ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నిక గురించి ఆలోచిస్తాడు, పిచ్చి పిచ్చి పధకాలు పెట్టి, ప్రజల బలహీనతలతో ఆడుకుంటూ, వారిని తన బానిసిలుగా చేసుకుంటాడు. అదే ఒక దార్శనికుడు మాత్రం, వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు. వాళ్లకు ఉపాధి వచ్చేలా చేస్తాడు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తాడు. ఇలాంటి దార్శనికులకు ఎన్నికల్లో గెలుపు ఓటముల గురించి ఆలోచన ఉండదు. కేవలం ప్రజల జీవితాలు, వచ్చే తరం గురించి మాత్రమే ఆలోచలు ఉంటాయి. అలాంటి దార్శనికుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సైబరాబాద్ నిర్మాణం తరువాత, ఇప్పటికీ ఆ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు అంటే, అది విజన్. అలాగే నవ్యాంధ్రను కూడా తీర్చి దిద్దే ప్రయత్నం చేసారు చంద్రబాబు. అనంతపురంలో కియా, కర్నూల్ లో సోలార్ పార్క్, చిత్తూరులో మొబైల్ హబ్, విశాఖలో ఐటి, గోదావరి జిల్లాల్లో ఆక్వా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని, ఇలా ఆయన గత 5 ఏళ్ళలో ప్రజలు జీవితాలు మార్చే నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయినా, ఆయన విజన్ మాత్రం ఇప్పటికీ పని చేస్తుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు, పోలీసుడి యూనిఫారం కూడా డ్యూటీ చేస్తుందని, చంద్రబాబు కూడా సియంగా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మంచి కొనసాగుతూనే ఉంది.

ashok 190220211 2

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, 2018 సమయంలో కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ని తీసుకువచ్చారు. వారిని ఒప్పించి మన రాష్ట్రానికి తీసుకురావటమే కాదు, భూమి ఇవ్వటంతో, వెంటనే పనులు కూడా మొదలు పెట్టారు. అయితే నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంట్, నిన్న తమ కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఈ ప్లాంట్ లో అశోక్ లేల్యాండ్ బస్సులు తయారు చేయనుంది. 75 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మాణం జరిగింది. మొత్తం 340 కోట్ల పెట్టుబడి అశోక్ ల్యేల్యాండ్ పెట్టనుంది. ఇక్కడ నుంచి ఏడాదికి 4800 బస్సుల తయారీ జరగనుంది. అలాగే ఇక్కడే ఒక లర్నింగ్ సెంటర్, అలాగే ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా నెలకొల్పారు. అలాగే ఇక్కడే ఎలక్ట్రిక్ బస్సుల వాహనాలు కూడా తయారు చేయనున్నారు. ఇక్కడ తాయారు చేసిన బస్సులు వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్నాయి. రాష్ట్రంలో యువతకు ఉపాధి మాత్రమే కాదు, రాష్ట్రానికి భారిగా జీఎస్టీ కూడా వచ్చే అవకాసం ఉంది. ఈ రోజు ప్లాంట్ నిర్మాణం కావటంతో, ఇక్కడ ప్లాంట్ నెలకొల్పటానికి ఎంతో కృషి చేసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుని గుర్తు చేసుకోకుండా ఉండలేం.

 

విశాఖ ఉక్కుపరిశ్రమ (రాష్ట్రీయఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్) ని కాపాడుకోవడానికి గతకొద్దిరోజులుగా రాష్ట్రప్రజలతో పాలు, కార్మికులు, ప్రజాసంఘాలు, విశాఖవాసులు వేలాదిగా రోడ్లమీదకు వచ్చి ఉద్యమంచేస్తున్నారని, టీడీపీ పూర్తిగా ఆఉద్యమానికి మద్ధతు తెలిపిందని, పల్లాశ్రీనివాస్ తనప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేపట్టారని, టీడీపీఅధినేత నారా చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ లు విశాఖ ఉద్యమానికి మద్ధతుతెలిపి, ప్రభుత్వ కపటనాటకాలను ప్రజలముందుంచారని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "32 మంది ప్రాణత్యాగాలు, ఎందరో రైతులుస్వచ్ఛందంగా ఇచ్చిన భూములతో, ఒక ఉద్యమంతో ఏర్పడిన విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రైవేటీకరిస్తే, చూస్తూఊరుకోబోమని మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. విశాఖస్టీల్ ప్లాంట్ విషయం లో జగన్ఆడుతున్న నాటకాలను ప్రజలంతా అర్థంచేసుకోవాలి. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలినెల జూన్ -22 (2019) లోనే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న దుర్భుద్ధితో ఆయన పోస్కో కంపెనీవారితో చర్చించారు. ఆయనచర్చలకు సంబంధించిన ఆధారాలు కూడా ప్రజలంతా ఇప్పటికే చూడటం జరిగింది. ఆతరువాత అక్టోబర్ 2020లో కూడా తాడేపల్లినివాసంలో ముఖ్యమంత్రి పోస్కో కంపెనీవారితో చర్చలుజరిపాడు. జగన్మోహన్ రెడ్డి రౌడీయిజానికి, బెదిరింపులకు తామెవ్వరమూ భయపడం. ఒకరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిఉండి ఏమీ తెలియనవాడిలా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో సిగ్గులేకుండా పచ్చిఅబద్ధాలు చెబుతున్నాడు. ఆయన ఎంతనటించినా, ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా జగన్ నటనలను, నాటకాలను, బండారాన్ని బట్టబయలుచేస్తూనే ఉంటాము. ముఖ్యంగా తెలుగుదేశం పక్షాన నేనుఎప్పుడూ జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలకు వెల్లడిస్తూనేఉంటాను. జగన్ లా జైలుజీవితం అనుభవించి, చిప్పకూడు తినడానికి తామెవరమూ సిద్ధంగా లేము. అసలు పోస్కో కంపెనీకి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధమే లేదన్నట్లుగా జగన్ నటిస్తున్నాడు. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఫిబ్రవరి 05, 2020న అడిగిన ప్రశ్నపై (ప్రశ్న నెంబర్-474) జగన్ఏం సమాధానం చెబుతాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నపై ఆర్ ఐఎన్ఎల్ కి, పోస్కోకి మధ్య ఒప్పందం కుదిరిందని చాలాస్పష్టంగా కేంద్రఉక్కుశాఖామంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజ్యసభలో సమాధానమిచ్చిన విషయం జగన్ కు తెలియదంటే నమ్మాలా? ధర్మేంద్రప్రధాన్ చెప్పిన సమాధానం గురించి ఏ2 విజయసాయి జగన్ తో చెప్పలేదా?

"ఈ వ్యవహారం బయటకు రాకుండా డ్రామాలాడి, అక్టోబర్ 2020లో పోస్కో వారిని రాచమర్యాదలతో తాడేపల్లి ప్యాలెస్ కు ఆహ్వానించిన జగన్ ఇప్పుడు ప్రజలమధ్యకొచ్చి నాకేమీ తెలియదంటూ నాటకాలాడుతున్నాడు. సంవత్సరం క్రితం ఫిబ్రవరి 2020లోనే పార్లమెంట్ సాక్షిగా పోస్కోకు, ఆర్ఐఎన్ఎల్ కు మధ్య జరిగిన ఒప్పందం గురించి తెలిసికూడా, దాన్ని తొక్కిపెట్టి, ప్రజలను మోసగించాలనిచూస్తారా? దీనినిబట్టే నటనలో జగన్ ఎంతటిప్రావీణ్యం సంపాదించాడో అర్థమవుతోంది. పోస్కోకు, ఆర్ ఐఎన్ఎల్ కుమధ్య జరిగిన ఒప్పందం వివరాలగురించి ఏమీతెలియనట్లునటిస్తూ విజయసాయిరెడ్డి సిగ్గులేకుండా పాదయాత్ర చేయాలని చూస్తున్నాడు. జగన్ రెడ్డికి అత్యంత సమీప బంధువైన వై.ఎస్. అవినాష్ రెడ్డి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీస్ కమిటీ( ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలించే కమిటీ) లో సభ్యుడిగాఉండి, ఆర్ ఐఎన్ఎల్, పోస్కో మధ్య జరిగిన ఒప్పందాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? కేంద్రప్రభుత్వ అధీనంలోని పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ మార్చి3, 2020న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ లోని డిజిన్వెస్ట్ మెంట్ వ్యవహారాలకు సంబంధించి నివేదిక సమర్పించే తరుణంలో ఫిబ్రవరి 05-2020న పార్లమెంట్ లో ధర్మేంద్రప్రదాన్ గారు, పోస్కో కంపెనీకి, ఆర్ ఐఎన్ఎల్ కి మధ్య జరిగినఒప్పందం వివరాలను తెలియచేసిన అంశాన్ని స్టాండింగ్ కమిటీ కమిటీలో సభ్యుడిగాఉన్న అవినాష్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు? అవినాష్ రెడ్డి విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తనకు తెలియదన్నట్లుగా నటించాడు. గతంలో ధర్మేంద్రప్రదాన్ ఇలా చెప్పారు, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అవినాష్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోయాడు? 32మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుపరిశ్రమ చేయిదాటి పోతోందని తెలిసికూడా, స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నవ్యక్తి సిగ్గులేకుండా ఎలా మౌనంగా ఉన్నాడు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉక్కుకమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ ఇద్దరుఎంపీలు మిగతా వైసీపీ ఎంపీలతో కలిసి, విశాఖ ఉక్కుఫ్యాక్టరీని కాపాడాలని ఎందుకుప్రయత్నించలేదు? ఏనాడైనా రాష్ట్రానికి రావాల్సిన వాటిగురించి వైసీపీఎంపీలు ఒక్కసారైనా పార్లమెంట్ లో మాట్లాడారా? ఏదో ఒకరకంగా విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైతే, దానికిచెందిన 20వేలఎకరాలను కాజేయాలన్నదే వైసీపీప్రభుత్వ దురాలోచన. ఎవడబ్బసొమ్మని విశాఖఉక్కుఫ్యాక్టరీకి చెందిన 7వేల ఎకరాలను జగన్ అమ్ముతానంటాడు?"

"కొనడానికి వాడెవడో, అమ్మడానికి వీడెవడో చెప్పాలి. జగన్ రాష్ట్రప్రభుత్వాన్ని నడుపు తున్నాడా... లేక రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నాడా? ఏపీ ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అని జగన్ అనుకుంటున్నాడా? బిల్డ్ ఏపీ పేరుతో అమ్మే స్తాను, విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేస్తాను అంటే చూస్తూకూర్చునేవాడెవడూ లేడు. జగన్ ముందే లెక్కలేసుకొని కూర్చునే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ కి చెందిన 7వేలఎకరాలపై కన్నేశాడు. ముందుగానే లెక్కలువేయ కపోతే, ముఖ్యమంత్రి అకస్మాత్తుగా 7వేలఎకరాల అమ్మకం అంశాన్ని తెరపైకి ఎలాతెచ్చాడు? పోస్కో కంపెనీకి అలాంటి ఉద్దేశమే లేదని జగన్ చెబుతుంటే, విజయసాయి ఎందుకు పాదయాత్ర డ్రామాలాడుతున్నాడు? ఒకపక్క చేయాల్సిందిచేస్తూ, మరోపక్కన వైసీపీఎంపీలు, మంత్రులు పాదయాత్ర డ్రామాలాడుతూ, కార్మికులతో కలిసిదొంగదీక్షలు చేయడంచేస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పటికేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కుపరిశ్రమను బీఏఎఫ్ఆర్ కు రిఫర్ చేసేప్రయత్నం చేస్తే, టీడీపీ ఎంపీలు కింజారపు ఎర్రన్నాయుడు, ఎంవీఎస్ మూర్తి 16-03-2000న లోక్ సభలో కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్, సీపీఐ నేతలతో కలిసి టీడీపీఎంపీలు ఆనాడు కేంద్రప్రభుత్వ చర్యను ప్రతిఘటించి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. ఆనాడు పార్లమెంట్ లో జరిగిన చర్చలో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, సోమనాథ్ చటర్జీ కూడాపాల్గొన్నారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి, ఇతరపార్టీల ఎంపీలమద్ధతు కూడగట్టి, ఆనాడు టీడీపీ ఎంపీల్లా విశాఖఉక్కుని కాపాడటానికి ఎందుకు ప్రయత్నించడంలేదు? వైసీపీఎంపీలు, ముఖ్యమంత్రి ఏం గడ్డిపీకుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. విశాఖ ఉక్కుఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ప్రభుత్వం ఏం చేసినాసరే, టీడీపీ కలిసివస్తుందని చంద్రబాబుచెప్పినా, కేంద్రం ముందుకు వెళ్లడానికి జగన్ ఎందుకు భయపడుతున్నాడు? గతంలో కేజీబేసిన్ గ్యాస్ వ్యవహారానికి సంబంధించి కిరణ్ కుమార్ ప్రభుత్వంతో కలిసి టీడీపీ పోరాటానికి సిద్ధమైంది. అటువంటి ప్రయత్నాలను జగన్ ఎందుకు చేయలేకపోతున్నాడు? జగన్ ప్రభుత్వం రాష్ట్రఆస్తులను అమ్మడం తప్ప ఇప్పటివరకు చేసిందేమీలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పటికే రూ.2లక్షలకోట్లు అప్పుచేసిన జగన్, రంగులకు, బియ్యంసరఫరా వాహానాలకు అనిచెప్పి వేలకోట్లు దుబారా చేశాడు. ఎక్కడారాష్ట్రంలో ఒక రూపాయి పెట్టుబడి తీసుకొచ్చింది లేదు."

"నిజంగా జగన్ కు చిత్తశుద్ధిఉంటే, రాష్టప్రభుత్వం తరుపునే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనడానికి ఎందుకు ప్రయత్నంచేయడం లేదు? అసలు ఆమాట జగన్ నోటివెంట ఎందుకు రావడం లేదు? దీన్ని బట్టే జగన్ కపటనాటకాన్నిఅర్థంచేసుకోవచ్చు. విశాఖ పట్నం వెళ్లిన ముఖ్యమంత్రి, స్టీల్ ప్లాంట్ కోసంధర్నాలు చేస్తున్న కార్మికులవద్దకు ఎందుకు వెళ్లలేదు? గతంలో సోనియాగాంధీకి నచ్చచెప్పి, ఓదార్పు యాత్రచేశానని, కష్టాల్లో ఉన్నప్రజల్లోకి వెళ్లేలా ఆమెను ఒప్పించానని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రికి, విశాఖ ఉక్కు కార్మికులు వద్దకువెళ్లి వారితోమాట్లాడే ధైర్యం లేకపోయిందా? దొంగస్వామి దగ్గరకు వెళ్లడానికి ముఖ్యమంత్రికి సమయం ఉందికానీ, కార్మికుల వద్దకు వెళ్లడానికి లేదు. కార్మికులను విమానాశ్రయానికి పిలిపించుకొని మాట్లాడతాడా? కోడికత్తి డ్రామా మొదలైనప్పటినుంచీ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన సహా, అనేకఅంశాలకు సంబంధించి విశాఖ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి తనపంచాయితీలకు కేంద్రంగా మార్చు కున్నట్టున్నాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన దొంగ పంచాయితీలు, దొంగనాటకాలు కట్టిపెట్టాలి. వైసీపీ ఎంపీలు చేసిన భాగవతం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆడిననాటకం, స్టాండింగ్ కమిటీ సభ్యుడిగాఉండి అవినాష్ రెడ్డి, మౌనంగా ఉండటం, అన్నీప్రజలు గమనిస్తున్నారు. జగన్ ఆడుతున్న నాటకాలను ప్రజలునమ్మేస్థితిలోలేరు. విశాఖఉక్కుపరిశ్రమ మొన్నటివరకు లాభాల్లోనే ఉంది. 2018-19లో కూడా దాదాపు రూ.100కోట్ల లాభం వచ్చింది. కరోనా ప్రభావం వల్ల, లాక్ డౌన్ కారణంగా నష్టాలొస్తే, దాన్ని అమ్మకానికి పెడతాడా ఈముఖ్యమంత్రి? రూ.2500 కోట్ల అభివృద్ధిపనులు స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నాయి. వాటిగురించి జగన్ కు ఏమైనా తెలుసా? ఆపనులన్నీ పూర్తయితే పరిశ్రమ ఉత్పత్తి పెరిగి, బ్రహ్మండంగా తిరిగి లాభాల్లోకివస్తుంది. ఒక సొంత ఐరన్ ఓర్ గనిని విశాఖస్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తే, సరిపోతుంది. ఓబుళాపురంలో దోచుకొని తినేబదులు, ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ ని జగన్ కేటాయించలేడా? అది చేయకుండా 7వేలఎకరాలు అమ్మేస్తానంటూ, ఎంత సేపూ భూదాహం తీర్చుకునే పనిలోనే ఉంటున్నాడు ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి. గతంలో కూడా లేపాక్షి నాలెడ్జ్ హబ్, వాన్ పిక్ పేరుతో వేలాది ఎకరాలు దిగమింగినఅనుభవం ఉందికదా? ఇప్పుడేమో రాజధాని పేరుతో రూ.2లక్షలకోట్ల విలువైన విశాఖ ఉక్కుభూములను కాజేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే జగన్ విశాఖ ను రాజధానిగా ప్రకటించాడు. వేలఎకరాలుదింగమింగి, విశాఖ పరిశ్రమను ప్రైవేట్ పరంచేయాలన్న దురాలోచనతోనే జగన్, విజయసాయి ఇన్నాళ్లూ నాటకాలుఆడారు. కార్మికుల, జేఏసీనేతలు, జగన్మోహన్ రెడ్డిని, వైసీపీఎంపీలను, విజయసాయిరెడ్డిలాంటి పంది కొక్కును విశాఖఉక్కు పరిరక్షణ ఉద్యమం నుంచి తరిమికొట్టాలని కోరుతున్నా. జగన్ కేవలం తనఆస్తిపాస్తులు పెంచుకోవడానికే భూదందాలకు పాల్పడుతూ, ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చాడనే వాస్తవాన్ని ప్రజలంతా అర్థంచేసుకోవాలని విన్నవించుకుంటున్నాను."

పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం, తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో షూటింగ్ చేయలని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో పాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలతో పాటుగా, సున్నితమైన గ్రామాల్లో కూడా పోలింగ్ ని వెబ్ క్యాస్టింగ్ తో పాటుగా, కౌంటింగ్ ని కూడా వీడియో షూటింగ్ చేయాలని చెప్పి, ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే పర్యవేక్షణ అధికారులు ఉన్నారో, వారు ఈ గ్రామాల్లో అందుబాటులో ఉండాలని కూడా స్పష్టం చేసింది. దీంతో పాటుగా కౌంటింగ్ సందర్భంగా ఏదైతే ఓట్ల తేడా తక్కువగా ఉన్న సమయంలో, అతి తక్కువగా మెజారిటీ వచ్చినప్పుడు మాత్రమే రీకౌంటింగ్ కు అనుమతించాలని, ఆ రీకౌంటింగ్ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే జరగాలని చెప్పి, ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాల్లో పేర్కొంది. అలాగే కౌంటింగ్ సమయంలో, కరెంటు పోతుందని, ఆ సమయంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపధ్యంలో, కరెంటు పోకుండా చూసుకోవాలని, అవసరం అయితే జెనరేటర్లు, ఇన్వర్టర్ లు పెట్టుకోవాలని ఎన్నికల కమిషన్ తమ అదేసలలో తెలిపింది.

nimmagadda 190222021 2

ఇటీవల రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పోలింగ్ వెబ్ కాస్టింగ్, కౌంటింగ్ వీడియో షూట్ చేయాలని పిటీషన్ దాఖలు చేయటంతో, దీని పై రాష్ట్ర హైకోర్టు, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్, ఎవరైనా పోటీలో ఉన్న అభ్యర్ధి, కౌంటింగ్ ని వీడియో షూట్ చేయాలని సూచిస్తే వెంటనే ఆ బాధ్యత రిటర్నింగ్ అధికారులు తీసుకోవాలని చెప్పి, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకల పై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రెండు రోజుల క్రితం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కౌంటింగ్ సమయంలో, డబుల్ డిజిట్ మెజారిటీ ఉన్నా రీకౌంటింగ్ చేస్తున్నారని, ఒకటి రెండు మూడు సార్లు రీకౌంటింగ్ పేరుతో, వైసీపీ మద్దతు దారులు గెలిచేలా చూస్తున్నారని, అలాగే కరెంటు తీసేసి కౌంటింగ్ లో అవకతవకలు చేస్తున్నారని, హైకోర్టు చెప్పినా ఎందుకు వీడియో షూట్ చేయటం లేదని ప్రశ్నించటంతో, ఎన్నికల కమిషన్ దిద్దుబాటు చర్యలు చేసిందనే చెప్పాలి.

ఎక్కడైనా ఎన్నికలు జరుగుతుంటే, అభివృద్ధి అజెండాతో అధికార పక్షం, అంత కంటే బాగా చేస్తామని ప్రతిపక్షం ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. గత పదేళ్లుగా ట్రెండ్ మారింది కాబట్టి, డబ్బు, మద్యం, వస్తువులు పంచి పెట్టటం వచ్చి చేరాయి. ఇక 2019 నుంచి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పోటీ చేస్తే పీకుతున్నారు, వేరే పార్టీకి ఓటు వేస్తే పీకుతున్నారు, నుంచుంటే పీకుడు, కూర్చుంటే పీకుడు, అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్ లు, ఇలా ఒక్కటి ఏమిటి, ఏమి చెయ్యల్లో అన్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ మరింత ముందుకు వెళ్లి, ఏకంగా దేవుడిని కూడా ఇందులోకి లాగింది. వైసీపీ నేతల వ్యవహార శైలి ఈ విషయంలో తీవ్ర దుమారం రేపుతుంది. చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో, 21వ తేదీ జరగబోయే నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి భార్య దీపిక అనే ఆమె పోటీ చేస్తున్నారు. అయితే ప్రచారం సందర్భంగా, ప్రజలను ప్రలోభపెట్టటానికి, తిరుమల లడ్డులను పెద్ద ఎత్తున తెప్పించుకుని, ఒక చోట పెట్టుకుని, కొత్తగా వచ్చిన రేషన్ డెలివరీ చేసే వాహనాలు ఉన్నాయో, వాటిల్లో తరలిస్తూ, ఓటర్లను ప్రలోభపెట్టే దానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంత మందికి కుటుంబాలకు కుటుంబాలకు కొన్ని బ్యాగులు ఇచ్చి, పంచిపెట్టమని అప్ప చెప్పారు.

tirumala 1902202 2

ఈ నేపధ్యంలోనే కొంత మంది వీటిని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఘటన పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదని, పదవుల కోసం చివరకి తిరుమల లడ్డూని కూడా వాడుకునే విధంగా దిగజారి పోయారని చెప్పి, చాలా తీవ్రమైన విమర్శలు చేసారు. పవిత్రంగా భావించే లడ్డూని కూడా ఏకంగా రేషన్ సప్లై చేసే వ్యాన్ లో, తీసుకుని వచ్చి పంచి పెట్టటం అనేది జీర్ణించుకోలేక పోతున్నారు. రెండోది, దాన్ని నుంచి ప్రలోభపెట్టి ఓట్లు వేసుకుంటానికి కూడా వేసుకోవటం అంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఏమి చేస్తున్నారు అనేది పరాకాష్టగా చెప్తున్నారు. ఎన్నికల్లో దేవుడిని లాగటం ఒక ఎత్తు అయితే, ఇలా లడ్డులు పంచి పెట్టి, మాకు ఓటు వేయండి అని చెప్పటం, ఎప్పుడూ చూడలేదని, వినలేదని, ఈ ఎన్నికలు అయ్యే లోపు ఇంకా ఎన్ని వింతలు, విచిత్రాలు, అరాచాకాలు చూడాలో అని, వైసీపీ నేతల పై ప్రజలు మండి పడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read