న్యాయవ్యవస్థలతో ఆడుకోవటం, న్యాయవ్యవస్థలను టార్గెట్ చేయటం, న్యాయమూర్తుల పేరు ప్రతిష్టలు దిగజార్చటం, కొంత మంది రాజకీయ నాయకులకు లేటెస్ట్ ట్రెండ్. ఇది వరకు న్యాయ వ్యవస్థ అంటే ఎంతటి వారైనా భయపడే వారు. అయితే ఈ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్ లో తారా స్థాయిలో ఉంది. ఏపి ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థ మధ్య గ్యాప్ తీవ్రం అయ్యింది. అది ఎక్కడ వరకు వెళ్ళింది అంటే, తన పై కాబోయే సుప్రీం కోర్టు జడ్జి కుట్ర పన్నారని, ఇక్కడ హైకోర్టులో చీఫ్ జస్టిస్, మరో ఆరుగురు న్యాయమూర్తులు టార్గెట్ చేసారు అంటూ, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసే దాకా వెళ్ళింది. ఫిర్యాదు చేసి, ఆ వివరాలు ఏకంగా మీడియాకు కూడా విడుదల చేయటం, మరో సంచలనం. ఏకంగా న్యాయమూర్తులకు, చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయి, నా మీద కుట్ర పన్నారు అని చెప్పే దాకా వ్యవహారం వెళ్ళింది. ఇంతటి అయ్యిందా అంటే లేదు. సుప్రీం కోర్టు జడ్జి, మరో రెండు మూడు నెలల్లో చీఫ్ జస్టిస్ అవుతున్నారు. ఆయన్ను చీఫ్ జస్టిస్ అవ్వకుండా చేయటానికి, చేయని ప్రయత్నం అంటూ లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కోవలోనే ఈ మధ్య ప్రభుత్వం జాతీయ మీడియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగమో ఏమో కానీ, ఒక జాతీయ పత్రికలో, సిఎంఓ అధికారులు చెప్పారు అంటూ, ఒక కధనం వండి వార్చారు. అందులో ఏకంగా కాబోయే చీఫ్ జస్టిస్ ను, అలాగే మొన్నటి దాకా ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న మహేశ్వరిని, జగన్ రాసిన లేఖ పై వివరణ అడిగారు అంటూ, కధనం వచ్చింది.

ramana 07012021 2

అంతే కాదు, ఎంక్వయిరీ మొదలైంది, అదీ ఇదీ, జగన్ లేఖతో సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది అంటూ, హడావిడి చేసారు. ఇక ఇది పట్టుకుని వైసీపీ బులుగు మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. జగన్ లాంటి వ్యక్తీ లేఖ రాస్తే, కాబోయే చీఫ్ జస్టిస్ సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఈ దేశంలో ఉందని ఎలా అనుకుంటారు అంటూ, టిడిపి నేతలు కూడా అన్నారు. అయితే ఇప్పుడు అసలు నిజం బయటకు వచ్చింది. అవన్నీ తప్పుడు కధనాలు అని తేలిపోయింది. ఈ తప్పుడు వార్తల పై సుప్రీం కోర్టు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. సుప్రీం కోర్టు నుంచి సమాచారం ఉంది అంటూ, కొన్ని మీడియా సంస్థలు, చీఫ్ జస్టిస్, ఒక జడ్జి పై చర్యలు తీసుకుంటారు అంటూ వచ్చిన వార్త మా దృష్టికి వచ్చింది, మేము ఎలాంటి సమాచారం ఎవరికీ ఇవ్వలేదు. ఇలాంటి విషయాల్లో బయటకు లీకులు ఇచ్చే అవకాసం లేదు అంటూ, ఎంక్వయిరీలు జరిగినా, అవి ఇన్ హౌస్ ఉంటాయి కానీ, సుప్రీం కోర్టు ఎప్పుడూ ఇలాంటి వాటిని ప్రోత్సహించదు అంటూ, తప్పుడు కధనాల పై సమాధానం ఇచ్చారు. ఈ తప్పుడు కధనాలతో, ఏకంగా సుప్రీం కోర్టుకు స్పందించేలా చేసిన ఫేక్ బ్యాచ్ కి, హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురంలో బుధవారం నిర్వహించిన ఇళ్ళపట్టాల పంపిణీ రసాభసగా మారింది. వేదికపై టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట త్రిమూర్తులు మధ్య వాగ్వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యేను మాట్లాడవద్దని మైక్ కట్ చేయడంతో ఆయన అదే సభావేదికపై బైఠాయించి తన నిరసనను తెలిపారు. అయినప్పటికీ టిడిపి ఎమ్మెల్యేను పట్టించుకోకుండా మొత్తం కార్యక్రమాన్ని తోట నిర్వహించారు. ఇదే వేదికపై వైకాపా రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇది దుమారాన్ని రేపింది. తోట త్రిమూర్తులు ఒకరిని ఉద్దేశించి అనాలని ఒక వ్యవస్థ పై విమర్శలు చేయడం తగదని సూచించడంతో పాపారాయుడు వెనక్కి తగ్గారు. అదే సభాప్రాంగణంలో ఉన్న మండపేట రూరల్ సీఐ కే.మంగాదేవీ పాపారాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పోలీసు వ్యవస్థపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని తనదైన శైలిలో కౌంటర్‌ ఫైర్ అయ్యారు. కపిలేశ్వరపురంలో బుధ వారం ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వేగుళ్ళకు ఆహ్వానం వస్తుండడంతో ఆయన ఆయా సభలకు హాజరవుతూ ఉన్నారు. ఒకటి రెండు చోట్ల వైకాపా, టీడీపీల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో కపిలేశ్వరపురం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఇతర విషయాలు ఈ వేదికపై ఎందుకు మాట్లాడుతున్నారంటూ వైకాపా ఇన్ చార్జ్ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు.

police 07012021 2

దీంతో వారిద్దరి మధ్య వాగ్వి వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను మాట్లాడనివ్వబోమని వైకా పా కార్యకర్తలు కేకలు వేయడంతో ఎమ్మెల్యే అదే వేదికవద్ద కింద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ దశలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించారు. ఇదిలా ఉండగా ఇదే సమయంలో తొలుత ప్రసంగించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కుక్కల్లా వ్యవహరించారని తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఆనాడు తన కుమార్తె వివాహ సందర్భంలో ఎమ్మెల్యే వేగుళ్ళ రెడ్డి సామాజికవర్గానికి చెందిన తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేసారన్నారు. తన తల్లిని సైతం మానసిక క్షోభకు గురిచేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ అప్పటి రూరల్ ఎస్ఎ సిహెచ్.విద్యాసాగర్(గబ్బర్ సింగ్) అంటూ సంబోధిస్తూ అధికారతొత్తుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో అక్కడే ఉన్న సీఐ కే.మంగాదేవీ పోలీసు వ్యవస్థను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ, వైసిపీ నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వ్యవస్థను అనడం సరికాదని పేర్కొన్నారు. తాము యునిఫారం వేసుకుని, చట్టాల ప్రకారమే పని చేస్తాం అని, మీ ఇష్టం వచ్చినట్టు మాటలు పాడటానికి, మేము సిద్ధంగా లేమని అన్నారు. అనంతరం తాను అనుభవించిన ఇబ్బందుల మేరకు అలా అన్నానని ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానంటూ పాపారాయుడు సభాముఖంగా స్పష్టంచేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై జురుగుతున్న వరుస ఘటనలతో, అటు హిందువులే కాదు, ఇటు రాజకీయ నాయకులు కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై, హిందూ మతం పై జరుగుతున్న ఘటనలతో, హిందువులు అందరూ బాధపడుతున్నారు. రాష్ట్రంలో మెజారిటీ హిందూ జనాభా ఉండటం, ప్రభుత్వం 20 నెలలు అయినా, ఈ సమస్య పరిష్కరించక పోవటం, ఈ ఘటనలకు పరాకాష్టగా రామతీర్ధం ఉండటం, అప్పటికే నాలుగు రోజులు అయినా, ప్రభుత్వం ఈ విషయం సీరియస్ గా తీసుకోకపోవటంతో, చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. రామతీర్ధం వెళ్లి, హిందూ మతం పై జగన్ మోహన్ రెడ్డి వైఖరిని తప్పు బట్టారు. ఇన్ని ఘటనలు జరిగినా, ఒక్కరినీ పట్టుకోలేదు అంటే, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. కావాలని ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ అని, హోం మంత్రి క్రీస్టియన్ అని, డీజీపీ క్రీస్టియన్ అని, వీళ్ళు హిందూ మతం పట్ల మరింత బాధ్యతగా ఉండాలని అన్నారు. ఎవరు ఏ మతం అయినా ఆచరించవచ్చని, కానీ వేరే మతాన్ని కావాలని టార్గెట్ చేయటం మాత్రం, ఆక్షేపణీయం అని అన్నారు. ఈ విధంగా చంద్రబాబు, జగన్ పై ధ్వజమేట్టారు. కావాలనే, ఇన్ని ఘటనలు జరుగుతున్నా, జగన్ చూస్తూ ఉన్నారని అన్నారు.

subbu 07012021 2

అయితే ఈ విషయంలో స్వామీజీలు అందరూ జగన్ వైఖరిని తప్పు బట్టగా, కేవలం ఇద్దరు మాత్రమే జగన్ కు సపోర్ట్ చేసారు. ఒకటి విశాఖ శారదా పీఠం స్వామి, రెండు సుబ్రహ్మణ్యస్వామి. శారదా పీఠం స్వామి కొంచెం ఆచి తూచి స్పందించారు కానీ, సుబ్రహ్మణ్యస్వామి అయితే వన్ సైడ్ గా, జగన్ వైపు నిలబడ్డారు. ఇంకో అవాక్కయ్యే విషయం ఏమిటి అంటే, జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ అని ఎవరు చెప్పారు, ఆయన హిందువు అంటూ చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ మోహన్ రెడ్డి తిరుమలని ఎంతో పవిత్రం చేసారని, రెండు గంటలకు కూడా స్వామికి జగన్ పూజలు చేసారని, జగన్ హిందువు కాక మరి ఏమిటి, ఆయన హిందువే అంటూ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యల పై అందరూ అవాక్కయ్యారు. ఇదేమి వింత వాదన అంటూ సుబ్రహ్మణ్యస్వామి వైఖరిని తప్పు బట్టారు. జగన్ ను సమర్ధించుకునే విధానం ఇది కాదని అన్నారు. ఆయన హిందువు అని, సుబ్రహ్మణ్యస్వామి ఎలా చెప్పారో అర్ధం కావటం లేదని అన్నారు. జగన్ కుటుంబం మొదటి నుంచి క్రీస్టియన్ మతాన్ని ఫాలో అవుతారని, జగన్ ఎప్పుడు తాను హిందువు అని చెప్పుకోలేదని, గుర్తు చేస్తున్నారు. ఈ వివాదానికి, జగన్ ఒక్కరే సమాధానం చెప్పగలరు. అసలు సుబ్రహ్మణ్యస్వామి ఇంతలా జగన్ ను ఎందుకు వెనకేసుకుని వస్తున్నారో, ఎవరికీ అర్ధం కావటం లేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అటు పరోక్షంగా కేంద్రం పైన నిందలు వేస్తూనే, జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన తీరు, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న వరుస ఘటనలకు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆక్టివ్ అయిన దగ్గర నుంచి, అధికార వైసీపీ పార్టీకి ఊపిరి ఆడటం లేదు. ముఖ్యంగా 140 ఘటనలు జరిగినా, దాని పై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యపు వైఖరి అందరినీ ఆలోచించచేస్తుంది. దీంతో ఆ దోషులు ఎవరో పట్టుకుని, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి, జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి, ఇది ప్రతిపక్షం చేస్తున్న కుట్ర, నేను ఎప్పుడు పధకాలు ప్రారంభం చేసినా, దాన్ని డైవర్ట్ చేయటానికి, ఇలా చేస్తున్నారు, ప్రతిపక్షాలు నా పై గెరిల్లా వార్‌ఫేర్‌ చేస్తున్నాయి అంటూ, సానుభూతి పొందే ప్రయత్నాలు చేసారు. అయితే దీని పై ప్రతిపక్షాలు కూడా ఘాటుగానే స్పందించాయి. మొత్తం 140 ఘటనలు జరిగితే, కేవలం ఏవో ఒక 9 సంఘటనలు చెప్పి, ప్రతిపక్షాల పై బురద వేసి, ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పట్టుకోకుండా, జగన్ మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు అంటూ విరుచుకు పడ్డాయి. తాజాగా ఈ విషయం పై స్పందించిన పవన్ కళ్యాణ్, సంచలన వ్యాఖ్యలు చేసారనే చెప్పాలి.

pk 07012021 2

హైకోర్టు చీఫ్ జస్టిస్ ని, ఇతర న్యాయమూర్తులను ఒక్క లేఖతోనే ట్రాన్స్ఫర్ చేసే మీరు ఎంతో శక్తి కలిగిన వారు కాదా, మీ పైనే గెరిల్లా వార్‌ఫేర్‌ చేసేంత ధైర్యం ఎవరికి ఉంది జగన్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు పవన్. అంటే పరోక్షంగా, కేంద్రం కూడా జగన్ లేఖకు తలొగ్గింది అనే విధంగా పవన్ స్పదించారు. మీ దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు మీ వైపు ఉన్నారు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇలా ఇంట పెద్ద వ్యవస్థని మీ చేతిలో పెట్టుకుని, ఇప్పటి వరకు మీరు ఎవరినీ పట్టుకోలేదు అంటే, విడ్డూరం అనే చెప్పాలి అంటూ పవన్, పరోక్షంగా ఇవి ప్రభుత్వం చేస్తుందా అనే విధంగా స్పందించారు. డాక్టర్ సుధాకర్ పై ప్రతాపం చూపిస్తారు, సోషల్ మీడియాలో మీ పై రాస్తే కేసులు పెడతారు, అలాంటిది దేవుళ్ళ పై జరిగితే ఘటనలకు ఎందుకు స్పందించరు అని పవన్ ప్రశ్నించారు. గొప్పగా మాకు ఎన్నో లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు అని చెప్పుకుంటారు కాదా, మరి ఇన్ని ఘటనలు జరిగితే ఒక్క వాలంటీర్ కూడా పట్టుకోలేక పోయారా ? అని పవన్ ప్రశ్నించారు. లోపం ఎక్కడ ఉంది ? మీలోనా, మీ వ్యవస్థలోనా అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు నుంచి తప్పుకుని, ప్రతిపక్షాల పై నేట్టేస్తున్నారని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read