ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితం జారీ చేసిన ఈ ఆదేశాల్లో, నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, పురపాలక సంఘాలు, ఈ మూడిటలో ఎవరైతే నామినేషన్ వేసి బలవంతంగా, ఉపసంహారనికి రంగం సిద్ధం చేసుకున్నారో, అటువంటి వారు మళ్ళీ రిటర్నింగ్ అధికారికి కానీ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి కానీ, వీళ్ళ ముగ్గిరిలో ఎవరికైనా వచ్చి, తాము తిరిగి రంగంలో ఉంటామని చెప్పి, ధరకాస్తు చేసుకుంటే, వారి దరఖాస్తు పరిశీలించాలని, మళ్ళీ పోలింగ్ లో అభ్యర్దులుగా ప్రకటించాలని కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, సర్కులర్ జారీ చేసినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 75 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థలకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో, తమని బెదిరించి నామినేషన్లు విత్ డ్రా చేసారని చెప్పి, పలు రాజకీయ పక్షాలతో పాటు, ఆయా అభ్యర్ధుల తరుపున పోటీ చేసిన వారు కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ రోజు ఉదయం వరకు కూడా, అనేక ఫిర్యాదులు చేసారు. ఈ ఫిర్యాదుల నేపధ్యంలోనే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

sec 16022021 1

ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా, ఒక అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలు స్వేచ్చగా జరగాలి అంటే, ఓటర్ కానీ, అభ్యర్ధి కాని భయం లేకుండా పోటీ చేసి, ఓటు వేయాలని, ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఉదాహరించారు. ఈ తీర్పులో రాజ్యంగం ఇచ్చిన విచాక్షాదికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉందని, ఓటు వేసే ఓటర్ కానీ, పోటీ చేసే అభ్యర్దులు కానీ భయం లేకుండా పోటీ చేయాలని, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రాకారం, ఎలక్షన్ కమిషన్ స్పందించింది. నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, పురపాలక సంఘాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఎవరైనా, తమను బెదిరించారని, బలవంతపు ఏకాగ్రీవాలు చేసి ఉంటే, వాటిని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. చిత్తూరు జిల్లా తంబళపల్లి, పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, తిరుపతి నుంచి అనేక ఫిర్యాదులు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ రోజు మునిసిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచే మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తెలిపారు. అయితే సరిగ్గా ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. గతంలో ఇదే ఎన్నికల కమీషనర్, ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని, అసాధారణ రీతిలో ఏకాగ్రీవాలు జరిగాయని, కేంద్ర హోం శాఖకు లేఖ రాసారు. అయితే ఇప్పుడు ఆ బలవంతపు ఏకగ్రీవాల పై మాత్రం, ఏమి స్పందించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడో ఏడాది క్రితం జరిగిన నోటిఫికేషన్, అసలు ఇప్పటి వరకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇవి పార్టీ సింబల్ తో జరిగే ఎన్నికలు అని, ఏడాది క్రితం ఒక పార్టీలో ఉన్న వారు, ఇప్పుడు వేరే పార్టీకి మారి ఉంటే పరిస్థితి ఏంటి ? అభ్యర్ధి మరణిస్తే పరిస్థితి ఏంటి ? ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, బలవంతపు ఎకగ్రీవాలు. దీని పై ఏమి తేల్చకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం ఎలా తీసుకుంది అని ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. మాచర్లలో మొత్తం ఏకగ్రీవం అయ్యాయని, అసలు అది ఎలా సాధ్యమో ఎలక్షన్ కమిషన్ చెప్పాలని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పై, కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి.

nimmagadda 150222021 2

తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి, గన్ని కృష్ణ స్పందిస్తూ, "మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ గతసంవత్సరం ఎక్కడ ఆపామో అక్కడినుండే కొనసాగుతాయని.. అంటే కొత్తగా నామినేషన్లు స్వీకరించడం జరగదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం ముమ్మాటికీ అధికారపార్టీకి అనుకూలమే! గత సంవత్సరం కరోనా మూలంగా స్థానికఎన్నికలను వాయిదా వేసిన సందర్భంలో ఇదే ఎన్నికల కమీషనర్ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి లేఖ వ్రాస్తూ.. రాష్ట్రంలో ఎన్నికలు హిం-సా-త్మ-కం-గా మారాయని స్వేఛ్చగా నామినేషన్లు వేసే అవకాశం కూడాలేదని.. తనకూ తన కుటుంబానికి రక్షణ కూడా లేని పరిస్థితి ఏపీలో నెలకొందని పేర్కొనడాన్ని గుర్తు చేసికుంటే అటువంటి పరిస్థితులలో జరిగిన ఏకాగ్రీవాలను ఎలా కొనసాగిస్తూ నిర్ణయించారో ఎస్ ఈసీ కే తెలియాలి. తక్షణం రీనోటిఫికేషన్ జారీ చేస్తూ మొత్తం ఎన్నికల ప్రక్రియ తాజాగా మొదలుపెట్టాలని గతంలోని ఏకగ్రీవ ఎన్నికలను నామినేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని అన్నారు.

రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమిషన్ తన పై ఇచ్చిన ఆదేశాల పై, హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై, నిన్న విచారణ జరిగింది. వీడియో టేప్ లు పరిశీలించేందుకు, ఈ రోజు హైకోర్టు కేసుని వాయిదా వేసింది. ఈ రోజు దీని పై మళ్ళీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి, అటు ఎన్నికల కమిషన్ నుంచి, ఇటు కొడాలి నాని వైపు నుంచి న్యాయవాదులు వీడియోలు టేప్ లు అందించారు. ఈ వీడియో టేప్ లు పరిశీలించిన హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వీడియో టేప్ లు ఎవరికి అనుకూలంగా వారు అందించారన్న భావనలోకి హైకోర్టు వచ్చింది. అంతే కాకుండా, రాజ్యాంగ న్యాయసూత్రాలను విశదీకరించడంలో విఫలం అయ్యారని, హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి కేసుల్లో లోతైన విచారణ జరపాలని తాము భావిస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. సరైన వీడియో టేప్ లు అందించాలని ఇటు ఎన్నికల కమిషన్ నుంచి, ఇటు కొడాలి నాని వైపు న్యాయవాదులును కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా, ఈ కేసులో, హైకోర్టుకు సహాయపాడేందుకు, సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు సాయంత్రం లోగా, సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమించే అవకాసం ఉంది.

nani 150222021 1

బుధవారానికి ఈ కేసుని హైకోర్టు వాయిదా వేసింది. గతంలో కొడాలి నాని ఎన్నికల కమిషన్ ను కించపరిచే విధంగా, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేసారని, ఈ నెల 21వ తేదీ వరకు మీడియాతో మాట్లాడ కూడదు అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అదే విధంగా, గ్రూపు సమవేసల్లోనూ, బహిరంగ సమావేశాల్లో ఆయన మాట్లాడకూడదు అని ఆంక్షలు విధించింది. దీంతో పాటు, ఎన్నికల కమిషన్ ను కించ పరిచే విధంగా, మాట్లాడినందుకు, ఆయన పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు, ఆ సెక్షన్ ల కింద కూడా కేసులు నమోదు చేయాలని, ఎన్నికల కమిషన్, కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ ఆదేశాలు సవాల్ చేస్తూ, కొడాలి నాని శనివారం హైకోర్టు లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా, ఆదివారం నిన్న సాయంత్రం విచారణకు వచ్చింది. ఈ రోజు వాయిదా పడిన కేసు పై, హైకోర్టు వీడియో టేప్ లు పరిశీలించి అసంతృప్తి చెంది, సరైన వీడియో టేప్ లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని గోగులపాడు లోజరిగినఘటనను బట్టే, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏకగ్రీవాలన్నీ ఇదే విధంగా, అధికారపార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే టీడీపీ వారిపై దారుణాలు, దాడులు జరుగుతున్నాయని చెప్పొచ్చని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా, వైసీపీఎమ్మెల్యేలు ఏకగ్రీవాలకోసం ఎంతలా బరితెగించారో జరుగుతున్న ఘటనలే నిదర్శనమన్నారు. ముఖ్య మంత్రి ప్రజావేదికను కూల్చి తనపాలన ఆరంభిస్తే, ఆయన చూపిన బాటలో ఎమ్మెల్యేలు, వీధులు, ఇళ్లను కూల్చే కార్యక్రమంలో నిమ గ్నమయ్యారని రఫీ ఎద్దేవాచేశారు. వైసీపీప్రభుత్వం ఇంకా మూడే ళ్లు అధికారంలో ఉంటుందని తెలిసికూడా, టీడీపీ అధినేత చంద్రబా బునాయుడి పిలుపుతో ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంచా యతీ ఎన్నికల్లో టీడీపీసానుభూతిపరులను గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారనడానికి అధికారపార్టీ వారు చేయిస్తున్న అరాచ కాలే నిదర్శనమన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివా సరెడ్డిపై, అతని ఆదేశాలతో సామాన్యప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, పంచాయతీకి చెందిన ఆస్తులను ధ్వంసంచేసినందుకు స్థానిక పంచాయతీ కార్యదర్శిపై ఎస్ఈసీ ఏంచర్యలు తీసుకుంటారో చెప్పాలని రఫీ డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శిని తక్షణమే విధులనుంచి తొలగించి, జరిగిననష్టానికి సంబంధించిన పరిహారాన్ని అతనినుంచే వసూలు చేయాలన్నారు. వైసీపీకి ఓట్లే యకపోతే విధ్వంసాలు చేయడం, ఇళ్లుకూల్చడం, వీధులు ధ్వం సం చేయడం వంటి ఘటనలతో, తమకు ఓటేయకపోతే మున్ముం దు ఇటువంటి ఘటనలే జరుగుతాయనే సంకేతాన్ని ప్రభుత్వం ప్రజలకుఇవ్వబోతోందా అని రఫీ ప్రశ్నించారు. మూడు, నాలుగో విడత జరిగే పంచాయతీఎన్నికలు, త్వరలో జరగబోయే మున్సిప ల్ ఎన్నికల్లో అధికారపార్టీవారినే గెలిపించాలనే సంకేతాన్ని ఈ విధమైన చర్యలద్వారా ఇస్తున్నందుకు జగన్ ప్రభుత్వం నిజంగా సిగ్గు పడాలన్నారు.

పంచాయతీ ఎన్నికల తొలిదశలో అధికారపార్టీ వారు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీవారిపై అక్రమంగా పెట్టిన కేసులు వివరాలు 234 అయితే, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేసిన ఘటనలు 832 వరకు ఉన్నాయని రఫీతెలిపారు. అదేవిధంగా ఎన్నికలకోడ్ ఉల్లంఘనలు 72కాగా, హ-త్య-లు 2 జరిగాయని, హ-త్యా-య-త్నా-లు 31, దాడులు 93వరకుజరిగితే, కిడ్నాప్ లు 48, బెదిరిం పులు181, ఆస్తులవిధ్వంసాలు 70వరకు జరిగాయన్నారు. ఇవన్నీ ఇప్పటివరకు తమదృష్టికి వచ్చినవేనని, ఇంకా బయటకు రాకుండా ఎన్నో జరిగాయన్నారు. వేలాదిమంది తమప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తుండటంతో ముఖ్యమంత్రి అసహనం తో ఊగిపోతూ, అధికారులు, పోలీసులసాయంతో టీడీపీ వారిపై కక్ష తీర్చుకుంటున్నాడని రఫీ మండిపడ్డారు. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిస్తే, అధికారులు పోలీస్ యంత్రాంగం ఏమీచేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులన్నీ హరించబడ్డాయని, వాటిని కాపాడుకోవాలంటే జగన్ ప్రభుత్వానికి ఓటుతో బుధ్ధి చెప్పడమొక్కటే మార్గమన్నారు. ప్రభుత్వ పతనానికే స్థానిక ఎన్నికలు వచ్చాయనే విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాల న్నారు. అమరావతిని నాశనం చేసిన జగన్, మరోవైపు పోలవరా న్ని పడుకోబెట్టాడని, ఇప్పుడేమో విశాఖఉక్కుఫ్యాక్టరీని మింగేయ డానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. గోగులపాడులో టీడీపీ సానుభూ త పరురాలు రాధమ్మ పోటీలో నిలిచిందని, ఆమెస్వగ్రామమైన ఇసప్పాలెంలో విధ్వంసంచేయడంపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాల ని రఫీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సహా, ఘటనకు బాధ్యులైన అధికారులందరిపై ఎన్నికలకమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవా లన్నారు. జిల్లాలవారీగా వైసీపీప్రభుత్వం, అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్నతీరుపై ఎన్నికలకమిషనర్ చర్యలు తీసుకోవాలని, ఎన్నికలఅధికారి శేషన్ లా నిర్భయంగా వ్యవహరించి, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికలకమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఉందని రఫీ అభిప్రాయపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read