5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ.2,886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు.

polavaram 100042018

రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను నెలకోసారి స్వయంగా సమీక్షించాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 53 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయన్నారు. పెదపాలెం, చినసాన, పులికనుమ ఎత్తిపోతల పథకాలు, ఓక్‌ టన్నెల్‌, గోరకల్లుబ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

"త్వరలో విద్యుత్ రేట్లు తగ్గిస్తా !" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నవ్వారు... సంస్కరణ వల్ల వచ్చే లాభాలు , ప్రజలకే చెందాలి అంటే ఎగతాళి చేసారు... రెట్లు పెంచుకుంటూ వెళ్ళే ప్రభుత్వాలనే ఇన్నాళ్ళు చూసాం, కాని ఆంధ్రప్రదేశ్ లో రెట్లు తగ్గించే ప్రభుత్వం ఉంది... నాలుగేళ్ళు అయినా ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా, ఇప్పుడు చార్జీలు తగ్గిస్తున్నారు చంద్రబాబు... చంద్రబాబు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు వల్ల, మొట్టమొదటి సారిగా విధ్యుత్ పై 82,00,00,000/- లాభం వచ్చింది... ఇంధన పొదుపును ఖచ్చితంగా అమలు చేయడం వలన 861 కోట్ల విధ్యుత్ ను ఆదా చేసి, దానిని విక్రయించడం ద్వారా నష్టాల నుండి లాభాలలోకి తీసుకువచ్చారు... ప్రస్థుతం రాష్ట్రం ఉన్న పరిస్ధితిలో వచ్చిన లాభాన్ని వేరే వాటికి వాడుకోవచ్చు... కానీ చంద్రబాబు అలా ఆలోచించలేదు. నిర్దేశిత సమయాలలో ధర తగ్గించడం ద్వారా, తిరిగి ప్రజలకే ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు..

cbn current 10042018

డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది... రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య పరిశ్రమలకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య విద్యుత్తును వినియోగించే ఇళ్లకు ఒక యూనిట్ కు రూపాయి చొప్పున ప్రోత్సాహకాన్ని ఇవ్వనుంది... బిల్లుల్లో ఆ మేరకు తగ్గింపును వర్తింపజేయనుంది. స్మార్ట్ మీటర్లు కలిగిన గృహ వినియోగదారులు మాత్రమే దీనిని పొందగలరు... ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది... దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.

cbn current 10042018

ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణ వల్ల రూ. 861కోట్లు ఆదా చేశామని, మిగులు విద్యుత్తు విక్రయం ద్వారా తొలిసారిగా రూ. 82 కోట్లు లాభాలు ఆర్జించినట్లు అధికారులు వివరించారు. వినియోగదారుడి పై భారం పడకుండా ఛార్జీలు పెంచకపోవడమే అతి పెద్ద విజయమని సీఎం చంద్రబాబు వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకు కారకులైన అధికారులు, సిబ్బందిని అభినందించారు. తిరుపతి కేంద్రంగా విద్యుత్తు ఆదా ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయంలో ఐఓటీ గరిష్టంగా వినియోగించడం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసేలా దీన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ పద్ధతిలో కనీసం పదిశాతం విద్యుత్తు ఆదా చేసినా విజయం సాధించినట్లేనని సీఎం వారితో అన్నారు...

నేషనల్ మీడియాలో చంద్రబాబునే సరిగ్గా చూపించరు, ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె.ఇ. కృష్ణమూర్తి గురించి, న్యూస్ రావటం ఏంటి అనుకుంటున్నారా ? అదే మరి... ఏదైనా డైరెక్ట్ ఎవ్వరం.. అది పొత్తు అయినా, పోరాటం అయినా... బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని, చంద్రబాబు ఎలా ఎదుర్కున్నారో, మోడీ మోసాన్ని దేశానికీ తెలిసేలా ఎలా స్పందిస్తున్నారో చూస్తున్నాం... ఇప్పటి వరకు, ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా, దేశ రాజధానికి వెళ్లి, ఒక ప్రధాని చేసిన మోసాన్ని, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా, ఈ దేశానికి చూపించారు చంద్రబాబు... అదే స్పూర్తితో మంత్రులు కూడా, బీజేపీ పై ఎదురు తిరుగుతున్నారు.. బీజేపీకి వోట్ వెయ్యద్దు అని బహిరంగంగా చెప్తున్నారు... అందుకే ఇది నేషనల్ మీడియా న్యూస్ అయ్యింది...

deputy10042018 1

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. బెంగళూరు నగర శివార్లలోని వైట్ ఫీల్డ్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి నాలుగేళ్లలో ప్రధాని ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు, తీరని అన్యాయాన్ని చేశారు. అందువల్ల కర్ణాటకలోని తెలుగువారు ఎవ్వరూ వచ్చే ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు ఓటేయొద్దు' అని కోరారు. అమరావతి నిర్మాణానికి నిధులిస్తామని ఇవ్వలేదు. సాక్షిగా భరోసానిచ్చారు. ఇవేవీ గుర్తుంచుకోనందునే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాం. భాజపాను నమ్మి తెలుగుదేశం మోసపోయింది. అదే మాదిరి ఇతరులెవరూ మోసపోకూడదనేదే మా ఆశయం ' అని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రధాని ఇచ్చే వాగ్ధనలని ఎవరూ నమ్మరాదని హెచ్చరించారు...

deputy10042018 1

అయితే, ఈ వ్యాఖ్యల పై వెంటనే బీజేపీ కూడా స్పందించింది... అది ఆయన ఇష్టం... ఇది ప్రజాస్వామ్య దేశం. ఎన్నికలపుడు తమకిష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకునే స్వేచ్చ ఆయనకు ఉంది, అని కె.ఇ. కృష్ణమూర్తి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పందించారు. కర్ణాటకలోని తెలుగువారంతా భాజపాకు ఓటేయవద్దని పిలుపునిచ్చేందుకు ఆయనెవరు? ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోరు' అని భాజపా ముఖ్య మంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప వ్యాఖ్యానించారు... మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ చేసిన ద్రోహానికి, కర్ణాటకలో అనుభవించేలా ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు... తెలుగు వారు దాదాపు కోటి మంది ఉన్న కర్ణాటక ఎన్నికల్లో, మనవాళ్ళు కీలకం కానున్నారు... ఇప్పటికే సోషల్ మీడియాలో దీని పై పెద్ద ఉద్యమం జరుగుతుంది... బీజేపీకి వోట్ వెయ్యద్దు అని, కర్ణాటక ప్రజలను, అక్కడ తెలుగువారని చైతన్యపరుస్తూ పోస్ట్లు పెడుతున్నారు..

Advertisements

Latest Articles

Most Read