ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ రోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యుల్ ని నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధం అని, సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, హైకోర్టు డివిజిన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పీలుకు వెళ్ళింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సంక్రాంతి సెలవలు ఉండటంతో, ఈ పిటీషన్ ని అత్యవసర పిటీషన్ గా భావించి, వెంటనే విచారణ చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తరుపున న్యాయవాది డివిజన్‌ బెంచ్‌ను కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటీషన్, రేపు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చే అవకాసం ఉంది. రేపు డివిజన్ బెంచ్ అత్యవసర విచారణకు తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఈ రోజు హైకోర్టు, ఎన్నికల్ షెడ్యుల్ ని కొట్టేయటం పై, వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. నాయకులు వరుస ప్రెస్ మీట్ లు పెట్టి, హైకోర్ట్ తీర్పుని స్వాగతిస్తుంటే, వైసీపీ సోషల్ మీడియా, హైకోర్టు తీర్పుని మా విజయం అంటూ చెప్పుకొస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, వైసీపీ నేతలకు సడన్ గా హైకోర్టు అంటే ప్రేమ పుట్టుకు రావటం.

hcc 11012021 2

ఇక ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసిన దగ్గర నుంచి, అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలవటం, వాళ్ళు ఎన్నికలకు సహకరించలేం అని చెప్పటం, రాత్రికి ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయటం, ఆదేశాలు ఇవ్వటం, ఎన్నికల నియమావళి, అలాగే ఈ రోజు ఒక ఆఫీసర్ ని సస్పెండ్ చేయటం, మధ్యలో ఉద్యోగ సంఘాలు, పోలీస్ సంఘాలతో తిట్టించటం, ఇలాంటివి అన్నీ చేసిన తరువాత, ఈ రోజు హైకోర్టులో పిటీషన్ పై విచారణ జరపటం, ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యుల్ కొట్టేయటం, వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై,పలువురు స్పందిస్తూ, ఈ తీర్పు పై కోర్టులో నిలవకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. దీనికి అనేక ఉదాహరణలు చెప్తూ, సహజంగా కోర్టులు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవని, గతంలో వెస్ట్ బెంగాల్ లో, స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, రెండునెలల క్రితం కేరళలో కూడా ఇలాగే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. చూద్దాం ముందు ముందు, ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను కోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ నిలిపివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ రెండు గంటల పాటు తమ వాదనలు వినిపించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి ప్రభుత్వం చేయలేదని వాదించారు. ప్రభుత్వ వాదనను హైకోర్టు ఒప్పుకుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, డివిజనల్ బెంచ్‌కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ పిటీషన్ వేయనున్నారు. అయితే ప్రభుత్వానికి మాత్రం, ఈ తీర్పు భారీ ఊరటను ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జడ్జిల పై, న్యాయస్థానాల పై టార్గెట్ అనే వార్తలు వింటూనే ఉన్నాం. అయితే కొన్ని చర్యలు వీటికి బలం చేకూరుస్తూ ఉన్నాయి కానే, జస్టిస్ ఈశ్వరయ్య కేసు విషయంలో ఆడియో ఒకటి బయట పడటంతో సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం జడ్జి రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్య సంభాషణ ఒకటి బయట పడింది. అయితే ఈ ఆడియో నాది కాదని, అప్పట్లో జస్టిస్ ఈశ్వరయ్య ఖండించారు. అది ట్యాంపరింగ్ చేసారని అన్నారు. ఇది ఇలా ఉంటే, ఆ ఆడియోలో సుప్రీం కోర్టు జడ్జిలను టార్గెట్ చేసే విధంగా జస్టిస్ ఈశ్వరయ్య మాటలు ఉన్నాయని, ఈశ్వరయ్య ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా పదవిలో ఉన్నారని, ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న కుట్ర అనే విధంగా హైకోర్టులో కేసు వేసి వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు దీని పై విచారణకు ఆదేశించింది. అయితే హైకోర్ట్ ఆదేశాల పై జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ రోజు ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్‌ ఈశ్వరయ్య తరుపున ప్రశాంత్‌ భూషణ్‌, వ్యతిరేక వర్గంలో కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ముందుగా కపిల్‌ సిబల్‌ విచారణ ప్రారంభం కాగానే, తాను ఇప్పుడే మాట్లాడను అని అన్నారు. దీంతో ప్రశాంత్‌ భూషణ్‌ ని వాదనలు వినిపించమని సుప్రీం కోర్టు ఆదేశించింది.

eswaraiah 11012021 2

ఈ సందర్భంగా ప్రశాంత్‌ భూషణ్‌ వాదిస్తూ, అది ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రైవేటు సంభాషణ అని, దీంతో ఎలా ఎంక్వయిరీ వేస్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు జడ్జి మీద వాళ్ళు మాట్లాడుకున్నా, ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ క్రైమ్ ఎలా అవుతుంది అంటూ, ఆయాన వాదించారు. హైకోర్టు కనీసం తనకు చెప్పకుండా, విచారణకు ఎలా ఆదేశించిందని ప్రశ్నించారు. అందుకే ఈ కేసు పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే అప్పుడు కల్పించుకున్న కపిల్ సిబాల్, ఇది ప్రైవేటు సంభాషణగా వదిలేయటానికి లేదని, ఇది సిస్టం మీద కుట్ర పూరిత అటాక్ అని అన్నారు. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న కోర్టు, ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా అని, ప్రశాంత్‌ భూషణ్‌ ని ప్రశ్నించింది. దానికి ప్రశాంత్‌ భూషణ్‌ ఒప్పుకుంటునే, సంభాషణలో బయట జరిగిన ప్రచారం మాత్రం వాస్తవం కాదని అన్నారు. అయితే మీరు సంభాషణ జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి, ఏమి సంభాషణ జరిగిందో అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అంటూ, ఈ కేసు పై స్టే ఇవ్వలేమని, కేసుని వచ్చే సోమవారానికి వాయిదా వేసారు.

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులు అటు, సిబిఐ విచారణ జరుపుతుంది, ఇటు ఈడీ కూడా విచారణ జరుపుతుంది. 11 సిబిఐ కేసులు ఉండగా, 5 ఈడీ కేసులు జగన్ మోహన్ రెడ్డి పై, విజయసాయి రెడ్డి పై ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సిబిఐతో పాటు, ఈడీ కూడా ఈ కేసుల్లో చార్జీ షీట్లు దాఖలు చేసాయి. ఈ నేపద్యంలో, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ సిబిఐ చార్జ్ షీట్లు తేలిన తరువాతే, ఈడీ కేసులు విచారణ జరపాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ వేసారు. అయితే దీని పై వాదనలు జరిగాయి. సిబిఐ, ఈడీ కేసులు రెండు వేరే వేరు సెక్షన్లు అని ఈడీ వాదించింది. దీంతో ఈడీ కోర్టుకు ఈ వాదనతో ఏకీభవించింది. సిబిఐ కేసులతో సంబంధం లేకుండా, కేవలం ఈడీ కేసు విచారణ చేయటం కుదరదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేస్తాం అని చెప్పిన కోర్టు, ఈ కేసుని 21కి వాయిదా వేసింది. ఈ రోజు జరిగిన విచారణకు జగన్ హాజరు కావాల్సి ఉండగా, ఈ రోజు అమ్మ ఒడి కార్యక్రమం ఉండటంతో, జగన్ రాలేదు. ఈ రోజు విచారణకు విజయసాయి రెడ్డి వచ్చారు. గతంలో కూడా  సిబిఐ కోర్టులో కూడా అన్ని చార్జ్ షీట్లు కలిపి ఒకేసారి విచారణ చేయాలని కోరగా, గతంలోనే సిబిఐ ఈ పిటీషన్ తోసిపుచ్చుంది. ఇప్పుడు ఈడీ కూడా కుదరదు అని చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read