34 ఏళ్ళ తరువాత నూతన జాతీయ విద్యా విధానం తీసుకువచ్చింది కేంద్రం. జాతీయ విద్యా విధానంలో కీలక మార్పులు చేస్తూ, ఈ రోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 34 ఏళ్ళు తరువాత, అనేక కొత్త సంస్కరణలు తీసుకు వస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 10+2+3 విధానంలో మార్పులు చేసారు. ఇప్పటి వరకు పదవి తరగతి, ఇంటర్, తరువాత డిగ్రీ మూడేళ్ళు ఉండేది. ఇక నుంచి డిగ్రీ నాలుగు ఏళ్ళు ఉంటుంది. అలాగే మూడేళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు విద్యను కంపల్సరీ చేసారు. ప్రతిభి ఉన్న వారిని వెలికి తీసేలా ఉండే గైడ్ లైన్స్ కూడా తెచ్చారు. ఇక మరో కీలకమైన విషయం ఏమిటి అంటే, 5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధన ఉండాలని, కేంద్రం నిర్ణయం తీసుకుంది. మాతృ భాష, ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన ఉండాలని, తన గైడ్ లైన్స్ లో కేంద్రం తెలిపింది. వీలు అయితే, 8వ తరగతి వరకు కూడా, మాతృ భాషలోనే విద్యా బోధన ఉండేలా చూడాలని, కేంద్రం స్పష్టం చేసింది.

మాతృ భాషలో విద్యా బోధన ద్వారానే, మరింత తేలికగా విద్యార్ధులకు సబ్జెక్ట్ వస్తుందని, పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జగన్ సర్కార్ కు ఇబ్బంది అనే చెప్పాలి. ఇప్పటికే ఈ విషయం పై చట్టాలు ఉన్నా, అవేమీ పట్టించుకోకుండా, అందరికీ ఇంగ్లీష్ విద్య అంటూ, తెలుగు మీడియం అనే ఆప్షన్ లేకుండా, ప్రభుత్వం వెళ్తున్న తీరు పై, ఇప్పటికే కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు కేంద్రం కూడా, మాతృ భాషలో విద్యా బోధన గురించి కొత్త గైడ్ లైన్స్ ఇవ్వటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి. ఎవరి ఇష్టం వచ్చిన మీడియం వారు చదువుకోకుండా, మేము చెప్పినట్టే వినాలి అనే రాష్ట్ర ప్రభుత్వం ధోరణి, ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎలా ఉంటుందో చూడాలి. కేంద్రం తెచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మన రాష్ట్రంలో తెలుగు మీడియం ఉండాల్సిందే. తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ పెట్టాలని, చూస్తున్న జగన్ ప్రభుత్వానికి, ఇది షాక్ లాంటిదే. అసలు ఇప్పటికీ అర్ధం కాని విషయం, తెలుగు, ఇంగ్లీష్ రెండు ఆప్షన్ ఎందుకు ఇవ్వరు ? ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా ?

ఆంధ్రప్రదేశ్ లో, రాష్ట్ర బీజేపీ నాయకత్వ మార్పు, వైసిపీ పార్టీకి ఎక్కడ లేని సంతోషాన్ని తెచ్చి పెట్టింది. సోము వీర్రాజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించగానే, అదేదో తమ పార్టీలో జరిగిన సంబరంలో, వైసిపీ నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తలు దాకా, చివరకు ట్విట్టర్ లో ఉండే కొంత మంది ప్రభుత్వ సలదారులు కూడా సంబరాలు చేసుకున్నారు. బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తే, వైసిపీ నేతలు చేసుకుంటున్న సంబరం చూసిన వారికి వీళ్ళ సంబంధాల పై క్లారిటీ వచ్చింది. సోము వీర్రాజుకి బీజేపీ పగ్గాలు అప్ప చెప్పటంతో, తమకు సానుకూలం అనే అభిప్రయాన్ని వైసిపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కమల దళంతో ఇక మా స్నేహానికి ఎదురు లేదని, కేంద్రంలో తమ పై ఫిర్యాదు ఇచ్చే వారే ఉండరని, సంబర పడుతుంది వైసిపీ. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో, తమకు అనుకూలంగా ఉండే సోము వీర్రాజు రావటమే ఇందుకు కారణంగా చెప్తున్నారు.

సోము వీర్రాజు మార్పుతో, తమ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని, వైసిపీ అంచనా వేస్తుంది. దీనికి ప్రధాన కారణం, కన్నా లక్ష్మీనారాయణ, వైసిపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపటమే. కన్నా లక్ష్మీనారాయణ కరోనా కిట్ల స్కాం గురించి, 108 స్కాం గురించి బయట పెట్టటంతోనే పెద్దవి అయ్యాయి. తెలుగుదేశం పార్టీ పై అంటే విరుచుకు పడవచ్చు కాని, బీజేపీ పై విరుచుకు పడితే హైకమాండ్ ఊరుకోదు. దీంతో, వైసిపీ చాలా ఇబ్బంది పాడేది, కన్నా లేవనెత్తిన అంశాలు వైసీపీకి చాలా ఇబ్బందిగా మారుతూ వచ్చింది. కన్నా లక్ష్మీ నారయణ లేవనెత్తే అంశాలు ప్రజల్లోకి కూడా వెళ్ళేవి. దీంతో ఇప్పుడు కన్నాని తప్పించటంతో, ఊపిరి పీల్చుకుంది వైసిపీ. తమకు అనుకూలంగా ఉండే సోము వీర్రాజు రావటం, సోము వీర్రాజు తమకంటే చంద్రబాబునే ఎక్కువ టార్గెట్ చేసే వారు కావటంతో, తమ పని ఇంకా తేలిక అని, కేంద్రంలో ఎలా ఉన్నా, రాష్ట్రంలో బీజేపీతో కలిసి, తెలుగుదేశం పార్టీని మరింత టార్గెట్ చెయ్యవచ్చు అని వైసిపీ భావిస్తుంది..

జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ అయిన, వైఎస్ వివేకా కేసు, సిబఐకి అప్పచెప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం చేసే విచారణ పై తమకు నమ్మకం లేదు, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అంటూ, ఏకంగా వైఎస్ జగన్ సోదరి, వైఎస్ సునీత హైకోర్టులో పిటీషన్ వెయ్యటం, అలాగే అనుమానితులుగా, వైఎస్ కుటుంబంలో కొంత మందిని చేర్చి, హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. తరువాత హైకోర్టు విచారణ జరిపి, ఈ కేసుని సిబిఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పై సిబిఐ ఈ నెల నుంచి విచారణ ప్రారంభించింది. గత 12 రోజులుగా పులివెందుల, కడప వేదికగా సిబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏడు గంటల పాటు, వైఎస్ వివేక కూతురు, వైఎస్ సునీత రెడ్డిని, సిబిఐ విచారణ చేసింది. ఆమె నుంచి చాలా వివరాలు సిబిఐ రాబట్టింది. అంతకు ముందు రెండు రోజుల పాటు వైఎస్ వివేక, ఇంటికి వాచ్ మెన్ గా ఉన్న వ్యక్తిని కూడా సిబిఐ విచారణ చేసింది.

అయితే ఈ రోజు అనూహ్యంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు, వైసిపీ నేత, వైసిపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని, సిబిఐ విచారణకు పిలిచింది. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితిడుగా ఉన్నారు. అయితే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలవటం పై, చర్చ జరుగుతుంది. వివేక హత్య జరిగిన సమయంలో, ఉదయం పూట దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి అక్కడకు వెళ్లినట్టు, అక్కడ ఉన్న రక్తపు మరకలు తుడిచి వేయమని, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ప్రోత్సహించినట్టు, గతంలో సిట్ అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. గతంలో సిట్ అధికారులు కూడా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని అయుదు రోజులు విచారణ చేసారు. అలాగే సునీత ఇచ్చిన అనుమానితుల జాబితాలో కూడా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ఉన్నారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. గతంలో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డికి నేర చరిత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి సిబిఐ ఏమి రాబడుతుందో చూడాలి.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, మా మధ్య ఎవరూ గొడవలు పెట్టలేరు, మేము అన్యోన్యంగా ఉన్నాం అంటూ ఒక పక్క చెప్తూనే, మరో పక్క లేని వివాదాలు సృష్టించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. గతంలో ముచ్చుమర్రి కట్టిన సమయంలో, లేని హడావిడి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పధకం అంటూ అదేదో కొత్త పధకంలా చెప్తూ, పోతిరెడ్డి పాడు కాలువ వెడల్పు పనులు చేస్తూ, ఏపి చేస్తున్న హడావిడికి, మా ప్రాంతం దెబ్బ తింటుంది అంటూ తెలంగాణా హడావిడి చేస్తుంది. పోనీ అక్కడ నీళ్ళు ఎప్పుడూ ఉంటాయా అంటే, గట్టిగా పది పదిహేను రోజులు వరదలు వచ్చినప్పుడు ఉపయోగపడే ప్రాజెక్ట్ అది. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, మేము హీరోలం అంటే మేము హీరోలం అనే హడావిడి మొదలైంది. నాలుగు నెలల క్రితం హడావిడి జరిగినా, అప్పుడు సద్దుమణిగి, ఇప్పుడు మళ్ళీ హడావిడి మొదలైంది.

దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పై, ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. జల వివాదాల పరిష్కారం పై కేంద్రం ఫోకస్ చేసింది. వచ్చే నెల 5న, తెలంగాణా సియం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సియం జగన్ తో, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ సామవేసం కానున్నారు. కృష్ణా, గోదావరి జలాల నీటి పంపకాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసిన రాయలసీమ ఎత్తిపోతల పై కూడా చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల ఫిర్యాదులు, అభ్యంతరాల పై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఈ సమావేశం జరగునుంది. మరి ఈ సమావేశంలో అయినా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అభిప్రాయానికి వస్తారో లేక, బయటకు వచ్చి, నువ్వు కొట్టినట్టు నటించు అనే విధంగా చేస్తారో చూడాలి. కేంద్రం ఇప్పటికైనా ఒక డైరెక్షన్ ఇస్తుందేమో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read