ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు విభజన హామీల పై స్పష్టత లేదు. గట్టిగా అడిగిన చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టి పక్కన పడేసారు. మెడలు వంచేసి సాధిస్తా అని చెప్పిన జగన్, ఏమి చేస్తున్నారో ప్రజలు చూసారు. ఇక ఏపి ప్రజలు కూడా, తమ రాష్ట్రం గురించి పట్టించుకునే స్థాయిలో లేరు. అన్నీ కలిసి వచ్చిన అంశాలు అని అనుకున్నారో ఏమో కానీ, ఆంధ్రుల పోరాటానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచి, రాష్ట్రంలో అందోళన మొదలైంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తూ, ముందు ఉంది. టిడిపి నేత పల్లా, దీక్ష కూడా చేసారు. ఇక తాము ఎక్కడ వెనుకబడిపోతామో అని విజయసాయి రెడ్డి చేత పాదయాత్ర ప్లాన్ చేస్తుంది వైసీపీ. అయితే ముందు ఉండి కేంద్రంతో పోరాడాల్సిన వైసీపీ, ఢిల్లీలో ఏమి మాట్లాడకుండా, ఇక్కడ హడావిడి చేస్తున్నారు. అయితే అసలు కేంద్రం ఏపికి ఏది కావాలి అంటే, కావలసిన దాని కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది అని ప్రచారం చేసిన బీజేపీ నేతలు ఈ విషయంలో వెనుకబడ్డారు. ఇది కేంద్రం నిర్ణయం కావటం , ఎప్పటిలాగే చంద్రబాబు మీద ఎదురు దాడి చేసి తప్పించుకోవటం ఈ విషయంలో బీజేపీ కుదరలేదు.

somu 170222021 2

అందుకే ఉద్యమంలోకి రాకుండా, మేము ఢిల్లీ వెళ్లి, కేంద్రాన్ని ఒప్పిస్తాం అంటూ, సోము వీర్రాజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇప్పటి వరకు అమిత్ షా అప్పాయింట్మెంట్ దొరకలేదు. ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ దొరికే అవకాశమే లేదు. అందుకే నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిసి, ఏదో హడావిడి చేయాలని భావించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని నడ్డాతో చెప్తూ ఉండగా, ఈ విషయం తనకు చెప్పవద్దు అంటూ నడ్డా సున్నితంగా తిరస్కరించారు. పార్టీకి సంబందించిన విషయాలు మాట్లాడాలని, ప్రభుత్వానికి సంబందించిన విషయాలు, ఆయా కేంద్ర మంత్రుల వద్దే ప్రస్తావించాలని నడ్డా చెప్పటంతో, సోము వీర్రాజు షాక్ అయ్యారు. మరో సారి, ఇది ఏపి ప్రజల సెంటిమెంట్ అదీ ఇదీ అని చెప్తూ ఉండగా, తాను ఈ విషయంలో ఏమి చెయలేను అని, ప్రభుత్వ విషయాల్లో తన జోక్యం ఉండదు అని, పార్టీ విషయాలు మాత్రమే చెప్పాలని మరోసారి స్పష్టం చేసారు. దీంతో సోము వీర్రాజు అండ్ టీం, ఈ రోజు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. గత మూడు రోజులుగా దొరకని అపాయింట్మెంట్ ఈ రోజు అయినా దొరికితే, కనీసం మీడియాలో చెప్పుకోవటానికి అయినా బీజేపీ నేతలకు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడో దశకు చేరుకున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో మూడో దశ సందర్భంగా, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలకు ఓటింగ్, ఈ మూడో దశలో జరగబోతుంది. ఈ మూడో దశలో ఓటింగ్ కు సంబంధించి, అత్యంత కీలకమైన తీర్పును ఇచ్చింది. మరో 24 గంటల్లో ఎన్నికలు, ఓటింగ్ జరగనున్న సమయంలో, ఇది అత్యంత కీలకమైన తీర్పు అనే చెప్పాలి. గత రెండు దశల్లో కూడా ఒక పార్టీ తరుపున మద్దతుతో ఎన్నిక అయితే, ఎన్నిక జరిగినట్టు డిక్లేర్ చేసిన తరువాత, మరో పార్టీ మద్దతుతో గెలిచినట్టు రీకౌంటింగ్ లో ప్రకటించిన దాని పై, కొంత మంది హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించిన వారి తరుపున, మాజీ అడ్వొకేట్ జెనెరల్, సీనియర్ న్యాయవాది, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు నేపధ్యంలోనే హైకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులును ఈ రోజు జారీ చేసింది. ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే ఓట్ల లేక్కుంపు మొత్తం కూడా వీడియో చిత్రీకరణ చేయాలని సూచించింది. అయితే 15వ తేదీన సమస్యాత్మక గ్రామాలు , అత్యంత సమస్యాత్మక గ్రామాలు మాత్రమే వీడియో షూటింగ్ చేయాలని చెప్పి, ఎన్నికల కమిషన్ మరో ఆదేశాలు జారీ చేసింది.

hc 16022021 2

ఈ రోజు ఆదేశాల నేపధ్యంలో, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, నిజాయతీగా జరగాలని, కౌంటింగ్ సమయంలో జరుగుతున్న అవకతవకలను దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ నేపధ్యంలోనే, హైకోర్టు కొద్ది సేపటి క్రితం కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 13 వ తేదీన, అలాగే 15వ తేదీన ఎన్నికల కమిషన్ ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో, ఆ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలని, స్పష్టం చేసింది. దీంతో పాటు ఒక గ్రామానికి సంబందించిన ఒక ఓటర్ ఎవరైనా సరే, తమ గ్రామానికి సంబందించిన ఓట్ల లెక్కింపు వీడియో షూట్ చేయాలని అధికారులకు విజ్ఞాపన పత్రం ఇస్తే, కచ్చితంగా వీడియో షూట్ చేయాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పంచాయతీ ఎన్నికల సమరం అత్యంత కీలకమైనది అని, అందుకని ప్రతి దశలోనే కూడా పారదర్శకంగా జరగాలని, ఇలా జరగాలని అంటే ఎన్నికల మొదలైన దగ్గర నుంచి, కౌంటింగ్ వరకు వీడియో షూట్ చేయాలని, టెక్నాలజీ సాకులు చెప్పటానికి వీలు లేదని స్పష్టం చేసింది. అందువల్ల రేపు అత్యంత కీలకమైన మూడో దశ పోలింగ్ జరుగుతుంది, ఈ నేపధ్యంలోనే వీడియో షూట్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మలుపు తిప్పబోతున్నాయని చెప్పవచ్చు.

ఈ రోజు మునిసిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచే మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తెలిపారు. అయితే సరిగ్గా ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. గతంలో ఇదే ఎన్నికల కమీషనర్, ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని, అసాధారణ రీతిలో ఏకాగ్రీవాలు జరిగాయని, కేంద్ర హోం శాఖకు లేఖ రాసారు. అయితే ఇప్పుడు ఆ బలవంతపు ఏకగ్రీవాల పై మాత్రం, ఏమి స్పందించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడో ఏడాది క్రితం జరిగిన నోటిఫికేషన్, అసలు ఇప్పటి వరకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇవి పార్టీ సింబల్ తో జరిగే ఎన్నికలు అని, ఏడాది క్రితం ఒక పార్టీలో ఉన్న వారు, ఇప్పుడు వేరే పార్టీకి మారి ఉంటే పరిస్థితి ఏంటి ? అభ్యర్ధి మరణిస్తే పరిస్థితి ఏంటి ? ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, బలవంతపు ఎకగ్రీవాలు. దీని పై ఏమి తేల్చకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం ఎలా తీసుకుంది అని ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. మాచర్లలో మొత్తం ఏకగ్రీవం అయ్యాయని, అసలు అది ఎలా సాధ్యమో ఎలక్షన్ కమిషన్ చెప్పాలని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పై, కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి.

nimmagadda 150222021 2

తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి, గన్ని కృష్ణ స్పందిస్తూ, "మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ గతసంవత్సరం ఎక్కడ ఆపామో అక్కడినుండే కొనసాగుతాయని.. అంటే కొత్తగా నామినేషన్లు స్వీకరించడం జరగదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం ముమ్మాటికీ అధికారపార్టీకి అనుకూలమే! గత సంవత్సరం కరోనా మూలంగా స్థానికఎన్నికలను వాయిదా వేసిన సందర్భంలో ఇదే ఎన్నికల కమీషనర్ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి లేఖ వ్రాస్తూ.. రాష్ట్రంలో ఎన్నికలు హిం-సా-త్మ-కం-గా మారాయని స్వేఛ్చగా నామినేషన్లు వేసే అవకాశం కూడాలేదని.. తనకూ తన కుటుంబానికి రక్షణ కూడా లేని పరిస్థితి ఏపీలో నెలకొందని పేర్కొనడాన్ని గుర్తు చేసికుంటే అటువంటి పరిస్థితులలో జరిగిన ఏకాగ్రీవాలను ఎలా కొనసాగిస్తూ నిర్ణయించారో ఎస్ ఈసీ కే తెలియాలి. తక్షణం రీనోటిఫికేషన్ జారీ చేస్తూ మొత్తం ఎన్నికల ప్రక్రియ తాజాగా మొదలుపెట్టాలని గతంలోని ఏకగ్రీవ ఎన్నికలను నామినేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని అన్నారు.

ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితం జారీ చేసిన ఈ ఆదేశాల్లో, నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, పురపాలక సంఘాలు, ఈ మూడిటలో ఎవరైతే నామినేషన్ వేసి బలవంతంగా, ఉపసంహారనికి రంగం సిద్ధం చేసుకున్నారో, అటువంటి వారు మళ్ళీ రిటర్నింగ్ అధికారికి కానీ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి కానీ, వీళ్ళ ముగ్గిరిలో ఎవరికైనా వచ్చి, తాము తిరిగి రంగంలో ఉంటామని చెప్పి, ధరకాస్తు చేసుకుంటే, వారి దరఖాస్తు పరిశీలించాలని, మళ్ళీ పోలింగ్ లో అభ్యర్దులుగా ప్రకటించాలని కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, సర్కులర్ జారీ చేసినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 75 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థలకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో, తమని బెదిరించి నామినేషన్లు విత్ డ్రా చేసారని చెప్పి, పలు రాజకీయ పక్షాలతో పాటు, ఆయా అభ్యర్ధుల తరుపున పోటీ చేసిన వారు కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ రోజు ఉదయం వరకు కూడా, అనేక ఫిర్యాదులు చేసారు. ఈ ఫిర్యాదుల నేపధ్యంలోనే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

sec 16022021 1

ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా, ఒక అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలు స్వేచ్చగా జరగాలి అంటే, ఓటర్ కానీ, అభ్యర్ధి కాని భయం లేకుండా పోటీ చేసి, ఓటు వేయాలని, ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఉదాహరించారు. ఈ తీర్పులో రాజ్యంగం ఇచ్చిన విచాక్షాదికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉందని, ఓటు వేసే ఓటర్ కానీ, పోటీ చేసే అభ్యర్దులు కానీ భయం లేకుండా పోటీ చేయాలని, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రాకారం, ఎలక్షన్ కమిషన్ స్పందించింది. నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, పురపాలక సంఘాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఎవరైనా, తమను బెదిరించారని, బలవంతపు ఏకాగ్రీవాలు చేసి ఉంటే, వాటిని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. చిత్తూరు జిల్లా తంబళపల్లి, పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, తిరుపతి నుంచి అనేక ఫిర్యాదులు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read